Showing posts with label నచ్చిన పుస్తకం. Show all posts
Showing posts with label నచ్చిన పుస్తకం. Show all posts
Jan 17, 2012
Dec 27, 2011
ఇన్‌క్రెడిబుల్ గాడెస్ .
"ఇన్‌క్రెడిబుల్ గాడెస్ " రాత్రంతా ఈ నవల ఆసాంతం చదివేదాక నిద్ర పట్టనే లేదు.
నేను చదివిన కేశవరెడ్డి గారి మూడు రచనల్లో బాగా నచ్చింది "ఇన్‌క్రెడిబుల్ గాడెస్ " .
వేలాది సంవత్సరాల బానిస బ్రతుకుపై పోరాటం చేసేట్టు కనపడతారు మన కథానాయకుడు
మొదట్లో . కాని కేవలం అవి మాటలుగానే మిగిలి పోతాయి. ప్రతి సంఘటనలోను
నిస్సహాయుడిగా తన ప్రత్యర్థిని ఎదిరించలేక ఓడిపోతాడు. తన సర్వస్వాన్ని
హరించి..కన్న కొడుకునీ పొట్టన పెట్టుకున్న 'అధికారానికి' వ్యతిరేకంగా తనని
తన జాగృతం చేసి తన జాతిని పోరాటం వైపు అడుగు వేసే దిశగా ..తరాల బానిసత్వం
పై పైచేయి సాధించే వైపుగా 'ఆశని' కలిగించే చివరి అవకాశం కుడా వదులుకొని
...నేను బానిసనే అని ఒప్పుకుంటాడు.
ఆద్యంతం ఆసక్తి కరం.. ఆలోచనాత్మకం. తప్పక చదవండి. ఇంక్రెడబుల్ గాడ్దేస్
Dec 1, 2011
విముక్త ( కథలు )
పురాణ
కథల్లో నాయకులు ధర్మం కోసం పాటుపడి దాన్ని పునర్నిర్మించటానికి
ప్రయత్నించి గెలిస్తే గెలుస్తారు గాక.. కాని ప్రతి పురాణ పురుషుడి వెనకా ఓ
స్త్రీ హృదయపు ఆక్రందన ఉంది. స్వయవరంలో రాముడిని వరించి పెళ్ళిచేసుకొని
అష్టకష్టాలు పడింది సీత. రాముడిని వలచి వచ్చి అవమానానికి గురయ్యి అంతులేని
వేదనకి గురయ్యింది శూర్పణఖ.
అవతార పురుషుడిని వరించినా ధర్మబద్దంగా
ఇద్దరికీ అన్యాయమే జరిగింది. .. అయినా ఆ ఇద్దరూ పోరాడి..మనసుని స్వాంతన
పరచుకొని ఒంటరి జీవితాన్ని గడిపారు.
రామాయణంలో ఆవేదనకి గురయిన స్త్రీ పాత్రల గురించి చదవండి....ఆలోచించండి.
విముక్త ( కథలు ) రచన : ఓల్గా
May 29, 2011
పచ్చి నిజం
ఓ అమ్మాయి, .. బానే చదువుకుంది..ఏదో జాబ్ కూడా చేస్తోంది..పెళ్లి వయసు వచ్చేసింది..ఓ పిల్లాడిని చూసారు తల్లిదండ్రులు.. పెద్దగా నచ్చక పోయినా...మిగతా అన్ని ఓకే అయ్యాయి కనక ..తనూ ఓకే అంది.
అతను ఫోన్లు చేయటం మొదలెట్టాడు..మొబైల్ లో మాటలు..నిముషాల్లోంచి గంటల్లోకి మారుతున్నాయి.. కలుద్దామా అని అడిగాడు. చేసుకోబోయే వాడు డిన్నర్ కి రమ్మంటే ..కాదు అనలేదు కదా.. సరే అంది. ఆఫీస్ నుండి నేరుగా కలవాల్సిన చోటుకి వెళ్ళింది. ఇద్దరు కలిసి మంచి భోజనం చేసారు..ఇంటికి వెళ్దామా..అన్నాడు. ఇప్పుడొద్దు లేట్ అయ్యింది అంది.. పర్లేదు .నేను డ్రాప్ చేస్తాగా... మొహమాటం తో వెళ్ళింది..ఇంట్లో ఎవరూ లేరు..వాళ్ళ అమ్మ నాన్న ఏదో పెళ్ళికి వెళ్ళారని చెప్పాడు.
ఆ విషయం అక్కడే చెప్పి ఉండాల్సింది కదా..అని మనసులో అనుకుంది.
ఆమాట ఈ మాట చెపుతూనే.. మెల్లిగా దగ్గరికి వచ్చి గబుక్కున పట్టేసాడు.
no..i don't like it అంది.
అర్రే.. I am Ur fiance yaar అన్నాడు, కాని వదలలేదు..
వదిలిన్చుకుందాం అన్న ప్రయత్నం బెడిసింది.
ఎందుకో మనసు అంగీకరించటం లేదు.. ఇంకా అతని గురించి పూర్తిగా తెలియలేదు. ఒకవేళ తెలిసినా అంగీకరించేది కాదేమో. అంతా పెళ్ళయ్యాకే అని కుడా తానూ అనుకోవటం లేదు..కాని ఎందుకో నచ్చలేదు.
కోపం వస్తోంది..పట్టుకున్నవాడు...ఊరుకుంటాడా..ఎక్కడెక్కడో తడుముతున్నాడు. మనసుకీ..శరీరానికి కుడా అది నచ్చటం లేదు.
అతని పట్టులో ప్రేమ కంటే.. కామం కనపడుతోంది..పశుత్వం తెలుస్తోంది.
ఆడది అపురూపంగా..ప్రేమగా అందివ్వ వలసినది..బలవంతంగా లాక్కుంటున్నాడు.
వీడినా నేను కట్టుకోబోయేది...అనే ఆలోచన వచ్చేసింది..దాంతో కోపం కట్టలు తెగింది..
u .. IDIOT ...leave me..అని ..ఎంత బిగ్గరగా అరిచిందంటే..
అ అరుపుకి వదిలాడు..భయపడ్డాడో.. సిగ్గు పడ్డాడో ..ఏదో తప్పు చేసినట్టు నటించాడో...తెలిదు, I am సారీ అని మాత్రం అన్నాడు..
వినిపించుకోకుండా.. బాగ్ తీసుకొని వచ్చేసింది..
గంటకోసారి తన ఫోన్ మోగుతోంది.. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు..
ఆరోజు ముహూర్తాలు పెట్టుకుందాం అని ఇంట్లో మాట్లడుకొంతుంటే,
I don't like this alliance అంది..
hey are u mad.. అన్ని కలిసాక....మొన్న ఓకే అన్నావ్ కదా. వాళ్ళ నాన్న అరిచినట్టు అన్నాడు..
yes, but now I don't like...
hey what are u saying..u have gone mad..
I don't like it.. అంతే..చెప్పి విసురుగా వెళ్ళిపోయింది లోపలికి..
ఏం చెపుతుంది..rape attempt చేసాడని చెపుతుందా .. కాబోయే అల్లుడు ?
లోపలి వచ్చాడు వాళ్ళ నాన్న..
నీవేం అన్నా..ఈ పెళ్లి జరగటం ఖాయం..మళ్లీ పిల్లాణ్ణి వెతికే ఓపిక లేదు నాకు.
ఆ చిన్న దానికి ఎన్నో మంచి సంభందాలు వస్తుంటే వదిలేస్తున్నాం..............నీ వల్ల.
ఈ మాట గుండెల్లో కత్తి లాగా దిగింది.. బాధ ఎగజిమ్మింది..
" ఆడదానికి అందమే ప్రధానం...ఎంత పచ్చి నిజం.? కొంచం చామన ఛాయా గా ఉండటమే తను చేసుకున్న పాపమా..?? తన రూపం తను కోరుకున్నదా..?? ఎంచుకున్నదా ??
రాత్రింబవళ్ళు చదివి pg లో సాధించిన gold medal కి విలువ లేదు.. నెలకి సంపాదించే పదిహేను వేలకీ విలువ లేదు..వ్యక్తిత్వానికి .. తెలివికీ ..ఆలోచనలకీ ...ఆశయాలకీ.. దేనికీ విలువలేదు, కేవలం తన ఒంటి రంగు ..నిగారింపు..శరీర సౌష్టవం ..దీనికే విలువ సమాజం లో.. సమాజం సంగతి వదిలేస్తే, ...నాన్న కూడ అదే మాట అంతోంటే ...దానికి అమ్మ నోరెత్తకుండా చూస్తుంటే.. ఎందుకో తనవాళ్ళే తన గుండె కోసినట్టనిపించింది.
ఎంత సేపూ ఏడ్చిందో తెలిదు.. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలిదు.. కాని ఆ ఏడుపు లోంచి ఒక గట్టి నిర్ణయం మాత్రం తీసుకుంది.
తను కొన్నాళ్ళు ప్రశాంతంగా బతకాలని..independent గా ఉండాలని..తన నిర్ణయాలు తనే తీసుకోవాలని..జీవితాన్ని చవి చూడాలని.. ఎక్కడికైనా వెళ్లి పోవాలని నిర్ణయించుకుంది..
May 15, 2011
చలం రాతలు. ..
స్త్రీ సౌందర్యాన్ని వర్ణించి..ఆ సౌందర్యం తన మనసుని ఎట్టా కాల్చేస్తుందో.. స్త్రీ తన సున్నితత్వం.. వల్ల తెచ్చుకునే ..కష్టాలు, కన్నీళ్ళ గురించి రాస్తూ ..అప్పుడే తన నెత్తిమీద ఎగిరే కొంగల బారు కేసి చూసి, ఎంతో దూరం ఎగిరి వెళ్లి..తమ పిల్లలకి అవి తెచ్చే తాయిలం.. తల్లుల రాకని గమనించి వింత శభ్దాలు చేస్తూ అవి పొందే సంతోషాన్ని మనది గా చేస్తాడు.ఎన్నో రహస్యాలని తనలో దాచుకొని మౌన మునిలా నిల్చున్న ఆ నీలాకాశం కేసి చేతులు చాస్తున్నట్టు కనపడే పొడవాటి పచ్చని చెట్లని చూసి , గోధుమ రంగు నుంచి ఆకుపచ్చగా మారుతోన్న లేత ఆకుని పరికించి .. ఆ చెట్లు ఆకాశం నీలాన్ని తన ఆకుల పిడికిట్లో దాచుకున్నాయని అబ్బురపడతాడు. కొమ్మ నుండి కొమ్మకి ఎగురుతూ ఆటలాడుతున్న పిచ్చికలతో మాటాడి వాటి బాష అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.వాటిని దూరపు బంధువులు గా అనుకొంటాడు. స్నేహితులని గుర్తు చేసుకొని.. వాళ్ళ గుణ గణాలని విశ్లేషించి..పొగిడి తిట్టి వాళ్ళతో తన అనుభవాలని..అనుభూతులని మనతో పంచుకుంటాడు. దాంతో మన గతాన్నీ మనం ఓ సారి జ్ఞప్తికి తెచ్చుకోక తప్పదు. ..తరతరాల మన జీవన విధానాన్ని,అందులోని లోపాలని ఎత్తి చూపుతాడు. "ఒక ప్రశ్నలోంచి ...ఒక ఆలోచన లోకి,ఒక ఆనందం లోంచి ఒక అనుభవం లోకి, ఒక జవాబు లోంచి ఒక అనుభూతి లోకి" తీసుకు వెళ్తాడు, అలుపు లేకుండా.
తన ఆలోచనలనీ ...జీవితాన్ని మొత్తం అక్షరాల్లోకి దోల్లించాడు. మన మనస్సులో దాగిన క్రూరత్వాన్ని..ద్వేషాన్ని..కల్మషాన్ని బయటకి లాగి చూపించి..ఆ మురికిని కడిగి పారేయ్యలని ప్రయత్నిస్తాడు.లోక సౌందర్యాన్ని మనచే తాగిస్తాడు. జీవిత మాధుర్యాన్ని చూపిస్తాడు. అవీ చలం రాతలు.
ఒకటా రెండా ప్రతీ వాఖ్యం ఒక గొప్ప statement. ఒక ఖచ్చితమైన వాస్తవం. ఒక రస గుళిక..ఒక ఆలోచనా స్రవంతి.
రోజూ మనం ఇంత జీవితాన్ని అనుభవిస్తూ...వివిధ అనుభవాలకి లోనవుతూ..వింత ఆలోచనలు చేస్తూ...సత్యాలని దర్శిస్తూ.. కుడా ఒక్క మాట సూటిగా..ఖచ్చితంగా..నిజాయితీగా.. మాట్లడలేకపోతున్నాం..మనలో దాగిన రహస్యాలని..కల్మషాన్ని..కోరికలని.. ద్వేషాన్ని..ప్రేమనీ..కరుణ నీ.. బయట పెట్టలేక..నటిస్తూ..జీవిస్తూ...నటనలో జీవిస్తూ..జీవితమంతా నటిస్తూ.. ఒక్కరోజు కుడా మనకి మనంగా బ్రతకలేక ఈ చచ్చు బ్రతుకే నిజమనుకొని ..ఇదీ ఆనందం అనుకొని..మనని మనం మరిచి..ఈ వేషాలు..డాబులు ..దర్పాలూ.. ఎంతకాలం..?? ఎంతకాలం ??
May 9, 2011
మునెమ్మ
రచయిత, తన జీవితం లోంచి..పొందిన అనుభుతుల్లోంచి.. దర్శించిన సత్యాలను నిజాయితీగా చెబితే .. అదీ సులభ శైలిలో చెపితే నాకు బాగా నచ్చుతుంది. అక్షరాల అల్లిక ..అలంకారాలు.. పోల్చటాలు..వర్ణన వీటి గురించి ఆలోచించేది తరవాతే. మనిషి చేసే పనులకి, అతని ప్రవర్తనకి భావ గంబీర్యతని ఆపాదించటం,సరళత్వం, సునిశితత్వం,జీవితానికి దగ్గరగా ఉండే ఉండేట్టు రాయటం ఇవన్నీబాగా నచ్చుతాయి.నేను పుస్తకం ఆసాంతం వెతికేది వీటిగురించే. కథ..కథనం..వీటికంటే వీటి వెనకున్నమనిషిషి తత్వం నన్ను బాగా ఆకర్షిస్తుంది.ఒక కథకు గానీ ఒక సినిమాకు గానీ మరే ఇతర రచనకు గానీ ఇదే మూలాధారం అని నాకు తోస్తుంది. మనిషి తత్వాన్ని ఆధారం చేసుకొని కథను అల్లి అందులోని ప్రధాన పాత్రల ద్వారా రచయిత తన అనుభవ సారాన్ని వెలిబుచ్చి, కొన్ని జీవిత సత్యాలని దర్శింపజేస్తే అతడు తన రచనలో కృతార్థుడు అయినట్టే .. మునెమ్మ లో నాకు ఇవి బాగానే కనిపించాయి. మీరు చదివారా ???
May 5, 2011
Musings
చలం గారి Musings మళ్లీ చదవటం మొదలు పెట్టాను.. కానీ ముందుకు వెళ్ళటం లేదు. ఓ రెండు వాఖ్యాలు చదవటం..పుస్తకం మూసి తీవ్రంగా ఆలోచించటం... ఓ వాక్యం చదివి దానికి సంబందించిన దృశ్యాని ఉహించుకోవటం..దాని తాలూకు శాంతి..ఆనందాన్ని ఫీల్ కావటం. ఇంకో వాక్యం వెనక దాగిన సత్యాన్ని అన్వేషించటం ..ఆ సత్యం నా అనుభంతో సరిచుసుకోవటం... ఈ పుస్తకం ఐపోయేటప్పటికి సంవత్సరం అయ్యేట్టుంది.
Feb 15, 2011
బాధ - చలం
ఎంత తరచి చూసినా లోకంలో బాధ ఉండటం అన్యాయం..ఘోరం. మతాలూ ఈ బాధని ..శిక్ష అనీ , కర్మ అనీ ..ఈశ్వరేచ్ఛ అని ఎంత సమర్థింప చూసిన అర్థం లేని మాటలని పిస్తాయి..బాధ లేకుండ సృష్టి ఎందుకు ఏర్పడి ఉండకూడదు ?
ఈ ప్రశ్న ఎవరినడగాలి?ఈ ప్రశ్నని తీసుకునే దేవరు?జవాబు చెప్పేదెవరు? బాధకి లోబడే ఏ జీవికి అధికారం లేదు జవాబు చెప్పటానికి!
బాధలివ్వటం ఎందుకు? ఇట్లా జీవరాశుల్ని కాల్చి చంపడమెందుకు ?
ఎంత స్పష్టమైన కసి కనపడుతోంది సృష్టి కర్త హృదయం లో ?
- ఇదంతా కర్మ ఫలం -
అసలు దుష్కర్మ చేసే ఆలోచనలు ఎందుకు మనస్సులో పెట్టాలి ?
మనుష్యులయినా ఒక రకమైన బాధల్లోంచి ఇంకో రకమైన బాధల్లోకి నడవటమే కనపడుతోంది ఇన్ని యుగాలుగా..
దేవుడి కన్నా సైతానులో ఎక్కువ నిజాయితీ.. దేవుడి కరుణనీ- క్రూరత్వాన్ని కూడా నిర్లక్షంగా ఎదురుతన్న గలిగిన వాడు అతనొక్కడే.
ఇంత బాధ పెట్టినతరవాత ఇచ్చే నీ సుఖాలు నాకేం వొద్దు అని తన్న గల శక్తి రావాలి మనిషికి.
బాధకి లోబడి పోయి..తన విషయమే యోచించుకునే వాడు ఏడుపుగొట్టు..అన్నింటిలోను విషాదమే చూడగల మనిషిగా అయిపోతాడు...
బాధ గురించి చలం "బాధ" - పుస్తకం పేరు ' విషాదం'
ఈ ప్రశ్న ఎవరినడగాలి?ఈ ప్రశ్నని తీసుకునే దేవరు?జవాబు చెప్పేదెవరు? బాధకి లోబడే ఏ జీవికి అధికారం లేదు జవాబు చెప్పటానికి!
బాధలివ్వటం ఎందుకు? ఇట్లా జీవరాశుల్ని కాల్చి చంపడమెందుకు ?
ఎంత స్పష్టమైన కసి కనపడుతోంది సృష్టి కర్త హృదయం లో ?
- ఇదంతా కర్మ ఫలం -
అసలు దుష్కర్మ చేసే ఆలోచనలు ఎందుకు మనస్సులో పెట్టాలి ?
గజ్జి పట్టి దిక్కు లేక తిరిగే కుక్క పిల్లలు..
పిల్లల్ని తినేస్తే ఏడ్చే పక్షి తల్లుల గోల
గోడలో మొలిచి నీళ్ళు లేక ఎండే మొక్కల క్షుద -
ఇట్టాంటి బాధని ఏ కర్మ సిద్దాంతము సమర్థించలేదు.
దేవుడి కన్నా సైతానులో ఎక్కువ నిజాయితీ.. దేవుడి కరుణనీ- క్రూరత్వాన్ని కూడా నిర్లక్షంగా ఎదురుతన్న గలిగిన వాడు అతనొక్కడే.
ఇంత బాధ పెట్టినతరవాత ఇచ్చే నీ సుఖాలు నాకేం వొద్దు అని తన్న గల శక్తి రావాలి మనిషికి.
బాధకి లోబడి పోయి..తన విషయమే యోచించుకునే వాడు ఏడుపుగొట్టు..అన్నింటిలోను విషాదమే చూడగల మనిషిగా అయిపోతాడు...
బాధ గురించి చలం "బాధ" - పుస్తకం పేరు ' విషాదం'
Feb 3, 2011
అంతుబట్టని 'స్త్రీ హృదయం'
ఆమె అధికారిని..
అతను..ఉద్యోగి..
ఆమె మగాణ్ణి ఇట్టే ఆకర్షించగల ప్రౌఢ ..
అతను ఆ ఆకర్షణను తట్టుకోలేని యువకుడు.
ఆమె మగవాడి లోతులు తెలిసి ఆడించగల సమర్థురాలు
అతను.. ఆడది అంటే తెలియని బేల యువకుడు.
ఆమెకి అతనంటే చనువు..సంకోచం లేకుండా మాట్లాడుతుంది.
అతనికి అమెంటే ఇష్టం ..కాని ఆమె అధికారానికి భయం.
ఎంత ఒంటరిగా, చనువుగా ఎన్నాళ్ళు ఆమెతో వర్తించనీ ఆమెతో మొహ సంభంధంగా ఏ కొంచం దగ్గరిగా రావటానికి ఎవ్వరికీ గుండెలు లేవు.
ఆమె ఆకర్షణ శక్తి ముందు నిలవ లేక , ఆమె చనువుకి , సంభాషణలకీ అర్థం తెలీక.. మొహాన్ని ఆపుకోలేక అతనికి నరకం.
ఆమె దేహం పిలుస్తోంది..ఆమె మనసు పోమ్మతుంది.
ఆమె సుఖంగానే ఉంది ..
అతను చిక్కి పోతున్నాడు.
అంతుబట్టని 'స్త్రీ హృదయం'
"ఆరంభింపరు " కథ
రచయిత - చలం
అతను..ఉద్యోగి..
ఆమె మగాణ్ణి ఇట్టే ఆకర్షించగల ప్రౌఢ ..
అతను ఆ ఆకర్షణను తట్టుకోలేని యువకుడు.
ఆమె మగవాడి లోతులు తెలిసి ఆడించగల సమర్థురాలు
అతను.. ఆడది అంటే తెలియని బేల యువకుడు.
ఆమెకి అతనంటే చనువు..సంకోచం లేకుండా మాట్లాడుతుంది.
అతనికి అమెంటే ఇష్టం ..కాని ఆమె అధికారానికి భయం.
ఎంత ఒంటరిగా, చనువుగా ఎన్నాళ్ళు ఆమెతో వర్తించనీ ఆమెతో మొహ సంభంధంగా ఏ కొంచం దగ్గరిగా రావటానికి ఎవ్వరికీ గుండెలు లేవు.
ఆమె ఆకర్షణ శక్తి ముందు నిలవ లేక , ఆమె చనువుకి , సంభాషణలకీ అర్థం తెలీక.. మొహాన్ని ఆపుకోలేక అతనికి నరకం.
ఆమె దేహం పిలుస్తోంది..ఆమె మనసు పోమ్మతుంది.
ఆమె సుఖంగానే ఉంది ..
అతను చిక్కి పోతున్నాడు.
అంతుబట్టని 'స్త్రీ హృదయం'
"ఆరంభింపరు " కథ
రచయిత - చలం
Jan 29, 2011
The naked triangel
వాళ్ళకి మధ్య ఓ త్రికోణం.
మళ్లీ వాళ్ళకి ..వాళ్ళని ప్రేమించే వాళ్ళ మధ్య ...ఇలా ఆ పరంపర సాగుతూనే ఉంటుంది.
తన జీవితపు అనుభవాలని..చేదు నిజాలని ఎలాంటి hype లేకుండ..సూటిగా.. మనసులోతుల్లో తగిలేట్టు రాసిన రచయిత ఆత్మ కథయే ఈ పుస్తకం.
మరి కథ వస్తువు ? రచయిత మాటల్లోనే.
"Betrayal"
How men and women deceive each other when they make love;how they betray in their search for truth;
how being disloyal to one makes them madly loyal to other...the power and torture of sex its ecstasy ..its destructive nature how geniuses are blinded by it and how they lust to b destroyed by their women.
my characters are naked stripped to b worthy of the alter. there is no other comfort then the warmth of ones own skin.
- Balwant gargi
చలం శైలి లాగ అనిపించే నవల ఇది. దొరికితే తప్పక చదవండి.
Dec 23, 2010
చలం "మైదానం" గురించి
మైదానం ఒక బోల్డు రచన .. ఒక కాల్పనిక స్వేచ్చా ప్రపంచంలో ఒక స్త్రీత్వం, .. అది కోరుకునే భిన్న పురుష తత్వాలు.
బ్రాహ్మణ స్త్రీ తురక వాడితో లేచిపోవటం.. బ్రాహ్మణ స్త్రీ ఎందుకంటే అన్ని కులాల్లోకి అగ్రకులం, బ్రాహ్మణ స్త్రీ కి కట్టుబాట్లు ఎక్కువ. పాతివ్రత్య కథలకి ప్రతినిధులు. వాళ్ళ బ్రతుకు, మనసు ఒక చీకటి కుహరం . తర తరాల బ్రహ్మణ స్త్రీ లు పడిన బాధలకి మైదానం నాయిక రాజేశ్వరి ప్రతినిధి. ఆ చీకటి గది ఒక మైదానం గా మారితే. ఆ చీకటిలోకి వెలుతురూ కిరణం తొంగి చూస్తే.. ఆ కిరణాలు అనేకానేక రంగుల కిరణాలుగా చీలితే.. చుట్టూ ఉన్న కట్టుబాట్ల గోడలు కూలిపోయి ఒక ఎల్లలు లేని మైదానం గా మారితే ??
ఇక ఆ స్పేస్ లో అసలైన " స్త్రీ " మనసు చేసే స్వేచ్చా విహారమే ఈ
" మైదానం"
బ్రాహ్మణ స్త్రీ తురక వాడితో లేచిపోవటం.. బ్రాహ్మణ స్త్రీ ఎందుకంటే అన్ని కులాల్లోకి అగ్రకులం, బ్రాహ్మణ స్త్రీ కి కట్టుబాట్లు ఎక్కువ. పాతివ్రత్య కథలకి ప్రతినిధులు. వాళ్ళ బ్రతుకు, మనసు ఒక చీకటి కుహరం . తర తరాల బ్రహ్మణ స్త్రీ లు పడిన బాధలకి మైదానం నాయిక రాజేశ్వరి ప్రతినిధి. ఆ చీకటి గది ఒక మైదానం గా మారితే. ఆ చీకటిలోకి వెలుతురూ కిరణం తొంగి చూస్తే.. ఆ కిరణాలు అనేకానేక రంగుల కిరణాలుగా చీలితే.. చుట్టూ ఉన్న కట్టుబాట్ల గోడలు కూలిపోయి ఒక ఎల్లలు లేని మైదానం గా మారితే ??
ఇక ఆ స్పేస్ లో అసలైన " స్త్రీ " మనసు చేసే స్వేచ్చా విహారమే ఈ
" మైదానం"
" మైదానం" అనే నవల కామానికి,, ఆకర్షణకి ,, మొహానికి. ప్రేమకి..మధ్య ఉగిసలాడే ఓ మనసు కథ.
ఆకర్షణా, కామం తో మొదలై.. మోహము.. ప్రేమ వైపు పయనిస్తుంది..
Subscribe to:
Posts (Atom)











