Showing posts with label మతం - దేవుడు. Show all posts
Showing posts with label మతం - దేవుడు. Show all posts
Nov 28, 2011
విశ్వ రూపం
కాషాయం కట్టి ఇల్లు వదిలిన ప్రతివాడు హిందుత్వపు బలి పశువే. పూజలు వ్రతాలూ చేసి దరిద్రుడయిన ప్రతివాడు బలిపశువే...
హిందూమతాని ఆహా ఓహో అని చెపుతూ లక్ష విధాల రాయొచ్చు.అదో పెద్ద విషయం కాదు. హిందూ మతం గందరగోళం అన్న మాట వాస్తవం. జనాలు అంతకంటే గందరగోళం లో ఉన్నారనేది వాస్తవం.
అలా కాక వెనకేసుకోస్తుంటే..జరిగేది,
Feb 27, 2011
దేవుడి గురించి ఆలోచన ఎందుకో మనిషికి ??
తన గురించి తాను ఆలోచించుకోక ..దేవుడి గురించి ఎందుకో ఆలోచన మనిషికి ??
దేవుడు ఉన్నాడో లేడో అని సందేహం వెలిబుచ్చినా.. లేక దేవుడు లేడు అని అన్నా, 95% మంది .. ఆ ఏమన్నావ్..?? బుద్ది ఉందా?
మనిషివేనా.. దేవుడు లేకుంటే ఈ సృష్టి ఎలా ఉంది?? నీవెలా ఉన్నావ్ ?? ఎక్కడినుంచి వచ్చావ్ ?? ఏం తెలుసురా నీకు తుచ్చుడా ..??
అని ఓ ' వేద పద్యం'మో ఓ మత 'గ్రంధ' సూక్తినో పొల్లు పోకుండా చదివి వినిపిస్తారు.
సరే ఉన్నాడు సో వాట్ ?? అయితే ఏంటి..?? ఉంటే ఏం చేయాలి ??ప్రేమిచాలి...అంటారు . ఆ ప్రేమ కలగందే ??
సరే ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి ??
గుంపులు కట్టి రాగాలు తీసా? లేక ఎదుటోడి ప్రాణాలు తీసా??
నా దేవుడు ..నా దేవుడు అని .. ఒకదినోకడు చంపుకుంటూ నా ?? నా మతం లోకి మారు ..మారు allure చేస్తునా ? కొంతమందికి దేవుడి మీద ప్రేమ కంటే ప్రపంచాన్ని తమ మతం లోకి మార్చుకుందామనే ధ్యాసే ఎక్కువ.
చాలామందికి దేవుడంటే ' ప్రేమ' కంటే 'భయమే' ఎక్కువ.
"నాయనా ఎన్నో జన్మల తరవాత ఈ మనవ జన్మ సంప్రాప్తించింది ..
జన్మ రాహిత్యం పొందటమే మానవ జన్మ కర్తవ్యం..కనక దేవుడిని పూజించి పుణ్యం సంపాదించుకో' ..అంటారు . కాని వాళ్లకి రూపాయిల మీద ఆశ మాత్రం చావదు... సుఖాల మీద విసుగు పుట్టదు.ఒకవేళ సృష్టి కర్త ఉంటె .. ఆయనతో వ్యక్తి గత సంభందం ఉండాలి. అది పదిమందికీ చూపాల్సిన అవసరం లేదు. తంతులు.. పూజలు. ..ప్రార్థనలు ...ఆర్భాటాలు అంతకన్నా అనవసరం. కాని ఈనాడు ఇవే ముఖ్యమైనాయి.సోషల్ లైఫ్ కోసం ఇదంతా చేస్తున్నాం అని ఒక్కడూ ఒప్పుకోడు. స్వామి కార్యం కంటే 'స్వకార్యమే' ఎక్కువ అయినా.
.
Feb 16, 2011
ఎదగాలి...
విగ్రహాలు...పూజలు అవసరం లేదా అంటే అవసరమే. కాని వాటి అవసరం ఎంతవరకో తెలుసుకోవాలి.
ఒకటోతరగతి రెండోతరగతి ఈ విధంగా తరగతులు అవసరమే.
మనం ఎంత నేర్చుకుంటున్నామో అవి తెలియచేస్తాయి.
వాటితో మొదలు పెట్టకుండా తరవాత స్థితికి చేరగలమా ?? ఎల్లకాలం అ, ఆ, లు దిద్దుతూ కూర్చోలేం కదా ?? ముందు క్లాసులకు ఎదగాలి.
కాని ఎప్పటికీ ఒకటో తరగతి లోనే ఉంటే అదేమి విద్యాభ్యాసం?
ఆధ్యాత్మికత కూడ అంతే .ఎదగాలి.. స్థూలం నుండి సూక్ష్మానికి
భక్తి నుండి ధ్యానానికి ...ధ్యానం నుండి యోగానికి..
Dec 22, 2010
ఈ నాడు ఏం జరుగుతోంది హిందూ మతం లో ??
ఈ నాడు ఏం జరుగుతోంది హిందూ మతం లో ??
మనకి దేవుళ్ళకి కొదువ లేదు.. ఎటు చూసినా దేవుళ్ళే.. ఏ పేరు చెప్పినా దేవుడే..రామయణ భారత భాగవతాల్లో.. పురాణాల్లో చెప్పిన వాళ్లే కాక.. గ్రామ దేవతలు.. నవగ్రహాలు.. అడుగడుగునా పుట్టగొడుగుల్లా దేవుళ్ళే.
"మనుజుడై పుట్టి మనుజుని సేవించి.. అనుదినము దుఃఖ పడనేలా " అన్నట్టు.. రోజుకో బాబా.. అవతారం ఎత్తుతాడు ....జీవితం మీద ఓ రెండు మూడు నిర్వచనాలు, నాలుగు వేదాంతం మాటలు.. రెండు మోక్ష మార్గాలు..చెపుతాడు. కనీస ఇంకిత జ్ఞ్యానం లేని జనాలు అతన్ని దేవుడిని చేస్తారు. ఈ బాబాలకి.. కూడా దేవుళ్ళకి పూజ చేసినట్టే.. భజనలు..హారతులు .. ధూప దీప నైవేద్యాలు..
దేవుడు ఒక్కడే అంటారు.. మళ్లీ ఇన్ని రూపాలని పూజిస్తారు..
బౌద్ద జైన సిక్కు మతాలూ పుట్టుకొచ్చాయి..అవి కూడా హిందూ మతం లో అంతర్భాగమే అంటారు. ఎంటిందంతా ??
హిందూ మతానికి తనకంటూ ఒక ఉనికి.. లేదా?? ఖచ్చితంగా హిందూ మతం అంటే ఇది అని చెప్పెడాడు ఎవడైనా ఉన్నాడా ?
ఎటు పోతోంది హిందూ మతం ? ఆపే వాడెవడు ?
హిందూ మతం ఏం చెపుతోంది ??పురాణ పురుషులని , పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే బాబాలకి ..ధూప దీప నైవేధ్యాలా పెట్టి పుజించామనా ?? లేక యమ నియమాలు పాటిస్తూ యోగాభ్యసమా ??
ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఎవరు, ఎంతమంది నిజంగా జన్మ రాహిత్య స్థితి కావాలని.. eternity కలగాలని ఆశిస్తున్నారు ?
ఎంత మంది.. ఈ సుఖ భోగాలకై.. పరితపిస్తున్నారు ?
ఒక solidity లేదు కనకనే..ఒకే బావన లేదు కనకనే .. complicated ఐపోయింది..చిక్కుముడి పడిపోయింది.. ఇప్పుడు ఎవ్వరు ఏమి చేయగలిగింది లేదు. there is no way..
నేను అనుకునేది ఏంటంటే ..
అసలైన హిందూ ఆధ్యాత్మిక సంపద అయిన ... కుండలిని, క్రియా, రాజయోగాది యోగాభ్యాసాలు వదిలేసి..బౌతిక మైన ఆహార్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. రామాయణ భాగవత భగవత్గీత పద్యాలను వల్లె వేసే వాళ్లే హిందూ అధ్యాత్మికతకి ప్రతీకలు గా భావిస్తున్నాం. హిందూ మతం "life is a celebration" అని చెప్పే జీవన శైలి. భారతీయ ఆధ్యాత్మికత నిస్సంకోచంగా పరమాత్మని చేరే ఒక సాధనం. ఒకటి సుసమాజం కోసం..ఇంకోటి ఆత్మా - పరమాత్మల సంయోగ సాధనం. ఒకటి సామాజికం, ఇంకోటి వ్యక్తి గతం. కనక వ్యక్తి గతంగా పరమాత్మా దర్శనం కావాలంటే మతం తో పనిలేదు, యోగ సాధన తప్ప. సామాన్య సామాజిక జీవితం గడిపేవాడు ఏ మతం లో చేరి ఏం చేసిన.. భారతీయ ఆధ్యాత్మికత కి వాటిల్లే ప్రమాదం ఏమి లేదు.
Subscribe to:
Posts (Atom)

