Showing posts with label సమాజం. Show all posts
Showing posts with label సమాజం. Show all posts

Jul 19, 2012

ఆహా ఎంత అభివృద్ధి సాధించాం..!!


ఇంటిముందుకి వచ్చిన కూరగాయల బండి వాడితో గీచి గీచి బెరమాడుతాం..
రిలయన్స్ ఫ్రెష్ లాంటి వాటిల్లో మారు మాట్లాడకుండా వాట్ (వాత) పెట్టించుకొని వస్తాం..
ఆప్యాయంగా వచ్చే చిరునవ్వుని పలకరింపుని పట్టించుకోం.. ప్లాష్టిక్ నవ్వుకి..తప్పని మర్యాద పలకరింపుకి మురిసిపోతాం..
ఓ అయిదు రూపాయలు తక్కువ పడితే మనని నమ్మని వాడి దగ్గరే కొంటాం..కాని, దాందేముంది రేపు ఇద్దురు కానిలే అనేవాడిని సహించం.
రౌండ్ ఫిగుర్ పేరుతో చిల్లర నొక్కేది వాడు.. ప్రేమతో రెండు కాయలు ఎక్కువ వేసేది వీడు.
శ్రమని దోచుకొని పోయేది వాడు.. శ్రమజీవన సౌందర్యాన్ని చెప్పేది వీడు..
మనం కళ్ళకి మాత్రం artificial జిలుగులే తప్ప మనసు వెలుగులు కనిపించవు.
ఆహా ఎంత అభివృద్ధి సాధించాం..!!

Apr 29, 2012

మనిషిగా మిగిలిపో..



 
సరే.. దోచుకున్నావు. వేల కోట్లు దోచుకున్నావ్ ?? ఆ కాగితపు కట్టలు నీ పేరుమీద దాచుకున్నావ్. ఎకరాలకి ఎకరాలు నీ పేరుమీద ఉందని మురిసిపోతావ్ .. కాని ఏం లాభం ?? చెప్పు ?

చెయ్యి ..ఎంజాయ్ చెయ్యి.. ఎంత చేయగలిగితే అంత చెయ్యి. తెలివితో సంపాదిన్చుకు
న్నావ్ కనక చెయ్యి. కాని

ఆ చేత్తోనే... కలలో కుడా ఇలాంటి అదృష్టం / అనుభవం వస్తుందని అనుకోని ఒకడికి ఒక గొప్ప అనుభవాన్ని/అదృష్టాన్ని ఇచ్చి చూడు. పొంగి పోయే వాడి గుండె ని చూడు. వాడి కళ్ళలో ఆనందం చూడు. వాడు కృతజ్ఞతతో రెండు చేతులుఎత్తి చేసే నమస్కారం చూడు. మనుషుల మనస్సులో దాగిన ప్రేమని చూడు. దాన్ని సంపాదించుకున్న నీవు ఎంత గోప్ప వాడివో నీకు అర్థం అవుతుంది.

ఈ దేశంలో

రెండు పూటలా అన్నం.. తనకంటూ ఓ చిన్న గూడు ఇవీ మహత్తర అదృష్టంగా భావించే వాళ్ళు కోకొల్లలు.
శుబ్రమయిన మంచి నీళ్ళు దొరికితే చాలు అనుకునే ఉర్లు కోకొల్లలు..
చదువుకోటానికి తమ పిల్లలకి బడి దొరికితే చాలు అనుకునే వాళ్ళు కోకొల్లలు..
తమ ఉరికి బస్సొస్తే చాలు అనుకునే వాళ్ళు కోకొల్లలు.
తమ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగాయితే చాలు అనుకునే వాళ్ళు కోకొల్లలు.
దిక్కు లేక ..రోడ్డున పది వెట్టి చాకిరీ చేస్తూ బాల్యాన్ని కోల్పోతున్న పసివాళ్ళు కోకొల్లలు..
వీళ్ళ0తా నీ కోసం.. నీ అభయ హస్తం కోసం...నీ సాయం కోసం ఎదురు చూస్తున్నారు...
కళ్ళు తెరువు. వాళ్ళని చూడు. నీది కాని నీ సంపదని.. వాళ్ళ సంపదని వాళ్ళకి ఇచ్చేసి మనిషిగా మిగిలిపో.. దేవుడిగా వెలిగిపో.

Aug 20, 2011

అడిగే దిక్కే లేదు.


టైం అవుతోంది  ఆఫీసు కి వెళ్ళాలి.. కాని తొందరేం లేదు. నేను ఎంత లేట్ గా వెళ్ళినా ..అసలు వెళ్లకున్నా  నన్నేమి అనరు. ఎందుకంటే నేను లేకుండా ఒక్క పని జరగదు అక్కడ. అలా అని వెళ్ళకుండా ఉండలేను. కాకపోతే కొంచం ట్రాఫిక్ తగ్గాక.. చిన్న సైజు లంచ్ చేసి, బాక్స్ ప్యాక్ చేసుకొని పదిన్నర ,  పదకొండుకి  గాని  బయలుదేరను.  ఇంట్లో ఎవరో చుట్టాలు రావటం తో కేవలం బాక్స్ మాత్రమే తెసుకొని బయలుదేరాను.
ఎందుకో బాగా ఆకలిగా  అనిపించింది.. అంటే రోజు అదే టైం కి కానిస్తున్న కదా..అందుకేమో.
ఇహ లాభం లేదు ఏదైనా తినాల్సిందే అని అనుకొంటుండగా.. ఆనంద్ theator దాటాక ..ఒక  మొబైల్ టిఫిన్ సెంటర్ కనిపించింది. సరే చూద్దాం అని బండి అటు తిప్పి దాని ముందు ఆపానో లేదో..  ఎవడో పార్కింగ్ టికెట్టు తెసుకొని వచ్చాడు. 
బండి ఆపితే చాలు..ఎక్కడినుంచి వస్తారో..ఈ నాకొడుకులు..  
ఏంటి ?
పార్కింగ్
ఎంత ?
అయిదు రూపాయలు 
బాబు ,,ఇక్కడ నేనేమి సంపాదిన్చుకోవటానికి రాలే .. ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళాలి.అంతే..
అయినా కట్టాల్సిందే..
సరే కాని నీ లైసెన్సు చూపించు అన్నా..
అదా అది.. అటువైపు మావాడు ఇంకోడు ఉన్నాడు వాడిదగ్గర ఉంది. వెళ్లి చూసుకోండి అన్నాడు .
నేనే వెళ్లి వాడిని పలకరించి..బాబు లైసెన్సు చూపించు.. అని అడిగి..వీడికి డబ్బులు కట్టాలంట.
ఇదీ వాడి వాదన.
మన ప్రధానమంత్రి ఎవరు ?
నోరేల్లబెట్టాడు వాడు..
ఇదీ మనదేశ దౌర్భాగ్యం..
మన ప్రధానికి దేశాన్ని గురించి  దేశ ప్రజల గురించి, ప్రజలు రోజు పడే పాట్లు గురించి  తెలిదు..ఈ ప్రజలకి ప్రధానేవరో తెలిదు. (తెలిసినా నేను మాత్రం పెద్ద పోదిచేదేమి లేదనుకోండి.)  
ఇహ వాడితో వాదిస్తే ఆకలి ఎక్కువయ్యి అక్కడే పార్కింగు ఫీజు కట్టి తినాల్సోస్తుందని  .. "బాయ్ రా బ్రదరూ..
కళ్ళు తెరిపించావు.ఈ ఐదురుపాయలు కలుపుకుంటే.. టిఫిన్ సెంటర్లో దర్జాగా తినొచ్చు అంటూ బండి వెనక్కి తీసా.
 ఒక్క ఐదునిముషాలు ఓపిక పట్టవే..ఈ రోడ్డు తిండి ఎందుకు ..మంచి టిఫిన్ సెంటర్లో తినిపిస్తా అని ఆకలితో   చెప్పా .. అది హాప్పీ గా ఒకే అంది. 

అయితే మాట్లడుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆశకు నిజంగానే GHMC పార్కింగు ఫీజు వసూలు చేస్తోందా ??
ఎందుకు?
రోడ్డుమీద పెడితే ట్రాఫిక్కి అంతరాయం అనుకుంటే డబ్బులు కట్టి పెడితే మాత్రం అంతరాయం కాదా ??
పోనీ  రోడ్డుకు ఇరువైపులా గవర్నమేంట్ ఆస్తి,  అక్కడ పార్కింగు ఫీ  ద్వారా డబ్బు రాబట్టుకోవాలి అనుకుంటే..
 నెలకి  వంద రూపాయలు వసూలు చేసుకొని పార్కింగ్ కార్డు అని ఒకటి ఇవ్వచ్చుకదా.. license తో పాటు ఆ కార్డు పెట్టుకొని తిరుగుతాం.అడిగితే చూపిస్తాం. రోజూ ఈ  గొడవ ఉండదు కదా..అసలు  ప్రజలు వాహానాలు నిలిపే అవసరం ఉన్న చోటే నో పార్కింగ్ బోర్డు పెట్టి ఫైన్ వేసి డబ్బు వాసులు చేస్తోందని నా వాదన.
ప్రభుత్వ ప్రైవేటు  అని తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ...పార్కింగు చేసే ప్రతి చోటా ఎవడో ఒకటు టిక్కెట్లు ముద్రించుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు.
అడిగే దిక్కే లేదు.  మీకు ఇలాంటివి ఎదురయ్యయా ??
ఎందుకొచ్చిన గొడవ  అని  పట్టించుకోరా ??

Jun 23, 2011

తీయని గొంతు


నిన్న ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది... తీయని గొంతుతో..
 " సర్ జీవితాన్ని అద్భతంగా మార్చేయగల దివ్య మైన ఉంగరాలు..రాళ్ళూ...రప్పలు..మణులు ..మాణిక్యాలు..కంకణాలు..వడ్డాణాలు ఉన్నాయి.   తీసుకుంటారా "
ఒక పని చేస్తావా ??
చెప్పండి సార్ ..
చంపెయ్యి నన్ను..
సార్ ...
ఆ మాటకి ఫోన్ కట్ చేసి తీరాలి అని   కట్టయిందో లేదో చూసా..కాలేదు.
 " సార్ మీ frustration తొలగించుకోవాలంటే మీరు మా ఉంగరం పెట్టుకోని చూడండి సార్ మీ మనసును పీస్ ఫుల్ గా ........" 
మళ్లీ ఫోన్ కట్ అయ్యిందో లేదో చెక్ చేశా..
అయ్యింది.
ఎందుకంటే చేసింది నేనే కదా..

Jun 1, 2011

జనాలని entertain చెయ్యటం అంటే...


రాత్రి  ఇంటికి వెళ్ళాక  ఇంట్లో ఏమి తోచటం లేదు. చాల  రోజులైంది కదా అని  FM   పెట్టుకున్నా.. ఏ చానల్ తిప్పినా అంకర్ల గోల.. అబ్బబ్బా భరించలేం. రాత్రి పదకొండు గంటలు దాటినా మన అంకర్  గొంతులో మాత్రం ఫుల్ energy.. ఎంత అంటే..ఏం మాట్లడుతున్నోరో తెలినంత..సరే ఎప్పుడో రికార్డు చేసింది లైవ్ కాదని అనుకుందాం. కాని ఆ మాట్లదేదేదో స్పష్టంగా కొంచం నిదానంగా మాట్లాడొచ్చు కదా..ఎంత అంకర్ అయితే మాత్రం కనీసం మాట్లాడింది వినేవాడికి  అర్థం కావాలిగా.. అర్థం అయ్యే time ఇవ్వాలి కదా..సరే ఈ సంగతి వదిలేస్తే..


ఎంత ఫాస్ట్ మాట్లాడుతున్నమనే ధ్యాసలో...మాటలు తడబడుతూ..u know..u know అని ఇంగ్లీష్ add చేస్తూ...అసలు విషయం మరిచి పోతారు.. సరే ఇదే ప్రస్తుత స్టైల్ అఫ్ ఆకరింగ్  అనుకొని  వదిలేద్దాం..
మంచి పాటలు ప్లే చేస్తునపుడు కొంచం పాట గురించో..లేక situation గురించో, పాజిటివ్ గా చెప్పొచ్చు కదా.. అంతా తెలివి ఉందా..అని.
ఆగడి ఆగండి విషయం చెప్పకుండా తిడుతున్నా అనుకుంటున్నారా..
చెపుతున్నా..
"చక్కనైన ఓ చిరుగాలి..ఒక్క మాట వినిపోవాలి.. ఉషా దూరమైన నేను ..ఉపిరైన తీయలేను." పాట వేసాడు.. ఆహా .. అనుకుంటుండగా.. పాట ఆపి  మొదలెట్టాడు.." బాబు.. ఇది ముందే హైదరాబాదు..pollution  పెరిగిపోయింది.. నీవు  ఏదైనా పల్లెటూరు  వెళ్లి పాడుకోమ్మా.. ఈ pollution పెరిగిపోయి మాకే  ఉపిరి తీయటం కష్టం అవుతోంది....అంటూ ఏదో వాగాడు..
వేసిన పాట ఏంటి ? దాని situation   ఏంటి..నీ program  ఏంటి.?  నీ మాటలేంటి? టైం ఎంత అయింది ?
ఎమన్నా అర్థం ఉందా ??
అంతా చక్కని పాట మొదలెట్టి...ఆపేసి..pollution  ఉంది పల్లెటూరు  వెళ్లి  పాడుకో పో అంటాడా??
జనాలని entertain   చెయ్యటం అంటే వెటకారం కాదురా బాబు..ఫీల్ తెప్పించటం..నిదానంగా..స్పష్టంగా మాట్లాడుతూ, చెప్పే విషయాలని చాకచక్యంగా మెలికలు వేస్తూ.. ప్రసేంట్ చేయటం.. అంతే కాని గొప్ప పాటలని వేస్తూ.. సంబంధం లేకుండా మాట్లాడుతూ 'పాట' ని  insult చేస్తూ వెటకారంగా మాట్లాడటం కాదు నాయనా.. కొంచం ఆలోచించుకొని ఆంకరింగ్  చెయ్యండి.అభిమానులు ఉన్నారు కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడుతే..దూరమైపోతారు,  తరవాత  మీ ఇష్టం.

May 14, 2011

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు



మధ్యాన్నం  కదా..ఖాళీ గానే  ఉంది  సిటీ బస్సు .. ఓ సీట్ చూసుకొని కుర్చున్నా .. నా పక్క సీట్ లో ఎవరు లేదు..వెనక ఓ చదువుకున్న ఉద్యోగి. ఇంకో వైపు..అప్పుడే  జాబ్ ఎక్కినట్టు కన్పిస్తున్న సాఫ్ట్వేర్ అబ్బాయి..మంచి దుస్తులతో  నిగానిగాలడుతున్నాడు..మేడలో ID వార్డు వేలాడుతోంది.. ప్రేమ కూడ మొదలయినట్టు ఉంది, తనలో తానే చిన్నగా నవ్వుకుంటున్నాడు..ప్రియురాలు  గుర్తుకొచ్చేమో ...
ఇంతలో ఒక స్టాప్ లో  ఇద్దరు పదకొండో తరగతి కుర్రాళ్ళుఎక్కారు.
ఒకడేమో.. సన్నాగా  ఉన్నాడు... కాంతారావు ప్యాంటు..ముందు వైపు వంకీ తిరిగిన బూట్ల  లాంటి చెప్పులు...దాని మీద ఎరుపు నలుపు..చారాల T షర్టు.. ఇంకోడు దాదాపు ఇదే వేషం కానీ మనిషి  కొంచం దిట్టంగా ఉండటం తో బానే కనబడుతున్నాడు.. ఇద్దరూ  మధ్యతరగతి అని వేరే చెప్పనక్కరలేదు..
ఎక్కీ ఎక్కడం తోటే.. పాస్ అని కండక్టర్  కి  చెబుతూ  ..హడావిడిగా నా సీట్ లో కూలబడ్డారు...
అప్పటికే ఏదో విషయం సీరియస్ గా మాట్లడు కుంటున్నట్టు ఉన్నారు..దాన్నే కంటిన్యూ చేస్తున్నారు..సన్నగా ఉన్నవాడు  ఎక్కువ మాట్లడేవాడిలా ఉన్నాడు..చెప్పుకు పోతున్నాడు..
" ఆడ మంచోడు రా..ఎందుకంటే..అన్నం బెట్టిండ్ర వాడు ..ఇంటికి  దీస్క పోయి . .. ఆన్కి  ఎంత dare దెల్సారా... తాగి ఇంటికి భి వోతాడ్  ఆడు.. ఆళ్ళ  అయ్యా అమ్మా ఏమనర్ ఆన్ని..ఎందుకో ఆన్ని జూస్తే భయంరా బై ఆల్లకి..  మొన్న ఏమైంది దేల్సారా... ఆడు  రాజ్  గొట్టిండ్రా ..రాజ్గాడ్  తెల్సుకదా ..మా కాలేజే...మా పక్క గల్లి లా ఉంటడ్ జూడరా...నీవ్ మస్తు సార్లు జుసినావ్.. ఆన్ని. .  పొడుగ్గా ఉంటడ్ జూడు ...రాజ్ గాడు  సత్తి గాని  గాల్ ఫ్రెండ్ ని సతాయిస్తు డoట,  రాజ్ గాన్ని ఎమన్నా గొట్టిండా..


ఇంకోడు అడిగాడు..  అనుమానం వచ్చి.. " ఆ పిల్ల  సత్తి గాన్ని లవ్ జేస్తుందా ??
ఏమో రా గాల్ ఫ్రెండ్.. గాల్ ఫ్రెండ్ అంటడు.. ఆ _______గాన్కి జెప్పిండ్రు ఆన్ దోస్తులు.  ఆ పిల్ల జోలికి వోకురా భై , వొద్దురా బై అని , ఇన్లె....ఆడ్ లైట్ దీస్కుండు.. సత్తి గాంకి దేల్సింది.. అందుకే గొట్టిండు..నేవ్వేమన్న అన్రా  ఆని   dare కి  మెచ్చుకోవాల్ రా.. నిజంగా.. ఆడ్ దోస్తానాల పానం ఇస్తడ్రా.. ఎందుకంటే..నన్ను ఇంటికి దీస్కపోయ్  అన్నం బెట్టిన్డ్రా.....
సత్తి గాన్ని జుష్ణావ్ లే,,నీవ్..
ఏమో..
కల్పిస్త .. ఓ సారి ..
ఇక వీడి వంతు వచ్చింది...
మొన్న మిస్ కాల్ ఇస్తే మల్ల జేయలేదేంది భే..
బాలన్సు లేకుండే.. మా  ఆయ్య ఈ సారి పాకెట్ మనీదక్కువ ఇచ్చిండ్రా ..
___ ల బాలెన్సు... నీ అమ్మా.. ఎంద్రా...mr perfect పోదామని .. మిస్ కాల్ జేస్తే మల్ల జేయ్యవారా , బడ్కావ్.. నీ కోసం ఎన్ని సార్లు ట్రై జేస్ష రా..
ఆ యాల్ల మా మామ వాళ్ళింట్ల ఉండే.. అది గాక ..బాలన్సు లేకుండే..
ఎట్లుంది..సిన్మా.
 మాటకు ముందు వెనక ఏదో ఒక బూతు చేర్చకుండా మాట్లాడటం లేదు.


నేనేమో వీళ్ళ గురించే ఆలోచిస్తున్నా... ఆ retired ఉద్యోగి...ప్రావిడెంట్ ఫండ్ సగం ఎలా  ఖర్చు అయిందా అని ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు..పట్టించు కోవటం లేదు.. MR సాఫ్ట్ వేర్  ..తన ధ్యాసలో తాను ఉన్నాడు..


 ప్రభాస్ గాడు వేస్ట్ గాడ్ అయిన్డ్రా .. ఆన్కి  బాడి కి ఎసువంటి సినిమాల్ దీయాలే..
నీ అమ్మా.. ______ లాగుంది సినిమా...
రెండు పాటల బావున్నయంకో....నాకైతే నచ్చలేద్ర బై..
 అర్రేయి...నేన్ దిగుత...
సరే.. అర్రేయి..ఫోన్ చై  రా...
బాయ్ రా..
బస్సు మలుపుతిరుగుతూ ఉండగానే ..ఆ  కుర్రాడు చెంగున దూకి జనాల్లో కలిసి పోయాడు..
ఒంటరిగా మిగిలిన వాడు..ఫోన్ తీసి ఏదో ఆట ఆడటం మొదలెట్టాడు.. :)






May 1, 2011

స్వేఛ్చ లేని బ్రతుకులు.


అప్పట్లో నేను మా CLASSMATE ఒక రూం లో ఉండేవాళ్ళం.
మనవాడి ప్రతిభకి ఒక అమ్మాయి పరిచయం అయ్యి..సినిమాలు షికార్లు అయ్యాయి. రూం కి సీనియర్ ని నేనే కనక  ఒకరోజు అడిగాడు  " మా ఫ్రెండ్ రూం చూస్తా అంటోంది అని. విషయం అర్థం అయింది.
అలా ఓ రెండు మూడు నెలల్లో ..ఎప్పుడు కంట బడిందో విషయం OWNER కి తెలిసింది. నన్ని పిలిచి కూర్చో బెట్టి అడిగాడు..
" ఎవరు ఏమిటి అని ?
మా ఫ్రెండ్ కి ఫ్రెండ్..ఏదో కలవటానికి వస్తోంది.
ఎందుకు ?
నాకేం తెలుసు..ఏదో మాట్లాడుకోటానికి అనుకుంటా ..
ఓకే , అయితే మా ఫ్రంట్ రూంలో  కూర్చొని మాట్లడుకోమని చెప్పు..
ఇలా చేయటం బావుండదు..చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ?
వాళ్ళకి కావలసింది ఫ్రంట్ రూం కాదడీ బెడ్ రూం ఇస్తార ?? అని అడుగుదాం అనుకున్నా..
అనలేక  సరే అన్నాను.
ఎంతసేపు అవతలి వాడు ఎం చేస్తున్నాడు అని తప్ప... తు.
29 ఏళ్ళ వయసు...phD చదువుతూ...కూడా స్వేఛ్చ లేని బ్రతుకులు.

Apr 3, 2011

ఒక్కరోజు కూడ గడవక ముందే...

ఇందాక ATM కి వెళ్ళాను..ఎమన్నా ఉంటే ఉడ్చేద్దామని. కాని బ్యాంకు ముందు ఓ పదిమంది గుంపు కట్టారు. అర్రే డబ్బుల్లేవా ఏంటో అనుకుంటుండగా...ఎవడో ఒకడు సెక్యూరిటీ మీద అరుస్తున్నాడు. ఇంతలో ఒకాయన నేరుగా లోపలి వెళ్లి డబ్బులేక్కపెట్టుకుంటూ వచ్చాడు. నేను వరుసలో డోర్ దగ్గరకెళ్ళి నించున్న. అయితే ఆ గుంపులో నుండి ఒకాయన వచ్చి అ సెక్యూరిటీ ని బండ బూతులు తిడుతూ మీద మీదకీ వస్తున్నాడు. ఇంతకీ ఆ సెక్యూరిటీ చేసింది ఏంటంటే ఇతన్ని అపాడట..మీరు లేట్ గా వచ్చారు మీ ముందు వచ్చిన అతను తీసుకున్నాక మీరు అని. దానికి ఇతగాడికి కోపం నషాళానికి అంటింది. సెక్యూరిటీ మీద విరుచుకు పడిపోయాడు. తన తాలూకు గుంపు వచ్చేసింది. ఆ గుంపులో నుండి ఓ నిరక్ష్యరాస్యుడు చెపం వాయించనే వాయిన్చాడా సెక్యూరిటీ ని. అర్రే అని అందరూ ఆపారు..మళ్ళీ కొట్టాలని ప్రయత్నం. ఆగవయ్య.. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టటం అని ఓ పెద్దాయన అన్నా వినడే, ..పోనీ లెండి అని ఓ చదువుకున్నావిడ అన్నా బూతులు ఆపడే.. లేడీస్ వస్తుంటే ఎక్కువ చేస్తున్నాడు బూతులు. నేను లక్షలు పెడతాను బాంకులో..ఏమనుకుంటున్నావో అంటూ.. నాకైతే డబ్బుల్లేని frustration కనపడింది. మాట తీరు పెద్దగా చదువుకున్నట్టు లేదు. పోనీ ఏ రియల్ ఎస్తాటే వ్యాపారి అంటే.. టాటా సఫారీ కూడ లేదాయే. పోనీ ఒక చిన్న కారు ?? అదీ లేదు..బైక్ కూడ ఉన్నట్టు కనపడలేదు.మరి లక్షలు ఎక్కడనుంచి పెడతాడు. ఆ పెట్టె వాడే అయితే సెక్యూరిటీ తో గొడవ పదే టైం ఉంటుందా అని.?? పాపం సెక్యూరిటీ అతని కళ్ళల్లో నీలు తిరిగాయి. అతను చేసిందల్లా తన డ్యూటీ. నిజంగా ఆ సెక్యూరిటీ తప్పు చేసే ఉంటే అతనికి నేర్పిద్దాం..పాపం పుట్టిన పాపానికి ..చదువు కోని పాపానికి ఈ ఉద్యోగం చేస్తుంటే..అతని కొడితే ఏం వస్తుంది ? మనకంటే పెద్దవాళ్ళని/ గొప్పవాళ్ళని ఎలా గౌరవిస్తున్నాం అనేది కాదు ముఖ్యం మనకంటే తక్కువ వాళ్ళను ఎలా treat చేస్తున్నాం అనేది ముఖ్యం. నిన్నయితే మాచ్ చూసి ఓహో భారతీయులం అనుకుని.. ఒక్కరోజు కూడ గడవక ముందే మనం ఏంటో మనం మరిచి పోతున్నాం.. పక్క వాడి బలహీనత మీద చెయ్యి చేసుకుంటున్నాం. నిన్న నేను ఇండియాని గెలిపించమని ప్రార్థన చేయలేదు. కాని ఈ రోజు ఈనా భారతీయులని బాగు చెయ్యి అని ప్రార్థిస్తున్నాను.

Mar 24, 2011

యువత

 ఆలోచనలేని  ఆవేశం..ఉప్పొంగే ఉడుకు రక్తం.. ఎగసి పడే ఉత్సాహం..
కాని దాన్ని ఏం చేసుకోవాలో  తెలిదు ..
స్నేహం..హాయ్ లు ,,బై లు.. సినిమాలు..షికార్లు..మాటలు..ముచ్చట్లు..కోపాలు, తాపాలు..  ప్రేమలు..అలకలు..కులుకులు..కిస్సులు..హగ్గులు...
చదువు తక్కువ...టైం పాస్ ఎక్కువ..
బుక్కులు ముట్టరు ..పేస్ బుక్కు  మాత్రం  వదలరు.
అన్ని అందుబాటులోనే.. కాని ఏ ఒక్కటీ అందుకోరు.
చదువుకి తొందర లేదు..ప్రేమకి మాత్రం ముందరి కొస్తారు.
అన్ని ఎదురుగా ఉన్నా..ఏదో పెద్ద టెన్షన్..
నైల్ తో పోయేదానికి ..నైఫ్ దాకా తెస్తారు..
గుండెలకి గాలికి బదుకు పొగ కావలి..
పాలు తాగే వయసులో బీరు కావలి.. 
పట్టుమని పది మార్కులు రాకున్నా  పొగరు మాత్రం పుట్టెడు.
ఎం చేయాలో  తెలిదు కాని ఏదైనా చేసేయగలమని బ్రమ
ఇదంతా  ఉండొద్దని కాదు.. ఇదే ఉంటె బ్రతుకు బొగ్గే..


Feb 12, 2011

ఏ మేరా ఇండియా ..

ప్రేమికుల రోజు.. భారతీయ సంప్రదాయం కాకపోయినాప్రపంచ వాప్తంగా గుర్తింపబడిన దినం.
ఇది భారతీయ సంప్రదాయం కాదంటూ ప్రేమికులనికొట్టడమో.. లేక పెళ్ళిళ్ళు చేయటమో లేక రాఖీలు .. కట్టించడమో.. గుంజీలు తీయించడమో..



ఎటు పోతున్నాం మనం..ప్రజాస్వామ్య  దేశం
అంటూ .. 18 ఏళ్ళు  నిండిన వాళ్ళని ఓటర్లుగా గుర్తిస్తూ ఓటు హక్కు ఇచ్చాం.. ఇంకా దాంతో పాటే  అనేక హక్కులు ఇచ్చాం...పెళ్లి చేసుకోడం లాంటివి.

 ఏం ?  ఫిబ్రవరి   14 రోజు ప్రేమికులు కలుసుకూడదా ... మాట్లడుకో కూడదా .. ప్రేమించుకోకూడదా??
రోజు రోజుకి  ప్రాణానికి బద్రత లేకుండ పోతోంది
ఒక వైపు అ టెర్రరిస్ట్ లు  ఎక్కడ బాంబు తో పెల్చేస్తాడో అని భయం. ఉన్న నాలుగు నాళ్ళు హయిగా బ్రతికేద్దాం అంటే ఈ అతివాదుల భయం.
సంకృతిని   తామేదో కాపాడుతున్నట్టు..?
అంత  సంకృతీ   ప్రియులైతే విప్పేయండి పాంట్లు.. కట్టండి పంచెలు.. తలకి కుంకుడు కాయ రసం..మట్టి ఇల్లు..పేడతో అలకటం.. ముగ్గులు పెట్టటం.. చేయండి.. టీవీ మానేసి తోలుబోమ్మతాట చూడండి. బైక్ .. కారు వదిలేసి గుర్రం..గుర్రపు బండ్లు వాడండి..

"ఎచ్చోట నెమ్మనము భయము శంకలు వీడి.". టాగోర్ గారికి నోబెల్ ప్రైజ్ తప్ప ఇంకేమి మిగల్లేదు
భారతదేశం నా మాతృ భూమి అని గర్వపడే రోజులు పోయాయి.

Jan 9, 2010

ఎంతటి దుస్థితి !!!!


"వంట చేసేందుకు క్షవరానికీ, వండ్రంగానికి, భిక్షానికి  ట్రైనింగు  కావలి. కాని ప్రజలను ఏ వెర్రి ఉహలకయినా  ప్రోత్సహింపగల పత్రికాధిపతి కి మాత్రం ఎ విధమైన ట్రైనింగు అవసరం లేదు. డబ్బు... పత్రిక పెట్టాలనే "వేనిటి"  తప్ప.
 - చలం  "


మన టీవీ చానల్స్ ..మన రేడియో   మన పత్రికలూ.. .మన మీడియా
 YSR మరణాన్ని , తెలుగు సినిమా పాటలు జోడిచి పదే పదే చూపించి.. వందకి పైగా చావులకి కారణం ఐంది..
నిన్న తెలంగాణా ఉద్యమాన్ని అదే రకంగా చూపించి జనాల్లో విద్వంసకర చైతన్యాన్ని పురి కొల్పింది.
నేడు మళ్లీ  ఏదో చెత్త బ్లాగ్ ని ఫోకస్ చేసి..విద్వంసానికి నాంది పలికింది..
రాష్ట్రం లో దేశం లో జరిగే ప్రతి విద్వంసకర దుశ్చర్యకి పూర్తి భాద్యత మీడియా   దే. అది న్యూ చానలే కావొచ్చు.. "అ అంటే అమలాపురం" అని చంటి పిల్లలతో అర్ధనగ్నగా అసభ్యంగా డాన్స్ ప్రోగ్రాములు రూపొందిస్తున్న ఇతర చానెల్స్  కావొచ్చు.. భక్తి పేరుతో మత విశ్వాసాలను తద్వారా మత మౌడ్యాన్ని   పెంపోదిస్తున్న భక్తీ చానెల్స్  కావొచ్చు..
" హాయ్..భారతి "
హాయ్  whats ur name.. what  u do ?
ఐ అం నిహారికా..ఇంటర్ ఫస్ట్ ఇయర్..
ఓకే, కూల్.. bf ఉన్నడా..
లేడు..
ఆయ్యో లేడా ,,ఏం  ఎవ్వరు propose చేయలేదా ?" 
అంటూ పసి పిల్లలకి  ఒక ఉతాం ఉచ్చే  రేడియో  కావొచ్చు..


  నేటి మీడియా
1) కేవలం డబ్బు కోసమే ఆవిర్భావించటం.
2) ఒక ఆశయం ఒక దృక్పథం.. ఒక ఆలోచన లేకపోటం
3) మాస్ మీడియా కి ఉన్న శక్తి ఏంటో తెలియని వాళ్ళు ఆయా మీడియా కి heads గా ఉండటం.
4) కేవలం డబ్బు ఉంది చానెల్ ఓపెన్ చేయటం తప్ప..ఆ విషయం లో ఎలాంటి చదువు సంధ్యలు లేకపోటం.
5) సమాజం పై ,, సమాజ పురోగమనం పై.. తమకి ఉన్న భాద్యత తెలికపోవటం.
6) చెప్పిందే..చూపిన్చిన్దె    పదే పదే 24 గంటలు చూపించి.. జనాల ని భావోద్వేగంలోకి.. ఉన్మదంలోకి నెట్టటం.
7)మళ్లీ తమది భాద్యత కానట్టు.. ఈ ఉన్మాదాన్ని ఇంకో కథనంగా చూపించటం.
ఎంతటి దుస్థితి !!!!


Jan 8, 2010

.జన్మని వృధా చేసుకుంటున్నారు.

ఆంధ్ర ప్రేదేశ్ ని పరిపాలించిన ప్రతి ప్రభుత్వం.. తెలంగాణా సమస్యని ఇంతదాకా రానిచింది..వెనకబడిన ప్రతి ప్రాంతాన్ని.. (అది తెలంగాణా కావొచ్చు..ఆంద్ర కావోచు రాయల సీమ కావొచ్చు..) అబివృద్ది చేసినట్టయితే... అభివృద్ధి అనగానే.,, ఏదో ఆకాశ హర్మలు కాదు.. ఆహరం ఆరోగ్యం..మంచినీరు ...విద్య, ఇలా మనిషి కనిస
అవసరాలు తీర్చగలిగి ఉంటె దేశం ( రాష్టం ) ఈ నాడు ఈ గతికి వొచ్చి ఉండేది కాదు. కాని.. మన నాయకులూ పదవీ వ్యామోహంతో..సుఖ బోగ లాలసులై.. తరతరాలకి తరగని ఆస్తులు కుడబెడుతూ.. మానవ సేవయే మాధవ సేవ అని మరిచి పోయి ప్రజలకి సేవ చేయగలిగే అపూర్వ అవకాశాన్ని వదులుకుంటూ ..జన్మని వృధా చేసుకుంటున్నారు.
మనిషికు ఉండలిసిన బేసిక్ లక్షణాలు కూడా లేని నాయకులే అందరూ . అంతరాత్మలు చచ్చిన మనుషులు వాళ్ళు.
మన ప్రభుత్వాలు  విద్య , ఆరోగ్యాన్ని కార్పోరేట్ పరం చేసి.. సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది.
జనాభా పెరుగుదల ని పట్టిచుకునే నాథుడే లేడు.
దేశం capital of diabetics and aids గా మారుతుంటే అడిగే దిక్కు అంతకన్నా లేదు.
మత చందాసం ప్రభలుతోంటే .. terrorist లు దేశం లోకి చొరబడి జనాల్ని పిట్టల్ని కాల్చి నట్టు కాల్చుతుంటే.. సంసృతి పరిరక్షణ పేరుతో వ్యక్తి స్వేచని భంగపరుస్తోంటే.. ఎన్ని అని చెప్పేది...
భారత దేశము కర్మ భూమి...
.........నా కర్మ భూమి....
ఇదా నా భారత దేశం.???
(స్వయం పరివర్తన చెందని వాడు విశ్వాన్ని మార్చలేడు.)

Dec 20, 2009

నేను సైతం

మన ప్రియతమ నాయకులు.. ఒకరిని మించి ఒకరు నిరాహార దీక్షలు చేస్తుంటే నాకు చాల ఆనందంగా ఉంది..దీక్షలు ఇలాగే కొనసాగించి.. సమైక్య ఆంధ్రా  కోసం ప్రాణాలు లెక్క చేయని వారి పట్టుదల ముచ్చటగా ఉంది.. నేను సైతం " సమైక్య ఆంధ్రా"   కోసం  (స్వ ఆస్తుల  రక్షణ కోసం ???  ) అంటూ నాకు  తెలిసిన .. తెలియని నాయకులు ముందుకొస్తున్నారు.(ఇలాంటి పట్టుదలే  జనాలకి సేవ చేయటం లోను.. వెనకబడిన వర్గాలను అభివృద్ధి చేయటం లోను ఉండింటే  ఇంకెంత బాగుందో అని కూడా అనుకుంటున్నా). ఇంకా కొంత మంది ఎటు తేల్చుకోలేక పోతున్నారు...ఎటు వైపు ఉంటె లాభం చేకురుతుందో అని..
ఇక మన ప్రియతమ నాయకురాలు.. సోనియా గాంధీ  గారు.. ఆహా కాంగ్రెస్ నాయకులు  అలనాటి  స్వాతంత్రోద్యమం ని తలపిస్తున్నారే అనుకుంటూ.. ప్రస్తుత కర్తవాన్ని మరిచి పోయింది.. ఆమెకి భారత దేశము, స్వతంత్రపోరాటం ... భారత దేశము   నా మాతృభూమి .. అని ప్రతిజ్ఞ తెలియకపోయినా ... తన పెనిమిటి అడుగు జాడల్లో నడుస్తూ ,, మెట్టినింటి వంశ పారంపర్య పరిరక్షణలో  మాత్రం నూటికి నూరు మార్కులు కొట్టేసింది....ఇంకా ఉందండోయే

Dec 17, 2009

. ఏ గుండైతే ఎంటంట ..

Easily Upload Your Images To Myspace
Free Music

మొత్తానికి ఒక ఉద్యమం ముగిసింది అనుకుంటునదాగానే మరొక యుద్ధం మొదలైంది ,, ఆంద్ర ప్రదేశ్ లో. తెలంగాణా ,రాయలసీమ ఆంధ్ర లలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు , మన MP, MLA ల అ రాజీనామాలు చూస్తుంటే వీళ్ళకి అసలు "విషయం" మీద అవగాహన లేకుండానే నిర్ణయాలు తెసుకున్నరేమో అని అనిపిస్తుంది. మొన్నటి దాక అధిష్టానం శిరోధార్యం అన్నారు. ఈ రోజు చిదంబరం ఎవరు? సోనియా ఎవరు ? నిర్ణయం తీసుకోటానికి అని అంటున్నారు..
మరి మొన్నే స్పష్టంగా చెప్పాల్సింది.. తెలంగాణా ఇచ్చిన పక్షం లో మేము రాజీనామా చేస్తాం అని.. ఎవడబ్బ సొమ్మని ఇష్టం వొచ్చినపుడు రాజేనామ చేయటానికి..


ఒక్కొక్కరి ముఖం చూస్తుంటే..కనిసం మాట్లాడటానికి రాని ఇలాంటి వాళ్ళు ఎన్నికల్లో ఎలా గెలిచారా అని సందేహం వేస్తోంది నాకు.. వీల మొహాలు చూసి, వోటేసిన్నట్టు ఫీల్ అయిపోతున్నారు..అదంతా కాంగ్రెస్ మహిమ అని తెలుసుకోలేక పోతున్నారు..ఎవడు పార్టి టిక్కెట్టు ఇస్తే వాడి వెంట పరిగెత్తే వీళ్ళు.. ఎవడు పదివి ఇస్తా నంటే వాడి పంచన చేరే వీళ్ళు .. ఎవడు డబ్బు పారేస్తే వాడి పార్టి లో చేరే వీళ్ళు .. ఉంటె ఏంటి పోతే ఏంటి.??
వీళ్ళు కాక పోతే వేరే ఓల్లు .. ఏ గుండైతే ఎంటంట ..


మేము కలిసి ఉండము మొర్రో అని ఒక దంపతులు అంటే,, కలిసే ఉండాలి అని నిర్ణయించి నట్టు ఉంది ఈ తంతు చూస్తుంటే..
విడిపోతే నష్టమే .అది వాస్తవమే.. కాని.. విడిపోవాలి అనేంత దాక తెసుకోచ్చారు విషయాన్ని.
సమక్య ఆంధ్ర అనేది ఇక కల్ల..వదిలేసి.. తమ తమ రాష్ట్రాలని ఏవిధంగా అభివృద్ధి పరచాలో ఆలోచించుకోండి. ఒకవేళ కలిసి ఉన్న ఒరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. అలా అని తెలంగాణా విడిపోయి ఊ పెద్ద అభివృద్ధి సాధిస్తుంది అనుకోటం కూడా భ్రమ. కేవలం ఒక మానసిక స్వాంతన.  వాడు కాకా పోతే వీడు అన్న చందంగా ..... ఇంకొంత మంది స్వార్థాలకి బలి.