Nov 29, 2011

ఎందుకో నవ్వొస్తుంటుంది నాకు..


ఎందుకో నవ్వొస్తుంటుంది నాకు..
ప్రేమలో ఓడిపోయాను అన్న వాళ్ళని చూసి. ..ప్రేమించి మోసపోయాను అనుకునే వాళ్ళని చూసి...
ఒక మనిషిని.. ఒకే మనిషిని నమ్ముకుని బ్రతకాలనుకునే వాళ్ళని చూసి.. నాకు ఇలాంటి గాయాలు ఎప్పుడూ  కావేమో...
 ఎందుకంటే 


ప్రతి కలయిక తర్వాత వీడుకోలు ఉంటుంది కనక.. 
ఆనందం వెనకాల విషాదాన్ని ఉహిస్తా కనక..
బాధ కూడా ఆనందం  అని అనుకుంటా కనక..
కలుసుకునే స్వేఛ్చ.. విదిపోతానికి కుడా ఉండాలి కనక..
నాది అనేది ఏది లేదు.. ఉండదు అని నమ్ముతాను గనక..
ఏది శాశ్వతం కాదన్న నిజం జీర్ణించుకున్నా  కనక..
కాలం ..దాంతో పాటే మార్పు అతి సహజం కనక..
నాకు నేనే జీవితాంతం అని తెలుసు గనక..

Nov 28, 2011

విశ్వ రూపం

 
ఏ శనివారమో, భార్యామణి బాగా తయ్యారయ్యి బండి వెనకాల కూర్చుంటే ఓ గుడికి వెళ్లి , విగ్రహానికి నమస్కారం పెట్టి .. ఓ కొబ్బరి కాయో, హరతో ఇచ్చి , తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికొచ్చి వీక్ ఎండ్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి మతం మస్తుగానే ఉంటుంది. కాని,......
మెట్టు మెట్టు కడిగి దీపాలు పెట్ట్టేవాళ్ళు, ఏదో నమ్మకంతో గుండు గీయించుకునే మనుషులూ..బాబాలని నమ్మి శీలాలని అర్పించుకునే అతివలు.. మైల అయ్యిందని మంచి నీళ్ళు పారబోసుకొనే బ్రాహ్మణ ఇల్లాళ్ళు.. ఉపవాసలతో ఆరోగ్యం చెడగోట్టుకునే అమ్మలక్కలు ..పెళ్లి కాక గుడి చుట్టూ పోల్లిగింతలు పెట్టె కన్యలు.. తండ్రికి పిండం పెట్టలేక, కర్మకాండలో స్వర్ణ , గోదానం ఇచ్చుకోలేక తండ్రీ అత్మ శాంతించదేమో  అని చింతించే  గృహస్తు...ఇలా కొంప కొంప కీ పోయి చూడండి మతం విశ్వ రూపం కనపడుతుంది.
ఫలానాది చేస్తే ఫలానా అవుతుందని... పాపం తుడిచి పెట్టుకు పోతుందని., ఉత్తమ లోకాలు ప్రప్తిస్తాయని .. ఫలానా చేయకపోతే పుట్టగతులుండవని చెప్పేది హైందవ మతం లోనే. పురాణాలు చదవండి.. స్తోత్రాలు వల్లె వేయండి.మీకే తెలుస్తుంది జనాన్ని ఎంత భయ బ్రాంతులకి గురిచేసారో...
కాషాయం కట్టి ఇల్లు వదిలిన ప్రతివాడు హిందుత్వపు బలి పశువే. పూజలు వ్రతాలూ చేసి దరిద్రుడయిన  ప్రతివాడు బలిపశువే...
జాతకాలు.. నవగ్రహాలు.. ఉంగరాలు అంటూ పెళ్ళాం నగలు తాకట్టు పెట్టిన ప్రతివాడు బలిపశువే.
పాలకి ఏడ్చే పిల్లాడు.. మడితో ఉండి  పాలివ్వలేని ఆ తల్లి ఇద్దరు బలి పశువులే, అప్పు చేసి హోమం/ పూజలు  చేయించే గృహస్తుడు బలి పశువే..దేవుడు దేవుడు అంటూ కొంప కొల్లేరు చేసుకున్న వాళ్ళంతా బలిపశువులే.
మతం పేరుతో ఏం జరిగినా.. ఆది మతానికే చెందుతుంది. దానికి జవాబు దారి మతమే. 
హిందూమతాని ఆహా ఓహో అని చెపుతూ లక్ష విధాల రాయొచ్చు.అదో పెద్ద విషయం కాదు. హిందూ మతం గందరగోళం అన్న మాట వాస్తవం. జనాలు అంతకంటే గందరగోళం లో ఉన్నారనేది వాస్తవం.
ఆత్మ పరీక్ష చేసుకొని సరిదిద్దుకోవలసిన అవసరం.. simplify చేసి ముడత్వాన్ని మట్టుపెట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది.  
హిందూ మతంలో   అర్థవిహీనాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రక్షాళన చేయాలి. అర్థంలేని ఆచారాలు..క్రతువులు అన్ని తొలగి పోవాలి.  వేదాలు.. పురాణాలు..ద్వైతం, అద్వైతం...లక్షల సంఖ్యలో దేవుళ్ళు దేవతలు.. గుళ్ళు గోపురాలు..యజ్ఞాలు ..పూజలు, వ్రతాలు ..అన్ని కలగలిపి  హిందూమతాన్ని పెద్ద గందరగోళం చేసి పెట్టారు. 'సరళీకృతం' చేసి ఆ మతాన్ని కాపాడవలసిన అవసరం ఉంది.
అలా కాక వెనకేసుకోస్తుంటే..జరిగేది, ఒరిగేది ఏమి ఉండదు. లోకంలో అజ్ఞానం  పెచ్చు పెరిగి మతోన్మాదంతో జనాలు చస్తూ బ్రతకటం..లేదా బ్రతుకుతూ చావటం తప్ప.
 

Nov 9, 2011

మన multiplex


మొన్న INOX మల్టీ ప్లెక్ష్ లో సినిమా చూసా.అగ్గిపెట్టె లాగా ఉంది.  నా దురదృష్టం ముందు వరుసలో సీట్ వచ్చింది. వామ్మో.. ఏందిరా భై  తెర నా తల మీదే ఉంది. రెండుగంటలకి పైగా అలా తల ఎత్తి ఆ మూల నించి ఈ మూలకి చూస్తూ సినిమాని అర్థం చేసుకునేసరికి మెడనొప్పి + తలనొప్పి వచ్చేసాయి. ఈ ముల్తిప్లెక్ష్ ల్లో  సినిమా చూడటం వేస్ట్ అని decide అయిపోయా.. హయిగా traditional సినిమా హల్లో  బాల్కనీ టిక్కెట్టు తీసుకుంటే.. సినిమా బాలేకపోయినా కనీసం  మెడనొప్పి ఉండదు.

ఇక్కడ ఈ దేశంలో ...


యే దునియా . ఎక్ దుల్హన్...యే దునియా ఎక్ దుల్హన్. దుల్హన్ మాతే కి బిందియా.. యే మేరా ఇండియా...యే మేరా ఇండియా.. పాడుకోవటానికి బావుంటుంది. కాని .... 

భారత దేశం.. నూటా ఇరవై కోట్లమంది ...అందులో కనీసం సగం మంది యువత ఉంటారనుకుంటే... పద్నాలుగు నుంచి యవ్వనపు రక్తం కొత్తదారుల్లో ఉరకలేస్తుంటే, లైంగిక వాంచని తొక్కి పెట్టిన మన సంస్కృతి సంప్రదాయాలు ఒక పక్క, ఇంటర్నెట్ లో పచ్చి శృంగారం మరోపక్క, వయాగ్రాలకంటే ఎక్కువ కిక్కు ఇచ్చే సినిమాలు, హిరోయిన్లు మరోవైపు, ఎందుకో తెలీక,చెప్పెనాథుడు లేక, చెప్పుకోలేక, అడగలేక, ఆగలేక, ఆపుకోలేక  ఆ యువత ఏం చేస్తుంది ? అడపా,  దడపా హద్దు దాటుతుంది.


ఆడ అయినా మగయినా ఈ దేశంలో, శృంగారం కావాలంటే, పెళ్లి చేసుకోవాల్సిందే.పెళ్లి అయ్యాక, కొంతకాలం గడిచాక కాని తెలిదు అసలు విషయం. అప్పుడు విడివడలేక , కలిసి ఉండలేక నరకం. ఆ నరకం లోంచి కోపం, క్రోధం.. దాంతో ఏదో మిషతో ఒకరినొకరు శారీరక, మానసిక హింస పెట్టుకోవటం.ఇది ఇంకోరకం  బాధ.
అయితే దరిద్రం, లేదా అత్యాశ వల్ల ... కష్టపడకుండా మామగారు ముద్దుగా ఇచ్చే , పెళ్ళాం తెరగా తెచ్చేకట్నం. కట్నం డబ్బులు కరిగి పోగానే ..పెళ్ళాం మీద మోజు తీరుతుంది. 'కుక్కని కొట్టినా  డబ్బులొస్తాయి' అన్న విషయం గుర్తొచ్చి పెళ్ళాన్ని  కొడతాడు. 

ఇలా ఏ సందర్బంలో అయినా బాధ పడేదీ, నష్టపోయేదీ ...  సున్నిత మనస్సు కలిగి, ఎక్కువ emotional అయిన స్త్రీ యే.

బాగా ఆలోచిస్తే.. ఇక్కడ ఈ దేశంలో ప్రభుత్వానికి ప్రజల మీద కంట్రోల్ లేదు..గౌరవం లేదు. పట్టింపు లేదు. ఇష్టం లేదు...బాధ్యత లేదు. దేశ భవిష్యత్తు మీద అవగాహన లేదు. అలాగే ప్రజకీ కుడా ప్రబుత్వం మీద ఏదీ లేదు. వెరసి ఇదీ మనదేశం. ఇదీ మన ప్రగతి. ఇదీ మన భవిష్యత్తు.
 యదా రాజా... తథా ప్రజా .