May 3, 2011

యువకవీ మేలుకో



  యువకవీ మేలుకో .. నవకవీ విజ్రుమ్భించు
ఆలోచనలకి పదును పెట్టి..
అనుభవాలని పంచి పెట్టి..
సమాజానికి అద్దం పట్టి..
అంతరంగాల్లోకి తొంగి చూసి..
అత్మీయతని పలకరించి.
అనుభూతులతో మేళవించి
అక్షరాలతో  ఆడుకో....మాటలతో తూటాలు చెయ్యి
కవితలతో కదం తొక్కు...పాటలతో ఏమరుపాటు కల్గించు.
వచనం తో భోజనం వడ్డించు..నవలతో నవలోకం చూపించు..
కథలతో కళ్ళు తెరిపించు ..
సినిమాతో ఆనందం అందివ్వు ..
 
  యువకవీ మేలుకో .. నవకవీ విజ్రుమ్భించు.

No comments: