May 4, 2011

ఓ ప్రేమలేఖ..



నిన్ను తొలుతగా ఎప్పుడు చూసానో గుర్తు లేదు. కాని చూసిన మొదటి నిముషం లోనే నీతో స్నేహం కుర్దిరింది.. ఆ దోస్తీ ముదిరి   ప్రేమగా మారింది..
ఎన్ని సార్లు ఎక్కడెక్కడ కలుసుకున్నామని..

వారం లో ఒక్కసారైనా నిన్ను చూడక ఉండలేక పోయేవాడిని...
గంటలు లెక్కపెట్టుకుంటూ గడిపేవాడిని..నీ దర్శనం కోసం..
నిన్ను కలుసుకొని అలా  వొళ్ళో తల పెట్టుకోని..నీవు చెప్పే కథలు వింటూ గడపటం నాకెంత ఇష్టమని...నీకు తెలుసుకదా..
అప్పట్లో మనం కలుసుకున్నది తక్కువే అయినా.. నీవు చెప్పిన కథలన్నీ ఇంకా కళ్ళలోనే ఉన్నాయి..ఎంత బాగా చెపుతావని.. 

రామాయణ భారతాలు నేనెప్పుడు చదవలేదు...నేవు చెపితేనే తెలిసింది..
అలా ఒకటా రెండా వందలు, వేల కథలు కళ్ళకి కట్టావు.. 
బావున్నా బాలేకపోయినా 'ఉ' కొట్టటం ఒకటే నాలు తెలిసింది, అప్పట్లో..
నీ మాటలతో  కవ్వించి..నవ్వించి.. ఏడిపించే దానివి.. 

నీ పాటలతో నన్ను ఆలించి..లాలించి జో కొట్టేదానివి.. 
అవి వింటూ..నేను ఏదో ఉహాలోకం లో తెలిపోయేవాడిని


నివు కళ్ళ ముందు ఆడనిదే  నాకు నిద్ర పట్టదు
పగలంతా నీకోసం కలవరమే.. కలలోను నీకై పలవరమే
కొన్ని క్షణాలు నేను నువ్వయానా అని అనిపించేది..

ఎల్లకాలం  నీతో ఉండాలని ఆశ పుట్టేది .


గుర్తుందా... మనం శ్రావణమాసం ఎక్కువగా కలుసుకునే వాళ్ళం.
అమ్మ పూజల్లో పెట్టిన రూపాయి బిళ్ళలు దొంగిలించి జుబులో వేసుకొని నీ దగ్గరికి వచ్చేవాడిని.
అలా నిన్ను కలిసి వచ్చాక ఎన్ని సార్లు తన్నులు తిన్నానని..  
అదే విషయం నేకు చెపితే ..నేవు కిల కిలా నవ్వి  నన్ను నీ వొళ్లోకి తీసుకునే దానివి ఓదార్పుగా..

నీ మాయలో పడి చదువు అత్తెసరయ్యింది,.. తెలివి తెల్లారింది.. జీవితం విందర వందర అయ్యింది.
అందుకే నీవంటే కసి..కాని ఆ కసి లోంచే ఏదో ప్రేమ..
కాని నాకేప్పుడైనా దొరికావా...

దేశదిమ్మరిలా నీకోసం పరుగులు పెట్టాను..
నిన్నెట్లా  చేరుకోవాలా అని మధన పడ్డాను..
నీ ఆత్మీయతకై అర్రులు చాచాను..
నీ నీడన బ్రతకాలని ఆశ పడ్డాను..



కనీసం..ఇప్పటికైనా కరుణిస్తే అంత కన్నా కావలసిందేమి లేదు నాకు...... ఈ జన్మకి..
వస్తావు కదూ..

2 comments:

appu said...

very nice,i like it.........keep rocking....bye

. నల్ల కొండలో తెల్ల చుక్క said...

meeru pedda kavi ayite vastaaremoo.. :D gud bavundi