ఎండపట్టుకు ఎడ తెగక తిరిగి..
కళ్ళు సోలి సోమ్మసిల్లగ
చెట్టునీడన సేదదీరగ..
చెట్టు నాకు గొడుగు పట్టే,
చల్ల గాలి జోలపాడే
గాలి చాటుగా జోల పాడిన
దైవదర్శన మయ్యేనాకు..!
మాయదారి రోగమొకటి..
తెలియకుండా సోకినాది
ఓపలేని బాధతోనూ..
రోజు రోజు కుంగి పోవగా.
రోజు రోజు కుంగి పోవగా.
వైద్యుడిచ్చిన చిన్న మాత్ర..
నొప్పినంతను తెసివేయగా..
మాత్ర. మాటున దాగి ఉన్న
దైవదర్శన మయ్యేనాకు..!
పొట్ట కూటికి దారి పట్టి
ఆకలికి ప్రాణాలవిసి పోవగా
తుట్ట తుదకు సాటి వాడు
పట్టెడన్నం పెట్టినాడు
సాటివాని దాత గుణమున
దైవదర్శన మయ్యేనాకు ..!!