Showing posts with label 'సిని'మా'య. Show all posts
Showing posts with label 'సిని'మా'య. Show all posts

Nov 29, 2013

Soul Kitchen – ‘ఆత్మ’గల వంటిల్లు


 

సోల్ కిచెన్ – ‘ఆత్మ’గల వంటిల్లు

  :)    ఆత్మ అనగానే ఏదో దెయ్యాల సినిమా అనుకుంటున్నారా అబ్బే కాదండీ.. ఇదో సరదా కథ. బలమైన కథనం…సన్నని భావోద్వేగాలు ఉన్న హాస్య భరిత సినిమా ఇది.

” నేను నాకు సినిమా తీయాలని అనిపించినపుడు మాత్రమే సినిమాలు తీస్తాను.అదీ  ఆప్పటి  మూడ్ ని  బట్టి . ఇప్పటివరకూ  ‘ఎడ్జ్ ఆఫ్ హెవెన్‘  లాంటి సీరియస్ సినిమాలుతీసాను. సీరియస్నెస్ కి బానిస అయ్యా. ఎడ్జ్ ఆఫ్ హెవెన్ తీస్తుండగా  స్నేహితుడయిన సినిమా నిర్మాత  చనిపోయాడు. అరునెలలు బాధ పడ్డాను.  కానీ జీవితం అన్నింటికీ అతీతమైనది. చావు జీవితంలో భాగం.   నవ్వటం జీవితానికి అవసరం  అనిపించింది. అందుకే  “సోల్ కిచెన్ తీసా ” అంటాడు దర్శకుడు.  ఓ సారి మిత్రుడి రెస్టారెంట్ కి వెళ్లాను. భలే సందడిగా ఉండే అక్కడ కస్టమర్లనీ ..వెయిటర్లనీ..ఓనర్నీ..ఇలా రక రకాల వ్యక్తులని గమనించాక ఒకరితో ఒకరు తమకే తెలియకుండా  ప్రేమగా  ఉన్నారనిపించింది. వాళ్ళంతా ఆ రెస్టారెంట్ ని ప్రేమిస్తున్నారనిపించింది. అప్పుడే సోల్ కిచెన్ కి బీజం పడింది అంటాడు.
కథ ఎలాంటిదయయినా దానిమూలాలు .స్పూర్తీ నిజ జీవితంలోనుంచే రావాలి అప్పుడే అది నేలవిడిచి సాము చేయదు. సో  నిజ జీవిత స్పూర్తి  తో రాసిన కథ కనక  బానే ఉండుంటుంది కదూ..
ఇహ కథలోకి తొంగిచూస్తే ….
http://navatarangam.com/2013/11/soul-kitchen

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు



” ఇది వాస్తవ విషయాల ఆధరంగా అల్లుకున్న కథ. ఆ వాస్తవవిషయాలని సినిమా కథగా చేయటానికి నాకు కొంతకాలం పట్టింది. నేను మరో ఎక్సోరిసం -2 చేయాలనుకోలేదు. అలాగే ఎవ్వరినీ వేలెత్తి చూపాలనీ అనుకోలేదు.నేను ప్రజల గురించి వాళ్లు పడే అవస్థల గురించి, తమకే తెలియకుండా మనుషుల్లోకి వచ్చే హింసాత్మకత గురించి చెప్పదలచుకున్నాను. అందరికీ తట్టే కథలు చేయకపోవటం నాకు ముఖ్య విషయం. మంచి వెనక చెడు ఏవిధాంగా దాగి ఉంటుందీ అనేది ఈ కథాఇతివృత్తం. ఇది జరిగింది ఒక ప్రదేశంలోనే అయినా ప్రపంచంలోని పలు చోట్ల..రకరకాలుగా జరిగే విషయమే ఇది .”
ఈ దర్శకుడు ప్రస్తుత సమాజంలోని నైతిక అసంబద్ధత మీద కథని ఎంచుకుని సినిమాగా మలిచిన తీరు అసాధారణం. అందుకే ఆయనకి ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా అవార్డు దక్కింది.

పూర్తివ్యాసం.. 

http://navatarangam.com/2013/11/beyond-the-hills

Mar 9, 2012

సమాజం పై సినిమా ప్రభావం



సినిమా సమజోద్దరణ కి తీస్తారా లేదా వేరే సంగతి. కాని 'సినిమా' సమాజాన్ని  ప్రభావితం చేస్తుందనేది ఒప్పుకోవాల్సిందే. అయితే అన్ని సినిమాలు చేయకపోవచ్చు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ప్రభావం చూపితే..కొన్నిటి ప్రభావం subconscious లెవల్లో ఉంటుంది. ఈ ప్రభావం positive గా ఉండొచ్చు ..negative గాను ఉండొచ్చు. అంతెందుకు ఒక సినిమాలో పాపులేర్ పాత్ర స్టైల్..డైలాగు..హెయిర్ కట్.. డ్రెస్..accessories .. ఏదోటి సమాజం లో వాడబడితే .. ఆ సినిమా సమాజాన్ని ప్రభావితం చేసినట్టే.
సినిమా అనేది ఒక మీడియం. కొందరు జనాలని pure entertain చేయాటానికి ఉపయోగించుకుంటారు. .. మరొక అతను entertain + ఆర్ట్ ఫాం గా ఉపయోగించుకుంటాడు. మరొకడు సమాజం లోని అవకతవకలను చూపిస్తాడు. ఇంకొరు నేర చరిత్రలని ..సమాజ చీకటి కోణాన్ని చూపిస్తాడు. entertainment అనేది అన్నిటిలోనూ దాగి ఉంటుంది. ఆది వేరే విషయం. film maker  దేనికోసం తీసినా అది సమాజం పై ఇంకోరకంగా ప్రభావం చూపొచ్చు. అయితే సినిమా ఎలాంటి ప్రభావం చూపబోతోంది అని ఒకింత దూర దృష్టి కలిగి ఉండాల్సిన బాధ్యత film maker కి ఉంది.
 1989 లో శివ సినిమా విడుదలై సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిందే. కాలేజీల్లో స్కూళ్ళలో ఎక్కడపడితే అక్కడ గ్యాంగ్ లు తయ్యారు అయ్యాయి. అప్పటిదాకా ఎక్కడో మూల ఉండే గుండాగిరి ప్రతి చోటా పాకిపోయింది. రౌడీలు హీరోల్లా ఫీల్ అయ్యారు.
 సినిమా ప్రభావం అంటే, సినిమాలో చూపించినట్టు నరుక్కోవటం ..లేదా ప్రేమించుకోవటం లేదా జనాలకి కాపాడటం లేదా హీరోలు గా మారటం కాదు. ఇది లోతుగా స్టడీ చేస్తే తప్ప తెలియదు.దురదృష్టవశాత్తు మనదగ్గర సినిమా ఎడ్యుకేషన్ మిస్ అయ్యింది. " నీ ఎంకమ్మ.. 'అంత సీన్ లేదు' తోక్కేం కాదు.. ఇలాంటి పదాలు చిన్నా పెద్దా తేడా లేకుండ ఉపయోగించే మాటలు .  సినిమా నించి వచ్చినవే కదా. ఎవరో/ ఎక్కడో /ఒక ప్రదేశం లో ఉపయోగించిన మాట..సినిమా ద్వారా మొత్తం మందికి పాకి అవి జనాలకి ఉతపదాలు అయ్యాయి. ఇదీ సినిమా ప్రభావం.
  నాకు మన సమాజం లో అడుగడునా ..'సినిమా' ప్రభావమే కనపడుతోంది. నేను అమ్మాయికి 'ఐ లవ్ యు' చెప్పటం నేర్చుకుంది సినిమాల ద్వారా.. ఇలా ఉండాలి అని అనుకుంది సినిమా హీరోని చేసే. చేస్తే ఇలాంటి అమ్మాయిని లవ్ చేయాలి అనుకుంది సినిమా హీరో ఇనే లని చూసే. నాలో ఓ రకమైన భయం కలిగించింది సినిమాలే...ఇంకో రకమైన భయం పోగొట్టింది సినిమాలే. సిగరెట్టు తాగింది ..హీరోలని చూసే.. ఇంకా చాలా.. నా జీవితం లో అడుగడుగునా సినిమా ప్రభావం ఉంది. వాస్తవాన్ని వాస్తవంగా చోపోచ్చు.. కొన్ని కల్పనలు జోడించ వచ్చు.. లేదా పూర్తిగా కల్పనే కావచ్చు.
చెడిపోతారు.. బాగు పడతారు అని కాదు..సినిమా ' ప్రభావం'' కొంతకాలం ఉంటుంది అని మాత్రమే ఒప్పుకోక తప్పదు.
సమాజం పై సినిమా ప్రభావం లేకపోతే ..
* సినిమాకి ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ?
* పోర్నోగ్రఫీ పిల్లలు ఎందుకు చూడకూడదు ??
* ఎందుకు కొన్ని సినిమాలని బాన్ చేసారు /చేస్తారు ??

ప్రాబ్లం ఏంటంటే.. సినిమా చూడగానే మనిషి మొత్తానికి మొత్తం అలా మారిపోతాడు అని అనుకుంటున్నావ్.. కాని ప్రభావం అంటే...అది కాదు. దాన్ని వివరంగా రచకుండా ..మాట్లాడితే ఎలా ? ఆ ప్రభావం కూడా జీవిత కాలం ఉండదు కదా.. సినిమా ఒక్కటే కాదు కదా ప్రభావం చూపించేది. మిగతా అన్నిన్తిలాగే సినిమా కూడా ... అదీ కొంతమందిలో .. అదీ "ఒకింత " ప్రభావం చూప 'వచ్చు' . చూపుతుంది అని కాదు. చూపటానికి అవకాశం ఉంది అని . ఆ ప్రభావం ఇనిస్తంట్ గా కాకుండా  subconsious   పని చేస్తుంది. వ్యక్తిని ..వ్యక్తిత్వాన్ని బట్టి...ఎంతో కొంత కాలం. మనం వ్యక్తిత్వం ఇలా మారటానికి ఏమేం దోహదం చేసాయో చెప్పగలమా ??
ఏ సినిమాలు ఎందుకు ఎంతవరకు ఎవరిని ప్రభావితం చేసాయో ..బాగా ఆలోచిస్తే వాళ్ళకి తెలియటానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలు చూసి నచ్చి సినిమా పిచ్చి పెరిగి సినిమాలు తీద్దామని ఇల్లువిదిచిన వాళ్ళందరి మీదా సినిమా ప్రభావం ఉన్నట్టే. సినిమా వాళ్ళ జీవితాని నిర్దేశిన్స్తోన్న్ట్టే. ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకోటి కావాలా సినిమా ప్రభావం గ్గురించి చెప్పటానికి.

Feb 25, 2012


ఓ తల్లి ...  భర్త చనిపోయాక ..ఏనామిదేళ్ళ కుతుర్నిని పెంచి పెద్ద చేసింది. మంచి చదువు చెప్పించింది.
కూతురే లోకంగా సాగిపోతున్న ఆమె జీవితం ప్రయాణంలో తన కాలేజి ప్రేమికుడు మళ్ళి కనపడ్డాడు.
ప్రేమించమని వెంటపడిన  అతన్ని కుటుంబం కోసం సున్నితంగా తిరస్కరించింది. ఇంట్లో వాళ్ళు చూపించిన పెళ్లి చేసుకుంది. హైగా సాగుతున్న సంసారాన్ని  దురదృష్టం వెంటాడి ఒంటరిది అయ్యింది. కాని  ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమికుడు కళ్ళముందు.
మంచి పోసిషన్ లోకి రావలసిన సమయంలో  ప్రేమ కోసం మూడేళ్ళు.. ప్రేమ విఫలమై మూడేళ్ళు  వృధా అయ్యి, ఏదో చిన్న పాటి ఉద్యోగంలో బ్రతుకీడుస్తున్న ఆతడు ఆమెకి కనపడ్డాడు. కలిసి మాట్లాడుకొనే అవకాశం దొరికింది.
 తండ్రి అంటే గౌరవం ఇష్టం ఉన్న అ టీనేజ్ పిల్లకి తెలిసింది. తన తల్లి ఇలా చేయటం ఆమెకి ఇష్టం లేదు. ఏదోలా అనిపించింది.బాధ పడింది. ఏడ్చింది . ఉండబట్టలేక   ఎవరతను? అని నిలదీస్తే ...??
. human  emotions ,   beautiful  visuals ..excellent  music ..made  this    as  must  watch film by a great director.




Nov 9, 2011

మన multiplex


మొన్న INOX మల్టీ ప్లెక్ష్ లో సినిమా చూసా.అగ్గిపెట్టె లాగా ఉంది.  నా దురదృష్టం ముందు వరుసలో సీట్ వచ్చింది. వామ్మో.. ఏందిరా భై  తెర నా తల మీదే ఉంది. రెండుగంటలకి పైగా అలా తల ఎత్తి ఆ మూల నించి ఈ మూలకి చూస్తూ సినిమాని అర్థం చేసుకునేసరికి మెడనొప్పి + తలనొప్పి వచ్చేసాయి. ఈ ముల్తిప్లెక్ష్ ల్లో  సినిమా చూడటం వేస్ట్ అని decide అయిపోయా.. హయిగా traditional సినిమా హల్లో  బాల్కనీ టిక్కెట్టు తీసుకుంటే.. సినిమా బాలేకపోయినా కనీసం  మెడనొప్పి ఉండదు.

Aug 8, 2011

ఓ పేద హృదయపు ప్రేమ కథ

మనిషి ప్రేమని కోరుకుంటాడు. ప్రేమ కోసం తపిస్తాడు, చుట్టూ ఎంతో మంది మనుషులూ ఉన్నా ప్రేమించే హృదయం  అందరికీ దొరకదు. ఒక జోకర్ అందరినీ  నవ్విస్తాడు, అందరూ చప్పట్లు కొడతారు. తనని అందరూ  ప్రేమించినట్టు అనిపిస్తూంది, కాని తనని ఓ నవ్వించే బొమ్మగానే చూస్తారు  తప్ప మనిషి గా కాదు.
Khwaja Ahmad Abbas అందించిన అద్భుతమైన స్కీన్ ప్లే తో  నాకు ఈ సినిమా బాగా నచ్చింది.  దాదాపు మూడున్నర గంటల సినిమా అయినా ఎక్కడా పట్టు సడలకుండా మనసుని హత్తుకు పోతుంది...   http://navatarangam.com/2011/07/meranaam-jokar/

May 17, 2011

ప్రొడ్యూసర్ కి "కథ" ఎలా చెప్పకూడదు...

 
హీరో ఎదురుగ విలన్ ని చూపిస్తాం. ఇప్పుడే jimmy మీద కెమేరా ఉంటుంది . హీరో పిడికిలి భిగించాడు. పిడికిలి భిగించటం క్లోజ్ అప్ లోంచి ..బ్యాక్ వస్తూ ... హీరో కాళ్ళ కిందనుంచి మెల్లిగా టాప్ angle కి వస్తుంది కెమేరా .. హీరో ఒక్క గుద్దు గుద్దుదాం అనుకునేంతలో ఎదురుగా విలన్ ఉండడు.. హీరోయిన్ ఉంటుంది..హీరో షాక్..  ఎందుకంటే .. విలన్ ఉండాల్సిన ప్లేస్ లో హీరోయిన్ ఎలా వచ్చింది అని. కాని.. కెమేరా కాళ్ళ కిందనుంచి తల మీదకి పోయే టప్పుడు హీరో పిడికిలి భిగిసిందో లేదో అని ఒకసారి చూసుకున్నాడు. సరిగ్గా అప్పుడే..విలన్కి పారిపోయే టైం దొరికింది. హీరోయిన్ హీరోని వెతుక్కుని వచ్చేసింది. ఇలా కథ చెపుతుంటే.. హీరో హీరోయిన్ని ఎక్కడికో తీసుకెళతాడు.. ప్రొడ్యూసర్ గారు విలన్ తో చెయ్యి కలిపి పారిపోతాడు. ఇక మిగిలేది మనమే....  :) :)

ఎలాంటి అబ్బాయి కావలి.

అవునూ...  ఎలాంటి అబ్బాయి కావలి..?? 
 నాకంటే కొంచం హైటూ... సాఫ్ట్ వేర్ ఇంజనీరు.. అమెరికా లో సెటిల్ అయితే బెశ్టు...
 అమ్మయిలకి ఆశ ఎక్కువైంది ఈ మధ్య.. అన్నాన్నేను.
 ఏం మీకు లేవా.. తెల్లగా ఉండాలి.. అందంగా ఉండాలి..మంచి ఫిగురు ఉండాలి.. బొలెడు కట్నం కావాలి..అని ??
 నేను అలా చెప్పానా?
ఓకే,  అక్కర్లేదా.. అయితే మా ఫ్రెండ్ ఉంది.. చేసుకుంటావా ?
 చూడకుండానే ?
అందం అక్కర్లేదన్నావ్ గా..??  
 అది కాదు..  
 నవ్వు తోంది. లత నవ్వితే చూడటం నాకిష్టం.

May 15, 2011

“విశ్వనాథుడు”


kv copy
కళామతల్లి శ్రీభారతీదేవి స్తన్యామృతమయిన సంగీత సాహిత్యాల మాధుర్యాన్ని పండితులకే కాక పామరులకి కూడా రుచిచూపించాలని తాపత్రయపడిన కళా బంధువు…
శాస్త్రీయ నృత్య రీతులయిన కూచిపూడి,భరత నాట్యాలని కథా వస్తువులుగా,వాటి మీద సామాన్య జనాలకి కూడ ఒక అవగాహన కల్పిస్తూ.. ఆ రసానందాన్ని పంచిపెట్టిన కళారంతి దేవుడు…
భారతీయకళల్లో ఉన్నఅందాన్ని,ఆకర్షణనీ..తెలియజేస్తూ..ఆ సాధనలో రసానందం అనుభవిస్తూ.. అధ్యాత్మికతలోని అత్యున్నతమైన నిర్వాణస్థితిని చేరుకోవోచ్చని సినిమా కళ ద్వారా ప్రపంచానికి చాటిన కళోద్దారకుడు..
కథా సందర్భాను సారంగా.......http://navatarangam.com/2011/05/12016-my-favorite-director/

May 11, 2011

నా మొహానికి..

ప్రేమ ప్రేమకై పరితపిస్తుంది..ప్రేమ ప్రేమకై ప్రేమిస్తుంది...అర్థం కాలేదా..నాకు  అర్థం కాలేదు..కాని ప్రేమ గురించి ఏదోటి చెప్పాలి అనిపించి చెప్పాను. ఎందుకంటే...ఈ ప్రేమ ఏంటో  అర్థం కాక చస్తున్న.. అలా అని నేనేదో ప్రేమలో పడ్డాను అనుకోకండి. నా మొహానికి ప్రేమొకటా ..
ఆ రోజు.. మా మానేజర్ పిలిస్తే ఆహా promotion ..TL గా వస్తుందేమో అని ఆశగా వెళ్ళను.. ఎందుకంటే నేనే ఉన్నా లిస్టు లో ఫస్టు.. కాని తీర వెళ్ళాక బెంచ్ మీద కూర్చోమన్నాడు.. బెంచ్ మీద కూర్చో అనగానే.. అర్థం అయ్యింది..రెండే నెల్లల్లో..చిరునవ్వుతో షాకే హ్యాండ్ ఇస్తారని..
సరిగ్గా ఈ బాధలో నేను ఎక్కువసేపు బెంచి మీద కూర్చోలేక అలా కేఫ్ లో చాయ్ సిగరెట్టు కొట్టటానికి వెళ్తే అక్కడ తగిలాడు..మావాడు.. చైతన్యగాడు. ఎప్పుడో పదిలో దోస్తులం...ఆ తరవాత నేను  ఎదవ కాలేజీ అదే కార్పోరాటే కాలేజీలో పుస్తకాలు చించటం.. వాడేమో.. govt కాలేజీలో క్లాసులు జరక్క సినిమాలు షికార్లు.. అక్కడ విడిపోయాం..మళ్ళీ ఇదే చూడటం..
మామా... కిట్టుగా..నేను రా చైతు గాడ్ని...చైతన్య.. అంటూ.. వాడే నన్ను గుర్తు పట్టాడు.
మామ సిగరెట్లు  తాగుతున్నావా .. నీవు మారలేదురా..
ఒరేయ్ నేనేదో చిన్నపటినుంచి సిగరెట్లు తాగుతున్నట్టు... చూసేవాడికి నాకేదో ఉపిరితిత్తుల రోగం ముదిరినట్టు ,,ఏంటా  మాటలు...
ఏదో అప్పుడో ఇప్పుడో  . ఒకటీ అరా..
సరే కానీ మామ ఏం చేస్తున్నావ్.. కొంపదీసి నివు కూడ సాఫ్ట్వేర్ కాదుకదా..??
సాఫ్ట్వేర్ గురించి అంత బాడ్ గా అనుకుంటున్నారా జనాలు అని మనసులో భయపడి..
నేను సాఫ్ట్వేర్ యే రా..ఇన్ఫోసిస్..
అర్రే..అనుకున్నా.. .. ( ఇకా చాలా ఉందోచ్ )

Apr 8, 2011

నా అభిమానం


నాకు అప్పుడు అయిదారేళ్ళ వయసు.
సినిమా అంటే అబ్బురం. అందులోను.. చిరంజీవి సినిమా అంటే.. ఓహ్..దసరా ,,దీపావళి కంటే పెద్ద పండగ నాకు ఆది..
నానా హంగామా చేసి చిరు సినిమా చూసేవాడిని.. స్కూల్ ఎగ్గొట్టి సినిమా చూసే ధైర్యము..ఘనతా నా కాలనీలో నాకే దక్కాయి. పక్కవాళ్ళ ముందు దోషిగా నిలబడ్డా నామోషి గా ఎప్పుడు ఫీల్ అవలేదు. పైగా అదో గొప్ప adventure గా అనుభూతి చెందేవాడిని. ఆ ఫైగింగులు..ఆ స్టైలు .. ఆ అందము..ఆ డ్రెస్సులు..ఆ స్టెప్పులు..మరిచిపోగాలనా?? ఖైదీ, గుండా..పులి..కిరాతకుడు..యమకింకరుడు....మీకు తెలుసుగా పేర్లు..


Intermediate.
"Gang leader  కాలేజీ ఎగ్గొట్టి టిక్కెట్స్ కోసం try చేస్తే చివరికి మొదటి ఆటకి దొరికింది. నాలుగింటికల్లా  రావలసిన పిల్లాడు ఎక్కడికి వెళ్ళడా అని ఇంట్లో వాళ్ళంతా యమా  ఇదై పోతుంటే.. నేను మాత్రం.. " ఆంజనేయుడికి దండం పెట్టి రాఫ్ఫ్ ఆడించేస్తా నాహా..... రావణ లంకకి నిప్పంటించి మీసం మెలి పెడదామ.  జి  అ న జి ..గ్యాంగ్ గ్యాంగ్ ..బజావో..బ్యాండ్ బ్యాండ్.."
సినిమా చూస్తూ..అప్పుడప్పుడు పిడికిలి భిగించి వదులుతూ తన్మయత్వం చెంది..  ఇంటికి వెళ్లేసరికి  10 కొట్టింది.ముందు అన్నం పెట్టారు..ఆ తరవాత వాతలు పెట్టారు. కాని నేను గ్యాంగ్ లీడర్ లో చిరంజీవిలా  ఫీల్ అయ్యి .. అవి గొప్పగా నొప్పి పెట్టనట్టు నటించాను.


డిగ్రీ
...చదువుతున్నానో...లేక అయిపోయిందో..గుర్తులేదు..
హైదరాబాదు..మల్కాజిగిరి ..సాయిరాం theater.. "స్నేహం కోసం"  సినిమా చూసాను.
ఆ తరవాత ఇంక చిరంజీవి  సినిమా చూడకూడదు అనుకున్నాను.. అప్పటికే ఆయన మాస్ మసాల మాటల స్టయిలు.. లుంగీలు ఎగ్గట్టడాలు  గంతులు వేయటాలు..  ఎంచుకున్న పాత్రల్లో హుందా తనం లేకపోవటము.. చీ చిరంజీవి అనిపించింది.
మళ్లీ ఇంతవరకు చిరంజీవి సినమాని theater లో చూడలేదు.


మొన్నటి దాకా & ప్రస్తుతం.
చిరంజీవి పార్టీ పెట్టటం..నాకు చాల బాధేసింది.   ఇక ఆయన ఏం మాట్లాడిన అసహ్యం వేసింది. ఎందుకంటే ఆయన తెర నుంచి రాజకీయ నాయకుడు అయ్యాడు కనక. రాజకీయం అంటే నిజ జీవిత నటన కనక.. రాజకీయ నాయాకుడేవరు  హీరో కాదు..కాలేడు గనక
ఇక ఆయన సంపూర్తిగా నా మనసులోంచి తొలగించ బడ్డాడు.
ఆయన తన స్వంత జీవితంలో సరి అయిన దారి ఎంచుకొని..ఒక్కో మెట్టు ఎక్కాడేమో..నా ఒక్కడికి బదులు వంద మంది అభిమానులని సంపాదించుకున్నాడేమో..
కాని నా గుండె కుండలో అభిమానం ఒక్కో చుక్కా కారి పోయి..ఎండిపోయింది.
ప్రజారాజ్యం కాంగ్రేసులో మద్దతో/ విలీనం కావటం తో..ఆ ఎండిన కుండా  పగిలి పోయింది.

Mar 30, 2011

" గీతాంజలి"




software జాబులు..జేబునిండా డబ్బులు....లివిన్ రేలషన్ షిప్పులు వన్  నైట్  స్టాండ్ లు,  తాకే ఇట్ easy లవ్వులు... ఇవన్నిటి ముందు  ఈ విషయం  సాధారణం అయిపోయిందో..లేక  అలవాటయ్యి  ఇదో   పెద్ద విషయంగా చూడటం లేదో.. లేక మనం  పెద్దగా ఫీల్ కావటం లేదో.. కాని  అప్పట్లో...  వాళ్ళు ఇద్దరూ లేచిపోయారంట  అన్న విషయం  పెద్ద దుమారం లేపేది ..క్షణాల్లో  ఊరు ఊరు పాకి పోయేది.   పెద్దల్లకి అది మర్డర్ చేసిందానికంటే పెద్ద క్రైమే , యువకులకి అదో  క్రేజీ..adventure లా ఫీల్ అయ్యేవాళ్ళు ..   అలాంటి రోజుల్లో   " నేను నీకు నచ్చానా??  అయితే మంద్దరం ఉరు విడిచి లేచిపోదామా ? "
 అని ఓ  అమ్మాయి నోట చెప్పించి..జనాల మతి పోగొట్టాడు మాస్టర్ అఫ్ ఇండియన్ celluloid మణిరత్నం. అయితే సినిమా లేచిపోవటం గురించి కాదని అందరికీ తెలిసిందే . :)

 పేరులోనే ఓ కొత్తదనం. అది కుడా నలుపు ఎక్కువగా ఉండే  పోస్టర్  మీద  వంపులు తిరిగి భలే ఆకర్షకంగా.. " గీతాంజలి" 
ఏముంది ఈ సినిమాలో ? 
http://navatarangam.com/2011/03/geetanjali-1/

Mar 23, 2011

In to the wild.


Christopher McCandless అనే ఒక నవ యువకుడు ఈ materialistic సమాజం మీద విసుగు పుట్టి ,  ఉన్న డబ్బుని దానం చేసి అలస్కా గమ్యంగా ప్రయాణం సాగిస్తాడు. ఆ ప్రయాణం లో కలిసిన స్నేహితులు.. పొందిన అనుభవాలు.. చెందిన అనుభూతులు..దర్శించిన సత్యాలు… ఇదే ఈ సినిమా కథ.

Feb 15, 2011

సినిమా తీద్దాం రండి


  •  మీ దగ్గర ఉన్నఅ బ్లాక్ మనీ ని వైట్ మనీ గా మార్చుకోవాలని ఉందా ??
  • మీకే తెలియని ఆస్తులు ..తద్వారా మీకు తెలియనంత గా పెరిగిపోతున్న ఆదాయం ఉందా?
  • మీ తాతలేప్పుడో సంపాదించిన ఆస్తి పాస్తులు.. బంగారు గుడ్లు పెట్టె బాతుగా మారిందా?? తద్వారా వొచ్చే ఆదాయానికి పన్ను కట్టాలంటే బాధగా ఉందా ??
  • మీకు లెక్క పెట్టలేనంత ..మీకే తెలియని ..మీ ముందు తరాలు పడుకొని తిన్నా తరగని సంపద ఉందా??
అయితే
సినిమా తీద్దాం రండి 
  • మీ బ్లాక్ మనీ ని వైట్ గా మార్చుకోండి 
  • జనానికి కాలక్షేపం కోసం ఓ మంచి కథని తెరకేక్కించండి.
  • మీ కళాభిమానులని చెప్పే ఓ కళాత్మక సినిమా తీయండి. 
  •  సమాజానికి  ఓ మంచి సందేశాన్ని అందించండి 
  • సినిమా తీయటం ద్వారా కొన్ని కుటుంబాలకి  కొంత కాలం బ్రతుకు తెరువును కల్పించండి.
  • కొంత మంది సృజనాత్మక వ్యక్తులకి తమ సృజనని వెలుగు చూపించే అవకాశం కల్పించండి.

Feb 1, 2011

చరిత్ర కాకూడదా ..???

 
స్వప్నా.... ప్రేమంటే ఏమిటి ?
ఏం లేదు,... రెండక్షరాలు..?
మరి.."పిచ్చి"..ఆది కూడ రెండక్షరాలే..
అయితే ప్రేమికులు పిచ్చి వాళ్ళంటావా ??
కావలి మరి.   ఆ ...అటు చూడు... ఆది పిచ్చి పని కాదా ??
హి హి ...
అవును మనమెప్పుడు ఇలా శిధిలాల్లో  తిరుగుతున్నామెందుకు ?
ఈ శిధిలాల వెనక ఎన్నో కథలుంటాయి..చినిగి పోయిన చరిత్ర పుటలు ఎంత చిందర వందరగా పడున్నా శాశ్వతంగా గుర్తుంటాయి..
బాలు.. మన కథ కూడ ఒక చరిత్ర అవుతుందేమో ..
ఆ ఆ..
కాలికి  ముళ్ళు గుచ్చు కుంటేనే ఓర్చుకోలేవు .. ముందు ముందు చరిత్ర ఎలా సృస్తిస్తావ్ ??
హహ
స్వప్నా మనం పెళ్లి చేసుకోకూడదు..
ఏం ప్రేమంతా అయిపోయిందా ??
కాదు పెళ్లి చేసుకుంటే అందరి లాగ అందరి లాగ ఆలుమగలు గా మిగిలిపోతాం.. ప్రేమ ఫలించక పోతేనే,,,, కథానాయకులమవుతాం..
మనది కథెందుకు కావాలి?? ..... చరిత్ర కాకూడదా ..???

Mar 5, 2010

ఏమి భాగ్యమది.

సినిమా షూటింగ్ కోసం .. కులు, మనాలి వెళ్ళాం.
మనాలి నుండి " లే లడక్" దారిలో షూటింగ్ లొకేషన్ ఉంది.
అక్కడే  సాయంత్రం దాక షూటింగ్ చేసాక,  చీకటి పడుతుండగా  మిగతా వాళ్ళందరూ తిరిగి బస చేసిన hotel కి వెళ్ళిపోయారు.. నేను మా డైరెక్టర్, మిగతా మెయిన్ టీం దారిలో ఇంకో చిన్న ప్రాంతంలో షూటింగ్ చేయాలనీ అక్కడికి చేరుకున్నాం....అ ప్రదేశం అచ్చం "చలం" గారు వర్ణించినట్టు .. చుట్టూ మంచు కొండలు, దాన్ని తాకుతూ మెలికలుగా రోడ్డు.. పక్కనే ఒక చిన్న కొలను...మంచు కరిగి చేరిన స్వచ్చమైన చల్లని నీరు అ కొలనులో..

సాయంత్రం చీకటిగా మారుతోంది...ఇంతలొ ఎవరో అన్నారు..ఈ రోజు పౌర్ణమి అని .. చుట్టూ చూస్తున్నాం..ఏవైపు నుండి చంద్రోదయం అవుతుందా అని.. కొంత సేపు తరవాత .....


ఓ వైపు తెల్లని వెండి కొండల మధ్య నుండి  కాంతి పుంజం దర్శన మిచ్చింది.. అ వైపు కెమెరా ఆన్ చేసి కూర్చున్నాం..చల్లని మంచు గాలి మమల్ని సన్నగా వోణికిస్తోంది. ఇంతలో.. . మెల్లిగా.. తెల్లగా.. మంచు కొండలని వెండిలా మెరిపింప చేస్తూ.. నిండు చంద్రుడు దర్శన మిచచ్చాడు .
వావ్ ..ఏదో తెలియని ఆనందం చుట్టుముట్టేసింది..

.....నేనంటూ లేకుండా ఆ కాంతి లో ఐక్యమైతే ... ఏమి భాగ్యమది.

Oct 18, 2009

హాలిడే హోం వర్క్



వెంకటప్పయ్య..(వెంకి) ఆరో తరగతి చదువుతున్నాడు.. పరిక్షలు ఐపోయాయి..ఇక పదిహేను రోజులు సెలవులు.. ఆనందం తో ఎగురుకుంటూ..క్లాసు బయటికి పరిగెత్తాడు ఫ్రెండ్స్ తో.
ఎన్నో ఉహలు మొదలయ్యాయి ..బాగా నిద్రపోవాలి....క్రికెట్..ఫ్రెండ్స్..ఇష్టమైనవని తినటం..తాతయ్యతో కబుర్లు..అక్కని ఏడిపించటం...కాని ఇంతలొ..మరో అనౌన్స్మెంట్..
"every one should write the answers for the exam question papers in the holidays"

విన్నాడు..కాని పట్టించుకునే స్థితిలో లేడు..
చలో పదా అని ఏదో ఉహాలోకం పిలుస్తుంటే.. సరిగమలే తెలియని రాగం పాడుకుంటూ..
మాది బిందాస్స్టైల్..పెద్దలకే నేర్పిస్తాం అంటూ  వెళ్తున్నాడు.  ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడెక్కడో తిరిగి..ఇల్లు చేరుకున్నాడు.
సెలవుల్లో  క్రికెట్, సినిమాలు,వీడియో గేమ్స్ తో యమ busy అయిపోయాడు. అక్కయ్యని కాక పట్టి.. ఎలాగోలా.. అన్ని హోం వర్క్ లు పూర్తి చేసాడు...కాని సోషల్ పేపర్ మాత్రం కనపడక చేయలేదు.  అస్సలే సోషల్ టీచర్ అంటేఅందరికి హడల్.
అప్పటికి  ..ఒకరిద్దరు ఫ్రెండ్స్ ని అడిగాడు..కానీ  దొరకలేదు..టెన్షన్ మొదలైంది..
కలల్లో సోషల్ టీచర్ భయపెడుతూ ఉంది .
సెలవులు ముగిసాయి.. మళ్లీ స్కూళ్ళు తెరిచారు. పొద్దున్నే నిద్ర లేపారు వెంకిని.. ఇన్నాళ్ళు పోద్దేక్కే వరకు నిద్రపోయిన  అలవాటుకి...లేవాలనిపించలేదు. కడుపునొప్పి...కూడా రక్షించలేక పోయింది.. బద్దకంగా లేచి తయారయ్యాడుస్కూల్ కి.. 

దారిలో..అన్ని తనకి నచ్చినవి చూస్తుంటే ఏడుపొచ్చింది..తనలాగే చాలమంది పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు.. ఆటోల్లో ..బస్సుల్లో ..కొంతమంది..happygaa..కొంత మంది sad గా ..

అప్పటికే prayer స్టార్ట్ అయింది.. గేటు ముందు కూర్చున్నాడు భయంగా...బాధగా..
బాగ్ లో ఏదో తగిలింది.. తీసి చూసాడు ... cadbury.. అక్క పెట్టింది.. తను ఎంత ఎడిపించినా అక్కకి తనంటే ఎంత ఇష్టం అనుకున్నాడు.... ..ఒక చిన్న నవ్వు అ చిరుపెదాలపై మెరిసింది....prayer ఐపోయింది.. లోపలికెళ్ళాడు..క్లాసు రూం అంత గోల గోలగాఉంది.
అందరూ హాలిడే హోం వర్క్ చేసినట్టున్నారు... ఆనందంగా అరుస్తున్నారు..
..వెంకికి మాత్రం.."సోషల్ టీచర్" భయం ...టెన్షన్ పెరిగిపోతోంది... ఇంకో రెండు నిముషాల్లో ఏమవుతుందో అని... మరి అలాంటి పరిస్తితుల్లో వెంకి ఎలా తప్పించుకున్నాడు అనేది  ఈ సినిమా

సినిమాలో రెండు సందర్భోచిత పాటలు.. ఒక ఎంద టైటిల్ సాంగ్ ఉన్నాయి.
కింది లింక్ లో విని అభిప్రాయం తెలియ చేయండి

  Powered by     eSnips.com 

Jul 19, 2009

మా ప్రయాణం


దాదాపు ౩౦ గంటల రైలు ప్రయాణం తరవాత డిల్లిచేరుకున్నాం, అక్కడ మాకోసం 'తవేరా' వేచి ఉంది.. మళ్లీప్రయాణం మనాలికి, 650 kms. ఏ అర్ధ రాత్రికో చేరుకుంటాంఅన్నాడు డ్రైవర్. సామాను సర్ది డిల్లి రోడ్లు చూస్తూ ప్రయాణంసాగించాం.. మార్గం మధ్యలో అందరు ఓ బీర్ కోడదామంటేఆపి బీర్ , లంచ్ కానిచ్చాం. రెండురోజులుగా స్నానం లేదు.. చికాకుగా ఉంది.. చండి ఘర్ చేరుకునే టప్పటికి రాత్రి 8 గంటలైంది.. అక్కడ మాకోసం వేచి ఉన్న బావగారినికలుసుకొని. రూం లో హాయిగా స్నానం చేసాం. అందరు స్నానాలు కానిచ్చాక మళ్లీ బయలుదేరింది బండి, బావ తోపాటుగా. ఆన్ ది వే మల్లి బీర్లు లాగించి రాత్రి 10 గంటలకి ఒక దాబాలో భోజనం చేసి మల్లి ప్రయాణం. చుట్టూ చీకటి,, ఎదురుగా ఆ నల్ల త్రాచులా ఉన్న రోడ్డు తప్ప ఏది కనపడటం లేదు.. అప్పుడప్పుడు ఎదురుగ వచ్చే వాహనాల వెలుగు కళ్ళకికొడుతోంది.. కిటికీ లో నుండి గాలి రివ్వున మొహాన్ని తాకి చెవిలో వింత ధ్వనిని శ్రుస్టిస్తోంది . కొంత మందిజోగుతున్నారు, కొంత మంది కళ్ళు మూసుకొని ఆలోచనల్లో మునిగిపోయారు..
మనలోకి మనం చూసుకొనే సమయంప్రయాణాల్లో బాగా దొరుకుతుంది.. కళ్ళు మూసుకుంటే ముందు, వెనక జీవితం కళ్ళు ముందు ఉంటుంది.. ఒక్కోసారివింత ఆలోచనలు కూడా వస్తుంటాయి.. నేను మాత్రం జీవితాన్ని ముందేసుకున్నా ... ఏంటి ఈ జీవితం ? ఎంత విచిత్రం.. ఎటు చుసిన మనుషులు.. జీవనాని కై పరుగులు.. నిరంతర పోరాటం.. బ్రతుకుకై ఆరాటం ..అసలు శాంతిగా బ్రతికే మనుషులున్నారా అని అనుమానం. ఏదో బ్రతుకుతెరువు దొరికింది రా అనుకొనే లోపు.. మతము, దేవుడు తాయారు, శాంతిని దూరం చేయటానికి... వెనకనుండి " డ్రైవర్ కళ్ళు ముస్తున్నాడు చుడండి " అని అరుపు విని ఆలోచనలు కట్అయ్యాయి.. అవును ,, డ్రైవర్ జోగుతున్నాడు..
అప్పటికే ఘాట్ రోడ్డు మొదలైంది... కాసేపు విశ్రాంతి తెసుకోమని డ్రైవర్ కి చెప్పి.. బండి దిగాం.. ఒక్కసారి చల్ల గాలితగిలింది.. సమయం 1 కావొస్తోంది.. పడుకోవటానికి ఏమి లేక , దాబాలో ఓ కుర్చీ లో కులబడ్డా,,, బండి లోజోగుతున్న వాళ్ళు బయటికి రాలేదు. ఆ దాభాలో వేసిన నులక పై పది డ్రైవర్ గుర్రు పెట్టాడు.. గత 5 రోజుల నుండి నిద్రలేదట, " పోయాను నేను వేళ్ళను " అన్నా వినకుండా మా ట్రిప్ కి పంపించారట ఆఫీసు లో.. సర్లేలే చేసేదేముంది అని.. మల్లి ఆలోచనల్లోకివేల్లబోయా.. కాని చలి ఆపని చేయనీయలేదు.. వణుకుతూ..కూర్చున్నాం...కాసేపు రోడు మీద వాహనాలని చూస్తూ.. కాసేపు చాయ్, .. కాసేపు టీవీ చూస్తూగడిపాం.. ఉదయం 6 గం అవుతుందనగా.. నిద్ర లేపాం డ్రైవర్ ని .

Easily Upload Your Images To Myspace
Free Music

దారి పొడుగునా చిన్న చిన్న కొండలు వాటిమీద ఇళ్ళు.. మంచుపర్వతాలనుంచి కరిగి పరిగెత్తే స్వచమైన కాలువ ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగింది మా ప్రయాణం..