Feb 28, 2011

ప్రపంచం అంటే లెక్కే లేదు

 


జీవిత సాగర తీరం లో నీ జ్ఞాపకాల గవ్వలు ఎరుకుంటున్నాను.
కరిగిన కాలంలో ఆనంద క్షణాలు లెక్క చూసుకుంటున్నాను.
గతమే మధురమై..భవితే శూన్యమై..
నీ తలపే పనిగా..నీ జ్ఞాపలాలే మృత సంజీవనిగా
గడిపేస్తున్నా  బ్రతుకీడుస్తున్నా..
నీవు పక్కనుంటే ప్రపంచం ఓ లెక్కలోది కాదు..
నీవు లేక  ప్రపంచం అంటే లెక్కే లేదు నాకు.

Feb 27, 2011

దేవుడి గురించి ఆలోచన ఎందుకో మనిషికి ??

 

తన గురించి తాను ఆలోచించుకోక ..దేవుడి గురించి ఎందుకో ఆలోచన మనిషికి ??
దేవుడు ఉన్నాడో  లేడో  అని సందేహం వెలిబుచ్చినా.. లేక దేవుడు లేడు అని అన్నా, 95% మంది .. ఆ ఏమన్నావ్..?? బుద్ది ఉందా? 
మనిషివేనా.. దేవుడు లేకుంటే ఈ సృష్టి ఎలా ఉంది?? నీవెలా ఉన్నావ్ ??  ఎక్కడినుంచి వచ్చావ్ ?? ఏం తెలుసురా నీకు తుచ్చుడా ..??
అని ఓ ' వేద పద్యం'మో   ఓ మత  'గ్రంధ' సూక్తినో   పొల్లు పోకుండా చదివి  వినిపిస్తారు.
సరే ఉన్నాడు సో వాట్  ?? అయితే ఏంటి..?? ఉంటే ఏం చేయాలి ??
ప్రేమిచాలి...అంటారు . ఆ ప్రేమ కలగందే ?? 
సరే ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి ??
గుంపులు కట్టి  రాగాలు తీసా? లేక ఎదుటోడి   ప్రాణాలు తీసా??
నా దేవుడు ..నా దేవుడు అని .. ఒకదినోకడు చంపుకుంటూ నా ?? నా మతం లోకి మారు ..మారు  allure చేస్తునా ? 
కొంతమందికి దేవుడి మీద ప్రేమ కంటే  ప్రపంచాన్ని తమ మతం లోకి మార్చుకుందామనే ధ్యాసే ఎక్కువ. 
చాలామందికి దేవుడంటే ' ప్రేమ' కంటే 'భయమే' ఎక్కువ. 


"నాయనా ఎన్నో జన్మల తరవాత ఈ మనవ జన్మ సంప్రాప్తించింది ..
జన్మ రాహిత్యం పొందటమే మానవ జన్మ కర్తవ్యం..కనక దేవుడిని పూజించి పుణ్యం సంపాదించుకో' ..అంటారు . కాని వాళ్లకి  రూపాయిల మీద ఆశ మాత్రం చావదు... సుఖాల మీద విసుగు పుట్టదు.


 ఒకవేళ  సృష్టి కర్త ఉంటె .. ఆయనతో వ్యక్తి గత సంభందం ఉండాలి. అది  పదిమందికీ చూపాల్సిన అవసరం లేదు. తంతులు.. పూజలు. ..ప్రార్థనలు  ...ఆర్భాటాలు అంతకన్నా అనవసరం. కాని ఈనాడు ఇవే ముఖ్యమైనాయి.సోషల్ లైఫ్ కోసం ఇదంతా చేస్తున్నాం అని ఒక్కడూ ఒప్పుకోడు. స్వామి కార్యం కంటే 'స్వకార్యమే' ఎక్కువ అయినా.
.

Feb 26, 2011

ఎందుకు 'రావ్' ఏడుస్తావ్


ఎందుకు 'రావ్' ఏడుస్తావ్??ఏం జరిగిపోయిందని బాధ పడతావ్??

కాలం కదలిపోయిందనా?? కలలు కరిగి పోయాయనా??

నిజం నిప్పులా కాల్చేసిందనా ? జీవితం కుప్ప కూలిందనా ??

అనుకున్నది జరగకనా? జరిగింది ఒప్పుకోలేకనా??

ఆనందం అంద లేదనా ? సంతోషం సొంతం కాలేదనా??

ఆశలే అత్యాశలయితే.. పక్క వాడితో పోల్చుకుంటే..

చెమట చుక్కని కార్చకుంటే... నిమ్మళంగా తిని కూర్చుంటే..

ఉన్నదాన్ని కాదనుకుంటే.. చేతనయింది చేయకుంటే...

ఉహల్లో విహరిస్తుంటే..వాస్తవంలో బ్రతకకుంటే...అంతేనోయ్..అంతే

Feb 25, 2011

మిగులుంది జీవితం..


ఆనందం కోసం వెతికాను..అలసిపోయాను.
డబ్బు సంపాదించాలని వెంపర్లాడాను   .. వల్ల కాలేదు.
అమ్మాయి 'ప్రేమ' కోసం అంగలార్చాను  ..  దొరకలేదు.
నాకొచ్చిన పని చేద్దామను కున్నా... డిమాండు లేదు .
తప్పతాగాను..కాని 'అలవాటు అయ్యి ' పోయింది . 
సిగరెట్టు తాగినా  ..పొగ తప్ప ఏమి రావటంలేదు.
జీవిత పుస్తకం తిరగేస్తున్నా.. తెల్ల పేజీలు  తప్ప ఏదీ  కనపడటం లేదు.
జ్ఞాపకాలు నేమరేస్తున్నా ... చిరునవ్వు విరియటం లేదు..
భవిష్యత్తు బాగుంటుందన్న ఆశా లేదు..నమ్మకం అంతకంటే లేదు.
దుబారాగా ఖర్చు పెట్టినా  'కాలం' తరగటం లేదు..  .
ఇంకా మిగిలింది..మిగులుంది జీవితం..  ఏం చేయాలో తెలీటం లేదు.  

మలచుకోవోయ్


 
చెమట చుక్క చివరన నక్షత్రపు మెరుపుంటుందని..
విషాదపు లోతుల్లో ఆనందపు ఊటొస్తుందని.. 
నిశీది నీడలలోనే  వెలుగు రేఖ పోడుచుకోస్తుందని.. 
పని చేస్తూ పోతుంటే ఆనందపు  గని దొరుకుతుందని 
తెలుసుకోవోయ్  చక్రధారీ...మలచుకోవోయ్  జీవితాన్ని.


 


తెలుసుకోవోయ్


 
 

 రేపని, మాపని అంటుంటే...పనులన్నీ చేటవుతాయని 
చూస్తూనువు కూర్చుంటే ..అవకాశం చేజార్తుందని...
గతంలోన గడుపుతుంటే    భవిష్యత్తే  ఉండదని...
తెలిశాకే చేద్దామంటే...చేయటానికేముండదని..
తెలుసుకోవోయ్  చక్రధారీ...మలచుకోవోయ్  జీవితాన్ని.

Feb 24, 2011

ఓ స్వర్గం.


నీ చూపు.. ఓ కైపు..
నీ మాట ... ఓ తియ్యని పాట..
నీ స్నేహం ...ఓ అదృష్టం 
నీ స్పర్శ ...ఓ పరవశం
నీ సహచర్యం ... ఓ వరం
నీ సహవాసం ...ఓ స్వర్గం. 

Feb 18, 2011

what " love can do "
నల్ల మబ్బు కరిగిస్తుంది - స్వాతిచినుకు కురిపిస్తుంది 
 పుడమి కడుపు ఛీలుస్తుంది - చిన్ని మొలక మొలిపిస్తుంది.
చెమట నీరు చిందిస్తుంది - సిరుల రాశి అందిస్తుంది 
మనసు బాధ కనిపెడుతుంది - అమ్మ లాగ లాలిస్తుంది.

ముళ్ళ దారి మళ్ళిస్తుంది - పూలబాట నడిపిస్తుంది .
గుండె గుండె కలిపేస్తుంది - మమత పాట పాడిస్తుంది .
ఆత్మ లోకి చూపిస్తుంది - పరమాత్మని దర్శిస్తుంది.


Feb 17, 2011

ప్రేమ అనొచ్చేమో

" ఎవరు పలికితే గుండె పరవశిస్తుందో..
ఎవరు తాకితే వొళ్ళు పులకరిస్తుందో.
ఎవరు పక్కనుంటే..ప్రపంచం అందంగా కనపడి ..ఆనందం విరుస్తుందో ..
ఎవరి వెన్నుదన్నులో గుండెల్లో ఆత్మ విశ్వాసం నిందుతుందో..

ఎవరి సమక్షం లో  లోకాన్ని ఎదుర్కోగల   దైర్యం.. కలుగుతుందో
ఎవరి సాన్నిహిత్యం  లో ఉత్సాహం పొంగి..ఉల్లాసం చింది..బ్రతుకు పూల బాటగా ..కమ్మని కలల పాటగా..అనిపిస్తుందో..
ఎవరి సహచర్యంలో బ్రతుక్కో అర్థం ..జీవితానికో పరమార్థం కనిపిస్తుందో !!

- లాంటి భావనలు కలిగితే ప్రేమ అనొచ్చేమో !!

Feb 16, 2011

ఎదగాలి...


విగ్రహాలు...పూజలు అవసరం లేదా అంటే అవసరమే. కాని వాటి అవసరం ఎంతవరకో తెలుసుకోవాలి.
ఒకటోతరగతి రెండోతరగతి ఈ విధంగా తరగతులు అవసరమే.
మనం ఎంత నేర్చుకుంటున్నామో అవి తెలియచేస్తాయి.
వాటితో మొదలు పెట్టకుండా తరవాత స్థితికి చేరగలమా ?? ఎల్లకాలం  అ, ఆ, లు దిద్దుతూ కూర్చోలేం కదా  ??
ముందు క్లాసులకు ఎదగాలి.
కాని ఎప్పటికీ ఒకటో తరగతి లోనే ఉంటే అదేమి విద్యాభ్యాసం?
ఆధ్యాత్మికత  కూడ అంతే .ఎదగాలి.. స్థూలం  నుండి సూక్ష్మానికి 
భక్తి నుండి ధ్యానానికి  ...ధ్యానం నుండి యోగానికి..

Feb 15, 2011

బాధ - చలం

ఎంత తరచి చూసినా లోకంలో బాధ ఉండటం అన్యాయం..ఘోరం. మతాలూ ఈ బాధని ..శిక్ష అనీ , కర్మ అనీ ..ఈశ్వరేచ్ఛ అని ఎంత సమర్థింప చూసిన అర్థం లేని మాటలని పిస్తాయి..బాధ లేకుండ సృష్టి ఎందుకు ఏర్పడి ఉండకూడదు ?
ఈ ప్రశ్న ఎవరినడగాలి?ఈ ప్రశ్నని తీసుకునే దేవరు?జవాబు చెప్పేదెవరు? బాధకి లోబడే ఏ జీవికి అధికారం లేదు జవాబు చెప్పటానికి!
బాధలివ్వటం ఎందుకు? ఇట్లా జీవరాశుల్ని కాల్చి చంపడమెందుకు ?
ఎంత స్పష్టమైన కసి కనపడుతోంది సృష్టి కర్త హృదయం లో ?
 - ఇదంతా కర్మ ఫలం -
అసలు దుష్కర్మ చేసే ఆలోచనలు ఎందుకు మనస్సులో పెట్టాలి ?
 గజ్జి పట్టి దిక్కు లేక తిరిగే కుక్క పిల్లలు..
పిల్లల్ని తినేస్తే ఏడ్చే పక్షి తల్లుల గోల
గోడలో మొలిచి నీళ్ళు లేక ఎండే మొక్కల క్షుద  - 
ఇట్టాంటి బాధని ఏ కర్మ సిద్దాంతము సమర్థించలేదు.

మనుష్యులయినా   ఒక రకమైన బాధల్లోంచి ఇంకో రకమైన బాధల్లోకి నడవటమే కనపడుతోంది ఇన్ని యుగాలుగా..
దేవుడి కన్నా సైతానులో ఎక్కువ నిజాయితీ.. దేవుడి కరుణనీ- క్రూరత్వాన్ని కూడా నిర్లక్షంగా ఎదురుతన్న గలిగిన వాడు అతనొక్కడే.
ఇంత బాధ పెట్టినతరవాత  ఇచ్చే  నీ సుఖాలు నాకేం వొద్దు అని తన్న గల శక్తి రావాలి మనిషికి.
బాధకి లోబడి పోయి..తన విషయమే యోచించుకునే వాడు ఏడుపుగొట్టు..అన్నింటిలోను విషాదమే చూడగల మనిషిగా అయిపోతాడు...

                  బాధ గురించి  చలం "బాధ" -   పుస్తకం పేరు ' విషాదం'  

సినిమా తీద్దాం రండి


  •  మీ దగ్గర ఉన్నఅ బ్లాక్ మనీ ని వైట్ మనీ గా మార్చుకోవాలని ఉందా ??
  • మీకే తెలియని ఆస్తులు ..తద్వారా మీకు తెలియనంత గా పెరిగిపోతున్న ఆదాయం ఉందా?
  • మీ తాతలేప్పుడో సంపాదించిన ఆస్తి పాస్తులు.. బంగారు గుడ్లు పెట్టె బాతుగా మారిందా?? తద్వారా వొచ్చే ఆదాయానికి పన్ను కట్టాలంటే బాధగా ఉందా ??
  • మీకు లెక్క పెట్టలేనంత ..మీకే తెలియని ..మీ ముందు తరాలు పడుకొని తిన్నా తరగని సంపద ఉందా??
అయితే
సినిమా తీద్దాం రండి 
  • మీ బ్లాక్ మనీ ని వైట్ గా మార్చుకోండి 
  • జనానికి కాలక్షేపం కోసం ఓ మంచి కథని తెరకేక్కించండి.
  • మీ కళాభిమానులని చెప్పే ఓ కళాత్మక సినిమా తీయండి. 
  •  సమాజానికి  ఓ మంచి సందేశాన్ని అందించండి 
  • సినిమా తీయటం ద్వారా కొన్ని కుటుంబాలకి  కొంత కాలం బ్రతుకు తెరువును కల్పించండి.
  • కొంత మంది సృజనాత్మక వ్యక్తులకి తమ సృజనని వెలుగు చూపించే అవకాశం కల్పించండి.

Feb 14, 2011

చిలక జోస్యం

 అతి కష్టం మీద రాజు గాడు  శృతి ని necklace రోడ్డు కు తీసుకొచ్చాడు..
రానంటే రాను.... ఏదో చాటింగు ..ఫోన్ లో మాట్లాడుకోడం  ఓకే కాని ఇవన్నీ ఇవన్నీ నాకస్సలు ఇష్టం ఉండదు .. చెప్పింది.
కాని వీడు వింటేగా.. అలకలు..కులుకులు.. ఓ రెండు రోజులు మాటలు లేకపోవటాలు....రాకపోతే నీకు నాకు కట్టు అన్నట్టు,  online లో మూతి  భిగించే సరికి  ..సరే .. ఒక్క సారికి ఒకే అని అంది.  
ఆహా..ఏమి భాగ్యం అని రాజు గాడు షర్టుకు డబ్బుల్లేక  deodorant మాత్రం కొత్తది కొనుక్కొని ఒళ్ళంతా దట్టంగా పట్టించి బయలుదేరాడు. ముందుగ 'తాళ్ళ పాక తిమ్మక్క' విగ్రహం దగ్గర కలుసుకొన్నారు. ఎన్నడూ బైక్ ఎక్కనట్టు పల్లకీ లోకి పెళ్ళికూతురు లా  బైక్ ఎక్కింది. రాజు గాడి బ్రేక్ లైనేర్స్  సగం అరిగాయి కాని  లాభం లేకపోయింది. పూర్తిగా అరగోట్టుకోవటం జేబుకు మరో బొక్క అని ఊరుకున్నాడు.
పార్కింగ్ టికెట్టు కొంటూ...మళ్లీ ఇంకోసారి తన 500/- తడిమి చూసుకున్నాడు. ఇది చెల్లకపోతే  అన్న negative  thought ని అక్కడికక్కడే నిలువున చీరేసి ..అడ్డంగా  నరికేసి .మొత్తానికి .చంపేసి.. కొంచం సేపు వాల్క్ చేద్దామా అన్నాడు. " కాఫీ ని మనసులోకి అప్పుడే రానివ్వకుండా..
 చుట్టూ చేతుల్లో చేతులేసుకున్న జంటలు  ..పార్కులో ఆడుకునే పిల్లలు .. చాయ్,, సిగరెట్లు , ఐస్ క్రీం లు....బెలూన్ లు.  అమ్ముకునే వాళ్ళు....ఇలా రక రకాల జనం తో బాగానే కళ కళ లాడుతోంది.. 

నడుస్తూ...కొంచం దూరమే వొచ్చారు. ఇప్పుడు తక్కువ జంటలు..ఎక్కువ దగ్గరగా ఉన్నారు. బుద్దుడి విగ్రహం వీపు  బాగా కనపడుతోంది అనే వొంకతో ఆగాడు..ఇద్దరి మధ్య  దూరం తగ్గింది.. ...కాలుష్యం వాసన వేస్తున్నా  గాలి చల్లగానే ఉంది.. ఎదురెదురుగా నిలబడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ... మాట్లాడుతున్నాడు.
సర్  ' చిలక ...చిలక  జోస్యం.. జరిగింది  జరిగినట్టు చెపుతుంది".. అన్నాడు ఒక కుర్రాడు..
చిన్న బోనులో.. తినలేక వొదిలేసిన   జామ కాయ  బిక్క మొహం తో ఓ చిలక..రాజుగాడిని చూసింది.
వద్దు వెళ్ళు.. అన్నాడు రాజు..
ఓ అయిదు నిముషాలు గడిచాయి.
రేలింగ్ మీద పెట్టిన చెయ్యికి ఒడుపుగా చెయ్యి తాకించాడు. శృతి కూడ.. గమనించనట్టే నటించింది.. రాజుకి  హుశారేక్కువైంది.. చేతిని చేయ్యిలోకి తెసుకున్నాడు.
"చెయ్యి వదులు" .. మాట మాత్రం అంది కాని వొదిలించుకునే ప్రయత్నం ఏమి చేయలేదు. శృతి.
 ఓ చేత్తో బుజాన్ని చుట్టి దగరగా తీసుకుందాం అనుకొని చెయ్యి వెనక  నుండి వేస్తున్నాడో లేదో..
సార్  " జరుగుతున్నది జరిగినట్టే చెపుతుంది .చేప్పించుకోండి సర్...."
కోపం దిగమింగి   వొద్దు బాబు . అవసరం లేదు..అన్నాడు..
మళ్లీ  ఇద్దరి    మధ్య దూరం పెరిగింది. కొంచం సేపూ మామూలు మాటలు..ఇందాకటి పోసిషన్ రావటానికి ఇద్దరికీ ఎక్కువ సేపు పట్టలేదు. మళ్లీ  మునపటి  మూడ్ వొచ్చింది . శృతి  మనసు కూడ గతి తప్పుతోంది. బుజం మీద చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు. నాకేం తెలిదు అన్నట్టు ఏదో  హు కొడుతోంది   శృతి ..   దగ్గరిగా జరిగి  మొహాన్ని మొహం దగ్గరగా తెసుకొని వొచ్చి ముద్దు పెట్టుకుందాం అనేంతలో..

" జరిగింది ..జరిగేది ,,జరగా బోయేది.. చెపుతా...సర్ చెప్పించుకోండి సర్  అని  ఇంకో  కుర్రాడు మళ్లీ  చెయ్యి గోకాడు..
ఒక్క సారి కోపం కపాళానికి అంటింది రాజు గాడికి, 
" రేయ్ చెప్పించుకోడం  కాదురా..చెప్పుచ్చుకుంటా" అని వాడి వెనక పడ్డాడు. విషయాన్ని ఫాస్ట్ గా  గ్రహించిన అ కుర్రాడు  పరుగందుకున్నాడు .
అ పరుగులో... ఆ కుర్రాడు  పట్టు తప్పి పడటం.. బోను కింద పడి తెరచు కోవటం..చిలక తుర్రు మనటం జరిగి పోయాయి.  
ఇదంతా చూసి శృతి .. చిలకలా  కిలకిలా నవ్వింది.

Feb 12, 2011

ఏ మేరా ఇండియా ..

ప్రేమికుల రోజు.. భారతీయ సంప్రదాయం కాకపోయినాప్రపంచ వాప్తంగా గుర్తింపబడిన దినం.
ఇది భారతీయ సంప్రదాయం కాదంటూ ప్రేమికులనికొట్టడమో.. లేక పెళ్ళిళ్ళు చేయటమో లేక రాఖీలు .. కట్టించడమో.. గుంజీలు తీయించడమో..ఎటు పోతున్నాం మనం..ప్రజాస్వామ్య  దేశం
అంటూ .. 18 ఏళ్ళు  నిండిన వాళ్ళని ఓటర్లుగా గుర్తిస్తూ ఓటు హక్కు ఇచ్చాం.. ఇంకా దాంతో పాటే  అనేక హక్కులు ఇచ్చాం...పెళ్లి చేసుకోడం లాంటివి.

 ఏం ?  ఫిబ్రవరి   14 రోజు ప్రేమికులు కలుసుకూడదా ... మాట్లడుకో కూడదా .. ప్రేమించుకోకూడదా??
రోజు రోజుకి  ప్రాణానికి బద్రత లేకుండ పోతోంది
ఒక వైపు అ టెర్రరిస్ట్ లు  ఎక్కడ బాంబు తో పెల్చేస్తాడో అని భయం. ఉన్న నాలుగు నాళ్ళు హయిగా బ్రతికేద్దాం అంటే ఈ అతివాదుల భయం.
సంకృతిని   తామేదో కాపాడుతున్నట్టు..?
అంత  సంకృతీ   ప్రియులైతే విప్పేయండి పాంట్లు.. కట్టండి పంచెలు.. తలకి కుంకుడు కాయ రసం..మట్టి ఇల్లు..పేడతో అలకటం.. ముగ్గులు పెట్టటం.. చేయండి.. టీవీ మానేసి తోలుబోమ్మతాట చూడండి. బైక్ .. కారు వదిలేసి గుర్రం..గుర్రపు బండ్లు వాడండి..

"ఎచ్చోట నెమ్మనము భయము శంకలు వీడి.". టాగోర్ గారికి నోబెల్ ప్రైజ్ తప్ప ఇంకేమి మిగల్లేదు
భారతదేశం నా మాతృ భూమి అని గర్వపడే రోజులు పోయాయి.

Feb 10, 2011

పట్టించుకోని ప్రభుత్వం


ఉద్యోగం లేకుండా..తిండి లేక చస్తున్నా పట్టించుకోని  ప్రభుత్వం.. ఓ ఉద్యోగం/ వ్యాపారం తో డబ్బు సంపాదించుకోగానే .. ఎందుకు  tax  కోసం దేబురిస్తుందో ??
కరెంట్  బిల్ కోసం  వొచ్చినట్టు ..ఇంటింటికి వొచ్చి.... నిరుద్యోగులుంటే.. అర్హత కు తగ్గ ఉద్యోగం ఇప్పించి,  tax కట్ చేసుకొనే రోజు ఎప్పుడు వొస్తుందో...??

Feb 9, 2011

సాధ్యం కాదా ???


తెలంగాణా మేధావులు..ధనికులు.. సేవాతత్పరులు.. తెలంగాణా NRI లు.. కళాకారులు..సామాన్య ప్రజలు అందరూ కలసి అభివృద్దే ధ్యేయంగా అనుకొని ..


తెలంగాణా బ్యాంకు పెట్టి.. తెలంగాణా రైతులకి రుణాలిచ్చి..
తెలంగాణా ప్రజలకి ...తెలంగాణా కార్డు ఇచ్చి.. తెలంగాణలో రైతుల పంటని ..తెలంగాణా వాళ్ళకి / బీదలకి తక్కువ ధరకి ఇవ్వటం
తెలంగాణా రుచులని అందరికీ అందించే తెలంగాణా రేస్తోరెంట్ లు దేశ వ్యాప్తంగా తెరవటం.
విద్వత్తు ఉన్న తెలంగాణా  బీద విద్యార్థులకి తగిన ధన / రుణ సహాయం చేయటం.
తెలంగాణా లో ఉన్న వనరులను గుర్తించి వాటి అభివృద్ధి.. వాడకం..
తెలంగాణా లో నగరాల్లో తెలంగాణా వాళ్లకి ఉపయోగపడే విధంగా మంచి   బళ్ళు.. ఆసుపత్రులు.. కట్టించటం.

ఇలాంటివన్నీ తెలంగాణా  రాష్ట్రం రాకుంటే సాధ్యం కాదా ??? 

చివుక్కుమంది ప్రాణం.. బలుక్కున తెల్ల వారింది..టపక్కున మెలకువ వొచ్చింది ...దబుక్కున లేచా.. గబుక్కున తయ్యారయ్యి... చటుక్కున బండెక్కి వెళ్తోంటే.. తలుక్కున ఓ అమ్మాయి..గిరుక్కున తిరిగా .. ఆ పిల్ల చురుక్కున చూసింది.. ఆ చూపు కసక్కున దిగింది ...దడక్కుమంది గుండె.. చెలుక్కున కన్ను గీటితే .. కిలుక్కుమని నవ్వింది.. ఇంతలో సరుక్కున గేదె .. గబుక్కున బ్రేక్ వేసినా ..దళుక్కున కింద పడ్డా.. పుటుక్కుమన్నాయి ఎముకలు... అమ్మాయి మినుక్కుమని మాయం.. చివుక్కుమంది నా ప్రాణం.

Feb 8, 2011

నీ దారి


నీ దారి ఎడారి అయితే గోదారి పొంగించు..
 ముళ్ళ దారి అయితే పూలదారి  గా మార్చు..
నిస్సత్తువ అవరించినా  వేసారి పోకు...
బాటసారి సహాయం అడిగితే సో సారి అనకు
 ఆదరి చేరుకున్నాక  ఏమారి పోకు.
 నిన్ను నమ్మిన వాళ్ళని  ఒక్కసారి  కాంచు . 
Feb 6, 2011

life cycleకుళ్ళి పోయిన పండే కదా  అని చెత్తకుప్పలో పడేసినా..
ఆది ఎండి పోయి.. గింజలు రాలి పోయి.. భూమిలో కుంగి పోయి..
ఓ చుక్క చెమ్మ తగలగానే.. మొలకై.. మొక్కై.. మానై..
పూవుగా పూసి.... కాయగా కాసి.. మధుర ఫలాలని మళ్లీ అందించగలదు.

ఆనందానికి కారణాలుఆనందానికి కారణాలు
౧) అనుకున్నది జరగటం
౨) అనుకోకుండా కలిసి రావటం
౪) ఓ గొప్ప విషయాన్ని realize కావటం
౪) అందమైన అనుభవానికి  లోను కావటం.

Feb 5, 2011

మన చరిత్ర


చరిత్ర కు ఆధారాలు ఏ రూపం లో ఉన్న స్వీకరించాల్సిందే.
ఆది ఓ కట్టడమో..ఓ పుస్తకమో..శిల్పమో, శాసనమో..సూక్తో .. లేక మరేదైనా.
అయితే వేదాలు,వేదకాలం   ఉనికి ని చరిత్రకారులు ఎన్నడూ కాదనలేదు. భారత దేశ చరిత్రకు సంబందించిన ఏ పుస్తకం చూసినా..ఎవరూ రాసినా అందులో 'వేదాకాలం'  ఖచ్చితంగా ఉంటుంది, ఆధారాలతో సహా.. అందులో ప్రస్తావించిన అంశాలు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని , ఆలోచన సరళిని తెలుపుతున్నయనటం లో సందేహం లేదు.
" అందులో చెప్పబడిన అన్ని విషయాలే గొప్పవని.. అవే గొప్ప విజ్ఞాన శాస్తమని, లోకం లో ఉన్న ప్రతి విషయం అందులో స్పష్టంగా చెప్పబదిందనీ మాత్రం ఒప్పుకోలేము."
 ప్రస్తుతం చాలా చిన్నవిగా..సిల్లిగా  అనిపించినా.. పశువుల మచ్చిక, పెంపకం,  వ్యవసాయం, పనిముట్లు ఉపయోగించటం "నిప్పు" , చక్రం, కనుగోనటం.. లాంటివి  ఎన్నో ఎంతో గొప్ప ఆవిష్కరణలు,  అయితే ఇవి ఎవరూ కనుగొన్నారో ఆధారాలు లేనప్పటికీ ఉపయోగించన మాట వాస్తవం.
ఇంతకు ముందే   చెప్పినట్టు..వేదోపనిశాత్తుల్లో  ఆధ్యాత్మిక తత్వం ఎక్కువ పాలు. ఆత్మ ,పరమాత్మ, యజ్ఞ యాగాది క్రతువులు,కర్మ కాండ, వీటి ప్రస్తావన విస్తృతంగా ఉండి.  జీవితం అంటే జీవనం సుఖంగా గడపటానికి కావలసిన విషయాలే కాదు , నేను ఏమిటి,  సృష్టి ఏంటి , ప్రకృతి ఏంటి,పదార్ధం ఏంటి  .. లాంటి ఆలోచనలతో మొదలు .. ఆత్మ , పరమాత్మభావన  లాంటి ఎన్నో విషయాలు  విశ్లేషించటానికి    ప్రయత్నించారు.జీవితానికి పనికి రాక పోయినా "తత్వ శాస్త్రం" కూడ ఒక విలువైనదే ఆని గ్రహించాలి. ఒక వర్గం జీవితానికి కావలసిన ఆవిష్కరణలు చేస్తే..ఇంకో వర్గం "తత్వాన్ని" గూర్చి ఆలోచిస్తుంది.
ఈ  ఆలోచన పరంపరలో ఆయుర్వేదం, సామవేదం (సంగీతం), యోగాభ్యాసం.. లాంటి ఎన్నో ఉపయొగకరమన విషయాలు లేకపోలేదు.
అవసరం ఆవిష్కరణకు మూలం. యోగాభ్యసంతో ఆరోగ్యం సమకూరి , ప్రకృతి చికిత్స తప్ప శస్త్ర చికిత్స అవసరం పెద్దగా రాలేదేమో.?
వర్గ పోరాటాలు, ఇతర దేశస్తుల దాడుల్లో ఎంతో అమూల్యమైన సమాచారం నాశనం అయ్యిందేమో..
ఉన్న సమాచారాన్ని భద్ర పరచటం, ముందు తరాలకి అందించటం లో విఫలం అయ్యారేమో ?


 పాశ్చాత్యులు దృక్పథం  సుఖమయ జీవితం అయితే.. అసలు  జీవితం ఎందుకు?  దేనికోసం అనే దృక్పథం లో మనవాళ్ళు ఆలోచించారేమో ?


తాతలు "వేస్ట్ ఫెల్లౌస్"  అని మీరు భావించినప్పటికీ .. తాతలే లేరు అనటం,
అలాగే మన చరిత్ర  గొప్పది కాకపోతే పోయింది కాని చరిత్రే లేదు అనటం సమంజసం కాదు.

Feb 3, 2011

అంతుబట్టని 'స్త్రీ హృదయం'


ఆమె అధికారిని..
అతను..ఉద్యోగి..
ఆమె మగాణ్ణి ఇట్టే ఆకర్షించగల ప్రౌఢ ..
అతను ఆ ఆకర్షణను తట్టుకోలేని యువకుడు.
ఆమె మగవాడి లోతులు తెలిసి ఆడించగల  సమర్థురాలు
అతను.. ఆడది అంటే తెలియని బేల యువకుడు.
ఆమెకి అతనంటే చనువు..సంకోచం  లేకుండా మాట్లాడుతుంది.
అతనికి అమెంటే ఇష్టం ..కాని ఆమె అధికారానికి భయం.
ఎంత ఒంటరిగా, చనువుగా ఎన్నాళ్ళు ఆమెతో వర్తించనీ   ఆమెతో మొహ సంభంధంగా ఏ  కొంచం దగ్గరిగా రావటానికి ఎవ్వరికీ గుండెలు లేవు.
ఆమె ఆకర్షణ శక్తి ముందు నిలవ లేక , ఆమె చనువుకి , సంభాషణలకీ అర్థం తెలీక.. మొహాన్ని ఆపుకోలేక  అతనికి నరకం.
ఆమె దేహం  పిలుస్తోంది..ఆమె మనసు పోమ్మతుంది.
ఆమె సుఖంగానే  ఉంది ..
అతను చిక్కి పోతున్నాడు.


అంతుబట్టని 'స్త్రీ హృదయం' 
 "ఆరంభింపరు " కథ 
రచయిత -   చలం

Feb 2, 2011

ఇదీ కుర్రాళ్ళ వరస ...
He : హే ..దుర్గం చెరువు వెళ్దామా.??
She:దుర్గం చెరువా ,, నో నేను రాను
She: ఎందుకు..?? నాకు తెలుసు అక్కడికొస్తే ఏం జరుగుతుందో..??
He : ఏం జరుగుతుంది..???
She: హే పో.. నేను రాను.
He : నీకెలా  తెలుసు.. వెళ్ళవా ఇంతకు ముందు ??
She: హే..చీ ..వెళ్ళలేదు..
He : మరి..??
She: ఫ్రెండ్ చెప్పింది..??
He :అవునా... ఆమెకెలా తెలుసు??
She: ఏమో .. వెళ్లి ఉంటుంది.
He :అవునా.. సరే.. మీ ఫ్రెండ్ నెంబర్ ఇస్తావా ?
She: ఎందుకు. .ఆ...చీ ..చీ...నీ ......
(అని  ఓ రాయి తెసుకొని కొట్టింది..
ఆది ఎక్కడో తాకి.. అబ్బా అన్నాడు..)
ఇదీ కుర్రాళ్ళ వరస ...

Feb 1, 2011

చరిత్ర కాకూడదా ..???

 
స్వప్నా.... ప్రేమంటే ఏమిటి ?
ఏం లేదు,... రెండక్షరాలు..?
మరి.."పిచ్చి"..ఆది కూడ రెండక్షరాలే..
అయితే ప్రేమికులు పిచ్చి వాళ్ళంటావా ??
కావలి మరి.   ఆ ...అటు చూడు... ఆది పిచ్చి పని కాదా ??
హి హి ...
అవును మనమెప్పుడు ఇలా శిధిలాల్లో  తిరుగుతున్నామెందుకు ?
ఈ శిధిలాల వెనక ఎన్నో కథలుంటాయి..చినిగి పోయిన చరిత్ర పుటలు ఎంత చిందర వందరగా పడున్నా శాశ్వతంగా గుర్తుంటాయి..
బాలు.. మన కథ కూడ ఒక చరిత్ర అవుతుందేమో ..
ఆ ఆ..
కాలికి  ముళ్ళు గుచ్చు కుంటేనే ఓర్చుకోలేవు .. ముందు ముందు చరిత్ర ఎలా సృస్తిస్తావ్ ??
హహ
స్వప్నా మనం పెళ్లి చేసుకోకూడదు..
ఏం ప్రేమంతా అయిపోయిందా ??
కాదు పెళ్లి చేసుకుంటే అందరి లాగ అందరి లాగ ఆలుమగలు గా మిగిలిపోతాం.. ప్రేమ ఫలించక పోతేనే,,,, కథానాయకులమవుతాం..
మనది కథెందుకు కావాలి?? ..... చరిత్ర కాకూడదా ..???