Showing posts with label నాలో నేను. Show all posts
Showing posts with label నాలో నేను. Show all posts

Jan 26, 2013

మనకి మనమే ..




హ్యారీ పాటర్ - 3
హ్యారీ పాటర్ సిరస్ ని కాపాడే ప్రయత్నం లొ ఉన్నాడు. సిరస్ కొలను ఒడ్డున చఛిపొతున్నాడు. డెమన్స్ చుట్టూ చేరాయి. ఇద్దరి జీవ శక్థులని పీల్చేస్తున్నాయి. హ్యారీ శక్తి హీనుడు అవుతున్నాడు.డెమన్స్ మాత్రం తమని వదలటం లేదు. సిరన్ నిస్సహాయంగా పడున్నాడు. నిస్సహాయతే వాటికి కావలసింది. ఇంకో కొన్ని క్షణాల్లో సిరస్ ప్రాణాలు పోతాయనగా హ్యారీ దీనంగా చావుబతుకుల మధ్య కొలను అవతలి వైపు చూసాడు అటు వైపు ఒక తెల్లని కాంతిపుంజం కనపడింది. ఆ కాంతి పుంజం అంతకంతకూ ఎక్కువయ్యి మొత్తం డెమన్స్ ని పారిపొయెలా చెసింది. లేచి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అసలేమి జరిగిందో గుర్తులేదు.పక్కన హర్మోయిని ఉంది నవ్వుతూ.
ప్రొఫెసర్ డంబెల్డొర్ వచ్చాడు. గడిచిన కాలంలో జరిగిన తప్పు సవరించటానికి ఇద్దరినీ గత కాలంలోకి పంపాడు. ఇద్దరూ అన్నింటినీ సవరిస్తూ .. సిరస్, హ్యారీ పాటర్ డెమన్స్ బారిన పడె దశకి వచ్చారు. అటువైపు సిరస్ కొలను ఒడ్డున చఛిపొతున్నాడు. హ్యారీ పాటర్ నిస్సహాయంగా చాస్తూఉన్నాడు. డెమన్స్ చుట్టూ చేరాయి. సిరస్..హ్యారీ జీవ శక్థులని పీల్చేస్తున్నాయి. హ్యరీ అంతకంతకూ శక్తి హీనుడు అవుతున్నాడు. ఇటువైపు ఇక్కడ హ్యారీ పాటర్ తనకి కాపాడే వాళ్ళకోసం చూస్తున్నాడు. చనిపోతున్న తనని కాపాడింది తన తల్లిదండ్రులే అని అతడు అనుకుంటున్నాడు. కనక వాళ్ళొచ్చి హ్యారీని ( తనని ) రక్షిస్తారని చూస్తున్నాడు. సిరస్ ప్రాణాలు మెల్లిగా గాల్లొకలిసి పోతున్నాయి. తన తల్లిదండ్రుల జాడలేదు. తాను కూడా కొలను ఒడ్డున ప్రాణాలు పోగొట్టు కునే దశలో ఉన్నాడు. సిరస్ ప్రాణాలు ఇంకో క్షణం అనంతవాయువుల్లో కలిసిపోతాయనగా ఇహ లాభంలేదని, ఇటు వైపున ఉన్న హ్యారీ తానే తన మంత్రదండాన్ని ప్రయోగించి డెమన్స్ ని పారద్రోలి హ్యారీ ని కాపాడాడు. అంటే సిరస్ ని.. తనని తాను కాపాడుకున్నాడు.
అంతా అయోమయంగా ఉండవచ్చు. సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఇంతకీ దీనిలో ఉన్న గొప్పదనమ్ ఎంటి అంటే , రచయిత్రి రోజు వారీ విషయాలకి చక్కని రూపకల్పన చేసి గొప్ప కథని తయారు చెసింది. అది కాల్పనికత అద్బుతంగా తెరెకెక్కించ బడింది. విశయానికి వస్తె....
ఆ డెమన్స్ ఎవరో కాదు... మన అత్మన్యూనత, అలసత్వం, నిరాశ, భయం, దిగులు, ఆందోళన, పిరికితనం. సమస్యలు మొదలైనవి. ఎప్పుడయితే మనం ఆత్మవిస్వాసాన్ని, దైర్యాన్ని,ఆశని కొల్పొతామో అవన్నీ మన మీద పడి దాడి చేసి మన శక్తులని పీల్చి మనని ఓటమి అంచున నిలబెట్టి చావుదశకి తీసుకెళతాయి. మనని ఎవరూ కాపాడలేరు. చివరికి మనని కనిపెంచిన తల్లిదండ్రులు కూడా. ఏ దేవుడూ రాడు మనకోసం.
మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరయా మనకి దిక్కు ?? ఎవరయా మనని కాపేడేది?? ఎవరయా మనకి సహాయం చేసెది..చేయగలిగేది అంటే .. 'మనకి మనమే .. మన ఆత్మవిశ్వాసమే'
ఆత్మవిశ్వాసపు మంత్రదండాన్ని ప్రయోగిస్తే .. ఆ డెమన్స్ అన్నీ తలో దిక్కూ పారిపోతాయి. ఎంతకాలం అయితే మనలో మనమీద మనకి విశ్వాసం ఉంటుందో అంతకాలం అవేవీ మన దరికి రావు.
అదీ ఈ ఎపిసోడ్ లో మనం గ్రహించవలసింది.

May 6, 2012

వెతుక్కుంటున్నాను.



 ప్రపంచం అంతా ఎక్కడికో పరిగెడుతోంది పరిగెడుతోంది  ... రాత్రిని పగటిగా వెలిగించే  విద్యుద్దీపాలు.. ఆకాశ హర్మాలు.. రాజహంసలాంటి  కార్లు..
దేశాలకి చేరవేసే విమానాలు..కొత్త  ప్రపంచాన్ని సృష్టించే  సాఫ్ట్వేర్ లు...

నేను మాత్రం..  మబ్బుల్లోని చల్లదనం  
..ఆకాశపు రంగులు  ..పర్వతాల గంభీరత... పక్షుల రెక్కల్లోని మృదుత్వం.. విత్తులో దాగిన చెట్టు...ఆకుల పచ్చదనం..మన్నులోని కమ్మదనం.. నా గుండెల్లో ప్రేమ.. జీవితానికి అర్థం.....  వీటిని వెతుక్కుంటున్నాను.




 



Nov 29, 2011

ఎందుకో నవ్వొస్తుంటుంది నాకు..


ఎందుకో నవ్వొస్తుంటుంది నాకు..
ప్రేమలో ఓడిపోయాను అన్న వాళ్ళని చూసి. ..ప్రేమించి మోసపోయాను అనుకునే వాళ్ళని చూసి...
ఒక మనిషిని.. ఒకే మనిషిని నమ్ముకుని బ్రతకాలనుకునే వాళ్ళని చూసి.. నాకు ఇలాంటి గాయాలు ఎప్పుడూ  కావేమో...
 ఎందుకంటే 


ప్రతి కలయిక తర్వాత వీడుకోలు ఉంటుంది కనక.. 
ఆనందం వెనకాల విషాదాన్ని ఉహిస్తా కనక..
బాధ కూడా ఆనందం  అని అనుకుంటా కనక..
కలుసుకునే స్వేఛ్చ.. విదిపోతానికి కుడా ఉండాలి కనక..
నాది అనేది ఏది లేదు.. ఉండదు అని నమ్ముతాను గనక..
ఏది శాశ్వతం కాదన్న నిజం జీర్ణించుకున్నా  కనక..
కాలం ..దాంతో పాటే మార్పు అతి సహజం కనక..
నాకు నేనే జీవితాంతం అని తెలుసు గనక..

Oct 11, 2011

నీసంగతేంటి ???


చిన్ననాటి స్నేహితుడు అనుకోకుండా కలిసాడు. వాడు మొదటినుంచి లెక్కల మాష్టారు. అంటే లెక్కలు  బాగా చేస్తాడని కాదు. లెక్కలు బాగా వేస్తాడు. ఎంత సంపాదించాను,..ఎంత కూడబెట్టాను....ఇదీ వాడి లెక్క.
పలకరింపులు అయ్యాయి.
ఆకాశం నీలం చిక్కనయ్యి  చీకటిగా మారుతోంది. విద్యుద్దీపాల  వెలుగులో సిటీ అంత దగ దగ లాడుతోంది.. కిందకొచ్చి  వరుసలో నిల్చున్నాయా అన్నట్టున్నాయి స్ట్రీట్ లైట్స్.. తొందరగా ఇల్లు చేరాలని జనాలు గుంపులు గుంపులుగా పరుగులు తీస్తున్నారు  వాహనాల మీద.
నేను, వాడు ఒక చిన్న కేఫ్ లో కూర్చొని ఉన్నాం,అరగంట క్రితమే చాయ్ తాగి మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్య మౌనంలో  ఏమి తోచక ట్రాఫిక్ ని గమనిస్తున్నాను.
డిన్నర్ ప్లాన్ ఏంటి ? అడిగాను..
ఎక్కడోచోట తిని ఫ్రెండ్ రూంకి వెళ్ళటమే..అన్నాడు.
మందు అలవాటుందా ?? 

'మందు' అనగానే కళ్ళు కొంచం తెరుచుకొని..పెదాలు విచ్చుకున్నాయి..నవ్వుగా ..
సిగ్గుపడుతున్నట్టు చెప్పాడు   "ఏదో అప్పుడప్పుడు.. మామ గారింటికి వెళితే తప్పదు కదా" 

మందు తాగకపోతే ఇంటికి రానివ్వరా  ఏంటి ??
పెళ్లి గిళ్ళీ లేని వాడివి నీకేం  తెలుసురా.. మా తోడల్లుళ్ళ ముందు చులకనైపోనా..తాగకపోతే  వాళ్లకి
షోడాలు కలుపుతూ,వాళ్ళ సొల్లు కబుర్లు వింటూ కూర్చోవాలి..పండక్కి వెళ్ళాకపోతేనా ...మా ఆవిడ ఊరుకోదు.. ముందే పల్లెటూరు..ఏమి తోచదు. మొదటి సరి షోడా లు కలిపినా తరవాత మందు అలవాటు చేసుకున్నా... బాగోతం చెప్పుకొచ్చాడు.
సరే...ముందు గుక్కెడు మందుతాగి ఎక్కడయినా డిన్నర్ చేసి ఆ తరవాత మీ ఫ్రెండ్ రూం లో డ్రాప్  చేస్తాలే...అన్నాను నేను.
అలా అన్నది  స్నేహితుడి మీద ప్రేమతో  కాదు..ఎందుకో మనసు బాలేక.
వాడు సరే అన్నాడు..

పొడి పొడి మాటలతో మొదటి రెండు పెగ్గులు పూర్తయ్యాయి. మూడో పెగ్గు రెండో సిప్పు తాగాక మొదలు పెట్టాడు..
" మన ఉళ్ళో  రెండు ఇల్లు కొన్నాను.. బాలెన్సు దాదాపు అయిదు  లక్షల వరకు ఉంటుంది.. బంగారం ధర పెరక్క ముందే మా ఆవిడకి పది  తులాల నగలు  చేయించాను.మా ఇద్దరి పేరా..ఇద్దరు పిల్లల పేరా తలా రెండు లక్షల  LIC పాలసీలు ఉన్నాయి. పిల్లల పేరు మీద చెరో రెండు లక్షల fixed  చేయించా, ..మా ఆవిడా చాలా రోజుల నుంచి 'కారో' అని గోల చేస్తోంది. దానికి నాలుగు లక్షలు అట్టి పెట్టాను. చూడాలి రేపో మాపో...అంటూ  వ్యాపారంలో తను ఎలాంటి సవాళ్లు  ఎదుర్కొంటూ..నానా కష్టాలు  పడి  సంసారాన్ని ఎంత చక్కగా లాక్కోస్తున్నాడో ...... తన జీవిత విజయ గాధ చెప్పుకొచ్చాడు....అప్పటికి నాలుగో పెగ్గు ఖాళీ చేసి  అడిగాడు. 



" మరి నీసంగతేంటి ??  "

Sep 5, 2011

కొన్ని పేస్ బుక్కు పోస్టింగులు..

  • బ్యాంకు బాలన్సు జీరో అయితే కాని జీవితం అర్థం కాదు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ సున్నా అలాగే ఉంటే ...జ్ఞానోదయం అవటం ఖాయం..
Aug 22
  •  చదువులు.రిలేషన్ షిప్పులు.. ప్రేమలు..సినిమాలు..హీరోలని ఆరాధించటం..ఎంజాయ్ మెంట్ .. .. వీటిల్లో యువత బిజీ గా ఉండటం... ప్రభుత్వం..పరిపాలన ..రాజకీయం అనే విషయాలమీద కనీస అవగాహన లేకుండా పోయింది... ఒక్కసారి  చదువు ఐపోయి ఉద్యోగం..సంపాదన..జీవితం.. సెటిల్మెంట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రమె సమాజ అసలు స్వరూపం తెలుస్తుంది.
  • ధనవంతులకి... affluent గా ఉన్న వాళ్లకి ఏ బాధాలేదు. ఏదోవిధంగా తమ పిల్లలని అన్ని సదుపాయాలూ ఏర్పరుస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వం మీద ఆధారపడేది మధ్యతరగతి ..బీదా బిక్కి..మాత్రమే.
Aug 28
  • మధ్య తరగతి మనుషుల్లో తెగింపు తక్కువ..సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఎక్కువ. కనక సహజాతాలని.. సహజ భావోద్వేగాల్ని కొంత అణిచి పెట్టి బతికేస్తుంటారు.మెల్లిగా జీవితం అంటే ఇదే అనే భ్రమ లోకి వెళ్ళిపోతారు.
Aug 30 (6 days ago)
  • * దేశ భక్తి అంటే కేవలం పిడికిళ్ళు భిగించి జై కొట్టం..లేదా ఆగస్ట్ 15 న జండా కి సలాం కొట్టటం.. క్రికెట్టును ఫాల్లో కావటమే కాదు.. భారతీయ కళలని ఆస్వాదించటం కూడా దేశ భక్తే.
Sep 2 (3 days ago)
  •   సుఖం దొరక్కుండా ఎన్ని గోడలు.ఎన్ని సెంటిమెంట్స్.. ఎన్ని నియమాలు..ఎన్ని డాంబికాలు ..ఎన్ని నీతులు పెట్టుకున్నాం,  మనం.. 
  • దేవుడు ఉన్నా లేకున్నా..పలికినా .. పలక్కున్నా ఈ పసుపు కుంకం వేసి నైవేద్యాలు  పెట్టె వాళ్ళే ఎక్కువయ్యారు లోకంలో..
Jul 1
  • * ముందుగా ప్రపంచాన్ని వదలాలి. తరువాత దేవుణ్ణి వదిలిపెట్టాలి. తరువాత గురువుని వదిలిపెట్టాలి. ఈముగ్గురినీ పట్టుకొని ఉన్నంత వరకూ అతను అజ్ఞానం లోనే ఉన్నట్లు లెక్క.
Jul 13
  • * దేవుడు లేదు అని చెప్పటం సులభమే. కాని ఉన్నాడని నమ్మటం...నమ్మకం కలగడం మాత్రం చాలా కష్టం.
Jul 28
  • *ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతంగా ఉన్నంతవరకు ఎలాంటి బాధ ఉండదు. ఎప్పుడయితే ఆది కమ్యూనిటీలోకి మారుతుందో అప్పుడు ఆది మతం రంగు పులుముకుంటుంది. ఈర్ష ..అసూయా లని రేకెత్తించి మారణహొమం సృష్టిస్తుంది.
Aug 27
  • * నేనైతే దేవుడినే తప్పు పడతా.. ఎవడు అడిగాడని ఇచ్చాడు నాకు ఈ లైఫ్.. ? ఎవరి కోసం చేసాడు ఈ సృష్టిని ..ఈ సకల చరాచర ప్రాణుల్ని ?? . పాపం శరీరాల్లో బంధింపబడి ..బ్రతక లేక చావలేక ఒక్కో ప్రాణి పదే బాధ యాతన వర్ణనాతీతం.
Aug 27
  • * రెండు తప్పులు.. సృష్టించటం మొదటి తప్పు.. సమానత్వం ఇవ్వకపోవటం రెండో తప్పు.. తప్పకుండా తిట్టుకోవలసింది వాడే. కాని తిడితే ఉన్నదీ ఉడపీకుతాడేమో అని భయం తో పూజలు చేస్తున్నాం.

Jun 19, 2011

నేను మనిషిని.


ఓ వేసవి సెలవుల్లో ఉరువెల్లి హాయిగా పొద్దు మాపు తిని పడుకుంటున్నా. మధ్యలో పుస్తకాలు తిరగేస్తూ.
ఓ రోజు పొద్దున్నే ఎక్కడినుంచి వచ్చిందో ఏంటో ..ఓ బుజ్జి కుక్క పిల్ల వచ్చింది లోపలికి .వెల్లగోట్టాను.. కాని కొద్దిసేపటి తరవాత మళ్ళి వచ్చేసింది. ఎన్ని సార్లు వెల్లగోట్టినా మళ్ళి మళ్ళి సిద్దం అయ్యేది. ఏం చేయాలో..ఎలా వెల్లగోట్టలో తెలియలేదు. ఏదో రునానుభంధం ఉందేమో...సరేలే అని వదిలేసాం.
ఒక పగిలిపోయిన కుండ పెంకు లో అన్నం,పాలు కలిపి పొద్దు మాపు పెట్టాం. అలా పది పదిహేను రోజులు గడిచిపోయింది,
ఇంట్లో వాళ్ళం ఎవ్వరం వచ్చినా  ..చిన్ని తోక ఆడించటం.. కాళ్ళు రాసుకుంటూ ప్రేమని వ్యక్తం చేయటం..వగలు పోవటం...అన్ని చేసేది..ముచ్చటగా అనిపించింది..అదే తెలియని మొహం రాగానే పెద్ద గొంతు తో ఒకటే అరుపు.  ఇంటి ముందు సింహం లాగా కూర్చునేది వచ్చిపోయే వారిమీద అరుస్తు . ఎక్కడెక్కడో తిరిగి హుందాగా ఇది నా ఇల్లు అన్నట్టు వచ్చేది. తనకోసం వేసి తట్టు సంచిలో..ఏదో ఆలోచిస్తూ పడుకునేది.. టైం కి అన్నం వేయాల్సిందే..కొంచం అటు ఇటు అయినా కుయి కుయి మంటూ గోల.. చంటి పిల్లాడి లాగా.. తన ప్రేమ... కోపం..అయిష్టం...ఏదో రకంగా వ్యక్తం చేసేది. ఎన్ని వగలో..
బాగానే అలవాటయ్యింది..దాంతో..
ఒకరోజు దాన్నే గమనిస్తున్నాను...ఉరికే మెడ గోక్కున్తోంది మాటి మాటికి.  కుక్క అన్నాక గోక్కోదా అని పట్టించుకోలేదు....ఓ రెండు రోజులుగా అది ఎక్కువ టైం  గోక్కోవటమే చేస్తోంది ..దానికో తోడు ..కొంచం కొంచం బొచ్చు రాలి పోవటం మొదలైంది. మాకేం తెలుసు రాలిపోయి మల్లి వస్తుందో..ఏంటో...అనుకుంటున్నాం...కాని రోజు రోజుకీ దాని బాధ ఎక్కువవుతోంది.. తిండి తగ్గించి...తిండికోసం అరవటం  మానేసింది.. పదిరోజుల్లో చాల బలహీనంగా తయ్యారయ్యింది.  ఎం చేయాలో తోచలేదు.
అలవాటు లేని విషయం.. కావాలని తెచ్చుకున్నది కాదు కూడాను. చూస్తున్నాం కాని ఏమి చేయటం లేదు.
ఉన్నచోటు నుండి కదలదు...ఉరికే మొహం చూస్తుంది.... దీనంగా కళ్ళలోకి కళ్ళు పెట్టి ..తోక  అడిచటం కుడా లేదు..పాపం శక్తి లేదేమో..

మూడురోజులైంది అన్నం ముట్టటం లేదు..జ్వరంగా ఉందేమో.. తెలిదు. ఇహ మా అన్నయకి చెప్పి బండి తీసి డాక్టర్ దగ్గరికి తెసుకేల్దాం అని ఇద్దరం రెడీ అయ్యాం.. ఒక పాత తువ్వాలు తో దాన్ని తీసుకొని బండి ఎక్కగానే..ఉంటేనా..చంగున దూకి పారిపోతోంది. అలా ఎంత ప్రయత్నించినా నావల్ల  కాలేదు దాన్ని పట్టుకోవటం.
సరే అని మేమే బయలు దేరాం డాక్టర్ దగ్గరికి.. వెళ్లి విషయం చెప్పాం.. ఏదో ఒక టోనిక్..కొబ్బరి నునే లో కలిపి పుయాటానికి ఆయింట్మెంట్  రాసిచ్చాడు. 

ఎంత ప్రయత్నించినా అది పాలు కుడా తాగటం లేదు. ఇహ టానిక్ కలిపిన పాలు అసలే తాగటం లేదు. అప్పటికి ఇహ విధి లేక దాని నోరు తెరిచి పోసాం ..మహా అంటే రెండు గుక్కలు..కాని తప్పించుకొని మూల కూర్చుంది..
ఆయింట్మెంట్  వంటినిండా పూస్తే..విదిలించింది..దుమ్ములో పోర్లాడింది. 
నీ ఖర్మ అని వదిలేసాం.
తిండి అసలే ముట్టక..ఐదు రోజులై..నిలబడే శక్తి లేక... లేచి నిలబడితే కూలి పడిపోతోంది..చంటి పిల్లాడి లాగా ఎంతో హుషారుగా ఉండేది..అయ్యో ఎలా ..ఎం చేయాలి అని అనుకున్నా కాని ఎం చేసే పరిస్థితి లేదు.

ఆ రోజు మధ్యానం రెండు  అయ్యిందనుకుంటా.. కుక్కపిల్ల పరిస్థితి ఏంటా  అని బయటికి వచ్చా.. నన్ను ఒక దీనాతి  దీనమైన చూపు చూసింది..అతి బలహీనంగా తోక ఆడించి.. నిలబడింది..నావైపు ఒక అడుగు వేసింది.. కూలబడింది...
అంతే...ఆ జీవి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి...

అమ్మా అని గట్టిగా కేకేసా.. కదిపి చూసాం.. కాని లేవలేదు. తోక అడిస్తుందేమో అని ఆశపడాను... దాన్ని చూస్తూ  సాయంత్రం ఏడింటి వరకు గడిపా.. కాని చలనం లేదు. ఏదో జడపదార్థం లా అయిపొయింది..

ఒక సంచిలోకి దాన్ని వేసుకొని..మాఇంటి వెనకాల ఉన్నా రైల్వే ట్రాక్ అవతల ఉన్న దట్టమైన చెట్లు వైపు బయలుదేరాను. అక్కడ దట్టంగా పెరిగిన ఒక పొద చూసి పొదల్లోకి విసిరేసాను సంచీ ని.. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసా..
ఇంటికి రాగానే బాత్రూం లో కూర్చుంటే..మా అమ్మ రెండు బిందెల నీళ్ళు గుమ్మరించింది నా మీద. ఏ ఋణానుభంధమో అంటూ.

ఏ భందమో..ఏ స్నేహమో.. ఏ భందుత్వమో.. ఎక్కడినుంచి వచ్చిందో... ఇరవై రోజులు..ఒక చిన్ని బంధం  పెనవేసింది....కాని అంతలోనే...కళ్ళముందే ...ఇలా జరిగింది. అంతే జీవితం...అంతే బంధం.

అన్నింటికంటే నన్ను బాధించింది, నామీద నాకే  సిగ్గుగా అనిపించింది  ఒకే ఒక్క విషయం..
విసిరేసాను.. నిర్దాక్షిణ్యంగా విసిరేసాను సంచినీ.. కనీసం  సంచీని పదిలంగా పొదల్లో పెట్టొచ్చు..లేదా గుంతలో  పూడ్చి పెట్టేయవచ్చు. కాని చేయలేదు..విసిరేసాను..
ఎందుకంటే .. దాని మొహాన్ని మళ్ళి చూసే దైర్యం లేదు నాకు..ప్రేమ  లేదు నాకు ..గుండెని రాయిని చేసాను..చేసుకోగల సమర్థుడిని. ఎందుకంటే.......నేను మనిషిని.

కన్నీళ్లు ధారకడుతున్నాయి..

May 25, 2011

ఆరెంజ్.........

 
ఓ పెద్ద బిల్డింగ్.. చుట్టూ ఎత్తైన కంపొండ్  గోడ.. ఓ పెద్ద గేటు.. తీహార్ జైలుకి కుడా ఇటువంటిదే ఉంటుందని నా ఉహ..
ఇంతకీ అదేమిటంటే.. మా చదువుల దేవాలయం..బడి..
..తెల్లని బురఖాలతో దేవదూతల్లా 'సిస్టర్స్' ..కనిపించటానికి దేవదూతలే..కానే బెత్తెం చేతికోచ్చిందంటే..పిశాచాలే. ఒక్కడు అల్లరి చేసినా దాదాపు అందరికీ వీపు పగిలేది.. ఎందుకు అంతగా  కొడతారో అప్పట్లో తెలిదు ఇదంతా..sexual frustration అని.  కాని నేను దెబ్బలు తిన్న సందర్భాలు ఏ ఒకటో రెండో..ఎందుకంటే ఈ దెబ్బల బాధ తప్పించుకోటానికి..నేను చెప్పింది చెప్పినట్టు చదివే వాడిని.  దాంతో ఏ ప్రశ్నకైనా టక్కున సమాధానం వచ్చేది. ..ఒకవేళ ఒక్కోసారి చెప్పలేకపోయినా...నా "బానే చదివే"  మొహం చూసి..క్షమించి వదిలేసేవాళ్ళు, లేదా దెబ్బ తీవ్రత తగ్గించే వాళ్ళు. దెబ్బలు తప్పించుకోటానికీ చదువు మీద శ్రద్ద కాని..ఆ చదువు ఎందుకో అర్థం అయ్యేది కాదు. .సున్నం బట్టీ...ఇటుకల తయారీ . పొటాషియం పర్మాంగనేటు ...చర్మం అడ్డుకోత..ముత్ర పిండాలు.. అమెరికా గడ్డి మైదానాలు...గోధుమ పండే రాష్ట్రాలు...

స్కూల్ ల్లోకి అడుగు పెట్టింది మొదలు.. మనసంతా  రెండు పీరియడ్ల తరవాత కొట్టే విశ్రాంతి గంట  మీదే. అప్పట్లో చేతికి గడియారాల పాడా..  కారిడార్ లో నీడలు  చూసేవాళ్ళం..అవే చెప్పేవి మాకు ఎప్పుడు ఏ బెల్లు కొడతారో అని. అందుకే ఆ నీడల్లోనే మా ప్రాణం . ఆ నీడ మేము అనుకున్న చోటుకి పాకుతోందంటే ఉత్సాహం ఎక్కువయ్యేది. 

విరామం లో గేటు బయట చిన్న పాటి జాతరే... ఎన్నో రకాల తిను బండారాలు  అమ్మేవాళ్ళు  మాకోసం కాచుక్కుచునే వాళ్ళు, తట్టుసంచీ పరచుకొని. ఒకామె పల్లీపట్టే..నువ్వుల పట్టే..పుట్నాల పట్టీలు అమ్మితే..ఇంకో అమ్మ..ఉదికేసిన కందగడ్డ..పల్లీలు శనగలు...ఇంకో అమ్మమ్మ ..కొబ్బరి గోలీలు..సంత్ర,..నిమ్మ గోలీలు నామాల గోలీలు.. మరోఆమె...బంతులు..లాయిలప్పలు..బొంగరాలు... లాంటి ఆట వస్తువులు.. ఇహ ఐస్ క్రీం బండి వాడి గురించి చెప్పనే అక్కరలేదు.. ఎక్కువ మంది పిల్లలు వాడి చుట్టే ముగేవారు.. ఎరుపు..ఆకుపచ్చ..తెలుపు..ముదురు పింకు రంగులతో..వెదురు పుల్లకి అంటుకొని బాగా ఆకర్షిచేవి. పది పైసలకి ఇలాంటివి.. అదే 25 పైసలయితే..పాల ఐస్ క్రీం. అదే 50 పైసలయితే  ... ఆరంజ్ లేదా..కోకాకోలా ఇసుక్రీం.
నాదగ్గర మహా అయితే పది పైసల కంటే ఎక్కువ ఎడిస్తేగా. కాని ఆ పది పైసల ఇసుక్రీం చల్లగా తప్ప తియ్యగా ఉండదు కనక మనసంత ఆ ఆరెంజ్ మీదే.  
ఓ రోజు ఇహ లాభం లేదని ఓ పథకం వేశా.. పరీక్షలో నా ముందు వెనకా ..అటు ఇటు ఎవరు అని గమనిస్తే.. ముందు విజయ్ గాడు.. వెనకా  శరత్ గాడు.. వీళ్ళతో లాభం లేదు.కాని అటు ఇటు..రాజు గాడు..నవీన్ గాడు. అః..ఇద్దరు మొద్దు మొహాలే . తన్నులు తినని రోజే  లేదు వాళ్ళు . పరీక్షల్లో ఫెయిల్ అయిన రోజు రెట్టింపు దెబ్బలు ..కనక వాళ్ళతో ఓ ఒప్పందం చేసుకున్న.. పరీక్షల్లో పాస్ మార్కులు వచ్చే విధంగా నేను చూపిస్తా ... బదులుగా నాకో ఆరెంజ్ ఐస్ క్రీం కొనివ్వాలి అని.  నవీన్ గాడు వెనకా ముందు ఆలోచించక..సరే  అన్నాడు. ఎందుకంటే.. వాడి జేబులో ఎప్పుడు లక్మి దేవి గల గల లాడేది.  ప్రతి  రోజు ఒకటో రెండో  రూపాయలు ఖర్చు చేసేవాడు.  ఇహ రాజు గాడు మాత్రం...పాల ఐస్ క్రీం కంటే ఎక్కువ ఇవ్వలేను అన్నాడు.వాడి దీనమైన  ముఖం చూసి..సరే అన్నాను.

అప్పటినుంచీ పరీక్షలొచ్చాయి అంటే  యమ హుషారు గా చదివే వాడిని..
మా వాళ్లకేం తెలుసు నా చదువంతా ఆరెంజ్ ఐస్ క్రీం కోసమని .. :) :)

May 24, 2011

మళ్ళీ ఎప్పుడో...

 
 పుస్తకాలు సర్దుతోంటే.. పుస్తకాల వెనక సాక్స్ లోంచి జారి పడ్డాయి..గోలీలు.  ఎన్నాళ్ళ  నుంచి  బందించావో తెలుసా..అంటూ చెంగు చెంగున దూకుతూ ఒక్కోటి.. ఒక్కో మూలకి పరిగెత్తి దాక్కున్నాయి..
నేను ఒక్కొక్కటీ వెతకటం మొదలు పెట్టాను. కంప్యూటర్ టేబుల్ కాలికి అటుపక్కన నక్కికూర్చుంది  పాలపిట్ట. చిన్ని గాజు గోలి కి మధ్యలో మల్లె పువ్వులా తెల్లని మరక. అన్నింటిలోకి చిన్నగా ఉన్న గోలీ ని 'పిట్టి' అని పిలిచే వాళ్ళం.  
 చీపురు కట్ట వెనకాల నక్కింది బెల్లం రంగు గోలీ.. న్యూస్ పేపర్ కింద దాక్కుంది  ఎరుపుది . టేబుల్ ఫ్యాన్ పక్కగా అకుపచ్చది...ఇలా రంగు రంగుల గోలీలు....అన్నీ ఏరాను.
స్కూల్ బాగ్ గూట్లోకి విసిరి కొట్టి... నా గోలీలా డబ్బా తీసుకొని  తోటలోకి పరిగెత్తేవాడిని. మా ఇంటికి ఎదురుగా..రోడ్డుకు అటువైపున ఉన్న ఇళ్ళ వెనకాల  చింత చెట్లు..మామిడి చెట్లు..వేప చెట్లు ఉన్నాయి..వాటి కిందే మా ఆటలన్నీ ..
నేను గోలీలు కొన్నది బహు తక్కువ.. ఎప్పుడు ఎవరిదగ్గరైనా అప్పు తో మొదలు పెట్టి  ఆటలో గెలిచి అప్పు తీర్చేవాడిని.మా ఏరియా లో గోలీ ఆటలో మనది సిద్ద హస్తమే. బాగా గెలిచి అక్కడి కక్కడ అమ్మేవాడిని.
మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు గోలీలు ఆడనిచ్చేవాళ్ళు కాదు. దుమ్ములో ఆడటం ..కొట్లాటలు.. వాటిని అమ్మటం..ఇవేవీ వాళ్ళకి నచ్చేది కాదు. అలా అని నేను ఉరుకున్నదీ లేదు. 

తల రెండో ..నాలుగో.. గోలీలు వేసికొని..ఒక పెద్ద గుండ్రం లోకి విసరటం.. చిపించిన గోలీని గురిచూసి కొట్టటం... తగిలిందా..తగిలి మిగతావాటికి తగలకుండా..కొట్టిందీ..తగిలిందీ రెండు గుండ్రం బయటకి పరిగేట్టాయా.. ఇహ మనవే ఆ గోలీలన్నీ.. ఒకవేళ వేరే దానికి తగిలినా..కొట్టింది గుండ్రం బయటకి రాకపోయినా..బొచ్చే ...
ఇదీ బొంబాయి ఆట..

ఒక చిన్న గుండ్రమో...చేతురస్రమో గీసి..అందుకో తలా కొన్ని గోలీలు వేసి ..పేర్చి.. బొటన వేలిని నేలమీద  ఉంది..చూపుడు/మధ్య వేలితో గాట్టిగా ఆ గోలీలని కొట్టటం.. అలా ఎన్ని గోలీలు బయటికి వస్తే అన్నీ మనవే. ఒకవేళ కొట్టింది అక్కడే చిక్కిందా మనం అవుట్.  
ఎవడు కనిపెట్టాడో కానీ భలే గా ఉండేవి ఆటలు.

అలా రెండు గంటలు దుమ్ములో ఆది..ఇరవై..ముప్పై గోలీలు గెలిచి  అమ్మితే   తెల్లారికి పాకెట్ మనీ దొరికేది రూపాయో..ఆటానా నో.. తెల్లారి బడి దగ్గర ఎం కొనుక్కొని తిందామా అని ఉహిస్తూ..నోట్లో నీళ్ళురేది
మిగిలిన గోలీలు జేబులో వేసుకొని మళ్ళీ ఇంటికి పరుగు ..గోలీలు  ఊరుకుంటాయా.....గళ్ళు గళ్ళు మని ఒకటే చప్పుడు.. నా ఆనందాని తాము వ్యక్త పరుస్తూ..
ఆ చప్పుడు అమ్మ గానీ వినిందంటే  మీ బతుకు మోరీ పాలే అని చెప్పి జేబుల్లో చేతులు దూర్చి వాటి నోరు నొక్కే వాడిని.
చప్పుడు కాకుండా ఓ డబ్బాలో వేసి  పుస్తకాల వెనకాల దాచేసేవాడిని.
సాయంత్రం నాతో పాటే వాటికీ ఓ రెండుగంటల స్వేఛ్చ.అందుకే అటు ఇటు..దొర్లుతూ పరిగెత్తేవి..

ఏరిన జ్ఞాపకాలని మళ్ళీ సాక్స్ లో వేసి మూటకట్టి పుస్తకాల వెనక పెట్టాను...మళ్ళీ వాటికి స్వేఛ్చ ఎప్పుడో...

Apr 30, 2011

నిర్వేదం


నిర్వేదం వొదిలి పెట్టు..బద్దకాన్ని కట్టి పెట్టు.


అలసత్వాన్ని పడుకోబెట్టు..హుశారుని తట్టిలేపు


కష్టం పెట్టుబడి పెట్టు..

(ఆపేయ్ ..ఆపేయ్ .. ఎవరికీ చెప్తున్నావ్... ??


ఈ మాత్రం మాకు తెల్సు.. మూసుకో.. )


:(

Apr 25, 2011

తల్లి మనసు


మొన్నెపుడో సరదాగా సాయంత్రపు నడకకు బల్దేరాను..మెయిన్ రోడ్డు, pollution బాగా ఉంది కూడ..అయినా అదేపనిగా ఇంట్లో కుర్చోటం భరించలేక వెళ్ళా .
 తిరిగి వస్తోంటే రోడ్డు మీద ఏదో గొడవ.. ఎంటా  అని చూస్తే...ఎవడో ఓ కుర్రాడు  తాగి నడి రోడ్డు మీద నిలబడ్డాడు. వచ్చి పోయే వాహనాలు ఆగి, వాడిని వితగా చూస్తూ పక్కనుంచి వెళ్ళిపోతున్నాయి. కొంత సేపు ట్రాఫిక్ జాం కూడా అయ్యింది. ఇంతలో యాభై ఏళ్ళ పబడ్డ వయసున్న ఒకావిడ, వాళ్ళ అమ్మ అనుకుంటా  "రా ఇంటి కి రా" .. అని వాడిని  లాగుతోంది..వాడు విదిలించుకుంటూ వాహనాలకి ఎదురుగా వెళ్తున్నాడు.
ఓరినీ ..ఏం పుట్టిన్దిరా నీకు.. ఎవడిని బెదిరించటానికి ? చచ్చేదానికి  బెదిరించటం ఎందుకూ ? ... అని అనుకుంటుండగానే..
వాడు  వాళ్ళ అమ్మని దూరంగా నేట్టేసాడు...ఆమె దుమ్ములో పడిపోయింది.   దుమ్ములోంచి లేచి మళ్లీ   'రా రా .. నీ కాల్మొక్త రా ..రా'  అని లాగుతోంది. వాడు నేట్టేయటము. ఆమె పడిపోయి లేవటం.. వీడు మళ్లీ రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడటం.
అప్పుడు ఇహ అక్కడ ఉండే  వాళ్ళూ పోగయ్యి వాడిని పక్కకి లాగేశారు.. వాడు విదిలించుకొని పోబోతోంటే ..లాగి ఒక్కటి కొట్టారు.. ఆ తల్లి బాబూ కొట్టకండి బాబు అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంది .

దాదాపు 25 ఏళ్ళ యువకుడు.. పని చేసేట్టు కనబడటం లేదు. బహుశా తల్లి వెట్టి చాకిరీ  చేసి పోషిస్తుంటే.. డబ్బు లాక్కొని తాగి వచ్చే తన్నే  బాపతుగా కనపడ్డాడు. నచ్చిన పని చేసి, ఎంతో కొంత సంపాదించి, తల్లిని పోషించాల్సింది  పోయి, ఇలా  తాగుబోతయ్యాడు..
పాపం ఆ తల్లి.. కన్న పాపానికి ఇన్నేళ్ళు  పెంచి పెద్ద చేసిందే కాక.. తాగి తంతే భరిస్తోంది. కడుపు లో ఉన్నపుడు తన్నలేదా.. ఇప్పుడు తంతే ఒక లెక్కా అనుకుందేమో ఆ మాతృమూర్తి .పాపం ఆ వయసులో, నలుగుర్లో, నడి రోడ్డు మీద, కన్నకొడుకే తిరస్కారం తో నేట్టేస్తుంటే...ఎందుకో చాల  బాధగా అనిపించింది ఆమెని చూస్తే..
మాతృహృదయానికి నా కన్నీటి చుక్క అర్పితం.

Mar 30, 2011

నేను


అందరూ ..ఆంధ్రాకో..తెలంగాణాకో... ఇంకోదేశానికో ...ఇంకెక్కడికో..పొట్ట చేతబట్టుకొని వచ్చారేమో .. నేనైతే ఈ భూమ్మీదకే పొట్టచేతబట్టుకొని వచ్చాను . నా నెత్తిమీద ఉన్న ఆకాశమే నా దేవుడు...నా కాలికింద ఉన్న నేలే నా తల్లి... నా చుట్టూ ఉన్న ప్రకృతే నాదేశం..నా మనసే నా రాజ్యం..నా చేతిలో ఉన్న పనే నా మనీ... నన్నెవడు దోచుకోలేడు.  దోచుకున్నాడని వాడు ఫీల్ అయినా ఆది నేను కాదనుకున్నదే..నేను ప్రేమతో ఇచ్చిందే. నాకు నేను విధించుకున్న బంధనాలే నన్ను బందిస్తాయి. కట్టుకున్నది నేనే..తెంచుకోవాల్సిందీ నేనే. బయటికి ఒకింత ..ఒకవైపు ఉన్నట్టు కనపడినా ఆది నా కనీసపు బాధ్యత .. నేను కళారాధకుడిని. విశ్వ మానవత్వపు సాధకుడిని.

Mar 16, 2011

గమ్యం

ఎక్కడికయ్యా  వెళ్తునావ్?
తెలిదు.
ఎక్కడికో తెలిస్తే తొందరగా వెళ్లోచ్చుగా.. పైగా ఎలా వెళ్ళాలో తెలుస్తుంది.
నాకు తొందరేం లేదు.. ఎలాగోలా వెళ్లక తప్పదు
అర్రే..ఎక్కడికో తెలీకుండా ఎలా వెళ్తావ్ ??
వెళ్తున్నాగా .
మహా తిక్కలోడి లాగ ఉన్నావే ?
నీకంటే  నా ??
ఏమిటీ నేను తిక్కలోడినా ??
అవును..
ఎందుకని ?
జీవిత ప్రయాణ గమ్యం నీకూ తెలిదు కనక..
తెలిసినట్టే మాట్లాడుతావ్ గనక..

Mar 7, 2011

నేనెవరు ?


నాకు నేనే ముఖ్యం.
నా అనుభవాలు .. నా ఆలోచనలు..అనుభూతులు.. జ్ఞాపకాలు ఇవే నా జీవితం.

నా పుట్టుకకు ముందున్న చరిత్ర ..నాకోసం కొంత నేను తెలుసుకున్నాను..
తొలుత గా నాకు తెలీక కొన్నింటిని అంగీకరించాను.. తెలియదు కనుక ఇంకోన్నింటిని ఇంకా అంగీకరిస్తున్నాను. కొన్నింటిని ఒప్పుకున్నాను.. కొన్నింటిని మార్చుకున్నాను. కొన్నింటికి తప్పక..తప్పించుకోలేక చేస్తున్నాను.
నిరంతరం "జీవితాన్ని" అన్వేషిస్తున్నాను.
నా పుట్టుకని అర్థం నాకింకా బోధ పడలేదు. పడుతుందో లేదో కూడ తెలిదు.

దేవుడు ఉన్నాడో  లేడో  అన్నది కాదు నా ప్రశ్న.. నమ్ముతున్ననా  లేదా అన్నదే సందిగ్ధం...
 మనిషిని నేను దేవునిగా అంగీకరించను. కేవలం పరమాత్మ తత్వాన్ని ప్రభోదించే గురువు గా మాత్రమే అనుకుంటాను. 

నేను ఫోటోగ్రాఫర్నీ కాను.. సినిమాటోగ్రాఫర్ని అంతకన్నా కాదు..
దర్శకుడిని కానే కాను..రచయితని అసలే కాను.

నేను ఎవరినీ కాను..ఏమీ సాధించలేదు..కేవలం ఆశ పడ్డాను అంతే.
చెప్పటం నాకు రాదు.. చేయటం చేత కాదు.
 

నేనొక  ప్రకృతి ప్రేమికుడిని,కళారాధకుడిని, స్వేచ్చా వాదిని, సత్యాన్వేషిని.
అసలుగా  చెప్పాలంటే పరమ  'పలాయన వాదిని.'

Mar 4, 2011

నా రాతలు

 
నా రాతలు.. ఎలా ఉంటాయో నాకు తెలుసు..
ఏది లోతుగా ఉండదు.. స్పష్టతా ఉండదు.. అప్పుడే కలిసిన వ్యక్తులతో హాయ్.హౌ రు అని పొడి పొడి గా మాట్లాడినట్టు..ఉంటాయి. 
కాని అ పొడి మాటల్లోనే కొంచం తడి తగులుతుంది..
విషయం  అర్థం చేయించే  ప్రయత్నమూ ఉంటుంది.
అప్పుడే మొదలవుతుంది..అంతలోనే అర్ధాంతరంగా అయిపోతుంది.  
నిష్టూరమే అయినా ఉన్న మాట చెప్పేస్తుంది.గుండె బద్దలు కొట్టేస్తుంది
జీవితం ఎప్పుడూ  ఏదో మూలసూత్రాల ఆధారంగా నడుస్తుందని నా అభిప్రాయం. అ సూత్రాలేవో కనున్నోవాలని నా ప్రయత్నం. కనుక్కొని చేసేదేమీ లేకున్నా.
ఎందుకంటే...సూత్రం తెలిసినా  తెలియకున్నా ... జీవితం గడుస్తుంటుంది..  కాని సూత్రం తెలిస్తే అదో ఆనందం....గుండె నిబ్బరం.

స్వేఛ్ఛ

 
స్వేఛ్ఛగా తిరిగే నీకు మళ్ళీ స్వతంత్ర్యం ఎందుకు?’అని అడిగిన ప్రతిసారీ
నా కనపడని సంకెళ్ళు శబ్ధం చేసి పెద్దగా నవ్వుతాయి.
"స్వతంత్ర్యం అంటే స్వేఛ్ఛగా తిరగటం కాదు.భయం లేకుండా ఉండటం" అంటాయి   - కత్తి మహేష్ . 
'తలెత్తుకొని తిరిగే తత్వం ' అంటాయి.
'ముక్కుసూటిగా మసలే తనం ' అంటాయి
'అరమరికలు లేని స్నేహం' అంటాయి..
'అవసరానికి అందిచే చేయి' అంటాయి..
...'హాయిగా నవ్వే అవకాశం' అంటాయి..
' గుండె లోతుల్లో, కల్మషం లేని ప్రేమ' అంటాయి.
'ముసుగు లేకుండా గడిపే జీవితం' అంటాయి.. - చక్రధర్



Feb 6, 2011

ఆనందానికి కారణాలు



ఆనందానికి కారణాలు
౧) అనుకున్నది జరగటం
౨) అనుకోకుండా కలిసి రావటం
౪) ఓ గొప్ప విషయాన్ని realize కావటం
౪) అందమైన అనుభవానికి  లోను కావటం.

Jan 13, 2011

యధాపి రుచిరం పుష్పం


"యధాపి రుచిరం పుష్పం
నణ్ణవంతం అగస్తకం
ఎవం సుభాషితో వాచా
న ఫలోహూతి కశ్చన: "

పువ్వు ఎంత అందంగా ఉన్న పరిమళం లేకపోతే ఆది వ్యర్థమే.
అలాగే క్రియా శూన్య మైన మాటలు వినటానికి ఎంత బావున్నా నిష్ప్రయోజనాలు

May 19, 2010

నన్ను కాల్చి చంపేసింది..



L    U     S    T      .. నన్ను కాల్చి చంపేసింది..
వయసొచ్చిన  నాటినుండి .. నేటి వరకు.. నన్ను నా జీవితాన్ని ఉపేసింది
20 సంవతరాలు..
ఏం చేయాలో తేలిక, చెప్పుకునే దిక్కులేక ,
అడగలేక, ఆగలేక .......రాత్రనక....పగలనక..
                         ......  నరకం..........
 ప్రేమగా పలకరిచే గొంతు లేక, సేద తీర్చే వొడి లేక..
 నేను తిట్టని దేవుడు లేడు.
అన్నమయ్య మది నిండా వేంకటేశ్వరుడు  నిండి నట్టు..
నా మది నిండా అదే..
అమ్మా  ఆకలేస్తుంది అనో,, నాన్నా  డబ్బులు కావాలనో అడగొచ్చు 

కాని దీన్ని  .. ఎవరిని..ఎక్కడ..  ఎలా.
నన్ను మెచ్చి వొచ్చిన   అమ్మాయి లేదు.. నేను మెచ్చి అడిగిన అమ్మాయిలతో   చీ ..పో లే .
I am not that kind of girl you know.. ..ohhh stupid.. as if they don't have LUST. 


దీనికి తోడు .. ఇంటర్నెట్ లో ఇండియన్ స్కాండల్సు..
ఇలాంటి అమ్మాయి నాకు తగలదేం   అని వాడి అదృష్తానికి మళ్లీ రగిలి.
..అయ్యో చావైనా  రాదే..

అద్బుల్ కలాం ని చూసి ఆశ్చర్యము, బాధ..................












మనిషి

జీవ పరిమాణ సిద్దాంతం నుండి మనిషి వోచ్చడా? లేక బైబిలు లో చెప్పినట్టు దేవుడు ఒక అడ ఒక మగని  సృష్టిస్తే   వాళ్ళ నుండి ఈ మన మనుష జాతి విస్తరించిందా ??

                           తెలీదు  కాని ....

మనిషి ప్రయాణం అప్రతి హతంగా సాగి

నిప్పు రగిల్చి.. రుచులు వడ్డించి

కాంతిని చీల్చి... రంగులుగా మార్చి,

చక్రాన్ని చేసి , ప్రపంచాన్ని చుట్టి.

నింగి పై ఎగిసి , నీటిపై తేలి..

భూమి లోతుని ...ఆకాశం అంతును చూసి 

కంప్యూటర్ కనిపెట్టి...ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చి.. 

ఏమి సాధించాలనో ఆ తపన ?
అంతు లేని కాంక్ష.. గమ్యం లేని పయనం...
అదే మనిషి జీవితం.

Sep 15, 2008

అంతిమ సంస్కారం


ఏదో పనిలో నేను SR Nagar లో ఉండగా, నా సెల్ ఫోన్ మోగింది. మా వదినచెప్పింది "
అమ్మమ్మ చనిపోయిందని ". నాకేమీ బాధ అనిపించ లేదు. ఎందుకంటే గత రెండు
సంవత్సరాలనుండి ఆమె మంచం పై జీవచ్చవంలా పడి ఉండేది, కళ్ళు తప్ప ఇంకేవి కదపలేని
స్థితిలో.. తాతచనిపోయిన కొద్ది రోజులకే అమ్మమ్మ పరిస్థితి  క్షీణించింది. 80
సంవత్సరాల పైబడి వయసు, నడవలేనిస్థితిలో నేల మీద పాకుతూ రెండు సంవత్సరాలు
గడిపింది, తరవాత అసలు కుర్చోలేని స్థితి.. ఆ తరవాత చేతులు కూడా కదపలేని స్థితి.
ఇద్దరు వ్యక్తులు ఆమెని చూసుకోటానికి ఉండవలసివచ్చేది. ఆడవ్యక్తి కనక ఆడవాళ్లే
అవసరం. అలా అమ్మమ్మ పరిస్థితి  విషమం.అందుకే అమ్మమ్మ చనిపోయిందన్న విషయం
పెద్దగా బాధించలేదు.అలాంటి  స్థితిలో ఎవరు మాత్రం బ్రతకాలనికోరుకుంటారు?? అదృష్టవ
శాత్తు, అమ్మమ్మ చనిపోయే టప్పుడు మా అమ్మ ఆమె  దగ్గరే ఉంది.మా అమ్మ అందరిలోకి
చాలఏమోషనల్. అక్కడే ఉండటం చేత చివరి దశలో తానామే పక్కనే ఉన్నానన్న తృప్తి
మిగులుతుంది.

నేను రూమ్ కివచ్చి బెంగుళూరు లో ఉన్న మా బావకి ఫోన్ చేసాను..రాత్రి 8 గంటల
కల్లా  తాను హైదరాబాద్  వస్తున్నానని చెప్పాడు. అతను  రాగానే ఇద్దరం బయలుదేరాము
అమ్మమ్మ వాళ్ళ ఊరికి ... "వేలూరు" ..హైదరాబాద్ నుండి 60 km దూరంలో ఉన్న
పల్లెటూరు. పక్క town నుండి 10 km. 7 seat auto ల పుణ్యమాని అర్ధరాత్రి కూడా
ప్రయాణం చేయొచ్చు,కనక పెద్దగా ప్రయాస  పడకుండానే ఊరికి వెళ్ళాము.
ఇంటిముందు జంపుఖానా లో ఒకరిద్దరు నిద్రపోతూ ఉన్నారు. ఇల్లంతా నిశబ్దంగా ఉంది. 
'పుట్టిన వానికిమరణము తప్పదు.. మరణించిన వానికి జన్మము తప్పదు.. అనివార్య మగు
ఈ  విషయమై చింతింప తగదు' ... ఘంటసాల గారి భగవద్గీత సన్నగా చెవులని తాకింది. 
చెప్పులు  ఒక మూల వదిలి ఇంట్లోకి వెళ్ళాను.. అమ్మమ్మ చుట్టూ చిన్నమ్మలు,
అత్తయ్య లు కూర్చొని ఉన్నారు.. వాళ కళ్ళన్నీ ఎర్రగా ఉబ్బి ఉన్నాయి..అప్పటివరకు
ఎంతగా ఏడిచారో తెలియజేస్తూ.. నేను మౌనంగా సాష్టాంగ నమస్కారం చేశాను.. ఆమె
ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థించి రెండు నిమిషాల తరవాత లేచాను. మెల్లగా వచ్చి
మా అమ్మ పక్కన కూర్చొన్నాను. నన్ను చూడగానే అమ్మ బావురుమంది, నన్నుపట్టుకొని.
ఏమని ఓదార్చను?? కని ..పెంచి ...ప్రేమానురాగాలు పంచిన మాతృ మూర్తి, .. తల్లి ..
పోతే పడే బాధను ఎవరుమాత్రం ఆపగలరు?? జ్ఞాపకాల వెల్లువ ఉప్పొంగుతుండగా వెక్కి
వెక్కి ఏడ్చింది.. చక్రీ  మా అమ్మరా అంటూ. నేనుమాత్రం అలాగే మౌనగా ఉండి
పోయాను..
 ఆశ్యర్యం.. నా కంట్లో చిన్న కన్నీటి చుక్క కూడా లేదు..ఎడవాలని ప్రయత్నించాను,
కాని ఏడుపు రావటం లేదు.
  అమ్మమ్మ జ్ఞాపకాల కోసం మనసంతా వెతికాను. .. రాలేదు.. ఇదేమిటి నా గుండెలో
అమ్మమ్మకోసం ఒక్క జ్ఞాపకం కూడా లేదా ..కంట్లో ఒక్క బొట్టు నీరైన లేదా??
 ప్రతి ఎండాకాలం సెలవుల్లో మేము అమ్మమ్మ  ఇంటికేవచ్చే వాళ్ళం. అమ్మను మరిపిస్తూ
మాకు అన్నం పెట్టేది, మాట్లాడేది,, కథలు చెప్పి మురిపించేది. ఎన్నెన్నో
తినుబండారాలు చేసి పెట్టేది. వీటిల్లో ఒక్క జ్ఞాపకం కూడా న మనసుకు తట్టటం
లేదు.. బహుశా నా ప్రస్తుత జీవితం నన్నురాయిలా మార్చిందేమో..కొద్ది నిముషాలు
అలాగే కూర్చున్నాను.అందరు మౌనంగా చూస్తున్నారు.. చిన్నమ్మలూ, అత్తయ్యలు..ఇక
అక్కడ కూర్చోలేక బయటికి వచ్చి జంపు ఖానా లో కూర్చొన్నాను.. ఇంతలొ మా మామయ్య
(మేనమామ )వచ్చి  నా ముందు కూర్చొన్నాడు, నేను అతని చేతిలో చేయి వేసి మౌనం
వహించాను.
ఏమని చెప్పను? ఈఓదార్పు మాటలు దుఖాన్ని ఎక్కువ చేస్తాయి కాని తగ్గించవని నా
అభిప్రాయం. అందుకే అలా మౌనంగాఉండిపోయాను.. ఒక ఐదు నిముషాల తరవాత అతనే  " ఎవరు
చెప్పారు విషయం" అని అన్డుగుతూనే ..అమ్మమ్మ చివరినిముషలో పడిన బాధనంతా
చెప్పాడు. అదంతా వింటుంటే..ఎందుకు మనిషికి ఇన్ని బాధలు పెట్టడు దేవుడు అని
అనిపించింది.   బావ కూడా కొద్ది సేపు లోపలకు వెళ్లి వచ్చాక   ఇక ఇద్దరం ఉదయం 4
గంటలవరకు ఏదో మాట్లాడుకొన్నాం. నేను అక్కడే నిద్రలోకి జారుకున్నా...

ఉదయం 5.30 అవుతుండగా అత్తయ్య నిద్ర లేపింది , పకనున్న టౌన్ కెళ్ళి పాలు ,
అత్యవసర సరకులు తీసుకొని రమ్మని. కొద్ది సేపట్లో బంధువర్గం అంతా వొచ్చేస్తారు,
ఎంత చావైనా కొంచం 'చాయ్' అయినా తాగాలి కదా..నేను ముఖం కడుక్కొని, ఓ కజిన్ తో
పాటు స్కూటర్ పై టౌన్ బయలుదేరాను. మేము తిరిగి వొచ్చేసరికి ఇల్లంతా  బంధువులతో
నిండిపోయింది. నేను పాలు ఇతర సరకులు అప్పగించి  వాకిట్లోకి వచ్చాను. అంతిమ
యాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు పాడె  కడుతున్నారు, తెల్లని బట్ట , కొత్త
చీర తెప్పించారు.. బావ కొత్తకుండలకోసం వెళ్ళాడు. ఇంతలొ ఎవరో అన్నారు "త్వరగా
కానీయండి .. ఎంత ఉదయం చేస్తే అంత మంచిది.. పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి".
అప్పుడే 8 కావొస్తోంది. ఇంతలొ చాయ్ తయారైంది.. దూరపు బందువులు అందరూ వేడి వేడి
గా చాయ్ ని గొంతు లోకి జార్చారు.
  యువకులం ఓ పది మందిమి.. దగ్గరలోని బోర్ బావి  దగ్గరికి వెళ్ళాము. అమాంతంగా
నల్లా కింద కూర్చొని మడి స్నానం చేసాము. ఎర్రని పంచెలు కట్టి, రెండు బిందెల
నీళ్ళతో ఇంటికొచ్చాము. మేము వొస్తుంటే అందరూ దూరంగా జరిగి మాకు దారి ఇచ్చారు.
వాకిట్లో కుర్చీ వేసారు.. దాని వయసు అమ్మమ కంటే ఎక్కువే అనుకుంటా.. అమ్మమ్మని ఆ
కుర్చీలో కూర్చుండబెట్టాం. నారాయణ మంత్రం ఉచ్చరిస్తూ స్నానం చేయించారు . మేము
పట్టు పంచలతో కుర్చీ చుట్టూ పట్టుకుంటే ..కొత్త చీర కట్టించారు..ముఖాన
గోపిచందనం పెట్టి నోట్లో తీర్థం, తులసి దళం వేసారు. మెల్లిగా అమ్మమ్మని పాడే
మీద పడుకోబెట్టాము.. తాళ్ళతో గట్టిగా కట్టి.. చుట్టూ 8 చోట్లలో నీళ్లు చల్లి .
బియ్యము, నువ్వులు ఉంచాము. ఏడుపులు ఎక్కువయ్యాయి. మా అమ్మని ఆపడం ఎవరితరము
కావటం లేదు. " ఓం నమో నారాయణనాయ .. ..ఓం నమో నారాయణనాయ " అంటూ  నారాయణ మంత్రం
నిరాఘాటంగా ఉచ్చరిస్తూ పాడెని  ఎత్తి బయలుదేరాము.
బందువులు.. స్నేహితులు...ఆప్తులు.. ఊరిజనం.. దారిన పోయే దానయ్యలు...అందరూ
చూస్తున్నారు " ఒక మనిషి అంతిమ యాత్ర" 

జీవితం ఒక పండగ...
పనిషి పుట్టిన నాటి నుండి  చనిపోయే వరకు పండగే ..
"పుట్టటం .. బారసాల..పుట్టిన రోజులు..పెద్దమనిషి కావటం/ఉపనయనం... పెళ్లి ..
పిల్లలు.....చివరికి 'చావు'కూడా ....అన్నీ పండగలే"
Life is a celebration .

మేము శవాన్ని తీసుకొని ఊరిబయట చెరువు గట్టుకి వెళ్తున్నాము..బందు మిత్ర గణం  ఆమెతో
తమకున్న అనుభంధం ..ఆత్మీయత,. తమ జ్ఞాపకాలు ..ఆమె అనురాగం ..గుణ గణాలు....అన్నీ
ఒకరికొకరు చెప్పుకుంటూ అనుసరిస్తునారు. మూడు చోట్లలో కిందకి దించి మళ్ళీ
నీళ్ళు చల్లి, బియ్యము..నువ్వులు పెట్టారు. చెరువుగట్టుకి పక్కగా ఉన్న పొలం
లో..చితి ఏర్పాటు చేసారు. అమ్మమ్మని చితి పై పడుకోబెట్టాము. అందరూ ఒక్కో కట్టే
ని ఆమెపై ఉంచారు. అక్కడక్కడ  చితి కట్టెలపై కిరోసిన్  చల్లారు. ఇక మిగతా తంతు
జరిగిన తరవాత తల దగ్గర నిప్పు అంటించి తల్లి ఋణం తీర్చుకున్నాడు, మామయ్య .
అప్పటివరకు మౌనంగా గుండె నిండా బాధ నిపుకున్న మావయ్య నిప్పంటించగానే ఒక్కసారిగా
అమ్మా.. అమ్మా అంటూ  బావురుమన్నాడు.

ఒక తల్లి.. ఒక జీవితం..ఒక జ్ఞాపకం ..ముగిసిపోయింది.. ఎవరాపగలరు అతన్ని..ఏమని ఆపగలరు???
అది చూసి ఏడుపులు మిన్ను ముట్టాయి... ఆ ప్రదేశం అంతా శోకరాగాలే...

 నా మనసులోకి ఆలోచనలు నిండాయి.
 కాలిపోతోంది.. .80 ఏళ్ల జీవితం.... మండిపోతోంది చితిలో..
ఎన్ని కలలు కందో..ఎన్ని తీరాయో..ఎన్ని మిగిలాయో..ఎంత ఆనందం పొందిందో..ఎంత
దుఖాన్ని దిగమింగిందో..??
కూతుర్లు ..కొడుకులు..కోడళ్ళు..మనవలు..మనవరాళ్ళు...ఇంత మందికి ప్రేమని అందించిన
మాతృ మూర్తి..
...జీవచ్చవంలా, నరక యాతన అనుభవించి....కాలిపోతోంది అమ్మమ్మ ..

ఒక్కసారిగా గుండె లోతుల్లోని తడి ఎగిసింది.
రెండు కన్నీటి బొట్లు నేల రాలాయి .