Showing posts with label నిర్వేదం. Show all posts
Showing posts with label నిర్వేదం. Show all posts
Oct 11, 2011
Aug 4, 2011
మగాళ్ళు ఎందుకు తాగుతారో....
మగాళ్ళు ఎందుకు తాగుతారో అని ఆడాళ్ళు అనుకుంటారు..
కాని తాగేది వాళ్ళ 'బాధ' పడలేకే అని తెలుసుకోరు.. ;)
మగువలేక మందు తాగేది కొందరు.
పొందులేక మందు కోరేది కొందరు.
స్త్రీ సన్నిహిత్ర్యం రాహిత్యమై కొందరు..
స్త్రీ దొరక్క కొందరు..
హేండిల్ చేయలేక కొందరు..
దొరికినా ప్రేమించటం రాక కొందరు..
ప్రేమించినా అనుభూతి లేక కొందరు..
అడ దాని పోరు పడలేక కొందరు..
ప్రేమ పొందలేక కొందరు..
పొందిన ప్రేమ నిలవక కొందరు..
ప్రేమే లేక కొందరు..
లేని ప్రేమకై వెతికి వేసారి కొందరు
ప్రేమ ఎక్కువై కొందరు..
Jul 20, 2011
అర్థం అయ్యిందిగా ...!!
నేను..నా మిత్రుడు ఒక కేఫ్ లో కూర్చున్నాం.
చాయ్ తాగుతూ అదీ ఇదీ మాటలయ్యకా..
" ఎంతకాలం ఇలా ?? future గురించి ఆలోచించు కొంచం " అన్నాను.
వాడు మౌనంగా ఆలోచిస్తున్నాడు.
ఇంకో టీ తాగాం, ఆ మౌనం మధ్యలో..
" ఏం ఆలోచిస్తున్నావ్ ?
future గురించి ?
అదే ఏంటి అని ?
'' life after death" ఎలాఉంటుంది అని
నీ ఆమ్మ.. future అంటే.. మరీ అంత దూరం పోవద్దురా...
రేపు ఎల్లుండి..ఈ సంవత్సరం.. అంతే చాలు... :(
అర్థం అయ్యిందిగా నా మిత్రుడి పరిస్థితి.
Jun 8, 2011
ఇదే జీవితం..
అంతా కళ్ళెదుటే..కాని ఏది దొరకదు..
అన్ని అందుబాటులోనే..కానీ ఏదీ అందుకోలేము..
అన్నీ తెలిసినట్టే ఉంటాయి..కాని ఎందుకో అనుమానం..
అమ్మాయి చిరునవ్వుతో మాట్లాడుతుంది..కాని ప్రేమిస్తోందో లేదో.. ??
తను పక్కనే ఉన్నట్టు ఉంటుంది.కాని మధ్యన ఓ అగాధం..
నవ్వుతూనే ఉంటాం..కాని లోపలి బాధ మనకి తెలుస్తూనే ఉంటుంది.
కలలు వస్తుంటాయి..పోతుంటాయి..కాని నిజం కావు..
గుండెనిండా సంతోషం పొంగినట్టే అనిపిస్తూంది..కాని ఆది ఎండమావిగా మిగిలిపోతుంది..
ఉదయం ,,మధ్యాన్నం..సాయంత్రం గడిచిపోతుంటుంది..రోజులో పెద్ద మార్పు ఏమి ఉండదు..
జీవితం చాలా చిన్నదే..కాని రోజు గడవక ఎంతో పెద్దదైపోతుంది .
అందరూ పక్కనే ఉంటారు...మన చావుని ఎవ్వరూ ఆపలేరు..
అన్ని అందుబాటులోనే..కానీ ఏదీ అందుకోలేము..
అన్నీ తెలిసినట్టే ఉంటాయి..కాని ఎందుకో అనుమానం..
అమ్మాయి చిరునవ్వుతో మాట్లాడుతుంది..కాని ప్రేమిస్తోందో లేదో.. ??
తను పక్కనే ఉన్నట్టు ఉంటుంది.కాని మధ్యన ఓ అగాధం..
నవ్వుతూనే ఉంటాం..కాని లోపలి బాధ మనకి తెలుస్తూనే ఉంటుంది.
దేవుడున్నట్టే అనిపిస్తూంది..కాని కనిపించడు ..కనిపించినట్టు అనిపించదు..
కోరిక మొలకెత్తుతుంది..పెరుగుతుంది..పెద్దవ్తుతుంది..చివరకు ఎండిపోతుంది..కాని తీరదు.కలలు వస్తుంటాయి..పోతుంటాయి..కాని నిజం కావు..
గుండెనిండా సంతోషం పొంగినట్టే అనిపిస్తూంది..కాని ఆది ఎండమావిగా మిగిలిపోతుంది..
ఉదయం ,,మధ్యాన్నం..సాయంత్రం గడిచిపోతుంటుంది..రోజులో పెద్ద మార్పు ఏమి ఉండదు..
జీవితం చాలా చిన్నదే..కాని రోజు గడవక ఎంతో పెద్దదైపోతుంది .
అందరూ పక్కనే ఉంటారు...మన చావుని ఎవ్వరూ ఆపలేరు..
Mar 30, 2011
ఇన్నాళ్ళూ ..
ఇన్నాళ్ళూ .. కాలంతో పరుగులు పెట్టి అలిసిపోయాను. కాలమే నాకోసం ఆగుతుందో. లేక తనతో పాటే లాక్కేలుతుందో ..దానిష్టం.
ఇన్నాళ్ళూ... నీ ప్రేమకోసం తపించాను. ఇక నీలో ప్రేమని ఇస్తావో.. నా ప్రేమని తర్కిస్తావో /తిరస్కరిస్తవో నీ ఇష్టం.
ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి ...పట్టుకోల్పోయాను..ఇక పుస్తకమే నన్ను చదువుతుందో..లేక నేనే పుస్తకం అంటుందో దానిష్టం.
ఇన్నాళ్లూ.. డబ్బుకోసం వెంపర్లాడాను . ఇక డబ్బే నావేనకోస్తుందో..లేక తనదారి తాను చుసుకుంటుందో దానిష్టం.
ఇన్నాళ్ళూ .. జనాన్ని మేల్కొలపాలని అరచి నీరసించాను. ఇక జనం మేలుకొంటారో..నన్నే నిద్రపుచ్చుతారో వాళ్ళ ఇష్టం.
ఇన్నాళ్ళూ .. నన్ను నేను తెలుసుకోవాలని ప్రయత్నించి వికటించాను.. ఇక నేను 'నన్ను'ని తెలుసుకుంటుందో...నన్ను 'నేను' ని తెలుసుకుంటుందో దానిష్టం.
ఇన్నాళ్ళూ ... మనసులోతుల్లోకి జారిపొవాలని శ్రమించాను. ఇక మనసే నాలోకి జారుతుందో. జారలేక జారగిల పడుతుందో..దానిష్టం.
ఇన్నాళ్లూ కలలు కంటూ కాలం గడిపాను...ఇక ఆ కలలు నిజమే అవుతాయో..కల్లలే అవుతాయో వాటిష్టం.
ఇన్నాళ్ళూ .. దేవుడిని కన్నుక్కోగలనని విస్వసించాను.. ఇక దేవుడే నన్ను కనుక్కుంటాడో, కనపడకుండానే ఉంటాడో ఆయనిష్టం.
Mar 8, 2011
స్మశాన వైరాగ్యం.
అనగనగా ఒకాయన.. బాగానే బతికాడు.. పుటుక్కున పోయాడు.
అందరు వచ్చి... కన్నీళ్లు కార్చి.. బాధని దిగమింగి.. కాటికి తీసుకెళ్ళి... కట్టెకి నిప్పు పెట్టేసరికి మిట్టమద్యాన్నం దాటింది..
అలా అందరూ ఎగిసే మంటని చూస్తూ ఉండగా..
ఎవరో ఓ పెద్దాయన, ఎవరితోనో..
ఇంటిదగ్గర వంట సామాను సిద్దం చేసారా? అని అనగానే...
ఒక్కసారి అందరి ఆత్మారాముడు గబుక్కున మేల్కొని, స్నానం చేసి వడి వడిగా ఇంటి ముఖం పట్టారంతా.
ఇదీ స్మశాన వైరాగ్యం.
అది కట్టే కాలే వరకే... ఆ తరవాత కడుపు కాలి వైరాగ్యానికి తిలోదకాలిచ్చి మళ్లీ ఈ లోకం లోకి రావాల్సిందే, ఎవ్వరైనా..!
సంతాన వైరాగ్యం..
పురుడు పోసుకుంది...ఆయాసం తో తొమ్మిది నెలలు మోసింది.
కానుపు సమయం వొచ్చేసింది.. ఆ బాధ తట్టుకోలేక..
ఆ సుఖము వొద్దు ..ఈ బాధ వొద్దురా దేవుడా..
దీనికి అంతా కారణం...అదే కదా.. ఇంకోసారి..మళ్లీ నన్ను ముట్టుకోనిస్తానా...అని మనసులో ఒట్టు పెట్టుకుంది.
పండంటి పిల్లాడు..కేరింతలు..తుళ్ళింతలు..పులకింతలు.. ముద్దు ముచ్చట్లతో, బారసాలతో.. మూడు నెలలు గడిచాయి.
ఓ ప్రశాంత సాయంత్రం , ఏకాంత సమయం.. ..ఓ పక్క హాయిగా నిదుర పోతున్న పాపడు..ఇంకో పక్క పుస్తకం తిరగేస్తున్న వాళ్ళాయన...
ఏమండీ..అని..గోముగా గోకింది..మళ్లీ కథ మొదలు..
ఇదీ సంతాన వైరాగ్యం..కొంత కాలమే ...
Mar 2, 2011
సన్యాసం
సన్యాసం తీసుకొని మాత్రం చేసేదేముంది అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే శ్రియ.. నయనతార, ఇంకా _ _ _ _ లాంటి భక్తురాళ్ళు ఉంటె ఆది వేరే విషయం అనుకోండి ;)
ఈ మధ్య MMS ల పుణ్యమాని మహా మహా బాబాలు..యోగుల అసలు రూపాలు బయట పడుతుంటే... దానికంటే సంసారమే నయ్యం అని తేలిపోతోంది.
అందుకేనేమో..ఎలాగూ మీ వల్లకాదురా అని ఏ వయసుకు ఆ ముచ్చట తీర్చుకోండి బాబు అని .బ్రహ్మచర్యం..గృహస్తం..వానప్రస్థం..సన్యాసం.. ఆశ్రమధర్మాలు పెట్టారు మన పూర్వికులు.
అప్పుడెప్పుడో " దలై లామా" "ఇప్పుడనిపిస్తోంది నేనూ మిస్ ని మిస్ అయ్యానా " అని అన్నట్టు విన్నాను..
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు( ఎం పడుతుందో నాకు తెలిదు :) ) బ్రహ్మచర్యం ముసుగులో ఉన్న ఆ యోగులకే, బాబాలకే, nun లకే ..ఫాదర్ లకే తెలియాలి..నిజంగా తాము 'అది' వోదిలేసరా లేక..దొంగ చాటు వ్యవహారం నడిపిస్తున్నారా అని.
ఏదో జీవితం లోనో, ప్రేమలోనో,డబ్బు సంపాదనలోనో విఫలమై చావలేక జీవితాన్ని దేవునికి అంకితం చేద్దామని సన్యాసిగా మారగానే..అందమైన భక్తురాళ్ళు అనుకోకుండా తగులుతారు.ఎక్కడినుండో విరాళాలు వొచ్చి పడుతుంటాయి. అప్పుడు అటు,ఇటు ..ఎటు తేల్చుకోలేక చివరికి బ్రహ్మచర్యానికి కామా పెట్టేసి.. కామానికి కాలు దువ్వుతారు. భక్తి బయటికి రక్తి లోపల..విరక్తి మాటలు జనాలకి..
ఇంకొంతమందికి ఇది ముందే తెలుసు..దీనికోసమే బాబాలు అవుతారు.
ఒక మంచి వేషధారణ,.రెండు ట్రిక్కులు.. మూడు నామాలు.నాలుగు మంత్రాలు.అయిదు వైరాగ్యపు మాటలు..ఆరుగురు శిష్యులు ఇవి చాలు సింహలో బాలయ్య డైలాగులా "పదిమందిని ...పదికి పది పెంచుతూ..పది పది సార్లు ఆకర్షించటానికి. మరే మన జనాలు వెర్రి వెంగలప్పలు కదా, అక్షరంరాని వాళ్ళు, ఇంట్లో దరిద్రం "శివతాండవం" చేసే వాళ్ళు, భక్తీ పరవశం ఎక్కువైన మేధావులు ..అన్ని కోల్పోయి..ఇంకా కోల్పోవటానికి ఏమి లేని నిర్భాగ్యపు స్త్రీలు...వీళ్ళంతా కలసి సామాన్య సన్యాసిని, బాబా ని చేసేస్తారు. .దాంతో ఇహ అయన 'ఇంటా బయటా' కార్యక్రమం రూపొందిస్తాడు.
మరీ నేనూ చెప్పినంత సులువేమీ కాదనుకోండి, ఈ బాబా అవతారం ఎత్తి విజయం సాధించటం. ఎన్నో ఏళ్ళ కృషి, మంచి మాటకారితనం, సూపర్ మేనేజ్మెంటు, multiple tasking ...ఉంటె తప్ప మంచి రాబడి గల రసిక బాబా కాలేరు.
నా బాధంతా ఇంత కష్టపడటం ఏదో.. బయటే, బాహాటంగా, ఒక మంచి రంగాన్ని( బాబా అవతారం కూడా ఓ రంగమే అనకండి ) ఎన్నుకొని కష్ట పడితే ఏ దొంగావేశాలకి తావుండదు కదా..తమకి తాము explanation ఇచ్చు కోవలసిన అవసరం లేదు కదా అని.
అయినా జీవితం ఎవ్వరినీ వదిలి పెట్టదు..ఎం చేస్తుందో తెలుసా ?? :):)
(అడగండి, చెపుతా...)
అయినా జీవితం ఎవ్వరినీ వదిలి పెట్టదు..ఎం చేస్తుందో తెలుసా ?? :):)
(అడగండి, చెపుతా...)
.
Feb 26, 2011
ఎందుకు 'రావ్' ఏడుస్తావ్
ఎందుకు 'రావ్' ఏడుస్తావ్??ఏం జరిగిపోయిందని బాధ పడతావ్??
కాలం కదలిపోయిందనా?? కలలు కరిగి పోయాయనా??
నిజం నిప్పులా కాల్చేసిందనా ? జీవితం కుప్ప కూలిందనా ??
అనుకున్నది జరగకనా? జరిగింది ఒప్పుకోలేకనా??
ఆనందం అంద లేదనా ? సంతోషం సొంతం కాలేదనా??
ఆశలే అత్యాశలయితే.. పక్క వాడితో పోల్చుకుంటే..
చెమట చుక్కని కార్చకుంటే... నిమ్మళంగా తిని కూర్చుంటే..
ఉన్నదాన్ని కాదనుకుంటే.. చేతనయింది చేయకుంటే...
ఉహల్లో విహరిస్తుంటే..వాస్తవంలో బ్రతకకుంటే...అంతేనోయ్..అంతే
Feb 25, 2011
మిగులుంది జీవితం..
ఆనందం కోసం వెతికాను..అలసిపోయాను.
డబ్బు సంపాదించాలని వెంపర్లాడాను .. వల్ల కాలేదు.
అమ్మాయి 'ప్రేమ' కోసం అంగలార్చాను .. దొరకలేదు.
నాకొచ్చిన పని చేద్దామను కున్నా... డిమాండు లేదు .
తప్పతాగాను..కాని 'అలవాటు అయ్యి ' పోయింది .
సిగరెట్టు తాగినా ..పొగ తప్ప ఏమి రావటంలేదు.
జీవిత పుస్తకం తిరగేస్తున్నా.. తెల్ల పేజీలు తప్ప ఏదీ కనపడటం లేదు.
జ్ఞాపకాలు నేమరేస్తున్నా ... చిరునవ్వు విరియటం లేదు..
భవిష్యత్తు బాగుంటుందన్న ఆశా లేదు..నమ్మకం అంతకంటే లేదు.
దుబారాగా ఖర్చు పెట్టినా 'కాలం' తరగటం లేదు.. .
ఇంకా మిగిలింది..మిగులుంది జీవితం.. ఏం చేయాలో తెలీటం లేదు.
Subscribe to:
Posts (Atom)








