Dec 27, 2011

కన్నులతో చూసేదీ గురువా....


paradise x రోడ్స్ ..టైం 11.45 am
అబ్బా టైం అవుతుంటే ఈ సిగ్నల్స్ ఏంట్రా నాయనా..
రెడ్ లైట్ చూసి ఆగక తప్పలేదు. ముందే రోడ్డుమీదకి వస్తే ఏదో తెలీని టెన్షన్, దానికో తోడు వర్క్ టెన్షన్ + లేట్.
థు దీన.... అని అనేలోపే మాట ఆగిపోయింది. కారణం ఓ రాయంచ పక్కన ఆగింది. తెల్లని సుజికి ఆక్సెస్ మీద.. తెల్లని చుడీదార్ లో..
చూస్తే బావుణ్ణు ..చూస్తే బావుణ్ణు.. చూస్తే ... మూడోసారి అనుకునేంతలో చూసింది.
కనులు కనులని దోచాయంటే.... నేనయితే ఆమె చూపులు దోచేసి దాచేసాను.
థు నీ .. తినేసేలా చూస్తావా అనుకుందేమో తలా పక్కకి తిప్పింది.
మళ్ళీ చుడకపోతుందా అనే ఆశ చావదే..
ఆమె అలా అనుకోలేదు, ఎందుకంటే మళ్ళీ చుసిందోచ్ .. ఇది మళ్ళీ మళ్ళీ రిప్లై  అయ్యింది.
చుట్టూ జనం..ఎవడి బాధల్లో వాళ్ళు. మా మధ్య మౌనం. కాని ఆ మౌనం మాట్లాడాలని ప్రయత్నం మొదలెట్టింది. ఏం జరిగిందో ఏమో..నాకు మాత్రం ఆమె నన్ను చూసి నవ్వినట్టే అనిపించింది.
'కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనస్సు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి '.....మనసుకి ఏదో కొత్త ఆనందం అవగతమవుతోంది.
ఇంకో అయిదు సెకండ్స్ ఉంది గ్రీన్ సిగ్నల్ పడటానికి. మొదటి సారి అనిపించింది ఈ ట్రాఫిక్ సిగ్నల్ టైం ఓ గంట ఉంటే ఎంత బావున్నో అని ..
ఇప్పుడెలా ...
అలోచిన్చేలోపే.... ఓ వాలు చూపు విసిరి జర్రున దూసుకుపోయింది..ఇంకోవైపు..నా  మనసుతో పాటుగా..కీక్ కీక్.. వెనక నుండి హరన్...

ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.
కన్నులతో చూసేదీ గురువా కనులకి సొంతమౌనా .. ఇక కనులకి సొంతమౌనా...

అద్బుత సాహస గాధ

ఒక అద్బుత సాహస గాధ..రాత్రి భోజనం అయ్యాక ఈ పుస్తకం చదవటం మొదలు పెట్టి తెల్లవారి మూడింటికి ముగించి..వేడిగా చాయ్ తాగి కథని visualize చేసుకుంటూ నిద్రపోయాను.
ఈ కథని సినిమాగా తీయగల దమ్ము మనవాళ్ళకి లేదు..గాక లేదు. కాని ప్రపంచంలోని ఎవ్వరైనా తీయగలిగితే..ఎంతబావుంటుంది.

ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ .

"ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ " రాత్రంతా ఈ నవల ఆసాంతం చదివేదాక నిద్ర పట్టనే లేదు.
నేను చదివిన కేశవరెడ్డి గారి మూడు రచనల్లో 
బాగా నచ్చింది "ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ " .
వేలాది సంవత్సరాల బానిస బ్రతుకుపై పోరాటం చేసేట్టు కనపడతారు మన కథానాయకుడు మొదట్లో . కాని కేవలం అవి మాటలుగానే మిగిలి పోతాయి. ప్రతి సంఘటనలోను నిస్సహాయుడిగా తన ప్రత్యర్థిని ఎదిరించలేక ఓడిపోతాడు. తన సర్వస్వాన్ని హరించి..కన్న కొడుకునీ పొట్టన పెట్టుకున్న 'అధికారానికి' వ్యతిరేకంగా తనని తన జాగృతం చేసి తన జాతిని పోరాటం వైపు అడుగు వేసే దిశగా ..తరాల బానిసత్వం పై పైచేయి సాధించే వైపుగా 'ఆశని' కలిగించే చివరి అవకాశం కుడా వదులుకొని ...నేను బానిసనే అని ఒప్పుకుంటాడు.
ఆద్యంతం ఆసక్తి కరం.. ఆలోచనాత్మకం. తప్పక చదవండి. ఇంక్రెడబుల్ గాడ్దేస్

Dec 14, 2011

వాట్ అన్ ఐడియా...!!

ఆకలి దంచేస్తోంది.. పర్సు వెతికితే అయిదొందల ఆకు పచ్చ నోటు తగిలింది.
ఆహా అదృష్టం, కాని ఏం తిందాం. బిర్యాని.? రోటీ పనీర్ బట్టర్ మసాలా? మెస్ భోజనం ? లేక పిజ్జా బర్గర్ ?? రక రకాల రుచులు జ్ఞాపకం వచ్చి నోరు ఉరింది. ఏం తినాలో అర్థం కాక తల మునకలవుతుంటే
ఇంతలో ఒక మెసేజి..
డియర్ కష్టమర్ మీరు కట్టవలసిన బిల్లు నాలుగు వందల ముప్పయి అయిదు రూపాయలా ఇరవై రెండు పైసలు .. చివరి తేదీ _ _ _
మీరు ఐడియా వాడుతున్ననదుకు ధన్యవాదాలు.

నోటు మడిచి పర్సులో పెట్టి జేబులు తడిమితే బంగారు రంగులో అయిదు రూపాయల కాయిన్ తలుక్కుమంది. వెంటనే అప్పుడెప్పుడో ఏళ్ళ కింద చూసిన ఒక టీవీ ప్రకటన గుర్తొచ్చింది..
అయిదు నిముషాల్లో రెడీ చేసి తిన్నా.ఆకలి ఆల్మోస్ట్ తీరిపోయింది 'మాగి' తో.
so చెప్పుకోవలసిన మాట ఏంటంటే ..
" ఐడియా మీ ఆకలిని తీర్చేస్తుంది." అని  ఈ ముక్క నా మిత్రుడికి చెప్పగానే 
కాదు కాదు.. " ఒక్క ఒక్క ఐడియా మీ ఫుడ్డుని మార్చేసింది." అన్నాడు. వాట్ అన్ ఐడియా .. :)

లవ్వు& హేట్

టీ పౌడర్ కొందామని ఓ దుకాణానికి వెళ్ళనా.. అచ్చు గుద్దినట్టు ఉన్న ఇద్దరమ్మాయిలు.. అక్క చెల్లెళ్ళు అని చెప్పకనే చెపుతున్నారు. మొదటి పిల్లని చూసాను నా చూపు తగలగానే ముఖం ముడుచుకొని.. తల పక్కకి తిప్పేసింది. " తరుణీ కడకంటి చూపులకి కూడా నోచుకొని జన్మా ఒక జన్మేనా .....థు
దీనమ్మ జీవితం... అని ఏదో తెలీని బాధపడుతుండగా .. ఆ రెండో పిల్ల నన్ను చూసింది. కళ్ళతో నవ్వింది.. ఆ తరవాత పెదాలు విచ్చుకొని ముసి ముసి నవ్వు నాపై రువ్వింది. ఆహా.. 'జగమే మారినది మధురముగా ఈ వేళా.' పాట మొదలయ్యింది. ఏముంది 3 smiles and 6 looks ..  కొంచం సేపు కాలం ఆగిపోయింది. చేసేదేం లేదు, చేసిందేం లేదు కానీ ఓ నిముషం పాటు సంతోషం. :)
సో చెప్పొచ్చేదేమిటంటే....
1) మనకి కావలసింది దొరక్క పోయినా పక్కది దొరికితే సంతోషించాలి.
2) లవ్వు, హేట్ అక్క చెల్లెళ్ళు. పక్క పక్కనే కలిసి ఉంటాయి.
3)కారణాలు తెలీదు కాని మనం అంటే కొందరికి ఇష్టం ..మరికొందరికి అయిష్టం. అయిష్టాన్ని అటు తోసేసి ఇష్టాన్ని దగ్గరకు తీసుకోవాలి.
4) మనని వద్దు అనుకున్న వాళ్ళని విసిగించి ఆసిడ్ పోయకుండా.. కావాలనుకుంటున్న వాళ్ళని పట్టించుకోవాలి
5) ....

6) ....
7).....

Dec 2, 2011

ఎప్పుడు కష్టాలు వచ్చినా..

 
"మగాడి గుండెల్లో అంతులేని బాధ ఉన్నా.. కృష్ణుడి వేషంలో NTR నవ్వినట్టు  దరహాసం ఇవ్వాలి. అదే ఆడాళ్ళు అయితే వలవలా ఏడ్చేస్తారు. ఎందుకంటే...
అది కలియుగపు ఆరంభపు రోజు.. కలియుగంలో దేవుడు ప్రత్యక్షం అవ్వటం అనే మాట ఉండదు. మానవ జంట ని సృష్టించి నిషిద్ద ఫలం గురించి చెప్పి వెళ్ళిపోయాడు. ఈవ్ నస భరించలేక ఆడం ఆపిల్ తెంచాడు. ఇద్దరూ ఆపిల్ పండు కోరికాక, కొంచం అదోలా అనిపించింది, తెలీని ఓ  గొప్ప బాధ మొదలయ్యింది. ఆది చూసి దేవుడు చిట్ట చివరి సారి ప్రత్యక్షమయ్యి చెప్పుకోండి మీ బాధలు...అని అడగ్గానే, తీర్చే వాడు వచ్చాడన్నచిన్నిసంతోషంలో మగాడు 'చిరునవ్వు' నవ్వాడు. భారీ సీరియల్ మొదలెట్టేముందు ఏడ్చినట్టు ఆమె 'కన్నీళ్ళు' పెట్టింది.
ఇంతలో ఓ అశరీరవాణి కలియుగం ఆరంభం అయ్యింది కదా, ఇహ మీరు మనుషులకి కనిపించటం.. కష్టాలు వినటం.. తీర్చటం చేయకూడదు, మరిచిపోయారా అని చెవిలో ఉదగానే నాలిక్కరుచుకొని దేవుడు మాయం అయ్యాడు. వీళ్ళకి మాత్రం ఆ expressions మిగిలాయి . అప్పటినుండి ఎప్పుడు కష్టాలు వచ్చినా అవే continue అవుతున్నాయి. అదీ అసలు సంగతి. ;)

Dec 1, 2011

విముక్త ( కథలు )

పురాణ కథల్లో నాయకులు ధర్మం కోసం పాటుపడి దాన్ని పునర్నిర్మించటానికి ప్రయత్నించి గెలిస్తే గెలుస్తారు గాక.. కాని ప్రతి పురాణ పురుషుడి వెనకా ఓ స్త్రీ హృదయపు ఆక్రందన ఉంది. స్వయవరంలో రాముడిని వరించి పెళ్ళిచేసుకొని అష్టకష్టాలు పడింది సీత. రాముడిని వలచి వచ్చి అవమానానికి గురయ్యి అంతులేని వేదనకి గురయ్యింది శూర్పణఖ.
అవతార పురుషుడిని వరించినా ధర్మబద్దంగా ఇద్దరికీ అన్యాయమే జరిగింది. .. అయినా ఆ ఇద్దరూ పోరాడి..మనసుని స్వాంతన పరచుకొని ఒంటరి జీవితాన్ని గడిపారు.
రామాయణంలో ఆవేదనకి గురయిన స్త్రీ పాత్రల గురించి చదవండి....ఆలోచించండి.

విముక్త ( కథలు ) రచన : ఓల్గా