May 25, 2011

ఆరెంజ్.........

 
ఓ పెద్ద బిల్డింగ్.. చుట్టూ ఎత్తైన కంపొండ్  గోడ.. ఓ పెద్ద గేటు.. తీహార్ జైలుకి కుడా ఇటువంటిదే ఉంటుందని నా ఉహ..
ఇంతకీ అదేమిటంటే.. మా చదువుల దేవాలయం..బడి..
..తెల్లని బురఖాలతో దేవదూతల్లా 'సిస్టర్స్' ..కనిపించటానికి దేవదూతలే..కానే బెత్తెం చేతికోచ్చిందంటే..పిశాచాలే. ఒక్కడు అల్లరి చేసినా దాదాపు అందరికీ వీపు పగిలేది.. ఎందుకు అంతగా  కొడతారో అప్పట్లో తెలిదు ఇదంతా..sexual frustration అని.  కాని నేను దెబ్బలు తిన్న సందర్భాలు ఏ ఒకటో రెండో..ఎందుకంటే ఈ దెబ్బల బాధ తప్పించుకోటానికి..నేను చెప్పింది చెప్పినట్టు చదివే వాడిని.  దాంతో ఏ ప్రశ్నకైనా టక్కున సమాధానం వచ్చేది. ..ఒకవేళ ఒక్కోసారి చెప్పలేకపోయినా...నా "బానే చదివే"  మొహం చూసి..క్షమించి వదిలేసేవాళ్ళు, లేదా దెబ్బ తీవ్రత తగ్గించే వాళ్ళు. దెబ్బలు తప్పించుకోటానికీ చదువు మీద శ్రద్ద కాని..ఆ చదువు ఎందుకో అర్థం అయ్యేది కాదు. .సున్నం బట్టీ...ఇటుకల తయారీ . పొటాషియం పర్మాంగనేటు ...చర్మం అడ్డుకోత..ముత్ర పిండాలు.. అమెరికా గడ్డి మైదానాలు...గోధుమ పండే రాష్ట్రాలు...

స్కూల్ ల్లోకి అడుగు పెట్టింది మొదలు.. మనసంతా  రెండు పీరియడ్ల తరవాత కొట్టే విశ్రాంతి గంట  మీదే. అప్పట్లో చేతికి గడియారాల పాడా..  కారిడార్ లో నీడలు  చూసేవాళ్ళం..అవే చెప్పేవి మాకు ఎప్పుడు ఏ బెల్లు కొడతారో అని. అందుకే ఆ నీడల్లోనే మా ప్రాణం . ఆ నీడ మేము అనుకున్న చోటుకి పాకుతోందంటే ఉత్సాహం ఎక్కువయ్యేది. 

విరామం లో గేటు బయట చిన్న పాటి జాతరే... ఎన్నో రకాల తిను బండారాలు  అమ్మేవాళ్ళు  మాకోసం కాచుక్కుచునే వాళ్ళు, తట్టుసంచీ పరచుకొని. ఒకామె పల్లీపట్టే..నువ్వుల పట్టే..పుట్నాల పట్టీలు అమ్మితే..ఇంకో అమ్మ..ఉదికేసిన కందగడ్డ..పల్లీలు శనగలు...ఇంకో అమ్మమ్మ ..కొబ్బరి గోలీలు..సంత్ర,..నిమ్మ గోలీలు నామాల గోలీలు.. మరోఆమె...బంతులు..లాయిలప్పలు..బొంగరాలు... లాంటి ఆట వస్తువులు.. ఇహ ఐస్ క్రీం బండి వాడి గురించి చెప్పనే అక్కరలేదు.. ఎక్కువ మంది పిల్లలు వాడి చుట్టే ముగేవారు.. ఎరుపు..ఆకుపచ్చ..తెలుపు..ముదురు పింకు రంగులతో..వెదురు పుల్లకి అంటుకొని బాగా ఆకర్షిచేవి. పది పైసలకి ఇలాంటివి.. అదే 25 పైసలయితే..పాల ఐస్ క్రీం. అదే 50 పైసలయితే  ... ఆరంజ్ లేదా..కోకాకోలా ఇసుక్రీం.
నాదగ్గర మహా అయితే పది పైసల కంటే ఎక్కువ ఎడిస్తేగా. కాని ఆ పది పైసల ఇసుక్రీం చల్లగా తప్ప తియ్యగా ఉండదు కనక మనసంత ఆ ఆరెంజ్ మీదే.  
ఓ రోజు ఇహ లాభం లేదని ఓ పథకం వేశా.. పరీక్షలో నా ముందు వెనకా ..అటు ఇటు ఎవరు అని గమనిస్తే.. ముందు విజయ్ గాడు.. వెనకా  శరత్ గాడు.. వీళ్ళతో లాభం లేదు.కాని అటు ఇటు..రాజు గాడు..నవీన్ గాడు. అః..ఇద్దరు మొద్దు మొహాలే . తన్నులు తినని రోజే  లేదు వాళ్ళు . పరీక్షల్లో ఫెయిల్ అయిన రోజు రెట్టింపు దెబ్బలు ..కనక వాళ్ళతో ఓ ఒప్పందం చేసుకున్న.. పరీక్షల్లో పాస్ మార్కులు వచ్చే విధంగా నేను చూపిస్తా ... బదులుగా నాకో ఆరెంజ్ ఐస్ క్రీం కొనివ్వాలి అని.  నవీన్ గాడు వెనకా ముందు ఆలోచించక..సరే  అన్నాడు. ఎందుకంటే.. వాడి జేబులో ఎప్పుడు లక్మి దేవి గల గల లాడేది.  ప్రతి  రోజు ఒకటో రెండో  రూపాయలు ఖర్చు చేసేవాడు.  ఇహ రాజు గాడు మాత్రం...పాల ఐస్ క్రీం కంటే ఎక్కువ ఇవ్వలేను అన్నాడు.వాడి దీనమైన  ముఖం చూసి..సరే అన్నాను.

అప్పటినుంచీ పరీక్షలొచ్చాయి అంటే  యమ హుషారు గా చదివే వాడిని..
మా వాళ్లకేం తెలుసు నా చదువంతా ఆరెంజ్ ఐస్ క్రీం కోసమని .. :) :)

1 comment:

Krshychait said...

ఒక్క సారి చిన్నతనం లోకి వెళ్ళిపొయాను...చాలా బాగా వర్ణించారు