May 31, 2011

ఓ టపా కొడుతున్నా..


నేను మళ్లీ బస్సు ఎక్కాను,
ఎక్కితే..??
ఎక్కితే.. ఏముంది ఓ టపా కొడుతున్నా మీ మొహాన.. 
ఏంటి మీరు సిటీ బస్ ఎక్కినప్పుడల్లా ఓ టపా రాస్తారా.. ఈ రకంగా,మీరు రోజు బస్సు ఎక్కితే రోజు టపా టపా కొట్టేట్టు ఉన్నారే.. ??
ఏమో టపా టపా టపా కొట్టొచ్చు.. లేదా చేతులు నొప్పి పెట్టి  కొట్టక పోవచ్చు.

ఈసారి ఫుల్ రష్ గా ఉంది బస్సు..
నేను బస్సు కొంచం ఖాళీగా ఉన్నపుడే ఎక్కా కాబట్టి.. సీట్ దొరికింది.
అటు ఇటు చూస్తూ ...అందరి మొహాలు గమనించటం మొదలు పెట్టాను.
అందరూ దీర్ఘాలోచనల్లో పడిపోయారు. ఏం ఆలోచిస్తున్నారో..
జీవితాన్ని గురించా..జీతం గురించా...బాస్ గురించా..భవిష్యత్తు గురించా... బాధల గురించా భయాల గురించా.. తెలియదు.. కాని తీవ్రమైన ఆలోచనలు మాత్రం చేస్తున్నారని వల్ల మొహం బట్టి చెప్పెయవచ్చు. లేదు  వాళ్ళూ నాలాగే ఎదుటి వల్ల గురించే అలోచిస్తున్నరేమో. ఎందుకంటే  ఎక్కి దిగుతున్న ప్రయానికులనీ గమనిస్తున్నారు.  ఒక్క మొహంలో సంతోషం ఏ కోశానా కనబడటం లేదు. ఎందుకొచ్చిన జీవితం రా అన్నట్టే ఉంది. నేట్టలేక నేడుతున్నట్టే ఉంది. ఓ వైపు ఎండా తీవ్రత ..ఉక్కపోత..ఇంకోవైపు జీవితం.
 కండక్టర్  అప్పుడప్పుడు టికెట్ టికెట్ అనటం  బయట వాహనాల రోద తప్ప మా బస్ లో మాత్రం  ' నిశబ్ధం ' .

ఆ  నిశబ్దాన్ని తట్టుకోలేకో ఏమో  ఒక నడి వయసు.. నడి వయసు అంటే  నలబై పైన అని అర్థం.. ఆ నడివయసు ముసల్మాన్ తన ఫోన్ తీసి mp3 ప్లేయర్ ఆన్ చేసాడు..
" మై దునియా బులాదుంగా.. ....తేరీ చాహత్ మే.. ఓ దుశుమన్ జమాన..  ముఝుకో  నా బులాన..మై  ఖుదుకో  మిటా దుంగా.. ..మై దునియా బులాదుంగీ..." అయన జీవితం ఆశీఖీ  పాట దగ్గరే ఆగిపోయినట్టుంది..
అప్పట్లో తన ప్రేయసి తో చూసిన మొదటి సినిమానో..లేక చివరి సినిమానో..
కళ్ళు మూసుకొని  శ్రద్దగా వింటూ..ఏవో ఏవో జ్ఞాపకాల్లోకి జారిపోయాడు.. 

 ఇంతలో ఇద్దరు యువకులు ఎక్కారు ఒక స్టాప్ లో.. Engineering స్టూడెంట్స్ లా ఉన్నారు..
వెలిగిపోతున్నాయి మొహాలు.. నవ్వుతో.. ఏదో చెప్పుకుంటూ పడి పడి నవ్వినట్టు ఉన్నారు
బస్సు ఎక్కగానే అదే కంటిన్యూ చేసారు.
ఆర్ నవీన్ గాడు ...ఏం చేసిండో తెల్సా... హ హ హ హ..
హ హ హ... సగం కుడా చెప్పకుండా నవ్వుతున్నారు..
వాళ్ళకే అర్థం అవుతోంది .. పట్టలేని నవ్వు ...ఆది.
ఇహ బస్సులో అందరి దృష్టీ వాళ్ళ మీదకి  మళ్ళింది..
అందరూ తమ తమ ఆలోచనల్లోంచి బయటికి వచ్చి వీళ్ళని చూస్తున్నారు..

వాళ్ళ  నవ్వు చూసి..తెలీకుండానే అందరి మొహాల్లో చిరునవ్వు విరిసింది.. నా మొహం లో కూడా...

ఇందులో  ఏముందని ?? ఇందులోఎం  పెద్ద  విషయముందని టపా రాసారు ?
జీవితంలో లాగే బస్సు లోను ఏముంటుంది ?  ఏమి ఉండదు.  జీవితం అంటే సినిమాల్లో చూపించినట్టు ఓ ఆనంద కరమైన సన్నివేశం దగ్గర 'శుభం' వేయలేం కదా.. తరవాత సన్నివేశాల  కొనసాగింపు ఉంటుంది మరి.
 ohh అయితే ఈ టపాకి శుభం వేయలేదన్న మాట?? ఇంకా ఏదో మిగిలుందన్న మాట..
అదీ చెప్పేడవండి ,..ఒకేసారి ..
'లేదు'లే మరోసారి చెపుతా..ఇప్పటికే మీరు విసిగి పోయి ఉన్నారు.
అదెప్పుడో ?? 
మళ్ళీ బస్ ఎక్కినప్పుడు .. :) :) 
హే పో...

4 comments:

Praveen Mandangi said...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు

chakri said...

పర్లేదు..కాని టపా బావుంది అని ఒక్కమాట చెప్పి.. మీ advertisement రాసుకోవచ్చుగా...:):)

Anonymous said...

chelam musings chadivara?

chakri said...

musings.. చదువుతూనేఉంటా..:)