May 31, 2011

మహేష్ బాబు" ad " ఇస్తాడా ??


పదరా.... చెరుకురసం తాగుదాం..

చెరుకు రసమా ??  నాకొద్దు.. Pepsi..or sprite ! 


ఎందుకు..?? 


చూడరా, ఆ చెరుకు ఆల్మోస్ట్ ఎండి పోయింది..
అదేం తాగుతాం.??

 తాగేవాళ్లు లేకపోతే ఫ్రెష్ చెరుకు  తెచ్చి ఏం చేస్తుకుంటాడు? వాడు మాత్రం, ..అదీ వాడిపోతుంది.అయినా నీ Pepsi మాత్రం ఫ్రెష్ ఆ ..ఏ మురుగు నీళ్ళో  ఏంటో..
ఛీ ఛీ..అలా అంటావేంట్రా..

ఏదో పిల్లలు ads చూసి attract అయితే అయ్యారు..కాని నీకేమైంది ?? 

అంటే...? 

 "బాబూ...చెరుకు రసం తాగండి  అని 'మహేష్ బాబు'  "ad" ఇస్తాడా ??
కొబ్బరి బొండాం తాగండి అని 'రామ్ చరణ్' అంటాడా ??
'కుర్కురే ని కరకర లాడించండి' అని  advertisement ఇస్తారు కాని.. కానీ 'మక్కజొన్న కంకి మంచి బలం'..తినండి అని ad ఉంటుందా ?? 

అనడు..ఉండదు..

సో ఏం తెలుసుకున్నావ్ ?? 


ప్రకృతి సిద్దమైన ఆహారమే తీసుకోండి.... వీలైనంతవరకు..
have natural food ,,where ever possible . 

వెరీ గుడ్ .. :)

ఓ టపా కొడుతున్నా..


నేను మళ్లీ బస్సు ఎక్కాను,
ఎక్కితే..??
ఎక్కితే.. ఏముంది ఓ టపా కొడుతున్నా మీ మొహాన.. 
ఏంటి మీరు సిటీ బస్ ఎక్కినప్పుడల్లా ఓ టపా రాస్తారా.. ఈ రకంగా,మీరు రోజు బస్సు ఎక్కితే రోజు టపా టపా కొట్టేట్టు ఉన్నారే.. ??
ఏమో టపా టపా టపా కొట్టొచ్చు.. లేదా చేతులు నొప్పి పెట్టి  కొట్టక పోవచ్చు.

ఈసారి ఫుల్ రష్ గా ఉంది బస్సు..
నేను బస్సు కొంచం ఖాళీగా ఉన్నపుడే ఎక్కా కాబట్టి.. సీట్ దొరికింది.
అటు ఇటు చూస్తూ ...అందరి మొహాలు గమనించటం మొదలు పెట్టాను.
అందరూ దీర్ఘాలోచనల్లో పడిపోయారు. ఏం ఆలోచిస్తున్నారో..
జీవితాన్ని గురించా..జీతం గురించా...బాస్ గురించా..భవిష్యత్తు గురించా... బాధల గురించా భయాల గురించా.. తెలియదు.. కాని తీవ్రమైన ఆలోచనలు మాత్రం చేస్తున్నారని వల్ల మొహం బట్టి చెప్పెయవచ్చు. లేదు  వాళ్ళూ నాలాగే ఎదుటి వల్ల గురించే అలోచిస్తున్నరేమో. ఎందుకంటే  ఎక్కి దిగుతున్న ప్రయానికులనీ గమనిస్తున్నారు.  ఒక్క మొహంలో సంతోషం ఏ కోశానా కనబడటం లేదు. ఎందుకొచ్చిన జీవితం రా అన్నట్టే ఉంది. నేట్టలేక నేడుతున్నట్టే ఉంది. ఓ వైపు ఎండా తీవ్రత ..ఉక్కపోత..ఇంకోవైపు జీవితం.
 కండక్టర్  అప్పుడప్పుడు టికెట్ టికెట్ అనటం  బయట వాహనాల రోద తప్ప మా బస్ లో మాత్రం  ' నిశబ్ధం ' .

ఆ  నిశబ్దాన్ని తట్టుకోలేకో ఏమో  ఒక నడి వయసు.. నడి వయసు అంటే  నలబై పైన అని అర్థం.. ఆ నడివయసు ముసల్మాన్ తన ఫోన్ తీసి mp3 ప్లేయర్ ఆన్ చేసాడు..
" మై దునియా బులాదుంగా.. ....తేరీ చాహత్ మే.. ఓ దుశుమన్ జమాన..  ముఝుకో  నా బులాన..మై  ఖుదుకో  మిటా దుంగా.. ..మై దునియా బులాదుంగీ..." అయన జీవితం ఆశీఖీ  పాట దగ్గరే ఆగిపోయినట్టుంది..
అప్పట్లో తన ప్రేయసి తో చూసిన మొదటి సినిమానో..లేక చివరి సినిమానో..
కళ్ళు మూసుకొని  శ్రద్దగా వింటూ..ఏవో ఏవో జ్ఞాపకాల్లోకి జారిపోయాడు.. 

 ఇంతలో ఇద్దరు యువకులు ఎక్కారు ఒక స్టాప్ లో.. Engineering స్టూడెంట్స్ లా ఉన్నారు..
వెలిగిపోతున్నాయి మొహాలు.. నవ్వుతో.. ఏదో చెప్పుకుంటూ పడి పడి నవ్వినట్టు ఉన్నారు
బస్సు ఎక్కగానే అదే కంటిన్యూ చేసారు.
ఆర్ నవీన్ గాడు ...ఏం చేసిండో తెల్సా... హ హ హ హ..
హ హ హ... సగం కుడా చెప్పకుండా నవ్వుతున్నారు..
వాళ్ళకే అర్థం అవుతోంది .. పట్టలేని నవ్వు ...ఆది.
ఇహ బస్సులో అందరి దృష్టీ వాళ్ళ మీదకి  మళ్ళింది..
అందరూ తమ తమ ఆలోచనల్లోంచి బయటికి వచ్చి వీళ్ళని చూస్తున్నారు..

వాళ్ళ  నవ్వు చూసి..తెలీకుండానే అందరి మొహాల్లో చిరునవ్వు విరిసింది.. నా మొహం లో కూడా...

ఇందులో  ఏముందని ?? ఇందులోఎం  పెద్ద  విషయముందని టపా రాసారు ?
జీవితంలో లాగే బస్సు లోను ఏముంటుంది ?  ఏమి ఉండదు.  జీవితం అంటే సినిమాల్లో చూపించినట్టు ఓ ఆనంద కరమైన సన్నివేశం దగ్గర 'శుభం' వేయలేం కదా.. తరవాత సన్నివేశాల  కొనసాగింపు ఉంటుంది మరి.
 ohh అయితే ఈ టపాకి శుభం వేయలేదన్న మాట?? ఇంకా ఏదో మిగిలుందన్న మాట..
అదీ చెప్పేడవండి ,..ఒకేసారి ..
'లేదు'లే మరోసారి చెపుతా..ఇప్పటికే మీరు విసిగి పోయి ఉన్నారు.
అదెప్పుడో ?? 
మళ్ళీ బస్ ఎక్కినప్పుడు .. :) :) 
హే పో...

May 30, 2011

ఓ పరిమళం..
మల్లి కి నాకు చిన్నపటినుంచి ఫ్రెండ్ షిప్.  'మల్లి' అంటే.. ఏదో కోయ,,చెంచు జాతి అమ్మాయో అనుకునేరు. మల్లె పువ్వు..
ఎక్కడ కనపడ్డా ఒకటి తీసి జేబులో వేసుకునేవాడిని.
పచ్చని కాడకి తెల్లగా  విరిసీ విరియని రెక్కలతో.. ముడుచుకొని కూర్చున్న అమ్మాయిలా అనిపించేది మల్లె మొగ్గ..
ఆ చిన్ని రేకుల మధ్య ఎన్ని ఎన్ని అత్తరు బుడ్లు దాచుకుందో..తెల్లవార్లు ఒకటే గుభాలింపు.

సైదాబాద్ లో ఉండేటప్పుడు, రోజు ఇంటికెళ్ళే టైం కి అంటే 9- 10pm మధ్య చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జి మీద నుండి వెళ్ళేవాడిని..
ఆ బ్రిడ్జి మీద ఒక పక్కన మల్లె పుదండలు అమ్మే వాళ్ళు
బైకుల మీద వెళ్తున్న జంటలు ఆగి,  కొని తలలో ముడుచుకొని మొగుడికి హత్తుకొని కూర్చొని ఝాం అని వెళ్లి పోయేవాళ్ళు.
ఒంటరి భర్తలు..పూలు పొట్లం కట్టించుకొని హుషారుగా వెళ్ళేవాళ్ళు..
నాలాంటి వాళ్ళు  అంటే  బ్రహ్మచారులు..వాళ్ళ మొహాలు చూసి 'హ్మం'  పెద్ద నిట్టూరూపులు..  


నిన్న మళ్లీ ఆ పరిమళం పలకరించింది..
పలకరిస్తూనే ..పాత  సంగతులు గుర్తుకు తెచ్చింది...  :)

May 29, 2011

పచ్చి నిజంఓ అమ్మాయి, .. బానే చదువుకుంది..ఏదో జాబ్ కూడా చేస్తోంది..పెళ్లి వయసు వచ్చేసింది..ఓ పిల్లాడిని చూసారు తల్లిదండ్రులు.. పెద్దగా నచ్చక పోయినా...మిగతా అన్ని ఓకే అయ్యాయి కనక ..తనూ ఓకే అంది.

అతను ఫోన్లు చేయటం మొదలెట్టాడు..మొబైల్ లో మాటలు..నిముషాల్లోంచి గంటల్లోకి మారుతున్నాయి.. కలుద్దామా అని అడిగాడు.  చేసుకోబోయే వాడు డిన్నర్ కి రమ్మంటే ..కాదు అనలేదు కదా..  సరే అంది. ఆఫీస్ నుండి నేరుగా కలవాల్సిన చోటుకి వెళ్ళింది.  ఇద్దరు కలిసి మంచి భోజనం చేసారు..ఇంటికి వెళ్దామా..అన్నాడు. ఇప్పుడొద్దు లేట్ అయ్యింది అంది.. పర్లేదు .నేను డ్రాప్ చేస్తాగా... మొహమాటం తో వెళ్ళింది..ఇంట్లో ఎవరూ లేరు..వాళ్ళ అమ్మ నాన్న ఏదో పెళ్ళికి వెళ్ళారని చెప్పాడు.

ఆ విషయం అక్కడే చెప్పి ఉండాల్సింది కదా..అని మనసులో అనుకుంది. 
ఆమాట ఈ మాట చెపుతూనే.. మెల్లిగా దగ్గరికి వచ్చి గబుక్కున పట్టేసాడు.
no..i don't like it అంది.
అర్రే.. I am  Ur fiance yaar అన్నాడు, కాని వదలలేదు..
వదిలిన్చుకుందాం అన్న ప్రయత్నం  బెడిసింది.

ఎందుకో మనసు అంగీకరించటం లేదు.. ఇంకా అతని గురించి పూర్తిగా తెలియలేదు. ఒకవేళ తెలిసినా అంగీకరించేది కాదేమో.  అంతా పెళ్ళయ్యాకే అని కుడా తానూ అనుకోవటం లేదు..కాని  ఎందుకో నచ్చలేదు.
కోపం వస్తోంది..పట్టుకున్నవాడు...ఊరుకుంటాడా..ఎక్కడెక్కడో తడుముతున్నాడు. మనసుకీ..శరీరానికి కుడా అది నచ్చటం లేదు.
అతని పట్టులో ప్రేమ కంటే.. కామం కనపడుతోంది..పశుత్వం  తెలుస్తోంది.

ఆడది అపురూపంగా..ప్రేమగా అందివ్వ వలసినది..బలవంతంగా లాక్కుంటున్నాడు.
వీడినా నేను కట్టుకోబోయేది...అనే ఆలోచన వచ్చేసింది..దాంతో కోపం కట్టలు తెగింది..
u ..   IDIOT ...leave me..అని ..ఎంత బిగ్గరగా అరిచిందంటే.. 
అ అరుపుకి వదిలాడు..భయపడ్డాడో.. సిగ్గు పడ్డాడో ..ఏదో తప్పు చేసినట్టు నటించాడో...తెలిదు, I am సారీ అని మాత్రం అన్నాడు.. 

వినిపించుకోకుండా.. బాగ్ తీసుకొని  వచ్చేసింది..

గంటకోసారి   తన ఫోన్ మోగుతోంది.. కానీ  ఫోన్ లిఫ్ట్ చేయలేదు..
ఆరోజు ముహూర్తాలు పెట్టుకుందాం అని ఇంట్లో మాట్లడుకొంతుంటే,
I don't like this alliance అంది..
hey are u mad.. అన్ని కలిసాక....మొన్న ఓకే అన్నావ్ కదా. వాళ్ళ నాన్న అరిచినట్టు అన్నాడు..
yes,  but now I don't like...
hey what are u saying..u have gone mad..
I don't like it.. అంతే..చెప్పి విసురుగా వెళ్ళిపోయింది లోపలికి..
ఏం చెపుతుంది..rape attempt చేసాడని చెపుతుందా .. కాబోయే అల్లుడు ?

లోపలి వచ్చాడు వాళ్ళ నాన్న..
నీవేం  అన్నా..ఈ పెళ్లి జరగటం ఖాయం..మళ్లీ పిల్లాణ్ణి వెతికే ఓపిక లేదు నాకు.
ఆ చిన్న దానికి ఎన్నో   మంచి సంభందాలు వస్తుంటే వదిలేస్తున్నాం..............నీ వల్ల.

ఈ మాట గుండెల్లో కత్తి లాగా దిగింది.. బాధ ఎగజిమ్మింది..
" ఆడదానికి అందమే ప్రధానం...ఎంత పచ్చి నిజం.? కొంచం చామన ఛాయా గా ఉండటమే తను చేసుకున్న పాపమా..?? తన రూపం తను కోరుకున్నదా..?? ఎంచుకున్నదా ??
రాత్రింబవళ్ళు చదివి pg లో సాధించిన  gold medal కి విలువ లేదు.. నెలకి సంపాదించే పదిహేను వేలకీ విలువ లేదు..వ్యక్తిత్వానికి .. తెలివికీ ..ఆలోచనలకీ ...ఆశయాలకీ.. దేనికీ విలువలేదు, కేవలం తన ఒంటి రంగు ..నిగారింపు..శరీర సౌష్టవం ..దీనికే విలువ సమాజం లో.. సమాజం సంగతి వదిలేస్తే, ...నాన్న కూడ అదే మాట అంతోంటే ...దానికి అమ్మ నోరెత్తకుండా చూస్తుంటే.. ఎందుకో తనవాళ్ళే  తన  గుండె కోసినట్టనిపించింది.
ఎంత సేపూ ఏడ్చిందో తెలిదు.. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలిదు.. కాని ఆ ఏడుపు లోంచి ఒక గట్టి నిర్ణయం మాత్రం తీసుకుంది.
తను కొన్నాళ్ళు ప్రశాంతంగా బతకాలని..independent గా ఉండాలని..తన నిర్ణయాలు తనే తీసుకోవాలని..జీవితాన్ని చవి  చూడాలని.. ఎక్కడికైనా  వెళ్లి పోవాలని నిర్ణయించుకుంది..

May 25, 2011

ఆరెంజ్.........

 
ఓ పెద్ద బిల్డింగ్.. చుట్టూ ఎత్తైన కంపొండ్  గోడ.. ఓ పెద్ద గేటు.. తీహార్ జైలుకి కుడా ఇటువంటిదే ఉంటుందని నా ఉహ..
ఇంతకీ అదేమిటంటే.. మా చదువుల దేవాలయం..బడి..
..తెల్లని బురఖాలతో దేవదూతల్లా 'సిస్టర్స్' ..కనిపించటానికి దేవదూతలే..కానే బెత్తెం చేతికోచ్చిందంటే..పిశాచాలే. ఒక్కడు అల్లరి చేసినా దాదాపు అందరికీ వీపు పగిలేది.. ఎందుకు అంతగా  కొడతారో అప్పట్లో తెలిదు ఇదంతా..sexual frustration అని.  కాని నేను దెబ్బలు తిన్న సందర్భాలు ఏ ఒకటో రెండో..ఎందుకంటే ఈ దెబ్బల బాధ తప్పించుకోటానికి..నేను చెప్పింది చెప్పినట్టు చదివే వాడిని.  దాంతో ఏ ప్రశ్నకైనా టక్కున సమాధానం వచ్చేది. ..ఒకవేళ ఒక్కోసారి చెప్పలేకపోయినా...నా "బానే చదివే"  మొహం చూసి..క్షమించి వదిలేసేవాళ్ళు, లేదా దెబ్బ తీవ్రత తగ్గించే వాళ్ళు. దెబ్బలు తప్పించుకోటానికీ చదువు మీద శ్రద్ద కాని..ఆ చదువు ఎందుకో అర్థం అయ్యేది కాదు. .సున్నం బట్టీ...ఇటుకల తయారీ . పొటాషియం పర్మాంగనేటు ...చర్మం అడ్డుకోత..ముత్ర పిండాలు.. అమెరికా గడ్డి మైదానాలు...గోధుమ పండే రాష్ట్రాలు...

స్కూల్ ల్లోకి అడుగు పెట్టింది మొదలు.. మనసంతా  రెండు పీరియడ్ల తరవాత కొట్టే విశ్రాంతి గంట  మీదే. అప్పట్లో చేతికి గడియారాల పాడా..  కారిడార్ లో నీడలు  చూసేవాళ్ళం..అవే చెప్పేవి మాకు ఎప్పుడు ఏ బెల్లు కొడతారో అని. అందుకే ఆ నీడల్లోనే మా ప్రాణం . ఆ నీడ మేము అనుకున్న చోటుకి పాకుతోందంటే ఉత్సాహం ఎక్కువయ్యేది. 

విరామం లో గేటు బయట చిన్న పాటి జాతరే... ఎన్నో రకాల తిను బండారాలు  అమ్మేవాళ్ళు  మాకోసం కాచుక్కుచునే వాళ్ళు, తట్టుసంచీ పరచుకొని. ఒకామె పల్లీపట్టే..నువ్వుల పట్టే..పుట్నాల పట్టీలు అమ్మితే..ఇంకో అమ్మ..ఉదికేసిన కందగడ్డ..పల్లీలు శనగలు...ఇంకో అమ్మమ్మ ..కొబ్బరి గోలీలు..సంత్ర,..నిమ్మ గోలీలు నామాల గోలీలు.. మరోఆమె...బంతులు..లాయిలప్పలు..బొంగరాలు... లాంటి ఆట వస్తువులు.. ఇహ ఐస్ క్రీం బండి వాడి గురించి చెప్పనే అక్కరలేదు.. ఎక్కువ మంది పిల్లలు వాడి చుట్టే ముగేవారు.. ఎరుపు..ఆకుపచ్చ..తెలుపు..ముదురు పింకు రంగులతో..వెదురు పుల్లకి అంటుకొని బాగా ఆకర్షిచేవి. పది పైసలకి ఇలాంటివి.. అదే 25 పైసలయితే..పాల ఐస్ క్రీం. అదే 50 పైసలయితే  ... ఆరంజ్ లేదా..కోకాకోలా ఇసుక్రీం.
నాదగ్గర మహా అయితే పది పైసల కంటే ఎక్కువ ఎడిస్తేగా. కాని ఆ పది పైసల ఇసుక్రీం చల్లగా తప్ప తియ్యగా ఉండదు కనక మనసంత ఆ ఆరెంజ్ మీదే.  
ఓ రోజు ఇహ లాభం లేదని ఓ పథకం వేశా.. పరీక్షలో నా ముందు వెనకా ..అటు ఇటు ఎవరు అని గమనిస్తే.. ముందు విజయ్ గాడు.. వెనకా  శరత్ గాడు.. వీళ్ళతో లాభం లేదు.కాని అటు ఇటు..రాజు గాడు..నవీన్ గాడు. అః..ఇద్దరు మొద్దు మొహాలే . తన్నులు తినని రోజే  లేదు వాళ్ళు . పరీక్షల్లో ఫెయిల్ అయిన రోజు రెట్టింపు దెబ్బలు ..కనక వాళ్ళతో ఓ ఒప్పందం చేసుకున్న.. పరీక్షల్లో పాస్ మార్కులు వచ్చే విధంగా నేను చూపిస్తా ... బదులుగా నాకో ఆరెంజ్ ఐస్ క్రీం కొనివ్వాలి అని.  నవీన్ గాడు వెనకా ముందు ఆలోచించక..సరే  అన్నాడు. ఎందుకంటే.. వాడి జేబులో ఎప్పుడు లక్మి దేవి గల గల లాడేది.  ప్రతి  రోజు ఒకటో రెండో  రూపాయలు ఖర్చు చేసేవాడు.  ఇహ రాజు గాడు మాత్రం...పాల ఐస్ క్రీం కంటే ఎక్కువ ఇవ్వలేను అన్నాడు.వాడి దీనమైన  ముఖం చూసి..సరే అన్నాను.

అప్పటినుంచీ పరీక్షలొచ్చాయి అంటే  యమ హుషారు గా చదివే వాడిని..
మా వాళ్లకేం తెలుసు నా చదువంతా ఆరెంజ్ ఐస్ క్రీం కోసమని .. :) :)

May 24, 2011

మళ్ళీ ఎప్పుడో...

 
 పుస్తకాలు సర్దుతోంటే.. పుస్తకాల వెనక సాక్స్ లోంచి జారి పడ్డాయి..గోలీలు.  ఎన్నాళ్ళ  నుంచి  బందించావో తెలుసా..అంటూ చెంగు చెంగున దూకుతూ ఒక్కోటి.. ఒక్కో మూలకి పరిగెత్తి దాక్కున్నాయి..
నేను ఒక్కొక్కటీ వెతకటం మొదలు పెట్టాను. కంప్యూటర్ టేబుల్ కాలికి అటుపక్కన నక్కికూర్చుంది  పాలపిట్ట. చిన్ని గాజు గోలి కి మధ్యలో మల్లె పువ్వులా తెల్లని మరక. అన్నింటిలోకి చిన్నగా ఉన్న గోలీ ని 'పిట్టి' అని పిలిచే వాళ్ళం.  
 చీపురు కట్ట వెనకాల నక్కింది బెల్లం రంగు గోలీ.. న్యూస్ పేపర్ కింద దాక్కుంది  ఎరుపుది . టేబుల్ ఫ్యాన్ పక్కగా అకుపచ్చది...ఇలా రంగు రంగుల గోలీలు....అన్నీ ఏరాను.
స్కూల్ బాగ్ గూట్లోకి విసిరి కొట్టి... నా గోలీలా డబ్బా తీసుకొని  తోటలోకి పరిగెత్తేవాడిని. మా ఇంటికి ఎదురుగా..రోడ్డుకు అటువైపున ఉన్న ఇళ్ళ వెనకాల  చింత చెట్లు..మామిడి చెట్లు..వేప చెట్లు ఉన్నాయి..వాటి కిందే మా ఆటలన్నీ ..
నేను గోలీలు కొన్నది బహు తక్కువ.. ఎప్పుడు ఎవరిదగ్గరైనా అప్పు తో మొదలు పెట్టి  ఆటలో గెలిచి అప్పు తీర్చేవాడిని.మా ఏరియా లో గోలీ ఆటలో మనది సిద్ద హస్తమే. బాగా గెలిచి అక్కడి కక్కడ అమ్మేవాడిని.
మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు గోలీలు ఆడనిచ్చేవాళ్ళు కాదు. దుమ్ములో ఆడటం ..కొట్లాటలు.. వాటిని అమ్మటం..ఇవేవీ వాళ్ళకి నచ్చేది కాదు. అలా అని నేను ఉరుకున్నదీ లేదు. 

తల రెండో ..నాలుగో.. గోలీలు వేసికొని..ఒక పెద్ద గుండ్రం లోకి విసరటం.. చిపించిన గోలీని గురిచూసి కొట్టటం... తగిలిందా..తగిలి మిగతావాటికి తగలకుండా..కొట్టిందీ..తగిలిందీ రెండు గుండ్రం బయటకి పరిగేట్టాయా.. ఇహ మనవే ఆ గోలీలన్నీ.. ఒకవేళ వేరే దానికి తగిలినా..కొట్టింది గుండ్రం బయటకి రాకపోయినా..బొచ్చే ...
ఇదీ బొంబాయి ఆట..

ఒక చిన్న గుండ్రమో...చేతురస్రమో గీసి..అందుకో తలా కొన్ని గోలీలు వేసి ..పేర్చి.. బొటన వేలిని నేలమీద  ఉంది..చూపుడు/మధ్య వేలితో గాట్టిగా ఆ గోలీలని కొట్టటం.. అలా ఎన్ని గోలీలు బయటికి వస్తే అన్నీ మనవే. ఒకవేళ కొట్టింది అక్కడే చిక్కిందా మనం అవుట్.  
ఎవడు కనిపెట్టాడో కానీ భలే గా ఉండేవి ఆటలు.

అలా రెండు గంటలు దుమ్ములో ఆది..ఇరవై..ముప్పై గోలీలు గెలిచి  అమ్మితే   తెల్లారికి పాకెట్ మనీ దొరికేది రూపాయో..ఆటానా నో.. తెల్లారి బడి దగ్గర ఎం కొనుక్కొని తిందామా అని ఉహిస్తూ..నోట్లో నీళ్ళురేది
మిగిలిన గోలీలు జేబులో వేసుకొని మళ్ళీ ఇంటికి పరుగు ..గోలీలు  ఊరుకుంటాయా.....గళ్ళు గళ్ళు మని ఒకటే చప్పుడు.. నా ఆనందాని తాము వ్యక్త పరుస్తూ..
ఆ చప్పుడు అమ్మ గానీ వినిందంటే  మీ బతుకు మోరీ పాలే అని చెప్పి జేబుల్లో చేతులు దూర్చి వాటి నోరు నొక్కే వాడిని.
చప్పుడు కాకుండా ఓ డబ్బాలో వేసి  పుస్తకాల వెనకాల దాచేసేవాడిని.
సాయంత్రం నాతో పాటే వాటికీ ఓ రెండుగంటల స్వేఛ్చ.అందుకే అటు ఇటు..దొర్లుతూ పరిగెత్తేవి..

ఏరిన జ్ఞాపకాలని మళ్ళీ సాక్స్ లో వేసి మూటకట్టి పుస్తకాల వెనక పెట్టాను...మళ్ళీ వాటికి స్వేఛ్చ ఎప్పుడో...

May 18, 2011

నింగిలో..మెరుపులా..

 
Thunder

  నీ చూపుల్లో ప్రేమలేఖలు చదవకముందే..
నీ మాటల్లో కవిత్వాని ఎరగక ముందే..
నీ నవ్వులో ముత్యాల అలికిడి వినకముందే..
నీ నడకలో హంసలని పోల్చుకోక ముందే..
నీ చేతి స్పర్శలో  వెన్నల వేడిని గుర్తించక ముందే..
నీ ముద్దులో అమృతపు రుచిని చూడకముందే.. 
నీ ఆలింగనంలో  స్వర్గపు దారులు తెలియకముందే..
తలుక్కున మెరిసి మాయంయ్యావా........యవ్వనమా..?? 

May 17, 2011

ప్రొడ్యూసర్ కి "కథ" ఎలా చెప్పకూడదు...

 
హీరో ఎదురుగ విలన్ ని చూపిస్తాం. ఇప్పుడే jimmy మీద కెమేరా ఉంటుంది . హీరో పిడికిలి భిగించాడు. పిడికిలి భిగించటం క్లోజ్ అప్ లోంచి ..బ్యాక్ వస్తూ ... హీరో కాళ్ళ కిందనుంచి మెల్లిగా టాప్ angle కి వస్తుంది కెమేరా .. హీరో ఒక్క గుద్దు గుద్దుదాం అనుకునేంతలో ఎదురుగా విలన్ ఉండడు.. హీరోయిన్ ఉంటుంది..హీరో షాక్..  ఎందుకంటే .. విలన్ ఉండాల్సిన ప్లేస్ లో హీరోయిన్ ఎలా వచ్చింది అని. కాని.. కెమేరా కాళ్ళ కిందనుంచి తల మీదకి పోయే టప్పుడు హీరో పిడికిలి భిగిసిందో లేదో అని ఒకసారి చూసుకున్నాడు. సరిగ్గా అప్పుడే..విలన్కి పారిపోయే టైం దొరికింది. హీరోయిన్ హీరోని వెతుక్కుని వచ్చేసింది. ఇలా కథ చెపుతుంటే.. హీరో హీరోయిన్ని ఎక్కడికో తీసుకెళతాడు.. ప్రొడ్యూసర్ గారు విలన్ తో చెయ్యి కలిపి పారిపోతాడు. ఇక మిగిలేది మనమే....  :) :)

ఎలాంటి అబ్బాయి కావలి.

అవునూ...  ఎలాంటి అబ్బాయి కావలి..?? 
 నాకంటే కొంచం హైటూ... సాఫ్ట్ వేర్ ఇంజనీరు.. అమెరికా లో సెటిల్ అయితే బెశ్టు...
 అమ్మయిలకి ఆశ ఎక్కువైంది ఈ మధ్య.. అన్నాన్నేను.
 ఏం మీకు లేవా.. తెల్లగా ఉండాలి.. అందంగా ఉండాలి..మంచి ఫిగురు ఉండాలి.. బొలెడు కట్నం కావాలి..అని ??
 నేను అలా చెప్పానా?
ఓకే,  అక్కర్లేదా.. అయితే మా ఫ్రెండ్ ఉంది.. చేసుకుంటావా ?
 చూడకుండానే ?
అందం అక్కర్లేదన్నావ్ గా..??  
 అది కాదు..  
 నవ్వు తోంది. లత నవ్వితే చూడటం నాకిష్టం.

May 16, 2011

ఆ ఆశలో...


                                "ఎదుటి వ్యక్తి"ని ఎరుక పరిచే యవ్వనం..
యవ్వనపు  మెరుపు ఆకర్షణ..
ఆకర్షణ బలమై  ప్రేమో కామమో తెలియని మైకం.
ఆ మైకంలో.. అస్తిత్వపు మరుపు.
ఆ మరుపులో తెలియని సంతోషం.
ఆ సంతోషం సొంతం కావాలని ఆశ..
ఆ ఆశలో మరిచే అసలు జీవితం..
 

May 15, 2011

“విశ్వనాథుడు”


kv copy
కళామతల్లి శ్రీభారతీదేవి స్తన్యామృతమయిన సంగీత సాహిత్యాల మాధుర్యాన్ని పండితులకే కాక పామరులకి కూడా రుచిచూపించాలని తాపత్రయపడిన కళా బంధువు…
శాస్త్రీయ నృత్య రీతులయిన కూచిపూడి,భరత నాట్యాలని కథా వస్తువులుగా,వాటి మీద సామాన్య జనాలకి కూడ ఒక అవగాహన కల్పిస్తూ.. ఆ రసానందాన్ని పంచిపెట్టిన కళారంతి దేవుడు…
భారతీయకళల్లో ఉన్నఅందాన్ని,ఆకర్షణనీ..తెలియజేస్తూ..ఆ సాధనలో రసానందం అనుభవిస్తూ.. అధ్యాత్మికతలోని అత్యున్నతమైన నిర్వాణస్థితిని చేరుకోవోచ్చని సినిమా కళ ద్వారా ప్రపంచానికి చాటిన కళోద్దారకుడు..
కథా సందర్భాను సారంగా.......http://navatarangam.com/2011/05/12016-my-favorite-director/

చలం రాతలు. ..


 స్త్రీ సౌందర్యాన్ని వర్ణించి..ఆ  సౌందర్యం తన మనసుని ఎట్టా కాల్చేస్తుందో.. స్త్రీ తన సున్నితత్వం.. వల్ల  తెచ్చుకునే ..కష్టాలు, కన్నీళ్ళ గురించి రాస్తూ ..అప్పుడే తన నెత్తిమీద ఎగిరే కొంగల బారు కేసి చూసి, ఎంతో దూరం ఎగిరి వెళ్లి..తమ పిల్లలకి అవి తెచ్చే తాయిలం.. తల్లుల రాకని గమనించి వింత శభ్దాలు చేస్తూ అవి పొందే సంతోషాన్ని  మనది గా చేస్తాడు.ఎన్నో రహస్యాలని తనలో దాచుకొని మౌన మునిలా నిల్చున్న  ఆ నీలాకాశం కేసి చేతులు చాస్తున్నట్టు కనపడే పొడవాటి పచ్చని చెట్లని చూసి ,  గోధుమ రంగు నుంచి  ఆకుపచ్చగా మారుతోన్న లేత ఆకుని పరికించి .. ఆ చెట్లు ఆకాశం నీలాన్ని తన ఆకుల పిడికిట్లో దాచుకున్నాయని  అబ్బురపడతాడు. కొమ్మ నుండి కొమ్మకి ఎగురుతూ ఆటలాడుతున్న పిచ్చికలతో మాటాడి వాటి బాష అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.వాటిని  దూరపు బంధువులు గా అనుకొంటాడు.  స్నేహితులని  గుర్తు చేసుకొని.. వాళ్ళ గుణ గణాలని విశ్లేషించి..పొగిడి తిట్టి వాళ్ళతో తన  అనుభవాలని..అనుభూతులని మనతో పంచుకుంటాడు. దాంతో  మన గతాన్నీ మనం  ఓ సారి జ్ఞప్తికి తెచ్చుకోక తప్పదు. ..తరతరాల మన జీవన విధానాన్ని,అందులోని లోపాలని ఎత్తి చూపుతాడు.  "ఒక ప్రశ్నలోంచి ...ఒక ఆలోచన లోకి,ఒక ఆనందం లోంచి ఒక అనుభవం లోకి, ఒక జవాబు లోంచి  ఒక అనుభూతి లోకి" తీసుకు వెళ్తాడు, అలుపు లేకుండా.  
తన ఆలోచనలనీ ...జీవితాన్ని మొత్తం అక్షరాల్లోకి దోల్లించాడు. మన మనస్సులో దాగిన క్రూరత్వాన్ని..ద్వేషాన్ని..కల్మషాన్ని బయటకి లాగి చూపించి..ఆ మురికిని కడిగి పారేయ్యలని ప్రయత్నిస్తాడు.లోక సౌందర్యాన్ని మనచే తాగిస్తాడు. జీవిత మాధుర్యాన్ని చూపిస్తాడు. అవీ  చలం రాతలు. 
ఒకటా రెండా ప్రతీ వాఖ్యం ఒక గొప్ప statement. ఒక ఖచ్చితమైన వాస్తవం. ఒక రస గుళిక..ఒక ఆలోచనా స్రవంతి.

రోజూ మనం ఇంత జీవితాన్ని అనుభవిస్తూ...వివిధ అనుభవాలకి లోనవుతూ..వింత ఆలోచనలు చేస్తూ...సత్యాలని దర్శిస్తూ.. కుడా ఒక్క మాట సూటిగా..ఖచ్చితంగా..నిజాయితీగా.. మాట్లడలేకపోతున్నాం..మనలో దాగిన రహస్యాలని..కల్మషాన్ని..కోరికలని.. ద్వేషాన్ని..ప్రేమనీ..కరుణ నీ.. బయట పెట్టలేక..నటిస్తూ..జీవిస్తూ...నటనలో జీవిస్తూ..జీవితమంతా నటిస్తూ.. ఒక్కరోజు కుడా మనకి మనంగా బ్రతకలేక  ఈ చచ్చు బ్రతుకే నిజమనుకొని ..ఇదీ ఆనందం అనుకొని..మనని మనం మరిచి..ఈ వేషాలు..డాబులు ..దర్పాలూ.. ఎంతకాలం..?? ఎంతకాలం ??

May 14, 2011

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళుమధ్యాన్నం  కదా..ఖాళీ గానే  ఉంది  సిటీ బస్సు .. ఓ సీట్ చూసుకొని కుర్చున్నా .. నా పక్క సీట్ లో ఎవరు లేదు..వెనక ఓ చదువుకున్న ఉద్యోగి. ఇంకో వైపు..అప్పుడే  జాబ్ ఎక్కినట్టు కన్పిస్తున్న సాఫ్ట్వేర్ అబ్బాయి..మంచి దుస్తులతో  నిగానిగాలడుతున్నాడు..మేడలో ID వార్డు వేలాడుతోంది.. ప్రేమ కూడ మొదలయినట్టు ఉంది, తనలో తానే చిన్నగా నవ్వుకుంటున్నాడు..ప్రియురాలు  గుర్తుకొచ్చేమో ...
ఇంతలో ఒక స్టాప్ లో  ఇద్దరు పదకొండో తరగతి కుర్రాళ్ళుఎక్కారు.
ఒకడేమో.. సన్నాగా  ఉన్నాడు... కాంతారావు ప్యాంటు..ముందు వైపు వంకీ తిరిగిన బూట్ల  లాంటి చెప్పులు...దాని మీద ఎరుపు నలుపు..చారాల T షర్టు.. ఇంకోడు దాదాపు ఇదే వేషం కానీ మనిషి  కొంచం దిట్టంగా ఉండటం తో బానే కనబడుతున్నాడు.. ఇద్దరూ  మధ్యతరగతి అని వేరే చెప్పనక్కరలేదు..
ఎక్కీ ఎక్కడం తోటే.. పాస్ అని కండక్టర్  కి  చెబుతూ  ..హడావిడిగా నా సీట్ లో కూలబడ్డారు...
అప్పటికే ఏదో విషయం సీరియస్ గా మాట్లడు కుంటున్నట్టు ఉన్నారు..దాన్నే కంటిన్యూ చేస్తున్నారు..సన్నగా ఉన్నవాడు  ఎక్కువ మాట్లడేవాడిలా ఉన్నాడు..చెప్పుకు పోతున్నాడు..
" ఆడ మంచోడు రా..ఎందుకంటే..అన్నం బెట్టిండ్ర వాడు ..ఇంటికి  దీస్క పోయి . .. ఆన్కి  ఎంత dare దెల్సారా... తాగి ఇంటికి భి వోతాడ్  ఆడు.. ఆళ్ళ  అయ్యా అమ్మా ఏమనర్ ఆన్ని..ఎందుకో ఆన్ని జూస్తే భయంరా బై ఆల్లకి..  మొన్న ఏమైంది దేల్సారా... ఆడు  రాజ్  గొట్టిండ్రా ..రాజ్గాడ్  తెల్సుకదా ..మా కాలేజే...మా పక్క గల్లి లా ఉంటడ్ జూడరా...నీవ్ మస్తు సార్లు జుసినావ్.. ఆన్ని. .  పొడుగ్గా ఉంటడ్ జూడు ...రాజ్ గాడు  సత్తి గాని  గాల్ ఫ్రెండ్ ని సతాయిస్తు డoట,  రాజ్ గాన్ని ఎమన్నా గొట్టిండా..


ఇంకోడు అడిగాడు..  అనుమానం వచ్చి.. " ఆ పిల్ల  సత్తి గాన్ని లవ్ జేస్తుందా ??
ఏమో రా గాల్ ఫ్రెండ్.. గాల్ ఫ్రెండ్ అంటడు.. ఆ _______గాన్కి జెప్పిండ్రు ఆన్ దోస్తులు ఆ పిల్ల జోలికి వోకురా భై , వొద్దురా బై అని , ఇన్లె....ఆడ్ లైట్ దీస్కుండు.. సత్తి గాంకి దేల్సింది.. అందుకే గొట్టిండు..నేవ్వేమన్న అన్రా  ఆని   dare కి  మెచ్చుకోవాల్ రా.. నిజంగా.. ఆడ్ దోస్తానాల పానం ఇస్తడ్రా.. ఎందుకంటే..నన్ను ఇంటికి దీస్కపోయ్  అన్నం బెట్టిన్డ్రా.....
సత్తి గాన్ని జుష్ణావ్ లే,,నీవ్..
ఏమో..
కల్పిస్త .. ఓ సారి ..
ఇక వీడి వంతు వచ్చింది...
మొన్న మిస్ కాల్ ఇస్తే మల్ల జేయలేదేంది భే..
బాలన్సు లేకుండే.. మా  ఆయ్య ఈ సారి పాకెట్ మనీదక్కువ ఇచ్చిండ్రా ..
___ ల బాలెన్సు... నీ అమ్మా.. ఎంద్రా...mr perfect పోదామని .. మిస్ కాల్ జేస్తే మల్ల జేయ్యవారా , బడ్కావ్.. నీ కోసం ఎన్ని సార్లు ట్రై జేస్ష రా..
ఆ యాల్ల మా మామ వాళ్ళింట్ల ఉండే.. అది గాక ..బాలన్సు లేకుండే..
ఎట్లుంది..సిన్మా.
 మాటకు ముందు వెనక ఏదో ఒక బూతు చేర్చకుండా మాట్లాడటం లేదు.


నేనేమో వీళ్ళ గురించే ఆలోచిస్తున్నా... ఆ retired ఉద్యోగి...ప్రావిడెంట్ ఫండ్ సగం ఎలా  ఖర్చు అయిందా అని ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు..పట్టించు కోవటం లేదు.. MR సాఫ్ట్ వేర్  ..తన ధ్యాసలో తాను ఉన్నాడు..


 ప్రభాస్ గాడు వేస్ట్ గాడ్ అయిన్డ్రా .. ఆన్కి  బాడి కి ఎసువంటి సినిమాల్ దీయాలే..
నీ అమ్మా.. ______ లాగుంది సినిమా...
రెండు పాటల బావున్నయంకో....నాకైతే నచ్చలేద్ర బై..
 అర్రేయి...నేన్ దిగుత...
సరే.. అర్రేయి..ఫోన్ చై  రా...
బాయ్ రా..
బస్సు మలుపుతిరుగుతూ ఉండగానే ..ఆ  కుర్రాడు చెంగున దూకి జనాల్లో కలిసి పోయాడు..
ఒంటరిగా మిగిలిన వాడు..ఫోన్ తీసి ఏదో ఆట ఆడటం మొదలెట్టాడు.. :)


May 11, 2011

నా మొహానికి..

ప్రేమ ప్రేమకై పరితపిస్తుంది..ప్రేమ ప్రేమకై ప్రేమిస్తుంది...అర్థం కాలేదా..నాకు  అర్థం కాలేదు..కాని ప్రేమ గురించి ఏదోటి చెప్పాలి అనిపించి చెప్పాను. ఎందుకంటే...ఈ ప్రేమ ఏంటో  అర్థం కాక చస్తున్న.. అలా అని నేనేదో ప్రేమలో పడ్డాను అనుకోకండి. నా మొహానికి ప్రేమొకటా ..
ఆ రోజు.. మా మానేజర్ పిలిస్తే ఆహా promotion ..TL గా వస్తుందేమో అని ఆశగా వెళ్ళను.. ఎందుకంటే నేనే ఉన్నా లిస్టు లో ఫస్టు.. కాని తీర వెళ్ళాక బెంచ్ మీద కూర్చోమన్నాడు.. బెంచ్ మీద కూర్చో అనగానే.. అర్థం అయ్యింది..రెండే నెల్లల్లో..చిరునవ్వుతో షాకే హ్యాండ్ ఇస్తారని..
సరిగ్గా ఈ బాధలో నేను ఎక్కువసేపు బెంచి మీద కూర్చోలేక అలా కేఫ్ లో చాయ్ సిగరెట్టు కొట్టటానికి వెళ్తే అక్కడ తగిలాడు..మావాడు.. చైతన్యగాడు. ఎప్పుడో పదిలో దోస్తులం...ఆ తరవాత నేను  ఎదవ కాలేజీ అదే కార్పోరాటే కాలేజీలో పుస్తకాలు చించటం.. వాడేమో.. govt కాలేజీలో క్లాసులు జరక్క సినిమాలు షికార్లు.. అక్కడ విడిపోయాం..మళ్ళీ ఇదే చూడటం..
మామా... కిట్టుగా..నేను రా చైతు గాడ్ని...చైతన్య.. అంటూ.. వాడే నన్ను గుర్తు పట్టాడు.
మామ సిగరెట్లు  తాగుతున్నావా .. నీవు మారలేదురా..
ఒరేయ్ నేనేదో చిన్నపటినుంచి సిగరెట్లు తాగుతున్నట్టు... చూసేవాడికి నాకేదో ఉపిరితిత్తుల రోగం ముదిరినట్టు ,,ఏంటా  మాటలు...
ఏదో అప్పుడో ఇప్పుడో  . ఒకటీ అరా..
సరే కానీ మామ ఏం చేస్తున్నావ్.. కొంపదీసి నివు కూడ సాఫ్ట్వేర్ కాదుకదా..??
సాఫ్ట్వేర్ గురించి అంత బాడ్ గా అనుకుంటున్నారా జనాలు అని మనసులో భయపడి..
నేను సాఫ్ట్వేర్ యే రా..ఇన్ఫోసిస్..
అర్రే..అనుకున్నా.. .. ( ఇకా చాలా ఉందోచ్ )

తెలుగు సినిమా పాట..


ప్రపంచం కుగ్రామం అవుతున్న  సందర్భంగా తెలుగు సినిమాల్లో .... సంకృతి, బాష, సాహిత్యం.. అన్ని మారుతున్నాయి అనటానికి ఈ తెలుగు సినిమా పాట ఒక చిన్ని ఉదాహరణ..
ఇదివరకు...

" ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా
సిగనుపూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా
కౌగిలింత...హుష్...
కౌగిలింత చేరుకో కల్యాణిలా
రేతిరంత మేలుకో రేరాణిలా
ఎన్నడు రానిది మల్లెల రాతిరి హాయిగా.. ముక్కుపుడక ఎందుకు మనసుండగా..
సిగనపూవు లెందుకూ సొగసుండగా..
కౌగిలింత లివ్వనా కట్నాలుగా
పరువమంత పరువనా తొలిపానుపుగా
ఎన్నడురానిది మల్లెల రాతిరి హాయిగా.."

కానీ ఇప్పుడు..


జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్చు  గీసినట్టుగా ఉందిరో ఈ సుందరీ..
బ్రిట్నీ స్పెఅర్స్ కి ప్రింట్ తీసినట్టుగా ఉన్దిరో..ఈ కాడ్బరీ..
నడుమే  చుస్తే  షకిరా  దాన్ని  అంటున్కున్న  చెయ్యే  లక్కీ  రా ..
నడకే   చుస్తే  బియాన్సే...  , బేబీ  నవ్విందంటే  ఖల్లాసే  ..
jeans  ప్యాంటు  వేసుకున్న  జేమ్స్  బాండ్  లాగా గున్ను  లాంటి  కన్ను  కొట్టి  చంపమాకురా ..
బ్లాకు  బెల్ట్ పెట్టుకున్న  జాకీచాన్  లాగ  నాన్చాక్  తిప్పమాకురో ... .:) :( :... ?


మార్పుని ఆహ్వానించక తప్పదు. May 9, 2011

మునెమ్మ


  రచయిత,  తన జీవితం లోంచి..పొందిన అనుభుతుల్లోంచి.. దర్శించిన సత్యాలను నిజాయితీగా చెబితే .. అదీ సులభ శైలిలో చెపితే  నాకు బాగా నచ్చుతుంది. అక్షరాల అల్లిక ..అలంకారాలు.. పోల్చటాలు..వర్ణన వీటి గురించి ఆలోచించేది తరవాతే. మనిషి చేసే పనులకి, అతని ప్రవర్తనకి  భావ గంబీర్యతని ఆపాదించటం,సరళత్వం, సునిశితత్వం,జీవితానికి దగ్గరగా ఉండే ఉండేట్టు రాయటం ఇవన్నీబాగా నచ్చుతాయి.నేను పుస్తకం ఆసాంతం వెతికేది వీటిగురించే. కథ..కథనం..వీటికంటే వీటి వెనకున్నమనిషిషి తత్వం నన్ను బాగా ఆకర్షిస్తుంది.ఒక కథకు గానీ ఒక సినిమాకు గానీ మరే ఇతర రచనకు గానీ ఇదే  మూలాధారం అని నాకు తోస్తుంది. మనిషి తత్వాన్ని ఆధారం చేసుకొని కథను అల్లి అందులోని ప్రధాన పాత్రల ద్వారా రచయిత తన అనుభవ సారాన్ని వెలిబుచ్చి, కొన్ని జీవిత సత్యాలని దర్శింపజేస్తే అతడు తన రచనలో కృతార్థుడు అయినట్టే .. మునెమ్మ లో  నాకు ఇవి బాగానే కనిపించాయి.  మీరు చదివారా ???

May 8, 2011

తీర్చుకోలేని ఋణంమొన్న...నేను పేస్ బుక్కులో ఏవేవో కామెంట్స్ రాసుకుంటూ యమ బిజీ గా ఉండగా , చాయ్ చేతికందిస్తూ...
ఓ నలబై రోజులు గుడికి ప్రదక్షణాలు చేయరా.. నీ జీవితం బాగుపడుతుంది..అంది మా అమ్మ..
నేనా. గుడా . .ప్రదక్షిణాలా ..చేస్తా అనుకొనే చెపుతున్నావా..
 ఆది కాదురా..
నా చేతకాదు 
 నాకోసం రా...
నీకోసం అయినా నేను చేయలేను
నాకేం చెప్పకు.. నన్ను వదిలేయ్ అమ్మా దండం పెడతాను.. ...ప్లీజ్..
అర్రే చెప్పేది వినరా...
ఒకటా రెండా..నలభై రోజులు..  చేస్తే ఏమొస్తుంది..ఏం ఒరుగుతుంది ?? ఓ జరుగుతుంది ??
ఏమైనా  జరగనీరా..అమ్మ కోసం.చెయ్యి.
నేను చే య ను 
ఇక..లోపలి నుంచి దుఖం పొంగుకొచ్చి..
నాకోసం చేయరా..మా నాయన కదూ.. నీకోసం అనుకోకు .. అమ్మ కోసంరా ..ఆ మాత్రం చేయలేవా.
గొంతు పుడుకొని పోయింది..కళ్ళల్లో నీరు ఉబుకుతుంటే.. గుడ్లు కుక్కుకుంటూ చెపుతోంది..
నా గుండె కొంచం కరిగింది...
సరే పో..ఏడవకు..ఊరికే.. ప్రతీదానికి..
ఇహ నా కష్టాలు మొదలయ్యాయి.
నేను లేచేదే పదింటికి.. వెళ్లేసరికి గుడి ముసేయటం.. ఎండలో కాళ్ళు కాలటం.. గుదికేల్లకుండా చాయ్ కూడ పోయ్యను  అనే సరికి.. తప్పక పొద్దున్నే లేచి గుడికి వెళ్ళా  ఓ నలభై రోజులు...
గొప్ప ఏమి జరగలేదు..బతికున్నా అంతే....
తల్లి ప్రేమ వెలకట్టలేనిది అంటారు..కొన్ని సార్లు ఆ ప్రేమ అతిగా అనిపించినా..  చీకాకు తెప్పించినా... దానివెనక తన పిల్లలు బావుండాలనే aaratame కనపడుతుంది.  ఆ ఋణం తీర్చుకోలేనిది...
MOTHERS DAY సందర్భంగా..."అమ్మ" లందరికీ కి వందనాలు..

May 5, 2011

Musings

Landscapes.jpg

చలం గారి Musings మళ్లీ చదవటం మొదలు పెట్టాను.. కానీ ముందుకు వెళ్ళటం లేదు. ఓ రెండు వాఖ్యాలు చదవటం..పుస్తకం మూసి తీవ్రంగా ఆలోచించటం... ఓ వాక్యం చదివి దానికి సంబందించిన దృశ్యాని ఉహించుకోవటం..దాని తాలూకు శాంతి..ఆనందాన్ని ఫీల్ కావటం. ఇంకో వాక్యం వెనక దాగిన సత్యాన్ని అన్వేషించటం ..ఆ సత్యం నా అనుభంతో సరిచుసుకోవటం... ఈ పుస్తకం ఐపోయేటప్పటికి సంవత్సరం అయ్యేట్టుంది.

May 4, 2011

ఓ ప్రేమలేఖ..నిన్ను తొలుతగా ఎప్పుడు చూసానో గుర్తు లేదు. కాని చూసిన మొదటి నిముషం లోనే నీతో స్నేహం కుర్దిరింది.. ఆ దోస్తీ ముదిరి   ప్రేమగా మారింది..
ఎన్ని సార్లు ఎక్కడెక్కడ కలుసుకున్నామని..

వారం లో ఒక్కసారైనా నిన్ను చూడక ఉండలేక పోయేవాడిని...
గంటలు లెక్కపెట్టుకుంటూ గడిపేవాడిని..నీ దర్శనం కోసం..
నిన్ను కలుసుకొని అలా  వొళ్ళో తల పెట్టుకోని..నీవు చెప్పే కథలు వింటూ గడపటం నాకెంత ఇష్టమని...నీకు తెలుసుకదా..
అప్పట్లో మనం కలుసుకున్నది తక్కువే అయినా.. నీవు చెప్పిన కథలన్నీ ఇంకా కళ్ళలోనే ఉన్నాయి..ఎంత బాగా చెపుతావని.. 

రామాయణ భారతాలు నేనెప్పుడు చదవలేదు...నేవు చెపితేనే తెలిసింది..
అలా ఒకటా రెండా వందలు, వేల కథలు కళ్ళకి కట్టావు.. 
బావున్నా బాలేకపోయినా 'ఉ' కొట్టటం ఒకటే నాలు తెలిసింది, అప్పట్లో..
నీ మాటలతో  కవ్వించి..నవ్వించి.. ఏడిపించే దానివి.. 

నీ పాటలతో నన్ను ఆలించి..లాలించి జో కొట్టేదానివి.. 
అవి వింటూ..నేను ఏదో ఉహాలోకం లో తెలిపోయేవాడిని


నివు కళ్ళ ముందు ఆడనిదే  నాకు నిద్ర పట్టదు
పగలంతా నీకోసం కలవరమే.. కలలోను నీకై పలవరమే
కొన్ని క్షణాలు నేను నువ్వయానా అని అనిపించేది..

ఎల్లకాలం  నీతో ఉండాలని ఆశ పుట్టేది .


గుర్తుందా... మనం శ్రావణమాసం ఎక్కువగా కలుసుకునే వాళ్ళం.
అమ్మ పూజల్లో పెట్టిన రూపాయి బిళ్ళలు దొంగిలించి జుబులో వేసుకొని నీ దగ్గరికి వచ్చేవాడిని.
అలా నిన్ను కలిసి వచ్చాక ఎన్ని సార్లు తన్నులు తిన్నానని..  
అదే విషయం నేకు చెపితే ..నేవు కిల కిలా నవ్వి  నన్ను నీ వొళ్లోకి తీసుకునే దానివి ఓదార్పుగా..

నీ మాయలో పడి చదువు అత్తెసరయ్యింది,.. తెలివి తెల్లారింది.. జీవితం విందర వందర అయ్యింది.
అందుకే నీవంటే కసి..కాని ఆ కసి లోంచే ఏదో ప్రేమ..
కాని నాకేప్పుడైనా దొరికావా...

దేశదిమ్మరిలా నీకోసం పరుగులు పెట్టాను..
నిన్నెట్లా  చేరుకోవాలా అని మధన పడ్డాను..
నీ ఆత్మీయతకై అర్రులు చాచాను..
నీ నీడన బ్రతకాలని ఆశ పడ్డాను..కనీసం..ఇప్పటికైనా కరుణిస్తే అంత కన్నా కావలసిందేమి లేదు నాకు...... ఈ జన్మకి..
వస్తావు కదూ..

May 3, 2011

యువకవీ మేలుకో  యువకవీ మేలుకో .. నవకవీ విజ్రుమ్భించు
ఆలోచనలకి పదును పెట్టి..
అనుభవాలని పంచి పెట్టి..
సమాజానికి అద్దం పట్టి..
అంతరంగాల్లోకి తొంగి చూసి..
అత్మీయతని పలకరించి.
అనుభూతులతో మేళవించి
అక్షరాలతో  ఆడుకో....మాటలతో తూటాలు చెయ్యి
కవితలతో కదం తొక్కు...పాటలతో ఏమరుపాటు కల్గించు.
వచనం తో భోజనం వడ్డించు..నవలతో నవలోకం చూపించు..
కథలతో కళ్ళు తెరిపించు ..
సినిమాతో ఆనందం అందివ్వు ..
 
  యువకవీ మేలుకో .. నవకవీ విజ్రుమ్భించు.

May 1, 2011

స్వేఛ్చ లేని బ్రతుకులు.


అప్పట్లో నేను మా CLASSMATE ఒక రూం లో ఉండేవాళ్ళం.
మనవాడి ప్రతిభకి ఒక అమ్మాయి పరిచయం అయ్యి..సినిమాలు షికార్లు అయ్యాయి. రూం కి సీనియర్ ని నేనే కనక  ఒకరోజు అడిగాడు  " మా ఫ్రెండ్ రూం చూస్తా అంటోంది అని. విషయం అర్థం అయింది.
అలా ఓ రెండు మూడు నెలల్లో ..ఎప్పుడు కంట బడిందో విషయం OWNER కి తెలిసింది. నన్ని పిలిచి కూర్చో బెట్టి అడిగాడు..
" ఎవరు ఏమిటి అని ?
మా ఫ్రెండ్ కి ఫ్రెండ్..ఏదో కలవటానికి వస్తోంది.
ఎందుకు ?
నాకేం తెలుసు..ఏదో మాట్లాడుకోటానికి అనుకుంటా ..
ఓకే , అయితే మా ఫ్రంట్ రూంలో  కూర్చొని మాట్లడుకోమని చెప్పు..
ఇలా చేయటం బావుండదు..చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ?
వాళ్ళకి కావలసింది ఫ్రంట్ రూం కాదడీ బెడ్ రూం ఇస్తార ?? అని అడుగుదాం అనుకున్నా..
అనలేక  సరే అన్నాను.
ఎంతసేపు అవతలి వాడు ఎం చేస్తున్నాడు అని తప్ప... తు.
29 ఏళ్ళ వయసు...phD చదువుతూ...కూడా స్వేఛ్చ లేని బ్రతుకులు.