Jul 26, 2011

ఆ 'నీవు' ఎవరో..??


జీవితంలో సాధించింది ఏమీ లేదనే బాధ నిద్ర పట్టనివ్వక.. 
తెల్లవారి నాలుగున్నరకి  మెలకువ వచ్చింది..
అసహనంగా అటు ఇటు దొర్లాను..
ఏమాత్రం ఉపశమించలేదు..
తలుపులు తెరుచుకొని బయటకి వెళ్లాను.
నీ జ్ఞాపకాన్ని మోసుకొచ్చిన  చిరుగాలి మొహాన్ని తాకింది.. 
మనసు కొంచం కుదుట పడింది..
ఆ 'నీవు' ఎవరో తెలిస్తే ఎంత బావుణ్ణు.

Jul 25, 2011

మాట్రిమొనీ కథలు ( కష్టాలు ) - 2

 క్రితం పోస్ట్ లో ఆ కాల్ సెంటర్ అమ్మయితో అంత ఆవేశంగా మాట్లాడటానికి కారణం ఉందండీ. అదేంటంటే... 

ఇంట్లో వాళ్ళ పోరు ఎక్కువైంది"పెళ్లి కోసం" .  నచ్చిన  అమ్మయినైనా వెతుక్కోవాలి లేదా మావాళ్ళు తెచ్చిన సంబంధం అయినా చేసుకోవాలి .  ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఇహ లాభం లేదని ప్రోఫైల్స్  సెర్చ్ చేస్తున్నాను. కులాంతర వివాహం కుదరదు కనక మా కమ్యూనిటీ వాళ్ళని వడబోసి వెతకటం ప్రారంభించా .
 ప్రొఫైల్ ఎలా తగలడ్డాయి అంటే...
సగానికి పైగా ప్రోఫైల్స్ కి ఫొటోలే లేవు. 
ఫోటో పెట్టిన వాళ్ళ మొహం బావుండదు.. సారీ ఇలా అనటానికి ఒక కారణం ఉంది. ఆ ఫోటోలు  పెళ్ళికోసం దిగిన   ఫోటోలు కాకుండా ఫ్రెండ్స్ తో తీసుకున్న ఫోటోలు.. వేరే ఫంక్షన్ లలో తీయించుకున్న ఫోటోలు . చాల వరకు మొబైల్ కెమేరాతో తెసినవి. అవి ఎం బావుంటాయి చెప్పండి ??  ఆ ఫోటోలు చూస్తుంటే చేసుకుంటే చేసుకో. లేకపోతే లేదు.. అన్నట్టు ఉన్నాయి. ఇంకొంత మంది ఓ నాలుగు మెట్లు ఎక్కి,  పక్కన ఎవడో అబ్బాయి ఉన్న ఫోటోలు  కూడా పెట్టారు ? వాడు బాయ్ ఫ్రెండ్ ఆ ..తమ్ముడా. అత్త కొడుకా.. ఎలా తెలిసేది ?  ఎంత  modren girl అయితే  మాత్రం  ఇలాగా  

horoscope  must match  అంటారు కాని వాళ్ళ horoscope   ఉండదు . 
partner preference :  I want a decent person as my life partner..
  వీళ్ళకి కావలసిన దేసెంట్ ఏంటో ఎలా తెలిసేది ?? 
ఇంకిత జ్ఞానం మనుస్కుల్లో బొత్తిగా కొరవడిందని నాకు ఇక్కడే జ్ఞానోదయం  అయ్యింది.
ఇలా వింత వింత ప్రొఫిలెస్ అన్నింటినీ దాటుకొని వెళుతుంటే   ఓ అమ్మాయి కొంచం మన టైపు లా ఉంది అని వివరాల్లోకి వెళ్ళాను,    మా అమ్మాయి  ముప్పై వేలు  సంపాదిస్తోంది .. . మీరో యాభై వేలు  సంపాదిస్తే తప్ప ఈ ప్రొఫైల్ చూసే  అర్హత లేదు అని  ఖరా ఖండిగా చెప్పాడు వాళ్ళ నాన్న . మూసుకొని  మూసేసాను.
అలా నేను వారం రోజుల పైగా.. రోజుకు నాలుగు గంటల చొప్పున.. వందలకి వందలు  ప్రోఫైల్స్  సెర్చ్ చేస్తుంటే   ఓ ప్రొఫైల్  తలుక్కున మెరిసింది. వివరాలు..ఫోటో.. haroscope అన్ని ఉన్నాయి. partner preference కుడా  సరిపోట్టే ఉంది.   అన్ని కలిసినట్టే అనిపించింది.   
" మీ ప్రొఫైల్ నచ్చింది .. మీకు నచ్చితే తెలియజేయండి"   నా ఇంట్రెస్ట్ ని express  చేసాను.
సరిగ్గా వారం తరవాత  "నాకు కుడా  మీ ప్రొఫైల్ నచ్చింది " అన్నట్టు నా ఇంట్రెస్ట్ ని accept  చేసినట్టు మెయిల్ వచ్చింది.
 ఆమె ప్రొఫైల్ ని ఒకటికి రెండు సార్లు చూడటం తో రెండురోజులు గడిచాయి.  మా కజిన్ ని పిలిపించా. వాడికి  జాతకాలూ...లెక్కలు వేయటం లో కొంచం ప్రవేశం ఉంది. నాకు వీటిమీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా  తరవాత  మా వాళ్ళు  పేచీ పెట్టకుండా, అదేదో మనమే చూస్తే .. అందుకే ...
" అన్నీ బానే కలుస్తున్నాయి"  అని మావాడు శుభం పలికాడు.

ఎవరైనా ఒకరికి మెంబెర్ షిప్పు ఉంటె తప్ప ఎదుటి వాళ్ళ ఫోన్ నెంబర్ /ఈ మెయిల్ కనపడదు.  నేను తీసుకోవలా ? లేక వాళ్ళే  తీసుకొని నాకు ఫోన్ చేస్తారా ? అని నేను టెన్షన్ పడుతోంటే ..
 " వాళ్ళ సంగతి వదిలెయ్యి. అమ్మాయి వాళ్ళు. నీలాంటి వాళ్ళు  వందమంది దొరుకుతారు వాళ్లకి .  కాని నీకు దొరకొద్దూ ".. అని మా వాడు చురుక్కు మనిపించాడు.
పచ్చినిజం వెలగకాయ లా అనిపించింది. అందుకే మరునాడే matrimony వాళ్ళకి పోనే చేశా.. ఎక్కడ  pay చేయాలో కనుక్కుందామని..
" సర్ ..మీరు కళ్ళు కదపకుండా అక్కడే కూర్చోండి  మా exicutive వస్తాడు మీ దగ్గరకి ..అరగంటలో.. కాదు కాదు ఇరవై నిముషాల్లో..
ఆహా .. ఏమి నా భాగ్యము.. ఏదో సామేత చెప్పినట్టు.. 'వెతకబోయిన తీగ కాళ్ళకు తగులుతుందని'. 
వచ్చాడు.. డబ్బు కట్టాను.. మెంబెర్ షిప్పు తీసుకున్నాను..  ఓ నలభై నమ్బెర్స్  చూసుకోవచ్చు .మూడు నెలల కాల వ్యవధిలో...

ఆ అమ్మాయి నెంబర్  నోట్ చేసుకున్నాను.... రెండు సార్లు ట్రై చేశా.   ఎవరు లిఫ్ట్ చేయటం లేదు.ఓ రోజు గడిచిపోయింది.
మరుసటి  రోజు ఉదయాన్నే ట్రై చేశా..ఓ ఆడ గొంతు.. నాకు టెన్షన్..రెండు సెకన్లలో టెన్షన్ తగ్గింది. ఆమె వాళ్ళమ్మ. 


మీ అమ్మాయి ప్రొఫైల్ చూసానండి. నచ్చింది.
మీరు కూడా నా ప్రొఫైల్ నచ్చినట్టు రిప్లై ఇచ్చారు. అందుకే ఫోన్ చేస్తున్నా..
మీ పేరు.. 
చెప్పాను
ఎం చేస్తుంటారు..
చెప్పాను 
డేట్ అఫ్ బర్త్ 
చెప్పాను
age difference  ఎక్కువుందండీ..
నాకు ఏంచెప్పాలో తెలియలేదు...అంటే ... కాని ....నేను ..మీరు ప్రొఫైల్ చూసారు కదండీ.. అయినా నేను అలా కనపడనండి...
మూడేళ్ళ కన్నా ఎక్కువ తేడా ఉంటె  మేము చేసుకోము .. అని ఏ మాత్రం  మొహమాటం లేకుండా  ఫోన్ పెట్టేసింది. 
అంతే....ఒక్క నిముషం నాకు మతి పోయింది.


నా ప్రొఫైల్  లో క్లియర్ గా అన్నీ రాసాను. చూడకుండానే మీ ప్రొఫైల్ నాకూ  నచ్చింది అని   రిప్లై ఇచ్చి.. 
తీరా నేను డబ్బులు కట్టి ఫోన్ చేస్తే...
 మూడేళ్ళ కంటే తేడా  సంబంధం మాకు వద్దు  అని ప్రొఫైల్ లో రాసి ఏడవచ్చు కదా...  దొంగ __


కోపం ముంచుకొచ్చి...ఫోన్ విసిరికొట్టే వాడినే. కాని మళ్ళీ మూడువేలు గుర్తొచ్చి...ఆ ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది.. :(


Jul 24, 2011

మాట్రిమొనీ కథలు ( కష్టాలు )


 సర్..  నేను ____________ matrimony  నించి మాట్లాడుతున్నాను.
చెప్పండి.
సర్ మీ ప్రొఫైల్ కి requests  వస్తున్నాయి కదా..
ఏమో..ఉండొచ్చు.. అయితే.
సర్ ..మీరు మెంబర్షిప్ తీసుకొంటే వాళ్ళతో కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా.
ఆ ముక్క వాళ్లకి చెప్పు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయలేరా..
ఆది కాదు సర్.. మెంబర్షిప్ తెసుకుంటే  మీకు నచ్చిన నలబై మందికి  తో కాంటాక్ట్ చేయవచ్చు. వాటిల్లో ఏదో ఒకటి కుదిరే ఛాన్స్ ఉంది కదా.
నాకు నచ్చితే.... వాళ్లకి నచ్చాలి కదా..
అదే వాళ్లకి నచ్చితే పెళ్లి కుదిరే అవకాశం ఉంది కదా..
వాళ్ళకి నచ్చితే మెంబర్స్ అయ్యి,  నా నెంబర్ యే వాళ్ళు తీసుకుంటారు కదా
సార్ ఆది కాదు...
ఏంటి కాదు. తొక్క.. నీ ......
మీ సైట్ లో ఒక్క ప్రొఫైల్ అయిన సరిగా ఉందా.. ఫోటో ఉంటే ఇన్ఫర్మేషన్ ఉండదు.. ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోటో పెట్టరు.  సరే ఫోటో ..ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోన్ నెంబర్ ఉండదు. ఫోన్ నెంబర్ ఉంటే ఆది పని చేయదు. వాళ్ళు ఇచ్చిన నెంబర్ వాళ్ళ దేనా కాదా అని మీరు inquiry   చేయరు. అసలా ప్రొఫైల్ పెట్టేవాడు పెళ్ళికి పెడుతున్నడా..సరదాకి పెడుతున్నాడో కూడా మీకు తెలియదు.  ఎవడూ పడితే వాడొచ్చి ప్రొఫైల్ పెట్టేస్తారు.

పోనీ  పెట్టినవాళ్లకి  ఆశ ఎక్కువ.
ప్రతి పోరీ కి చల్లగా జాబ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యే కావాలి. నెలకి ముప్పై నలభై  వేలు సంపాదించి దాని చేతిలో పోయాలి......
సర్ సర్... అదేం లేదు సర్..అన్ని రకాల వాళ్ళూ ...
హే ఆపు...నీ అమ్మ.. మీరే profiles create  చేసి... రిక్వెస్ట్ పంపించి...చూసారా మీకు రిక్వెస్ట్లు వస్తున్నాయి అని మెంబెర్షిప్ అంటగడతారు.
సర్ లేదు సర్ .. నిజంగా
అవునా... నీదేనా  ఈ సైట్..
కాదు సర్.. నేను employ ని...
కదా...మీ బాస్ ఎవరు ?
అదీ...actually....
తెలుసుకో.. తెలుసుకొని ..వాడిని నా దగ్గరకు పంపు.  నేను నేర్పిస్తా ..  మాట్రిమొనీ   సైట్ ఎలా ఉండాలో ఎలా సర్వీసు ఇవ్వాలో....అలాగే  జీతం వస్తుంది కదా అని కంపెనీ ఏంటో తెలియకుండా జాయిన్ కాకు...కొంచం జనాలకి ఉపయోగపడే కంపనీలో పనిచెయ్యి..

 సర్ ..:(

Jul 20, 2011

అర్థం అయ్యిందిగా ...!!నేను..నా మిత్రుడు ఒక కేఫ్ లో కూర్చున్నాం. 
చాయ్ తాగుతూ అదీ ఇదీ మాటలయ్యకా..
 " ఎంతకాలం ఇలా ?? future గురించి ఆలోచించు కొంచం " అన్నాను.
 వాడు మౌనంగా ఆలోచిస్తున్నాడు.
ఇంకో టీ తాగాం, ఆ మౌనం మధ్యలో..
" ఏం ఆలోచిస్తున్నావ్ ?
future గురించి ?
అదే ఏంటి అని ?
'' life after death" ఎలాఉంటుంది అని
నీ ఆమ్మ.. future అంటే.. మరీ అంత దూరం పోవద్దురా...
రేపు ఎల్లుండి..ఈ సంవత్సరం.. అంతే చాలు... :(

అర్థం అయ్యిందిగా నా మిత్రుడి పరిస్థితి.

Jul 11, 2011

"ఛీ.... నీ బతుకు "

డిగ్రీలో ఉండగా city బస్సు ప్రయాణం.. కోటి లో బస్సు ఎక్కేవాడిని. వయసు ప్రభావం వల్ల ..బస్సు ఎక్కగానే ముదుకు వెళ్ళటమే .. బస్సు రుష్ గా అయితే అమ్మాయిలు తాకక పోతారా అన్న ఆశకి. నా దురదృష్టానికి ..నేను ఎక్కినా బస్సు ఎప్పుడు ఖాళీ యే.. కానీ ఒక రోజు ...
రోజులాగే బస్సు ఎక్కాను.. ముదుకు వెళ్లి నిల్చున్నా. అదృష్టం పండి బస్సు రష్ గా అయ్యింది.
బిల బిల మంటూ ఆడాళ్ళు ఎక్కారు. నా చుట్టూ నించున్నారు. నేను వల్ల వైపు చూస్తే వెన్నకి వెళ్ళు అనో.. మరేదో ఇబ్బంది పడతారని.. ( తగిలే వాళ్ళూ తగలటం ఆపెస్తారని ) ...కిటికీ లోంచి బయటకే చూస్తున్న.. అటు ఇటు సర్దుబాటులో .. మెత్తగా ఎవరో తాకారు.. ఆ ఆనందాన్ని లోలోపలే అనుభవిస్తూ..మనసులోపలె కెవ్వు కేకలు. అలా బస్సు ప్రతి కుదుపుకు నా 'కక్కుర్తి సంతోషం'  .అమెకుడా నన్ను ఏమాత్రం తలలనట్టే ఉంది. ఇది ఆమెకీ ఇష్టమేమో అనే ధ్యాస లో  నేను. అరగంట తరవాత నా stop వచ్చింది ..
సరే దిగిపోయే ముందు .. నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన సుందరరూపాన్ని దర్శించుకుందామని వెనక్కి తిరిగాను..
అంతే....  " ఛీ... నీ బతుకు"  అని నన్ను నేనే తిట్టుకోవాల్సి వచ్చింది..
ఎందుకంటే...
.....
............ఆమె ఓ పండు ముసలి. 
ఇహ అప్పటినుంచి .. బస్సులో ముందుకు వెళ్లి నించోవటం చేయలేదు.

Jul 8, 2011

నేనూ ఒక scam చేసానండోయ్ ..

నేను ఇంటర్ చదివేటప్పుడు నాకు యమా సినిమాల పిచ్చి. ఇదీ అదీ అని కాకుండా అన్ని సినిమాలు.. కానీ జేబులో డబ్బు ఉండేది కాదు. ఎప్పుడు జేబులు గల గల లాడినా తిండి లేకున్నా  కాలేజీ ఎగ్గొట్టి సినిమాలో దూరేవాడిని.
మా ఫ్రెండ్ ఒకతనికి స్కాలర్ షిప్ వచ్చింది కాని అతడు అప్పటికే కాలేజి వదిలి పోయాడు. ఇంకో ఇద్దరు మిత్రులు నాకు  విషయం  చెప్పి,  అతని  పేరు మీద నా identity కార్డ్ తయారు చేసారు.నా పేస్ features కొంచం అతనిలాగే ఉంటాయి మరి. నేను చేయవలసిన పనల్లా ప్రిన్సిపాల్ ని కలిసి చెక్ తీసుకోవాలి. 
స్కాలర్ షిప్ వచ్చిన వాళ్ళందరూ ప్రిన్సిపాల్ ని కలవాలి. అతను రెండో మూడో ప్రశ్నలు వేస్తాడు. సమాధానం చెప్పాలి. చెక్ మీద sign చేసి మన చేతికి ఇస్తాడు. పక్కనే  register లో మనం చెక్ తీసుకున్నట్టు సంతకం చేయాలి. ఆ తరవాత మీకు తెలుసుగా..డబ్బు మనదే.
ఆది గవర్నమెంట్ కాలేజీ కనక  వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. ఎవరు ఎవరో ప్రిన్సిపాల్  గుర్తుపట్టే ఛాన్స్ యే లేదు అని అని నన్నుlure చేసారు.
డబ్బు ..అ డబ్బు తో చూసే సినిమాల లిస్టు కళ్ళముందు కనపడే సరికి నేను scam లో పాలు పంచుకున్నా.
   భయం భయంగా ఆ రోజు ఆఫీసు ముందు నిల్చున్న.. ప్రకాష్ అని పిలిచారు , నేను చుట్టూ చూస్తున్న.. నాపక్కన ఫ్రెండ్ నన్ను డొక్కలో పొడిచాడు అప్పుడు గుర్తొచ్చింది నేనే ప్రకాష్ అని. గుండె ని అదిమి పట్టి లోపలికేల్లాను. 
నీ పేరు.. 
చా.ప్రకాష్ సర్..
గ్రూప్.. మ్మ్ మ్మ్  MPC..
మీ నాన్న ఏం చేస్తాడు..
వ్యవసాయం.  
అతను మాములుగా చూసినా నన్ను అనుమానం తో చూస్తున్నాడేమో అని అనిపించింది. భయం వేసింది . ఈ లోపు చెక్ మీద సంతకం పెట్టి నా చేతికి అందించాడు బాగా చదువుకో అంటూ.. నేను registerలో సంతకం చేస్తుంటే ఇంకో విద్యార్ధి వచ్చాడు.  హమ్మయ్య ఇహ నన్నెవరు గమనించరు అనుకొని .. చెక్ తెసుకొని ఆఫీసు రూం బయటికి రాగానే పరుగో పరుగు.. మళ్లీ ఏ అనుమానం వచ్చి వెనక్కి పిలుస్తారో  అని. హహ్హ 
మొత్తానికి 325 రూపాయలు వచ్చింది నా వంతుకి. :) :)Jul 7, 2011

సముద్రం..

లోకంలోని సంతోషాన్ని తనదిగా కేరింతలు కొట్టే అలల సముద్రం.
ఒక ఆనంద తరంగం ఈ సముద్రం.
ఒక తుళ్ళింత  ఈ సముద్రం.
ఒక లాలింపు ఈ సముద్రం..
ప్రపంచపు బాధనంతా   నిండుగా నింపుకున్న కన్నీటి సముద్రం..
ఒక ఎదగోష ఈ సముద్రం..
ఎడతెగని తపన ఈ సముద్రం..
ఎగసిపడే ఆరాటం ఈ సముద్రం..

Jul 1, 2011

తేడాఏమీ లేదు

ఇండియా.. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇదో గమ్మత్తయిన దేశం. ఎటు చూసినా మూడనమ్మకాలు..సెంటిమెంట్లు, అర్థం లేని ఆచారాలు. 
కుల మతాలతో వచ్చే కుళ్ళు కంపుని ఇంపుగా పీలుస్తారు. 
బయటికి బాగానే నవ్వుతారు..కాని లోపల అంత విషమే....
స్త్రీ లను గౌరవించటం మన సాంప్రదాయమ అంటూనే..."స్త్రీ" మీద రోజూ  అఘాయిత్యమే. 
'చదువు' కేవలం ఉద్యోగానికే ఉపయోగిస్తారు తప్ప తర్కానికి కాదు. .
దుర్గ..సరస్వతి ..లక్మి అని పుజిస్తూనే..చంటి దాన్ని గొంతు నులుపుతారు. 
దేవుడు అంటే భయం..కానీ మనుషులని చంపటం ఆగదు. స్త్రీ అంటే గౌరవం...మాన భంగాలు ఆగవు. 
ఇంతకు మునుపు 'స్త్రీ ' ని భర్త చావగానే చితిలో కాలిపో అన్నారు.. ఇప్పుడు గర్భం లోనే మాడిపో అంటున్నారు. తేడాఏమీ  లేదు ..కేవలం కాలం మారింది అంతే. 
స్త్రీ ని ఇంతగా exploit చేసిన దేశం ఇంకేది  లేదు.