Showing posts with label స్త్రీ. Show all posts
Showing posts with label స్త్రీ. Show all posts

Nov 9, 2011

ఇక్కడ ఈ దేశంలో ...


యే దునియా . ఎక్ దుల్హన్...యే దునియా ఎక్ దుల్హన్. దుల్హన్ మాతే కి బిందియా.. యే మేరా ఇండియా...యే మేరా ఇండియా.. పాడుకోవటానికి బావుంటుంది. కాని .... 

భారత దేశం.. నూటా ఇరవై కోట్లమంది ...అందులో కనీసం సగం మంది యువత ఉంటారనుకుంటే... పద్నాలుగు నుంచి యవ్వనపు రక్తం కొత్తదారుల్లో ఉరకలేస్తుంటే, లైంగిక వాంచని తొక్కి పెట్టిన మన సంస్కృతి సంప్రదాయాలు ఒక పక్క, ఇంటర్నెట్ లో పచ్చి శృంగారం మరోపక్క, వయాగ్రాలకంటే ఎక్కువ కిక్కు ఇచ్చే సినిమాలు, హిరోయిన్లు మరోవైపు, ఎందుకో తెలీక,చెప్పెనాథుడు లేక, చెప్పుకోలేక, అడగలేక, ఆగలేక, ఆపుకోలేక  ఆ యువత ఏం చేస్తుంది ? అడపా,  దడపా హద్దు దాటుతుంది.


ఆడ అయినా మగయినా ఈ దేశంలో, శృంగారం కావాలంటే, పెళ్లి చేసుకోవాల్సిందే.పెళ్లి అయ్యాక, కొంతకాలం గడిచాక కాని తెలిదు అసలు విషయం. అప్పుడు విడివడలేక , కలిసి ఉండలేక నరకం. ఆ నరకం లోంచి కోపం, క్రోధం.. దాంతో ఏదో మిషతో ఒకరినొకరు శారీరక, మానసిక హింస పెట్టుకోవటం.ఇది ఇంకోరకం  బాధ.
అయితే దరిద్రం, లేదా అత్యాశ వల్ల ... కష్టపడకుండా మామగారు ముద్దుగా ఇచ్చే , పెళ్ళాం తెరగా తెచ్చేకట్నం. కట్నం డబ్బులు కరిగి పోగానే ..పెళ్ళాం మీద మోజు తీరుతుంది. 'కుక్కని కొట్టినా  డబ్బులొస్తాయి' అన్న విషయం గుర్తొచ్చి పెళ్ళాన్ని  కొడతాడు. 

ఇలా ఏ సందర్బంలో అయినా బాధ పడేదీ, నష్టపోయేదీ ...  సున్నిత మనస్సు కలిగి, ఎక్కువ emotional అయిన స్త్రీ యే.

బాగా ఆలోచిస్తే.. ఇక్కడ ఈ దేశంలో ప్రభుత్వానికి ప్రజల మీద కంట్రోల్ లేదు..గౌరవం లేదు. పట్టింపు లేదు. ఇష్టం లేదు...బాధ్యత లేదు. దేశ భవిష్యత్తు మీద అవగాహన లేదు. అలాగే ప్రజకీ కుడా ప్రబుత్వం మీద ఏదీ లేదు. వెరసి ఇదీ మనదేశం. ఇదీ మన ప్రగతి. ఇదీ మన భవిష్యత్తు.
 యదా రాజా... తథా ప్రజా . 

Mar 8, 2011

స్త్రీ అనుకోవాలే గాని,,,

Woman Power Logo Clip Art

స్త్రీ నవ్వలే  గాని.. ముత్యాలని  వరసకట్టి మెరిపించగలదు.
స్త్రీ పాడాలే  గాని...కోయిల మూగ  బోయేలా  పాడగలదు.
స్త్రీ అడాలే గాని..నెమలి నివ్వెర పోయేలా ఆడగలదు.
స్త్రీ సంతోషించాలే  గాని.. మేఘంలా  పరవశించి వర్షించగలదు.
స్త్రీ కరుణించలే గాని...మహాసముద్రాని గుండె లోతుల్లోంచి పొంగించ గలదు.
స్త్రీ ప్రేమించాలే గాని.. .రక్తాన్ని క్షీరంగా మార్చి అందించగలదు. (నుదుటన తిలకం లా దిద్దుకోగలదు)
స్త్రీ లాలించాలే గాని... దేవుణ్ణి  సైతం నిద్రపుచ్చ గలదు.
స్త్రీ అనుకోవాలే  గాని...మూతి తిప్పినంతలో మగాడిని ఓడించగలదు.
స్త్రీ కోరుకోవాలే కాని... ఆకాశాన్ని  చీరలా  చుట్టుకోగలదు.
స్త్రీ తలచుకోవాలే గాని..చుక్కలని దారంతో దండ కట్టి తలలో తురుముకోగలదు.
స్త్రీ పునుకోవాలే గాని.. ప్రపంచాన్ని కాళ్ల పట్టీలుగా మార్చుకోగలదు.
స్త్రీ  ఆపాలే గాని ...భూగోళాన్ని( మగాడి గుండెని )  ఒక్క చిరునవ్వు తో ఆపగలదు.
స్త్రీ ఆడించాలే  గాని.. లోకాన్ని బంతిల మార్చి ఫుట్ బాల్   ఆడగలదు.
స్త్రీ అనుకోవాలే గాని ఏదయినా చేయగలదు.

Mar 3, 2011

అమ్మాయిలూ మీరు గ్రేటో గ్రేట్..

 
ఆడది / అమ్మాయి  బయటికి అడుగు పెట్టింది మొదలు....

ఒకడు చురుక్కున చూస్తాడు.. ఒకడు కళ్ళలోకి సూటిగా  చూస్తాడు. ఇంకోడు ఇంకెక్కడో చూస్తాడు.. మరొకడు కిందనుంచి పైకి ఎగాదిగా చూస్తాడు.. ఒకడు చూసి చూడనట్టు చూస్తాడు. ఒకడు ఒకటికి నాలుగు సార్లు చూస్తాడు..ఒకడు regular time intervals లో చూస్తాడు.
ఒకడు పల్లికిలిస్తాడు.. ఒకడు చిరునవ్వు నవ్వుతాడు.. ఒకడు నవ్వి నవ్వనట్టు నవ్వుతాడు..ఇంకోడు కళ్ళతోనే నవ్వుతాడు..ఒకడు సిగ్గుపడుతూ నవ్వుతాడు..ఇంకోడు నవ్వి సిగ్గు పడతాడు.


ఒకడు రెండడుగులు దగ్గరికి వేస్తాడు.. ఇంకోడు ఎదురుగా నిలబడతాడు.. ఒకడు పక్కకోచ్చేస్తాడు.. ఒకడు గుంపులో నుండి బయటికొస్తాడు..ఇంకోడు గుంపులో దొంగ చాటుగా  తొంగి చూస్తాడు..ఒకడు gentle man ల పోజు  కొడతాడు...ఇంకోడు యమా rough గా రాసుకేల్తాడు...ఒకడు మీదకోస్తాడు .. ఒకడు దూరంగా జరుగుతాడు..ఒకడు మాట పెంచుతాడు..ఒకడు గొంతు తగ్గిస్తాడు.. 
ఎన్ని వేషాలో
..
మనసులో  "ఏదో ఆశ " పెట్టుకుని .. పరిచయం ఉన్నవాళ్ళు.., ..స్నేహితులు.. బంధువులు.. దగ్గరివాళ్ళు.. తెలిసిన వాళ్ళు..తెలియని వాళ్ళు.. వయసు..వరస కుడా పెద్దగా పట్టించుకోకుండా.. 
కలుపుగోలు మాటలు...గుడ్ మోర్నింగులు..జోకులు..అర్థం లేని మాటలు.. అనవసర  SMS లు..
అర్థింపులు..అబ్యర్థనలు..పొగడ్తలు..ప్రార్థనలు...అలకలు..ఉలుకులు..నటనలు..నర్తనలు...encouraging లు ..అడక్కున్నా సహాయాలు...వద్దన్నా ..బహుమతులు..care takingలు, ప్రతిదానికి best wishes లు, అడ్వాన్సు హ్యాపీ పండగలు...

మగాళ్ళ attitude ఎలా ఉంటుందంటే...
పెళ్లి కాలేదా..... మంచిది 
అయ్యిందా ......no problem .
ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా... పర్లేదు
 బాయ్ ఫ్రెండ్ లేడా ....వావ్  మరింకేంటి...
పిల్లలు ఉన్నారా.... అవునా..కాని  మీరలా అలా అస్సలు కనబడటం లేదు. :)

అబ్బబ్బబ్బా .. ఇవన్ని భరిస్తూ పని చేసుకొని ఇంటికోస్తున్నారంటే  ..అమ్మాయిలూ  మీరు  గ్రేటో  గ్రేట్..

Mar 22, 2010

అసలైన అబలత్వం

మొన్నెపుడో  ప్రపంచ మహిళా దినోత్సవం  జరిగింది. మహిళలందరూ ఒక చోట చేరి " మహిళ గొప్పతనం, కుటుంబానికి, సమాజానికి మహిళ ఎలా సేవ చేస్తుందో, తామెంత ముక్య పాత్ర పోషిస్తున్నారో తెలియజెప్పారు. సమాజం లో ఎలా దూసుకుపోతున్నారో, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటున్నారో , ఎలాంటి ఆపదలు ఎదురు కావోచ్చో, వాటిని ఎలా face చేయాలో  వివరించారు. మహిళా బిల్లు అదేంటో నాకు తెలియదు కాని దాని గురించి కూడా చర్చించారు.
ఆడది ఆబల  కాదు సబల అని చాల మంది మహిళలు prove చేసారు, చేస్తున్నారు.
కాని నేను గమనించింది ఏంటంటే... ఇల్లు విడిచి ఉద్యోగాలు చేస్తున్నా , విమానలేక్కి గాల్లో చక్కర్లు కొడుతున్నా.. పొలిసు మిలిటరీ దళాల్లో  చేరి దైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నా.. కొన్ని విషయాలలో మాత్రం ఆడది ఆబాల గానే మిగిలిపోయిందేమో అని అనుమానం .
ఉద్యోగం చేసినా, ఊళ్ళేలినా  ఇంటికొచ్చి  కన్నీటి చిట్టా విప్పుతుంది. చున్ని అంచుతోనో.. tissue  paper   తోనో కళ్ళు, ముక్కు తుడుచుకొంతోంది. కారణం ఏదైనా కావొచ్చు. బాస్ తిట్టాడనో,  బాయ్ ఫ్రెండ్ ముఖం చాటేసాడనో, మొగుడు పట్టించుకోటం లేదనో.  
         స్త్రీ తత్వం సున్నితం, తద్వారా బాధ అనివార్యం. ఎంత సున్నితం గా ఉంటె అంతా బాధ. ప్రపంచ తత్వం, మగాడి గుణం తెలిసి కూడా,  సగం ఎదుర్కొని ఇంకో సగంలో ఓడిపోతోంది. ఇంటికొచ్చి ఏడవటం  అసలైన అబలత్వం. ముఖ్యంగా  relationships  విషయంలో మహిళ బాధని అధిగమించలేక పోతోంది.
ప్రపంచాన్ని గెలుస్తున్నాం.. కాని మనని మనం గెలవకలగాలి.. మన attitude ని మార్చుకోగాలగాలి. దాన్ని సాధన చేయాలి. ఇది సాధించిన  రోజున నిజమైన మహిళా దినోత్సవం.