May 30, 2011

ఓ పరిమళం..




మల్లి కి నాకు చిన్నపటినుంచి ఫ్రెండ్ షిప్.  'మల్లి' అంటే.. ఏదో కోయ,,చెంచు జాతి అమ్మాయో అనుకునేరు. మల్లె పువ్వు..
ఎక్కడ కనపడ్డా ఒకటి తీసి జేబులో వేసుకునేవాడిని.
పచ్చని కాడకి తెల్లగా  విరిసీ విరియని రెక్కలతో.. ముడుచుకొని కూర్చున్న అమ్మాయిలా అనిపించేది మల్లె మొగ్గ..
ఆ చిన్ని రేకుల మధ్య ఎన్ని ఎన్ని అత్తరు బుడ్లు దాచుకుందో..తెల్లవార్లు ఒకటే గుభాలింపు.

సైదాబాద్ లో ఉండేటప్పుడు, రోజు ఇంటికెళ్ళే టైం కి అంటే 9- 10pm మధ్య చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జి మీద నుండి వెళ్ళేవాడిని..
ఆ బ్రిడ్జి మీద ఒక పక్కన మల్లె పుదండలు అమ్మే వాళ్ళు
బైకుల మీద వెళ్తున్న జంటలు ఆగి,  కొని తలలో ముడుచుకొని మొగుడికి హత్తుకొని కూర్చొని ఝాం అని వెళ్లి పోయేవాళ్ళు.
ఒంటరి భర్తలు..పూలు పొట్లం కట్టించుకొని హుషారుగా వెళ్ళేవాళ్ళు..
నాలాంటి వాళ్ళు  అంటే  బ్రహ్మచారులు..వాళ్ళ మొహాలు చూసి 'హ్మం'  పెద్ద నిట్టూరూపులు..  


నిన్న మళ్లీ ఆ పరిమళం పలకరించింది..
పలకరిస్తూనే ..పాత  సంగతులు గుర్తుకు తెచ్చింది...  :)

No comments: