Showing posts with label వెంపర్లాట. Show all posts
Showing posts with label వెంపర్లాట. Show all posts

Dec 27, 2011

కన్నులతో చూసేదీ గురువా....


paradise x రోడ్స్ ..టైం 11.45 am
అబ్బా టైం అవుతుంటే ఈ సిగ్నల్స్ ఏంట్రా నాయనా..
రెడ్ లైట్ చూసి ఆగక తప్పలేదు. ముందే రోడ్డుమీదకి వస్తే ఏదో తెలీని టెన్షన్, దానికో తోడు వర్క్ టెన్షన్ + లేట్.
థు దీన.... అని అనేలోపే మాట ఆగిపోయింది. కారణం ఓ రాయంచ పక్కన ఆగింది. తెల్లని సుజికి ఆక్సెస్ మీద.. తెల్లని చుడీదార్ లో..
చూస్తే బావుణ్ణు ..చూస్తే బావుణ్ణు.. చూస్తే ... మూడోసారి అనుకునేంతలో చూసింది.
కనులు కనులని దోచాయంటే.... నేనయితే ఆమె చూపులు దోచేసి దాచేసాను.
థు నీ .. తినేసేలా చూస్తావా అనుకుందేమో తలా పక్కకి తిప్పింది.
మళ్ళీ చుడకపోతుందా అనే ఆశ చావదే..
ఆమె అలా అనుకోలేదు, ఎందుకంటే మళ్ళీ చుసిందోచ్ .. ఇది మళ్ళీ మళ్ళీ రిప్లై  అయ్యింది.
చుట్టూ జనం..ఎవడి బాధల్లో వాళ్ళు. మా మధ్య మౌనం. కాని ఆ మౌనం మాట్లాడాలని ప్రయత్నం మొదలెట్టింది. ఏం జరిగిందో ఏమో..నాకు మాత్రం ఆమె నన్ను చూసి నవ్వినట్టే అనిపించింది.
'కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనస్సు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి '.....మనసుకి ఏదో కొత్త ఆనందం అవగతమవుతోంది.
ఇంకో అయిదు సెకండ్స్ ఉంది గ్రీన్ సిగ్నల్ పడటానికి. మొదటి సారి అనిపించింది ఈ ట్రాఫిక్ సిగ్నల్ టైం ఓ గంట ఉంటే ఎంత బావున్నో అని ..
ఇప్పుడెలా ...
అలోచిన్చేలోపే.... ఓ వాలు చూపు విసిరి జర్రున దూసుకుపోయింది..ఇంకోవైపు..నా  మనసుతో పాటుగా..



కీక్ కీక్.. వెనక నుండి హరన్...

ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.
కన్నులతో చూసేదీ గురువా కనులకి సొంతమౌనా .. ఇక కనులకి సొంతమౌనా...

Jan 27, 2011

సరళ రేఖ

ఒక ఆడ మగ మధ్య 
ప్రేమ ..కామం అనేవి  సరళ రేఖని చెరో వైపు..
కామం తో మొదలి ప్రేమ వైపుకో..

ప్రేమ తో మొదలై కామం వైపుకో.. సాగాల్సిందే.. 

Nov 26, 2010

తెలుసా??


నిద్ర పోతున్నావా.. బాగా అలసి పోయి.మత్తుగా..నిన్ను నివే ఆదమరిచావా ??
లేక కలల ప్రపంచంలో.. బంగారు వన్నెల రెక్కలతో విహరిస్తూ  వింత లోకాన్ని అస్వాదిస్తున్నవా ??
లేక మానస సముద్రంలో దూకి... అంతరంగ.. అందాల్ని..అద్బుతాల్ని  అవిష్కరిస్తున్నావా?
తెలియని అగాధపు లోతుల్ని శోధిస్తున్నావా  ?
లేక... నీకే తెలియని భయం.. వికృత రూపంలో దర్శనమిస్తోందా ??
లేక... హృదయాంతరాలాల్లో   ఉన్న ఆనందాన్ని    నీ మొహం మీద చిరునవ్వులా ఒలికిస్తున్నావా   ??


నీ నిద్ర కోసం..సూరీడు దూరంగా  ఇవతలి వైపుకి వోచ్చాడని..
ఆకాశం చుక్కల  దుప్పటి కప్పి ..చద్రున్ని బెడ్లాంప్   లాగా వెలిగించిందనీ ..
అనంతః  దూరంలోంచి పరుగు పరుగున పిల్ల గాలి నీకోసం వేంచేసిందనీ..
సమస్త ప్రకృతి నీకు జోల పాడుతోందనీ.. తెలుసా ??


తూరుపు నీ మెలకువకై.. కళ్ళలో వొత్తులు వేసుకు  చూస్తోందనీ
నారింజ రంగు చీరతో  తెగ మురిసిపోతోందనీ..
పక్షిలోకం కొత్త రాగాలు నేమరేస్తున్నయనీ..
నీ  వాకిట్లో  గులాబీ  నవ్వుని practice చేస్తోందనీ..
నీకోసం  మల్లియ  పరిమళాన్ని నింపు కొంటోందని   తెలుసా?? 

Oct 20, 2010

ఒకరోజు సరదాగా..



యా.. సరదా డేట్...
శ్రుతి రెండేళ్లుగా  ఇంటర్నెట్ లో పరిచయం..
అప్పుడప్పుడు sms .. ఫోన్ కాల్స్.. 
నెట్ లో కలిసిన ప్రతిసారి.. నేనూ కలుద్దాం అనటం.. ఆమె అవసరమా అనటం..




అల్ అఫ్ అ సడన్.. 
ప్రతిసారిలాగే..
కలుద్దామా అని నేను.. ఎప్పుడు?? అని ఆమె..
నిజమా అని నేను అడిగేన్తలో.. 11 కల్లా   వోచ్చేయి .. లేకపోతే ...i will go to office
ఒహ్హ వొస్తున్నా...
చక చక తయారై..బయలుదేరా ( చిన్నప్పుడు సినిమా అంటే ఇలాగె అయ్యేవాడిని )


హాయ్.. how are u లు ఐపోయాక
శృతి అంటే ఇలా ఉంటుందా.. ఈమేనా... అని ఆశ్చర్యం ..
అ మాటలకి.. రూపానికి పోల్చుకోటం లో నేను...
మాటల్లో రౌడి లాగ ఉన్నావ్..కాని.. చూస్తే అలా అనిపించవ్ అని ఆమె..
ఆఫీసు వెళ్ళాలనిపించలేదు.. అది కాక  నివ్ చాల రోజులనుండి కలుద్దాం అంటున్నావ్ కదా .....గొణుగు 
అవునా.. అంటే టైం పాస్ కి అన్నమాట....   
హే కాదు.. కలుద్దాం అంటున్నావ్ కదా.. అందుకే...
సర్లే .. ఇంకా...
 ఈ మాటల్లో లంచ్ అయింది..
నేను : అండ్ నౌ.. హే లాంగ్ డ్రైవ్ వెళ్దామా..?
శ్రుతి : ఎక్కడికి..??
నేను : ఏమో.. అలా .. may be చిల్కూర్.. 
శృతి : అంత దూరమా.. ఇంత ఎండలోన..
నేను : అంత దూరం కాకపోతే .. సగం దూరం వెళ్దాం..వెనక్కి వోచ్చేద్దాం ..ఏమంటావ్ ??
శృతి: సరే నీ ఇష్టం..
నేను : ఓకే.. ( అని..బైక్ మెహది పట్నం వైపు పోనిచ్చా..)
ఎదురుగ.. flyover .. నాకు అది airport fly over అని తెలిదు..
అది కాక  చాల పెద్ద లెటర్స్ తో రాసారు.. Two wheelers are strictly not allowed అని.. అది కుడా కనపడలేదు.
flyover ఎక్కించా..
ఖాలిగా ఉంది.. స్పీడ్ పెంచా...
అప్పుడు చెప్పింది.. శృతి.. హే.. ఎందుకు దీనిమీదకి  తెచ్చావ్.. 
two wheelers are strictly not allowed అని రాసారు గా
అవునా..అయ్యో ..నేను చుడలేదు..ఇప్పుడెలా??
అయితే వెనక్కి తిప్పు..
తిప్పుదామనే అనుకున్నా.,కాని వెనక్కి రావటానికి దారి లేదు..
అడపా దడపా ఎదురుగ కార్లు తప్ప ఒక్క two wheeler కూడా రావటంలేదు..
కనిసం ఒక్కడైనా రావోచ్చుగా నాకు తోడుగా..
ఎంత దూరం పోయినా.. fly over ఐపోటం లేదు.. వొస్తూనే ఉంది రోడ్డు..
అయ్యో..ఎలా అంది..తెగ టెన్షన్ తో అంది శృతి..
అయిందేదో  అయింది..అవతలి చివర  వొచ్చేదాకా   enjoy the ride ..
మహా అయితే 500 /- ఫైన్ ఉంటుంది ..
 11 km ఎవ్వరు లేని  మెలికల రోడ్డు...మాకోసమే వేశారా  అనిపించింది..
THE END రానే వొచింది..ఆపనే ఆపాడు  ... చిన్న ట్రాఫిక్ గుడిసె..దాన్లో ఉన్న  ట్రాఫిక్ భటుడు..

సర్.. తెలీకుండా వచ్చాం ..బోర్డు కనపడలేదు.. వెనక్కి వెళ్దాం అనుకుంటే.. దారి కూడా లేదు... (కొంచం లో వాయిస్ లో చెప్పా)
అయితే ఫైన్ కట్టు..
ఎంత ...అని నోట్లోకి వొచ్చేసేదే .. 
కాని..ఏ ట్రాఫిక్ పోలీసు పట్టుకున్నా.. వొచ్చే రేగులేర్ మాట... దానికంటే ముందు వొచ్చేసింది తెలీకుండానే..
"నేను  ప్రెస్ "
 మరి ముందే చెప్పోచుగా..అని చిరునవ్వు తో  లోపలికెల్లిపోయాడు.
వెనక పిల్లకి టెన్షన్ సడన్ గా మైనస్  లో కి పడిపోయింది..
:) :)
ఇంకంతే......

Feb 13, 2010

తమిళ పొన్ను

ఊరి నుండి అప్పుడే వొచ్చి ముఖం కడుక్కొని..అమ్మ కలిపిన అటుకుల మూట విప్పి తింటున్నాం ఇద్దరం,  నేను, వాసూ. . ఉప్పు కారం.. కొబ్బరి పొడి..వేసి కలిపిన అటుకులు కమ్మగా ఉన్నాయి ఇంతలో.. "రా   రమ్మని రారా రమ్మని రామచిలుక పలికెను ఈ వేలా" ..  అంతగా బాలేక  పోయినా  పదే పదే వినిపిస్తోంది ఓ అమ్మాయి గొంతు.. ఆ  పదాలు పలకటం కూడా తెలుగు వాళ్ళ లా లేదు..
 వాసు ని అడిగా " ఎక్కడిదా గొంతు.. ఎవరా పిల్ల"
అదా  మధ్యాన్నం నిద్ర రాకుండా ఇదో గోల మొదలైంది మనకి.. కింద షాప్.. హాట్ చిప్స్ కి అద్దెకి ఇచ్చారు.. తమిళ వాళ్ళకి "
 "ఓహ్  అవునా " అన్నాను మళ్లీ అదే పాట వింటూ..తమిళ యాసలో గట్టిగా బెరుకు లేకుండా పాడుతోందా  పిల్ల.
వేడి చాయ్ పెట్టాడు వాసు.
వాసు చిన్ననాటి మిత్రుడు. కాని ఈ మధ్యే నేను వాసు రూం లో జాయిన్ అయ్యా. ఆటను చాల సాదా సీదా వ్యక్తి.. లైఫ్ ఇస్ సో సింపుల్ అతనికి.  తన వల్లకాని..శక్తికి మించిన  ఆలోచనలు చేయడు..full practical minded. ఉదయం 7 గంటల కల్లా లేచి చాయ్ తో పాటు  న్యూస్ పేపర్ చూడటం, స్నానం..వంట ..భోజనం..కాసేపు విశ్రాంతి.. మధ్యాన్నం 1 గం  ఆఫీసుకి వెళ్లి. రాత్రి 10 గంటలకి రావటం..అది అతని దిన చర్య.. ఆదివారం వొస్తే...ఓ  సినిమా..అంతే.
నిద్ర లేవటానికి ఓ వేళా  పాళా  అంటూ లేని నేను వాసు రూం కీ షిఫ్ట్ అయ్యాక చాయ్ కోసం  7 కల్లా లేవటం అలవాటయ్యింది.
కాలేజీ  నుండి సాయంత్రం 4 గం కి వొచ్చి కాసేపు పడుకునే వాడిని..ఈ పిల్ల పుణ్యమా అని ఆ నిద్ర  లేకుడా పోయింది. లేటెస్ట్ సినిమా పాటలతో ఊదరగొట్టేది.  ఎవరా  పిల్ల ఎలా ఉంటుంది.. అనే కుతూహలం కూడా ఎక్కువవుతూనే ఉంది ఓపక్క .
ఓ రోజు మధ్యాన్నం కాలేజీ నుండి వొస్తూనే సరా సరి షాప్ కీ వెళ్ళా  హాట్ చిప్స్ కొందామని..
"రా రా రమ్మని రామచిలుకా".... ఆపేసింది నన్ను చూసి,..
తమిళ నలుపు..అయినా ఏదో కళ .. తెల్లగా పెద్ద   కళ్ళు .. 18- 19 మధ్య ఉంటుంది. హాట్ చిప్స్ వేయించి వేయించి  మొహం కొంచం జిడ్డు ఓడుతోంది..నూనే పట్టించి వేసిన చిన్న జడ .. పెద్దగ  చదువుకోలేదని మొహం చుస్తే ఎవరికైనా తెలుస్తంది.. కాని ఎదుటివారిని కట్టి పెడేసే  గుణం ఏదో  ఉంది..
 నిర్భయంగా బెరుకు లేకుండా మాట్లాడం లోనే ఉందేమో..
"ఎం కావలి"
"చిప్స్ "
"పైన రూం లో ఉంటారా " నన్ను ఎప్పుడో గమనిచేసింది..
"అవును "
"సదూ  కుంటున్నారా " తమిళ యాసలో ప్రశ్నలతో పాటు  గుప్పెడు చిప్స్ ఎక్కువేసింది.
అది  మొదలు.. అప్పుడప్పుడు నేను చిప్స్ కోసం వెళ్ళటం.. చిరునవ్వులు, పలకరింపులు హాయ్ లు బాయ్ లు  . ఆ పిల్ల నా కళ్ళ లోకి తదేకంగా చూసేది  నేనే మరల్చు కోవలిసి వొచ్చేది.
 అది ఎండాకాలం ఒక రోజు నేను భోజనం చేస్తున్నా, వాసు మంచి కునుకో లో ఉన్నాడు.. ఇంతలో    టక టక అని తలుపు చప్పుడైంది కింద.. మా రూం మొదటి అంతస్తులో..spiral stair case తో వింత గా ఉండేది. ఎవరా అని చెయ్యి కడుక్కోకుండా నే వెళ్లి తలుపు తీసా..
 తమిళ పొన్ను..  " కొన్ని నీలిస్తారా " అని వాటర్ బాటిల్ చూపించింది.
"సరే పైకొచ్చి తీసుకో..నేను భోజనం చేస్తున్నా " అన్నాను,
నాతో బాటే అనుసరించిది. అదుగో ఆ కుండలో ఉన్నాయి అని చూపించా.
వెళ్లి గ్లాస్ తో బాటిల్ నింపటం మొదలు పెట్టి మళ్లీ కళ్ళతో కళ్ళు ముడేసింది. నాకు ఎలా తప్పింహుకోవలో తెలిలేదు. దగ్గరి కెల్లాను.. ముద్దు పెట్టు అన్నట్టుగా   చెంప చూపించింది.
ఏమి ఆలోచించకుండా ముద్దు పెట్టాను. నీళ్ళ బాటిల్ వొదిలేసి..  చేతులు చాచింది..
నేను కోగిట్లో వాలాను. అలా రెండు మూడు  నిముషాలు ఉండిపోయాం..అ అమ్మాయి  చిన్నగా  కదిలే సరికి విడి  పడ్డాను.
ఎం మాట్లాడకుండా నీళ్ళ  బాటిల్ తెసుకొని వెళ్లిపోయింది..

Nov 10, 2009

మా ఊరికి "శివ" సినిమా వొచ్చింది



అది 1990 - 91 అనుకుంటా..మా ఊరికి  "శివ" సినిమా వొచ్చింది.. పరీక్షల్లో క్లాసు ఫస్ట్ వొస్తానని ప్రామిస్ చేస్తేనే కాని  ఓ   రెండు రూపాయలు దొరకలేదు.. మొత్తానికి సినిమాకి వెళ్ళాను..
నాగార్జున సైకిల్ చైన్  తెంపి.మెల్లిగా చేతికి చుట్టుకున్నాడు..పిడికిలి గట్టిగా భిగించాడు.. ఎదురుగ చక్రవర్తి....బిత్తరపోయి చూస్తున్నాడు... నేను నోరు వెల్లబెట్టుకొని చూస్తున్నాను..అయినా అది నాకు మాములే..ఏ సినిమా చూసినా నోరు అలాగే తెరుచుకొని ఉంటుంది..ముఖ్యంగా ఫైటింగ్ సన్నివేశాలు వొచ్చినపుడు. అప్పటి కప్పుడు నా ఫేవరేట్ హీరో మారిపోయాడు...చిరంజీవిని వెనక్కి నెట్టి నాగార్జున వచ్చేశాడు. ఇది కూడా నాకు మాములే.. మన రాజకీయ నాయకులూ పార్టిలు మార్చినట్టుగా నేను నా ఫేవరేట్ హీరోలని మార్చేవాడిని.
తరవాత రోజు నుండి నా స్నేహితునితో అదే సన్నివేశాన్ని పదే పదే చెప్పేవాడిని..పాపం.వాడునోరు తెరచుకొని   వినేవాడు..సినిమాయే చూడనట్టుగా.. అప్పటికే రెండుసార్లు చేసేసాడు.. వాడు నాగార్జున పార్టి లోకి ఎప్పుడో వచ్చేశాడు.


సన్నగా, "మిడ్డి" వేసుకొని జుట్టు వదిలేసి పదే పదే జుట్టును వెనక్కి తోస్తూ చిలిపిగా నవ్వే అమలని అంత సులువుగా ఎలా మర్చిపోతాను. ఒక పాటలో మెట్ల  మీద నుండి దూకుతూ చేసే డాన్స్ ఇంకా గుర్తుకు వస్తూ ఉంటుంది.
ఓ  రోజు స్కూల్ నుండి ఆదర బాదరాగా వచ్చా..
వచ్చి రావటమే గూట్లోకి బాగ్ విసిరేసి..డ్రెస్ మార్చుకొని చాయ్ తాగి పరిగెత్తాను..మేము ఆటలాడే చోటుకి...అది వైశాలి ఇంటి వెనకవైపు..చుట్టూ దట్టంగా చెట్లు...ఓ పెద్ద చింత చెట్టు కింద చదునుగా ఉండే ఖాళి ప్లేస్ నే మా ఆట స్తలం. ఇళ్ళకి దూరంగా ఉన్టటం తో అంత తొందరగా పెద్దలు వచ్చి మా ఆటకి భంగం కలిగించారు..అది గాక ఈ టైం లో అయినా ఆ పెద్ద చింత చెట్టు కింద నీడ ఎపుడు ఉంటుంది. అప్పుడప్పుడు జరిగే తగాదాలు కూడా ఇంట్లో వాళ్ళకి తెలీవు..అందుకే ఆ స్తలం ఎంచుకున్నాం. అప్పటికే ఒక ఆట మొదలైంది..ఎవరో కొత్త గోటిలు ( గోలి కాయలు) తెచినట్టున్నారు. ఒకటి ఎర్రగా ఉంది అది నన్ను ఆకర్షింది. దాన్ని ఎలాగైనా సంపాదించాలి అనుకున్న.. 
వైశాలి..ఆ ఆమ్మాయి అంత అందగత్తె అవునా కాదా అనేది నాకు తెలియదు కాని, ఆ కళ్ళే ఒక వింత కాంతి తో మెరిసేవి. అంతకంటే  వింతగా ఆ రెప్పలు కొట్టుకునేవి.. నిముషానికి కనిసం ముప్పై సార్లన్నా ..పచ్చని వర్చస్సు, చిన్ని పెదాలు బ్రాహ్మణత్వం తోనికిసలేడేది ఆమెలో. ఇవన్నీ కావు కాని.. ఆ గంభిరంత.. ఆ మౌనం అది నన్ను ఆకర్షించింది ..ఆటలాడుతూ అల్లరి చేసే వయసు కాని చేయదు.. ఎప్పుడూ వాళ్ళమ్మ పక్కన చేరి పూల మాల కడుతునో.. దేవుని దీపాలు వెలిగిస్తునో, అందంగా నవ్వుతుంది..కాని అది అపురూపం అందరికి దొరకదు.
అప్పుడప్పుడు వాళ తమ్ముడిని పిలుచుకొని పోటానికి వచ్చేది అక్కడికి.. మా పిచ్చి ఆటలు
చూసి కిలుక్కున నవ్వేది..అది నన్ను చూసి నవ్వినట్టు అనిపించేది.ఎందుకంటే బక్క పలుచగా..పొట్టి లాగు ..శివ స్టైల్లో భుజాల దాక మడిచి, దుమ్ముకొట్టుకోని పోయిన షర్టు..
కాని నా ఆలోచనలు వేరు..నాలోని "శివ " ఆమెలో " ఆశ " ని చూసేవాడు...(ఇంకా ఉంది.)

Oct 19, 2009

'మళ్లీ మొదటికొచ్చిన జీవితం '



Times of ఇండియా ఆఫీసు. సాయంత్రం 4.30.నిముషాలు..
bike visitors stand లో park చేసి.. లోపలికెళ్ళాడు..
." I want tho meet miss divya Mukharjee"
" OK please take ur seat".
సమాధానం విని పక్కనే ఉన్న సోఫా లో కుర్చున్నడతాను.. average buildup తో.. జీన్స్ పై T షర్టు వేసాడు.
చూడటానికి బానే ఉన్నాడు.. కొంచం టెన్షన్ గా ఉన్నట్టున్నాడు..కాలుని అదే పనిగాఉపుతున్నాడు.
ఇంతలొ "NIE candidates..ఇతనితో 4th floor కి వెళ్ళండి" receptionist చెప్పింది..ఒక ఆఫీసు బాయ్ ని చూపిస్తూ..
అదివిని..అతను మెల్లిగా లేచి ఆఫీసు బాయ్ నీ అనుసరించాడు..అలాని..తనతో పాటుగా వస్తున్న ఒక నడివయస్కురాలిని, పక్కనే ఉన్న అమ్మాయిని గమనించలేకపోలేదు..
అసలు చెప్పాలంటే..అతని కల్లెప్పుడు అమ్మాయిలనే చూస్తుంటాయి..అందాలని చూస్తాయి..అంచనా వేస్తాయి... హృదయం ఉందా అని వెతుకుతాయి...తనని ఒక వాలు చూపు చూడమని అర్థిస్తాయి ..చూడకపోతే విసుక్కుంటాయి ..చూస్తే విచ్చుకుంటాయి ..
అలా 4th ఫ్లోర్ కి వెళ్ళి ఒక హలో కూర్చున్నాడు.. ఇందాక చెప్పిన అమ్మ..అమ్మాయికూడా కూర్చున్నారు పక్కనే.
అ అమ్మాయే పలకరిచింది..
your dept?
"...Photography"..
yours name ??
చెప్పాడతను...
qualification??
XXXXXXX
good can u work for me ?
ohh sure ..
అలా ఇద్దరు పరిచయం అయ్యారు. 

ma
orientation class అయ్యాక..
"u want to have something like coffee ??" అంది madam
no.. thanks, I got to go ..అంటు.. నడివయ్స్కురాలు.. వెళ్ళిపోయింది..
ఆతను ఆ అమ్మాయి మిగిలారు..
( అలా అని నేను సంబోదిస్తున్నాను.. అతనైతే.. madam ని కూడా అదోలా చూసాడు)
"oh సరే" అన్నాడతను ఏ మాత్రం సంకోచించకుండా, అమాయి కూడా సరే అనడం తో ముగ్గురు
.. terrace పైన ఉన్న cafeteria కి వెళ్లారు.. అక్కడ ఏదో అవి ఇవి మాట్లాడి.. madam కి BYE చెప్పి ఇద్దరు కిందకి వోచ్చేసారు . అలా ఇద్దరు కిందకి వచ్చేటప్పుడు ...(అ) ప్రయత్నంగా ఆమె భుజాన్ని  భుజం తో  తాకాడు, కింది  చేతులు మాత్రం ఆమె ఉరువులని సుతారంగా రాసాయి ఒకసారి. దాంతో ఆమె చటుక్కున అతని కళ్ళలోకి చూసింది...కళ్ళు కళ్ళు సూటిగా కలిసాయి , ఆమె పెదవి చివరన చిన్ని చిరునవ్వు విరిసింది.చెంపల్లోకి నును సిగ్గు చేరింది. వెన్నులోంచి చిన్న జలదరింపు పాకింది. ఇవ్వన్నీ గమనించిన అతని   మనసు మనసులో లేదు. ఏదో ఉహాలోకంలో తేలిపోయింది....ఇదే సరిగ్గా ఇలాంటి సమయం లోనే కొంచం చొరవ చూపితే విచిత్రాలు జరగవచ్చని ఎవరో చెప్పిన గుర్తుకు వచ్చింది. అందుకే ఏదో ఒకటి చేయాలి.. కాని ఏం చేయాలి ?? తెలిదు  
అ అమ్మాయి వాష్ రూం కి వెళ్లి వొస్తానని చెప్పింది . సరే వెళ్ళొస్తా bye అని చెప్పక.. వాష్ రూం కి వెళ్ళొస్తా  అని ఎందుకు చెప్పినట్టు ?? తనని 'ఆగు వస్తా' అని చెప్పినట్టా ?? ..లేక ఇంకా ఏదైనా అర్థం దాగుందా..లేక casual గా చెప్పిందా..  ఖచ్చితంగా తనని ఉండమనే చెప్పింది. సో ఆమెని ఇంటిదగ్గర DROP చేస్తా అని అంటే.. ఆమె ఒప్పుకుంటే..ఇంటికి వెళ్ళాక కాఫీకి రమ్మంటే.... ఉహాలు పరుగులు తీసాయి. దైర్యం కూడ తీసుకున్నాడు   ...బయటకి వొచ్చేలోపు ..మనవాడు.. బైక్ పై గేటు ముందు రెడీ గా ఉండి .. అడిగాడు.. " shall I drop you somewhere??

ప్రేమ.. స్నేహం.. జాలి.. దయా.. కరుణా.. ఏ కోశానా  లేకుండా,  ఏమాత్రం ఆలోచించకుండా..అంది ఆమె.
"no thanks" 

సమాధానం విని.. 'మళ్లీ మొదటికొచ్చిన జీవితం తూ  ' మనస్సులో విసుక్కొని బైక్ ని ముందుకి పోనిచ్చాడు ..

ఎన్నాళ్ళని ???


చక్రీ.... ఎన్నాళ్ళని కలల్లో బ్రతుకుతావు?? ఏదో అదృష్తం తలుపు తడుతుందని..ఎవరో వస్తారని..ఏదోచేస్తారని..ఎన్నాళ్ళు??
అవును నాకు తెలుసు, నేనంటే నీకిష్టం..కాని కేవలం ఇష్టం ఉంటె సరిపోతుందా....? కలసి బ్రకాలంటే ఏదో ఒకటి చేయాలికదా..ఎన్నాళ్లని ఆగను ... నీకోసం .. నీ సక్సెస్ కోసం .??
నీకు తెలుసా ఓ సగటు ఆడపిల్ల ఎం కోరుతుందో..??
...పెళ్లి.. మనసు అర్థం చేసుకొనే భర్త...ఓ ఇల్లు.. ముచ్చటైన పిల్లలు..ఇంతే...
నేనో సగటు ఆడపిల్లని చక్రీ... నీ కలలతో నాకు పనిలేదు.. నీవేం చేస్తావో కూడా నాకు తెలియదు.. నాక్కావలసింది..ఇవే. నీవీయగలవా ?? లేవు... ఇవ్వలేవు.. ఇచ్చే పరిస్థితుల్లో లేవు..
గత రెండేళ్లుగా నీకోసం వేచాను. కాని నీ జీవితం లో ఎలాంటి మార్పు లేదు..కలుస్తావు..ఏదేదో చెపుతావు..సినిమాఅంటావ్..ప్రాజెక్ట్స్ అంటావ్..ఫోటోగ్రఫీ అంటావ్.. కాని అన్ని కథలే.. అన్ని కలలే.. ఒక్కటి జరుగుతుందో లేదోతెలిదు..నాకు నమ్మకం పోయింది. ఎన్నో సార్లు నీకు చెప్పాలని ప్రయత్నిచాను. జీవితం అంటే కల కాదని..కానినామాటలు నీకేక్కలేదు.. ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు చక్రీ.. చదువు ఐపోయింది అనుకున్న ప్రతివాడుఏదో ఒక పనిచేస్తూ. డబ్బు సంపాదించుకుంటున్నాడు..తనకి తగినంతలో ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకొని....ముందుకువెళ్తున్నాడు .. కలకి, వాస్తవానికి తేడా తెలుసుకొని ..నిజంలో బ్రతుకుతున్నాడు.

సరే ఇవన్నీ... ఎన్ని చెప్పినా లాభం లేదని తెలుసు..అసలు విషయానికి వస్తాను.. నాకు వచ్చే నెల 12 వ తారీఖున పెళ్లి.. రాజేష్ తో ..software engeneer.... పెళ్లి హైదరాబాదు లోనే....నీకు రెండేళ్ళు టైం ఇచ్చాను అర్థం చేసుకోలేదు.. అందుకే ఈ నిరయానికి వచ్చాను..అన్ని వైపులనుండి వచ్చే వోత్తిడులకి తల వోగ్గాను.. అర్థం చేసుకుంటావనిఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంత కంటే నాచేతుల్లో ఏమి లేదు..ఏమి చేసే పరిస్థితుల్లో లేను..

పెళ్ళికి తప్పక వస్తావని..ఆశిస్తున్నాను..
చివరగా ఒకమాట.. మళ్లీ అదే మాట..
చక్రీ...దయచేసి వాస్తవ ప్రపంచంలో బ్రతుకు..

- సదా నీ విజయాన్ని కోరుకునే
సు చి త్ర

Sep 20, 2009

SOUND OF HEART



I met her in orkut. I used to talk to her every day, as u know I am idle...lazy. nothing to do, so only work is orkuting haha

One day i was in front of system. Waiting her to come online. she used to come generally afternoon..after her class..she said she is taking classes in sap or wap .. i don know much about software.this time I thought I wan be cleaver. At any cost I want a gf.. I praised my self. Given self motivation and started the chat.
each and every reply was like,, a perfect answer.

I used to think twice b4 replying her. So my hard work paid me, got her number after 2 hours of HARD work, but what about the pic..?? I dint see her..b4 seeing i cant be emotional.. after all if want a beautiful GF..if she is not beautiful. and I talk emotionally.. that will brake hearts. Hahha typical guy I am..

So I used my so called brain.. (of course I hate god, dint given me as much I needed.
sometimes i doubt.. Whether he gave me any at all??)
I carefully balanced my chat and calls. finally after a month cleaver work.. I got the pic of her. My mind saying “she is not that beautiful”.. My heart is saying “pic is not that good” but she is beautiful. There is a big.. World war between my mind and heart... finally, heart won.. So i decided that she may be beautiful.. so go ahead . The result is ... I lessened my chat… and increased my calls.
The monthly bill used to make me happy... "ohh I talked with her these many hours.. Wow..hahha" ..she is from Bangalore. The 3rd month she came here on some work. she said she is going to stay with her relatives.. for 2-3 days. I asked her a date, im eager to see her. initiallay she a big NO...finally said ok. woooooooooooooooo...Im in cloud 9..10..11...12.....

I got a new t shirt and washed my bike.. got new..deo too. Then went to the place where we wan meet. i am waitng..waitng..lookin at each gal.. When i see a beautiful gal.. i pray "oh God..plase she must be her".. when I see a gal who is not good looking i pray again " she is not her naa thanks god.." so that prayer went on for a 15 min
Then..all of a sudden, the magical movements.. a cloud covered the sun to give shade, its cool breeze all around...an unknown heavenly music reached my eardrum.
i saw a gal stepped out of the bus graciously wearing white salwar kameez...
like an angel.. the cool breeze whisper in my ears ..there is she...yes she is her ... .. she got down and innocently looking here and there...
I know it is for me she is looking..the breeze is playing with her hair.
I moved...slowly towards her..as I m stepping forward, my heard beat doubling ,any one can hear that... who is beside of me
I waked to her, and as i reached to her.. She turned to me and smiled.. smiled like a rose blossoming. I conformed myself..yes ...she is ... she is ...she is beautiful. I gently forwarded my hand, for a shake hand, She too did the same. I felt like touching a piece of sponge.
then we moved aside, under a tree shade, I said “you are beautiful”. again another rose...blossomed on her face. I am word less.....a dream is in front of me. What to do now...
I asked her ..lets sit somewhere in a garden.she said OK. But she said she don’t wan sit on my bike (god know why).I wondered, and said.. Sit too away from me,by that u cant touch me, but she said no. she said no to take an auto even. she preferred only bus.I parked my bike aside.. some safe place,and we both got into a bus. I feel every one is looking at us.I felt proud.. I am sure, my chest increased 4 inches. She is saying something with smile and I could not able to listen to her..first time. I felt. a deaf n dumb fellow too can enjoy.we reached the destination....I walked beside of her so proudly. its a great feeling.. wow..I am with a beautiful l gal.. Beside of me, she is 5.7…tall
We sat in a place where. the green grass filled with some unknown yellow flower petals. she is talking a lot ..Im jus listening.I forgot what ever she talking but only one word which I could listen is she is leaving that evening..:(

Sep 13, 2009

ఎటు చూసినా మృదులే

తలుపు చప్పుడైతే వెళ్లి తీసాడు రవి..
" అంకుల్ భోజనానికి రమ్మంటున్నారు" అంది బిందు.
"అలాగే ..అవను మీ అంటీ భలేగా తయారైంది ఏంటి విశేషం" అన్నాడు రవి..
ఇంత పెద్దయ్యవు ఆమాత్రం తెలిదా " ఈ రోజు ఉగాది పండగ" బదులిచింది.
ఖంగు తిన్నాడు రవి...
ఈ రోజు మృదులఆంటీ హ్యాపీ బర్త్ డే...మళ్లీ తానే బదులిచింది..
అవునా,,,సరే పద భోజనానికి వెళ్దాం అని బయలు దేరాడు..
రవి మనసులో చిన్న ఆనందం. ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని మనుసులో అనుకున్నాడు..
భోజనం చేస్తుంటే కొసరి కొసరి వోడ్డించారు అందరూ..సుష్టుగా తిన్నాడు.
మధ్యలో మృదులని చూసాడు అడ్మైరింగా..కళ్ళతోనే చెప్పాడు బర్త్ డే విషెస్. అ చూపులు అర్థం కాక పదేపదే వింత గా చుసిందతని వైపు..
" ఇరవై ఏళ్ల క్రితం ఈ అమ్మాయి చిన్ని చిన్ని చేతులతో..బోసి నవ్వులతో..ఎక్కడో చూస్తూ కేరింతలు కొడుతూ ఆడుకొని ఉంటుంది..నాన్న చేతులు పట్టుకొని తప్పటడుగులు వేసుంటుంది..
అలా పెరిగి ... తనకంటూ ఒక వ్యక్తిత్వం సంపాదించుకొని.. తన ఎదురుగా ఉంది..
రవి కి ఇందంతా ఆలోచిస్తే వింతగా అనిపించింది.. బోసి నవ్వుల ఆ పాపకి..పుర్ణంగా ..కుందనాల బొమ్మలా ఎదిగిన ఈ అమ్మాయికి ఎంత తేడా...!! విచిత్రం అనుకున్నాడు మనసులో..
ఆ పూట రవి మది నిండా మృదులే ..ఎటు చుసిన మృదుల ముఖమే ..
" తన మీద బురద జల్లిన మృదుల ముఖం...తనని ఇంటికి తీసుకోచ్చినపుడు .. విసురుగా చుసిన మృదుల ముఖం... ప్రాతః వేళ తన్మయం లో సంగీత సాధన చేతున్న ముఖం... తన ఆకలికి కొసరి కొసరి వోడ్డిస్తున్న ముఖం..భోజం ముగిసాక అన్న మాటకీ "కోపగించిన మృదుల ముఖం"..
కాలేజ్ లో సెమినార్ ఇచిన మృదుల dignified ముఖం..తోరణాలు కడుతూ.. మామిడాకుల మధ్య నుండి చూసిన అందమైన ముఖం ..తను ఆమె అందాలూ చూస్తున్నపుడు...సిగ్గు పడిన మృదుల ముఖం..తనకి ఉగాది పచడి పెట్టి..తన పేస్ ఫీలింగ్స్ చూసి...కిలుక్కున నవ్విన మృదుల ముఖం..
ఎటు చూసినా మృదులే..

Aug 16, 2009

చైత్రo



ఆ రోజు చైత్రమాసపు తోలి రోజు..మావిళ్ళుపూతలు పెట్టి కొత్త పెళ్లి కుతుర్లలా తయారైన రోజు, కోయిలలు సన్నాయివాయించే రోజు, వేము కొత్త చేదుని సంతరించుకున్న రోజు..
అందరికి నూతన సంవత్సరం.. పండగ రోజు. కానీ నారాయణ రావు గారింట్లో రెండు పండగలు ఒకే సారి వస్తాయి..ఒకటిఉగాది అయితే, ఇంకోటి తన కూతురు మృదుల పుట్టిన రోజు.
అలాగని ఏ ఆర్భాటము, ఆడంబరము ఉండదు అ యింట్లో..కేవలం మనసుల్లో ఆనంద డోలికలు తప్ప.
మృదుల తలారా స్నానం చేసింది, చిలక పచ్చ పరికిణి మీద గులాబీ రంగు ఓణీ వేసింది.చిలకమ్మ లాగా. తలలో జాజిమల్లెలు.. నుదుటన తిలకం.. పదహారణాల తెలుగు పడుచులా ఉంది.తల స్నానం చేసింది కనక వెంట్రుకలు అరబెట్టాలనిచిన్న బ్యాండ్ మాత్రం వేసింది జుట్టుకి.
అ రోజు దగార్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మ నాన్నలు పేర అర్చన చేయించటం ఆమె చేసే మొదటి పని. అదితనకీ జీవితాన్నిచినందుకు ఆమె ఇచ్చే గౌరవం.

Aug 9, 2008

ANVESHANA

సాయంత్రం! ఉదయం రాత్రి గా మారే సమయం..పక్షులు తిరిగి తిరిగి అలసి గూటికి చేరే సమయం...ప్రతివాడు పని ముగించి ఎపుడెపుడు ఇల్లు చేరుకుందామా అని వడి వడి గా వెళ్ళే సమయం. ఆ సమయం లో నాకు ఏ ఒక్కరి మొహంలోను సంతోషం కనిపించదు. ఇక నా సంగతి అయితే మరీను ..నన్ను సాయంత్రాలు పెట్టె బాధ ఆ నరకం లో కూడా ఉండదేమో.. అసలు నరకమంటే సాయంత్రమేనేమో.. మసక చీకటి తో పాటే బాధ కూడా మెల్లగా ముసురుకొని చిక్కనై అశాంతి తో అటు ఇటు పొర్లుతూ నిద్రలోకి జారి కనుమరుగవుతుంది... మళ్లీ సాయంత్రం వరకి హయిగా గడిచిపోతుంది .. అసలు ఇది ఎలా మొదలైందంటే..
అప్పుడు నేను పదవ తరగతి చదువుతుండే వాడిని. రోజు పొద్దున్నే స్కూల్ కి వెళ్ళడం , సాయంత్రం చీకటి పడేవరకు ఏవేవో ఆటలు. తరవాత home work, తిండి, నిద్ర ఇలా గడిచిపోయేది.. అప్పట్లో తెలియదు ముందుది ముసళ్ళ పండగ అని..
మా ఇళ్ళన్నీ ఊరికి కొంత దూరంగా ఉండటం మూలాన రాత్రి దొంగల భయం ఎక్కువగా ఉండేది. వైశాలి వాళ్ళ ఇల్లు చాల పెద్దది కావటంతో దాన్ని మూడు నాలుగు పోర్షన్లు గా విడగొట్టి ఫామిలీస్ కి అద్దెకిచ్చారు . ప్రతి ఇంట్లోను ఇద్దరు ముగ్గురు పిల్లలు. సాయంత్రమైందంటే చాలు ఓ యాభై మంది పిల్లలం పెద్దగా గోల చేస్తూ ఏవేవో ఆటలు. ఆటల్లో మునిగి తేలేది జీవితం . కొంత కాలం క్రికెట్ ,కొంతకాలం కేరమ్స్, చెస్, గోలీలు, గిల్లి దండా ..తరవాత చక్కగా తయారై T.V ముందు హాజరు ఇలా ఉండేది వ్యవహారం .
పదవ తరగతి చివర్లో మొదలైంది ఈ బాధ , తెలియని వెలితి. సాయంత్రాలు ఆట మానేసి ఆకాశం కేసి చూస్తూ ఏదో ఆలోచించటం, రాతి నిద్ర పట్టక పోవటం.. అప్పటికింకా తెలీదు అది యవ్వనం తాలూకు చిహ్నం అని. రోజు పొట్టి లంగాలతో చెంగు చెంగున గెంతుతూ ఆడుకునే అమ్మాయిలు అకస్మాత్తుగా పెద్దాళ్ళలాగ ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఎక్కడ భయం బెరుకు మొదలయ్యాయి వాళ్లతో మాట్లాడాలంటే..ఆటలన్నీ మానేసి ఎప్పుడు అమ్మ వెంటే ఉండేవారు. మేమేమో లాగులు ఎగదోప్పుకుంటూ గిల్లి దండా గోలీలు ఆడుకునే వాళ్ళం, ఎన్నిసార్లు మమల్ని గేలి చేసినట్టు నవ్వినా మాకేమి అర్థం అయ్యేది కాదు.
ఎందుకో మా ప్రపంచం కూడా ఒక్కసారిగా మారిపోయింది. మా ఫ్రెండ్స్ అందరు పెద్దాళ్ళలాగ ప్రవర్తించటం మొదలు పెట్టారు. ఆటలన్నీ మానేశారు , కొంత మంది పొడుగు లాగులు కుట్టించుకున్నారు .ఏడ్చి గీ పెట్టి నేను కూడా pants కుట్టించుకున్నా. అసలా దుమ్ములో ఎలా ఆడాం అని అనిపించింది తరవాత. సాయంతం శుభ్రంగా తయారై చేతిలో ఒక పుస్తకంతో ఏదో చదివి నట్టు pose ఇవ్వటం మొదలెట్టాం అందరం. మాట్లాడే తప్పుడు సినిమాలు వీటి గురించి కాక సబ్జెక్టు, ఫిలాసఫీ రాజకీయాలు ఇలా పెద్ద విషయాలు చర్చల్లోకి వచ్చేవి . అమ్మాయిలు కూడా తెల్లగా ముఖాలు కడుక్కొని దేవుని దీపాలు వెలిగించటం, పేరంటాలు , పెద్దాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడటం చేస్తుందే వారు .
వైశాలి కంటికే కనిపించడం మానేసింది, ఒకవేళ ఎదురు పడితే కొత్తగా చూసుకోవటం , మాట్లాడటానికి సిగ్గు పడటం, లేక దూరంగా తొలగి పోవటం చేస్తోంది.. అన్నాళ్ళు కలిసి ఆడిన అమ్మాయి అలా ఎందుకు చేస్తోందో .. ఆ కొత్త ప్రవర్తనకి అర్థం ఏంటో అని ఆ అమ్మాయి గురించే ఆలోచించే వాడిని. ఇలా ఆలోచన ఎక్కువైనా కొద్ది ఏదో కోల్పోతున్నామనే భావన దాన్ని తిరిగి పొందాలనే పట్టుదల మొదలయ్యాయి..ఎన్ని సార్లు ఎదురుపడినా తప్పించుకొని పోయేది.. ఏదో తప్పు చేస్తున్న భావన ప్రవేశించింది మనసులోకి..
ఓ ఆదివారం తల స్నానం చేసి మేడపై ఎండకి నిల్చున్నాను. దూరంగా అ అమ్మాయి కనపడింది ఎక్కడికేల్తుందో అని చూస్తూ ఉండగా .. ఆశ్యర్యం .. మా ఇంట్లోకే ప్రవేశించింది, చేతిలో చిన్న బుట్టతో
"అత్తా అమ్మ పూలు తీసుకురమ్మంది " అంది మా అమ్మతో
"అలాగే మాకు కొన్ని ఇచ్చి వెళ్ళమ్మా " అంది అమ్మ
మాది చిన్న ఇల్లు ఖాలీ స్థలం ఎక్కువ , ఆ స్థలం లో పూల మొక్కలు వేశాం.
నీలి డిసెంబర్ పూలు నవ్వుతున్నాయి, చేమంతులు తలలూపుతున్నాయి, కనకాంబరాలు విచ్చుకోనేలేదు,నేనేమో ఆమె కంట పడాలని ప్రయత్నం మొదలెట్టా. తమని గమనిస్తున్నామని ఆడాళ్ళకి ఎలా తెలుస్తుందో.. నేను చూస్తున్నానని వైశాలికి తెలుసు, కానీ నావైపు చూడదు, కళ్ళు కలపాలని నా ప్రయత్నం.పూలన్నీ కోసి ఇంట్లోకి వెళ్లి మా అమ్మకి కొన్ని పూలు ఇచ్చి వెళ్ళిపోతూ నా వైపు ఒక చూపు విదిల్చింది,ఆ చూపు నా గుండెలో దూరి గిలిగింతలు పెట్టి నాకిదివరకెన్నడూ పరిచయం లేని సంతోషాన్ని కలిగించింది. అది మొదలు నేనా చూపుకై ఆమె చుట్టూ తిరగటం.. సాయంత్రం బడి నుండి వస్తూ ఈ చింత చెట్టు క్రిందో ..పేరంటాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తూనో .. ఉయ్యాల బల్ల ఊగుతూనో..వాళ్ళింటి నుండి మా అమ్మని తీసుకొస్తుంటే బొట్టు పేడుతునో..అందరు T.V చూస్తుంటే తను మాత్రం నావైపు ఒక్కసారి.... చూసేది ...నాకు మళ్లీ తెలీని సంతోషం .. అదేం చిత్రమో ఆ సంతోషం క్షణం లో మాయం, మళ్లీ ఆ చూపుకై వెతుకులాట.. ఎలాగు 1st class లో pass అవతామని చదువుపై ధ్యాస నిలుపలేదు.రోజులన్నీ ఆ చూపుకోసం తపించటం తప్ప.. పరిక్షలు ముగుసి results వచ్చాయి. అనుకున్నట్టుగానే నాకు 1st class వచ్చింది.
ఒద్దు మొర్రో అన్న వినకుండా వేరే ఊరిలో ప్రైవేట్ కాలేజీ లో join చేసాడు మా నాన్న.ఉదయం 8 గంటల కల్లా వెళ్ళటం, సాయంత్రం ఏ 6 గంటలకో అలసి పోయి రావటం, దీనికీ తోడూ తట్టెడు home work ..ఇక వైశాలిని చూడటానికి వీలులేకపోయింది. నా ఆరాటం ఎలాగైనా తెలియ జెప్పాలని ఒక రోజు చింత చెట్టు కింద గోడపై ఇద్దరి పేర్లు రాసాను.ఆ అమ్మాయి చూసిందో లేదో కాని వాళ్ళ అన్నయ్య కంట్లో మాత్రం పడింది. ఓ సాయంత్రం నన్ను మా అన్నయ్యని పిలుచుకు పోయారు ఆ చెట్టు క్రిందకి, ఇది మీ వాడు చేస్తున్న నిర్వాకం అని. వాళ్ళలోఒకడు ఆవేశం తో ఉగిపోతూ నా చెంప చెళ్ళు మనిపించాడు. మా అన్నయ్య అడ్డుపడి ఇక మళ్లీ ఇలాంటిది జరగదని హామీ ఇచ్చాడు. నాకు ఇంటికి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలో తెలిలేదు. మెల్లగా అన్నయ్య వెనకాల నడిచాను. ఇంట్లో కి వెళ్ళాలంటే ఏదో భయంగా సిగ్గు గా ఉంది, అన్నయ్య అమ్మకి నాన్నకి విషయం చెప్పాడు. మా అమ్మ బయటికి వచ్చినా వైపు అదోలా చూసింది , ఎందుకో తెలిదు నా కళ్ళనుండి బొట బొటా కన్నీళ్ళు రాలాయి. ఆ రోజు నుండి నేను మళ్లీ ఆ అమ్మాయి ఇంటి చాయలకి వెళ్ళలేదు.

నా మనసులోని ఆ సంతోషపు పొరలని తట్టే ఆ చూపుకై ఇంకా సాగుతూనే ఉంది నా అన్వేషణ.