May 29, 2011

పచ్చి నిజంఓ అమ్మాయి, .. బానే చదువుకుంది..ఏదో జాబ్ కూడా చేస్తోంది..పెళ్లి వయసు వచ్చేసింది..ఓ పిల్లాడిని చూసారు తల్లిదండ్రులు.. పెద్దగా నచ్చక పోయినా...మిగతా అన్ని ఓకే అయ్యాయి కనక ..తనూ ఓకే అంది.

అతను ఫోన్లు చేయటం మొదలెట్టాడు..మొబైల్ లో మాటలు..నిముషాల్లోంచి గంటల్లోకి మారుతున్నాయి.. కలుద్దామా అని అడిగాడు.  చేసుకోబోయే వాడు డిన్నర్ కి రమ్మంటే ..కాదు అనలేదు కదా..  సరే అంది. ఆఫీస్ నుండి నేరుగా కలవాల్సిన చోటుకి వెళ్ళింది.  ఇద్దరు కలిసి మంచి భోజనం చేసారు..ఇంటికి వెళ్దామా..అన్నాడు. ఇప్పుడొద్దు లేట్ అయ్యింది అంది.. పర్లేదు .నేను డ్రాప్ చేస్తాగా... మొహమాటం తో వెళ్ళింది..ఇంట్లో ఎవరూ లేరు..వాళ్ళ అమ్మ నాన్న ఏదో పెళ్ళికి వెళ్ళారని చెప్పాడు.

ఆ విషయం అక్కడే చెప్పి ఉండాల్సింది కదా..అని మనసులో అనుకుంది. 
ఆమాట ఈ మాట చెపుతూనే.. మెల్లిగా దగ్గరికి వచ్చి గబుక్కున పట్టేసాడు.
no..i don't like it అంది.
అర్రే.. I am  Ur fiance yaar అన్నాడు, కాని వదలలేదు..
వదిలిన్చుకుందాం అన్న ప్రయత్నం  బెడిసింది.

ఎందుకో మనసు అంగీకరించటం లేదు.. ఇంకా అతని గురించి పూర్తిగా తెలియలేదు. ఒకవేళ తెలిసినా అంగీకరించేది కాదేమో.  అంతా పెళ్ళయ్యాకే అని కుడా తానూ అనుకోవటం లేదు..కాని  ఎందుకో నచ్చలేదు.
కోపం వస్తోంది..పట్టుకున్నవాడు...ఊరుకుంటాడా..ఎక్కడెక్కడో తడుముతున్నాడు. మనసుకీ..శరీరానికి కుడా అది నచ్చటం లేదు.
అతని పట్టులో ప్రేమ కంటే.. కామం కనపడుతోంది..పశుత్వం  తెలుస్తోంది.

ఆడది అపురూపంగా..ప్రేమగా అందివ్వ వలసినది..బలవంతంగా లాక్కుంటున్నాడు.
వీడినా నేను కట్టుకోబోయేది...అనే ఆలోచన వచ్చేసింది..దాంతో కోపం కట్టలు తెగింది..
u ..   IDIOT ...leave me..అని ..ఎంత బిగ్గరగా అరిచిందంటే.. 
అ అరుపుకి వదిలాడు..భయపడ్డాడో.. సిగ్గు పడ్డాడో ..ఏదో తప్పు చేసినట్టు నటించాడో...తెలిదు, I am సారీ అని మాత్రం అన్నాడు.. 

వినిపించుకోకుండా.. బాగ్ తీసుకొని  వచ్చేసింది..

గంటకోసారి   తన ఫోన్ మోగుతోంది.. కానీ  ఫోన్ లిఫ్ట్ చేయలేదు..
ఆరోజు ముహూర్తాలు పెట్టుకుందాం అని ఇంట్లో మాట్లడుకొంతుంటే,
I don't like this alliance అంది..
hey are u mad.. అన్ని కలిసాక....మొన్న ఓకే అన్నావ్ కదా. వాళ్ళ నాన్న అరిచినట్టు అన్నాడు..
yes,  but now I don't like...
hey what are u saying..u have gone mad..
I don't like it.. అంతే..చెప్పి విసురుగా వెళ్ళిపోయింది లోపలికి..
ఏం చెపుతుంది..rape attempt చేసాడని చెపుతుందా .. కాబోయే అల్లుడు ?

లోపలి వచ్చాడు వాళ్ళ నాన్న..
నీవేం  అన్నా..ఈ పెళ్లి జరగటం ఖాయం..మళ్లీ పిల్లాణ్ణి వెతికే ఓపిక లేదు నాకు.
ఆ చిన్న దానికి ఎన్నో   మంచి సంభందాలు వస్తుంటే వదిలేస్తున్నాం..............నీ వల్ల.

ఈ మాట గుండెల్లో కత్తి లాగా దిగింది.. బాధ ఎగజిమ్మింది..
" ఆడదానికి అందమే ప్రధానం...ఎంత పచ్చి నిజం.? కొంచం చామన ఛాయా గా ఉండటమే తను చేసుకున్న పాపమా..?? తన రూపం తను కోరుకున్నదా..?? ఎంచుకున్నదా ??
రాత్రింబవళ్ళు చదివి pg లో సాధించిన  gold medal కి విలువ లేదు.. నెలకి సంపాదించే పదిహేను వేలకీ విలువ లేదు..వ్యక్తిత్వానికి .. తెలివికీ ..ఆలోచనలకీ ...ఆశయాలకీ.. దేనికీ విలువలేదు, కేవలం తన ఒంటి రంగు ..నిగారింపు..శరీర సౌష్టవం ..దీనికే విలువ సమాజం లో.. సమాజం సంగతి వదిలేస్తే, ...నాన్న కూడ అదే మాట అంతోంటే ...దానికి అమ్మ నోరెత్తకుండా చూస్తుంటే.. ఎందుకో తనవాళ్ళే  తన  గుండె కోసినట్టనిపించింది.
ఎంత సేపూ ఏడ్చిందో తెలిదు.. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలిదు.. కాని ఆ ఏడుపు లోంచి ఒక గట్టి నిర్ణయం మాత్రం తీసుకుంది.
తను కొన్నాళ్ళు ప్రశాంతంగా బతకాలని..independent గా ఉండాలని..తన నిర్ణయాలు తనే తీసుకోవాలని..జీవితాన్ని చవి  చూడాలని.. ఎక్కడికైనా  వెళ్లి పోవాలని నిర్ణయించుకుంది..

4 comments:

vanajavanamali said...

ఇప్పుడు చదువు కన్నా సంస్కారం కన్నా శరీరపు రంగు మెరుపులు- లావణ్యాలు ముఖ్యమైపోయి.. వ్యక్తిత్వానికి విలువ లేకుండా పోతున్నాయి. ఆ అమ్మాయి నిర్ణయం నూటికి నూరు శాతం ఆమోదయోగ్యం.ప్రేమ పేరిట వంచిపబడటం.. పెళ్లికాకముందే.. ఎంగేజేమేంట్ అయిన అబ్బాయితో.. ఇలాటి బలత్కారపు చర్యలు..చవిచూడటం రెండు ఒకటే.. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త...!! మంచి విషయం నల్గురి దృష్టికి తెచ్చారు. అభినందనలు.

Anonymous said...

ఇది కథో, నిజమో కానీ బాగా రాసారు. నిజమే అయితే ఆ అమ్మాయి బాధని అర్థం చేసుకుని బాగా వ్యక్తీకరించగలిగారు.

Anonymous said...

ఆ సీన్ కళ్ళార చూసిన అనుభవం నాకుంది.........ఒక తమ్ముడిగా...ఆ అక్క బాధ అర్థం చేసుకునే పరిణతి నా లో అప్పుడు లేదు...ఇప్పుడు ఉన్నా చేసెది ఎమి లేదు....అంటే రంగు కారణంగా సంబంధాలు రావటం లేదని,రెండవదానికి వస్తున్న వాటిని వదులుకుంటున్నమ అనీ అండం నేను విన్నను

Sasikiran said...

Well written sir people always go for glitters and leave the gold aside..dark is beautiful one day every one gonna realise ;)