Feb 21, 2010

మీరెన్ని వేషాలు వేసినావైకుంటం   .. పాలసముద్రం చల్లగా ఉంది.. ఆ సముద్రం లో ఒక పెద్ద 10 తలల ఆది శేషుడు..
శ్రీ మహా విష్ణువు  ఆది శేషుడి మీద పడుకుని ఒక కునుకు తీస్తునాడు.
లక్ష్మి  దేవి ఆవలిస్తూ కాళ్ళు  వత్తుతూ  ఉంది.
దేవీ .. కొంచం గట్టిగ నొక్కు..ముల్లోకాలు తిరిగి నొప్పిగా ఉన్నాయి..
ఏమండీ, నాకో చిన్న డౌట్.. మీరెన్ని దొంగ వేషాలు వేసినా I mean  "అవతారాలు" వేసినా ..లోకం లో అన్యాయం  ఆగటం లేదుకదండీ.. దోచేవాడు దోచేస్తూనే ఉన్నాడు, లేని వాడు నిత్యం చస్తూనే ఉన్నాడు. 
చూడబోతే మీరేమి "ఆక్షన్" తీసుకుంటున్నట్టు  లేదు.
  దేవీ .. సకలలోక పాలకుండ.. శేష తల్పుండ.. విశేష నామ దేయుండా... విష్ణు దేవుండ..
తోక్కేం కాదు.. అడిగింది చెప్పండి అంటే..మిమల్ని మీరు పొగుడు కుంటారేంటి ...తెలుగు సినిమా  హీరోల్లాగా.

అంతకంటే చేయటనికేముంది దేవీ .. అడుగు ఏం  చేయలేదో..
 ఆ కుంభకోణం చేసిన మంత్రి గారిని  ఏం చేసారు అంటా ?? కనీసం ఏదైనా శిక్ష వేసారా ?
అయ్యో దేవీ .. తెలిదా, అతను తిరపతి లో నాకు కిలో బంగారం ఇచ్చాడు..
అవునా (నాకు కనీసం  వజ్రపుటుంగరం కూడా లేదాయే) పోనీ.. మరి ఆ ఖనిజం స్కాం సూత్రధారి ?? అతని సంగతేంటి ??
అతనా.. అతను  నా  గుడి కట్టటానికి పెద్ద మొత్తం లో చందా ఇచ్చాడు.

మరి...మరి..అని లక్ష్మి దేవి..ఆలోచిస్తుంటే..
చూడు దేవి.. ప్రతి వాడు ఎంతో కొంత ఇస్తూనే ఉన్నాడు..
ఇవ్వలేక పోయిన వాడికి నేను ఏదో  ఒక కీడు చేస్తూనే ఉన్నా,ఇంకేం కావలి..
అది కాగ మనుషులు తెలివి మీరి పోయారు. బొత్తిగా పాప భీతి లేకుండా పోయింది, మహా అంటే పోతాం, పొతే పోయింది వెధవ జీవితం, ఉన్నన్నాళ్ళు  అప్పో సప్పో.. మోసమో, దగానో ఏదోటి చేసి సుఖం అనుభవిస్తే చాలనుకొంటున్నారు, ఎంతటి ఘోరానికైన తెగిస్తున్నారు.

ఎక్కువగా మాట్లాడితే నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అని పురాణాలు, భారత, భాగవతలో  నేను చేసిన ఘన కార్యాలని ఏకరువు పెడుతున్నారు.  నా వీక్ పాయింట్ తెలుసుకున్నారు, నా మోహన డబ్బు, నగా కొడుతుంటే  నేను మాత్రం ఏం  చేయగలను చెప్పు ?
అయినా దేవీ .. నీ కెందుకు ఇవన్నీ .. హాపీ గా కాళ్ళు పట్టక.. మగని సేవ కంటే మగువ కి  కావలసినదేముంది కనక ??
మగని సేవట,  మీరేదో సామాన్య జనాలని ఉద్దరిస్తున్నారేమో, నేను మీ సేవ చేస్తే పుణ్యం కలిసొస్తుందని అనుకుంటున్నా...మీరు కూడా  లంచాలకి మరిగి.. కుపరిపాలన చేస్తుంటే  మీకు సేవ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. దేవీ.. అంత కంటే  ఏం చేయగలవు దేవి.. హ్యాపీ గా నా సేవలో తరించు..
బ్రతికుంటే.. కాల్ సెంటర్ లో పనిచేసిన బ్రతుకుతా  కాని మీ కాళ్ళు పట్టను..
అయ్యో దేవీ ... వెళ్తున్నావా..

(ఇదంతా ఓరకంట గమనిస్తున్న బ్రహ్మ దేవుడు  ముసిముసి గా  నవ్వుకుంటూ  తన పని తాను చేసుకుంటున్నాడు)

4 comments:

Anonymous said...

chaala navochindandi baaga raasaru

narra venu gopal said...

తోక్కేం కాదు.. అడిగింది చెప్పండి అంటే..మిమల్ని మీరు పొగుడు కుంటారేంటి ...తెలుగు సినిమా హీరోల్లాగా.పన్ ఒక్కటే కాదు నిజాలు కూడా ఉన్నాయ్ andi

Srimoukthika said...

haha nijamele.. baga cheppau, chala bagundhi

ఆ.సౌమ్య said...

:)) బావుంది