Showing posts with label నా దేశం. Show all posts
Showing posts with label నా దేశం. Show all posts

Jan 26, 2013

ఇంత దరిద్రం... థు.

ఈ చట్ట సభల్లో ఒకరి పార్టిని..ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ..వాకౌట్లు గుర్రు పెట్టటాలు..తప్ప మారుతున్న కాల పరిస్థితులు విసిరే సవాల్లని ఎదుర్కొని troubleshooting చేస్తూ చట్టాలు సవరించి ఉండి ఉంటె
ఈ రోజు దేశం ఇంత దరిద్రంగా ఉండకపోయేది. పెరుగుతున్న జనాభాని నియంత్రించే వాడు లేడు... రగులుకుంటున్న మత విద్వేషాన్ని చల్లార్చే దిక్కు లేదు... పెడదారి పడుతున్న యువతకి దారి చూపే నాథుడే లేడు .
ఆ కాపిటలిస్ట్ లతో కలిసి దేశాన్ని దోచుకోవటం, దాచుకోవటం, ( దోచుకు తినటం కుడా కాదు.ఎందుకంటే తినే యోగ్యతా...యోగం కుడా ఉండదు )
ఉంది కదా అని ప్రజల మీద ధురాధికారం చూపించటం తప్ప..చూపించే అధికారం వలన తన ప్రజలు సుఖపడుతున్నారా, చల్లగా ఉన్నారా అనేకంపాషన్ లేని దొంగ ____ లా కనపడుతుంటారు మనం ఎన్నుకున్న చట్ట సభల్లో కూర్చున్న పెద్దలు.
ఒక్కో సమస్య మీద ఒక్కో సభ్యుడు తన నివేదిక సమర్పించి.. సూచనలు పరిష్కారాలు చేసినపుడు దాన్ని సరిచూసి..మెజారిటి సభ్యులు ఎంచుకున్న దాన్ని చట్టంగా పెట్టటానికి ... నా బొంద, ఇంత రాద్దాంతం.. ఇంత నాటకాలు ..ఇంత సమయం.. ఇంత ఆర్భాటం..ఇంత లేకి తనం..ఇంత దరిద్రం... థు.

Oct 18, 2011

కలిసే ఉందాం. సరేనా.. ;)


అనగనగా ఒక బడి.. అందులో  ఓ ఒక తరగతి గది.
మాష్టారు గుర్రు కొడుతున్నాడు.. పిల్లలు మాటలు..ఆటలు పాటలు..తమ ధోరణిలో తామున్నారు..
ఇంతలో..
సార్.. సార్.. పిలిచాదొక పిల్లాడు..
కళ్ళు నులుపుకొని.. పెదాలు చప్పరిస్తూ లేచాడు మాస్టారు..

సార్ వీడు నా పెన్సిల్ లాక్కున్నాడు సార్..
అదేం లేదు సార్..
సర్ వీడు నా లబ్బర్ కూడా తీసుకున్నాడు..
లేదు సర్ నేను తీసుకోలేదు..
సార్ వీడు  నా  కాపీలో  కమ్మలు చింపుకున్నాడు సార్..
నిజ్జంగా నేను చింపుకోలేదు సార్..ఒట్టు..
సర్ వీడు నా నీళ్ళు తాగేసాడు సార్..
నేను వాడి బాటిల్ ముట్టుకోనే లేదు సార్.
సార్ వీడు నా చపాతి తినేసాడు..
అమ్మతోడు.. నేను తినలేదు..

సార్ సార్ ప్లీజ్ సార్ నేను వీడి పక్కన కుర్చోను..నా బెంచి మార్చండి సార్..
సార్ వద్దు సర్.. మేమిద్దరం దోస్తులం..అన్నదమ్ముల లాంటి వాళ్ళం..
ఏంటి ..ఛీ... నీ దోస్తు కటీఫ్..
నేనెప్పుడు కటీఫ్ కాదు.. కలిసే ఉందాం. సరేనా.. ;)
మాస్టారు ఏమి మాట్లాడకుండా...ఇంకోసారి పెదాలు చప్పరించి పడుకున్నాడు.

Jun 20, 2011

ఏ జో దేశ్ హై మేరా..


మారేడ్పల్లి నుంచి వస్తున్నాను.. అక్కడ ఏదో విగ్రహం ఉంది.. దుమ్ముకొట్టుకుపోయి. అక్కడ  ఉన్న సిగ్నల్ దాటి మలుపు తిరుగుతున్ననో లేదో..ట్రాపిక్ పోలీసులు.. జనాన్ని ఆపుతున్నారు..రోడ్డుమీదకు  అడ్డంగా వస్తూ..
ఉదయం పదకొండు ..సికిందరాబాదు ..తార్నాక..మారేడ్పల్లి ఇలా మూడువైపుల నుంచి వచ్చే ట్రాఫిక్ లో వెళ్ళటమే కష్టం రా బాబు అంటే..మధ్యలో వాహనాలని ఆపుతూ ట్రాఫిక్ పోలీసులే ట్రాఫిక్ ఆగేట్టు చేస్తే..ఏం అనాలి ? కొంచం ముందుకు వెళ్తే సెయింట్ ఆన్స్ స్కూల్ ముందు ఖాళీగా స్థలం  ఉంది. అక్కడ వాహనాలను ఆపినా  మిగతావారికి ఇబ్బంది కలగదు.
ఇంకిత జ్ఞానం అంటారు దీన్నే. పదో ..ఇంటర్  ..అత్తెసరు మార్కులతో అప్పుడెప్పుడో   పాసయ్యి..promotions ద్వారా SI అయితే ఇలాగే ఉంటుంది.  వాళ్ళ మెదడు ఇలా కాక ఎలా పనిచేస్తుంది ???
సరే ఇది పక్కన పెడితే..
 cbz మీద జోరుగా వస్తున్న పాష్ యువకుడిని ఆపాడు ఒక భటుడు.
ఏంటి ?
లైసెన్సు..RC చూపించు..
చూపించాడు..
ఇన్సురన్సు..
చూపించాడు..
pollution..
లేదు..
ఫైన్ కట్టు
ఎంత ??
150 /-
ఆ యువకుడు ఒక్కనిముషం అన్నట్టు సైగ చేసి  మహా కూల్ గా  gold flake సిగరెట్టు వెలిగించాడు....గుండెనిండా పొగ పీల్చి..ఉదాడు..
అప్పుడు అన్నాడు..పచాస్ లేలో.. అని..
ట్రాఫిక్ భటుడి మొహం వెలిగింది..
ఆంగీకారపు  నవ్వు పెదాల మీద కనబరచాడు.
purse తీసి ..ఓ యాభై నోటు ఇచ్చాడు..ఆ ఇచ్చే పద్దతి చూస్తే ఎవ్వరికైనా తెలుస్తుంది..బిచ్చగాడికి వేసినట్టు వేస్తున్నాడని..
దాన్ని మహా ప్రసాదం లా అందుకునుని..చిరునవ్వుతో పనిలో లీనం అయ్యాడు మన భటుడు.
జై భారత్ అని తన దేశం మీద   ఒక్క నవ్వు నవ్వుకొని...మళ్ళీ అదే వేగం తో వెళ్ళిపోయాడు.

Jun 9, 2011

దేశ భక్తి


కాలేజీ కి వెళ్తూ ఓ  x రోడ్డు సిగ్నల్ దగ్గర ఆగాను. ఓ ఏడు ఎనమిది మంది బిచ్చగాళ్ళు (పిల్లలు)..వొంటిమీద చొక్కా సరిగ్గా లేక.. వాహనాలని చుట్టు ముట్టారు. కొంత దూరం లో ఓ మహాతల్లి కొంగు పట్టుకొని 5 ఏళ్ళు, 3 ఏళ్ళ పిల్లలతో పాటు చంకన ఓ చంటిది గుబులుగా చూస్తోంది. 
దాదాపు భారత దేశం లో ఏ మూల చూసినా ఇదే దర్శనం ఇస్తుంది.
ఎన్ని NGO organizations  ఉన్నా ఇంకా స్లమ్స్ వెలుస్తూనే ఉన్నాయి. 

ప్రభుత్వం జనాభా గురించి మరిచి పోయినట్టు ఉంది. అసలు వీళ్ళందరికీ  ఉచిత కాండోమ్స్  .. ఉచిత తుబెక్టామి, vasectomy   ఆపరేషనులు   తప్పని సరిగా చేయక పోతే భారత దేశ దరిద్రం ఎన్నటికీ పోదు. 

 పేదవాడికి పిల్లలు ఉండకూడదు అని కాదు. అందరికీ ఉండాలి. కాని కటిక దరిద్రులకు సంతానం ఎక్కువ ఉంటె..వాళ్ళు దరిద్రులు గా మారుతారు.  
అప్పట్లో కుటుంబనియంత్రణ అంటే తెలియక, ఆపద్దతులు తెలియక.. భయపడో లేక అంత చదువు లేకో ఎక్కువ సంతానాన్ని కని ఉండవచ్చు.ప్రస్తుతకాలంలో మాత్రం  వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవ్వరైనా  భారత  దేశ పౌరుడిగా  కుటుంబనియంత్రణ పాటించాల్సిందే. ఇది ఒక రకంగా దేశ పౌరుడిగా మన భాద్యత . ఆ బాధ్యతా  నిర్వర్తించి మన
  దేశ భక్తి
ని చాటుదాం. ఒక్కరికంటే ఎక్కువ సంతానం అవసరమా
అని  పదే పదే  ఓ వంద సార్లు  ఆలోచించుకోవాలి.  మూడో  సంతానం అసలే కూడదు.


కనీసం  ఇప్పటినుండి ప్రభుత్వం  ఒక జంటకి ఒక్కరి కంటే సంతానం ఉండాలి అని rule పెడితే బావుంటుందేమో!

Feb 12, 2011

ఏ మేరా ఇండియా ..

ప్రేమికుల రోజు.. భారతీయ సంప్రదాయం కాకపోయినాప్రపంచ వాప్తంగా గుర్తింపబడిన దినం.
ఇది భారతీయ సంప్రదాయం కాదంటూ ప్రేమికులనికొట్టడమో.. లేక పెళ్ళిళ్ళు చేయటమో లేక రాఖీలు .. కట్టించడమో.. గుంజీలు తీయించడమో..



ఎటు పోతున్నాం మనం..ప్రజాస్వామ్య  దేశం
అంటూ .. 18 ఏళ్ళు  నిండిన వాళ్ళని ఓటర్లుగా గుర్తిస్తూ ఓటు హక్కు ఇచ్చాం.. ఇంకా దాంతో పాటే  అనేక హక్కులు ఇచ్చాం...పెళ్లి చేసుకోడం లాంటివి.

 ఏం ?  ఫిబ్రవరి   14 రోజు ప్రేమికులు కలుసుకూడదా ... మాట్లడుకో కూడదా .. ప్రేమించుకోకూడదా??
రోజు రోజుకి  ప్రాణానికి బద్రత లేకుండ పోతోంది
ఒక వైపు అ టెర్రరిస్ట్ లు  ఎక్కడ బాంబు తో పెల్చేస్తాడో అని భయం. ఉన్న నాలుగు నాళ్ళు హయిగా బ్రతికేద్దాం అంటే ఈ అతివాదుల భయం.
సంకృతిని   తామేదో కాపాడుతున్నట్టు..?
అంత  సంకృతీ   ప్రియులైతే విప్పేయండి పాంట్లు.. కట్టండి పంచెలు.. తలకి కుంకుడు కాయ రసం..మట్టి ఇల్లు..పేడతో అలకటం.. ముగ్గులు పెట్టటం.. చేయండి.. టీవీ మానేసి తోలుబోమ్మతాట చూడండి. బైక్ .. కారు వదిలేసి గుర్రం..గుర్రపు బండ్లు వాడండి..

"ఎచ్చోట నెమ్మనము భయము శంకలు వీడి.". టాగోర్ గారికి నోబెల్ ప్రైజ్ తప్ప ఇంకేమి మిగల్లేదు
భారతదేశం నా మాతృ భూమి అని గర్వపడే రోజులు పోయాయి.

Feb 10, 2011

పట్టించుకోని ప్రభుత్వం


ఉద్యోగం లేకుండా..తిండి లేక చస్తున్నా పట్టించుకోని  ప్రభుత్వం.. ఓ ఉద్యోగం/ వ్యాపారం తో డబ్బు సంపాదించుకోగానే .. ఎందుకు  tax  కోసం దేబురిస్తుందో ??
కరెంట్  బిల్ కోసం  వొచ్చినట్టు ..ఇంటింటికి వొచ్చి.... నిరుద్యోగులుంటే.. అర్హత కు తగ్గ ఉద్యోగం ఇప్పించి,  tax కట్ చేసుకొనే రోజు ఎప్పుడు వొస్తుందో...??

Feb 9, 2011

సాధ్యం కాదా ???


తెలంగాణా మేధావులు..ధనికులు.. సేవాతత్పరులు.. తెలంగాణా NRI లు.. కళాకారులు..సామాన్య ప్రజలు అందరూ కలసి అభివృద్దే ధ్యేయంగా అనుకొని ..


తెలంగాణా బ్యాంకు పెట్టి.. తెలంగాణా రైతులకి రుణాలిచ్చి..
తెలంగాణా ప్రజలకి ...తెలంగాణా కార్డు ఇచ్చి.. తెలంగాణలో రైతుల పంటని ..తెలంగాణా వాళ్ళకి / బీదలకి తక్కువ ధరకి ఇవ్వటం
తెలంగాణా రుచులని అందరికీ అందించే తెలంగాణా రేస్తోరెంట్ లు దేశ వ్యాప్తంగా తెరవటం.
విద్వత్తు ఉన్న తెలంగాణా  బీద విద్యార్థులకి తగిన ధన / రుణ సహాయం చేయటం.
తెలంగాణా లో ఉన్న వనరులను గుర్తించి వాటి అభివృద్ధి.. వాడకం..
తెలంగాణా లో నగరాల్లో తెలంగాణా వాళ్లకి ఉపయోగపడే విధంగా మంచి   బళ్ళు.. ఆసుపత్రులు.. కట్టించటం.

ఇలాంటివన్నీ తెలంగాణా  రాష్ట్రం రాకుంటే సాధ్యం కాదా ??? 

Feb 5, 2011

మన చరిత్ర


చరిత్ర కు ఆధారాలు ఏ రూపం లో ఉన్న స్వీకరించాల్సిందే.
ఆది ఓ కట్టడమో..ఓ పుస్తకమో..శిల్పమో, శాసనమో..సూక్తో .. లేక మరేదైనా.
అయితే వేదాలు,వేదకాలం   ఉనికి ని చరిత్రకారులు ఎన్నడూ కాదనలేదు. భారత దేశ చరిత్రకు సంబందించిన ఏ పుస్తకం చూసినా..ఎవరూ రాసినా అందులో 'వేదాకాలం'  ఖచ్చితంగా ఉంటుంది, ఆధారాలతో సహా.. అందులో ప్రస్తావించిన అంశాలు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని , ఆలోచన సరళిని తెలుపుతున్నయనటం లో సందేహం లేదు.
" అందులో చెప్పబడిన అన్ని విషయాలే గొప్పవని.. అవే గొప్ప విజ్ఞాన శాస్తమని, లోకం లో ఉన్న ప్రతి విషయం అందులో స్పష్టంగా చెప్పబదిందనీ మాత్రం ఒప్పుకోలేము."
 ప్రస్తుతం చాలా చిన్నవిగా..సిల్లిగా  అనిపించినా.. పశువుల మచ్చిక, పెంపకం,  వ్యవసాయం, పనిముట్లు ఉపయోగించటం "నిప్పు" , చక్రం, కనుగోనటం.. లాంటివి  ఎన్నో ఎంతో గొప్ప ఆవిష్కరణలు,  అయితే ఇవి ఎవరూ కనుగొన్నారో ఆధారాలు లేనప్పటికీ ఉపయోగించన మాట వాస్తవం.
ఇంతకు ముందే   చెప్పినట్టు..వేదోపనిశాత్తుల్లో  ఆధ్యాత్మిక తత్వం ఎక్కువ పాలు. ఆత్మ ,పరమాత్మ, యజ్ఞ యాగాది క్రతువులు,కర్మ కాండ, వీటి ప్రస్తావన విస్తృతంగా ఉండి.  జీవితం అంటే జీవనం సుఖంగా గడపటానికి కావలసిన విషయాలే కాదు , నేను ఏమిటి,  సృష్టి ఏంటి , ప్రకృతి ఏంటి,పదార్ధం ఏంటి  .. లాంటి ఆలోచనలతో మొదలు .. ఆత్మ , పరమాత్మభావన  లాంటి ఎన్నో విషయాలు  విశ్లేషించటానికి    ప్రయత్నించారు.జీవితానికి పనికి రాక పోయినా "తత్వ శాస్త్రం" కూడ ఒక విలువైనదే ఆని గ్రహించాలి. ఒక వర్గం జీవితానికి కావలసిన ఆవిష్కరణలు చేస్తే..ఇంకో వర్గం "తత్వాన్ని" గూర్చి ఆలోచిస్తుంది.
ఈ  ఆలోచన పరంపరలో ఆయుర్వేదం, సామవేదం (సంగీతం), యోగాభ్యాసం.. లాంటి ఎన్నో ఉపయొగకరమన విషయాలు లేకపోలేదు.
అవసరం ఆవిష్కరణకు మూలం. యోగాభ్యసంతో ఆరోగ్యం సమకూరి , ప్రకృతి చికిత్స తప్ప శస్త్ర చికిత్స అవసరం పెద్దగా రాలేదేమో.?
వర్గ పోరాటాలు, ఇతర దేశస్తుల దాడుల్లో ఎంతో అమూల్యమైన సమాచారం నాశనం అయ్యిందేమో..
ఉన్న సమాచారాన్ని భద్ర పరచటం, ముందు తరాలకి అందించటం లో విఫలం అయ్యారేమో ?


 పాశ్చాత్యులు దృక్పథం  సుఖమయ జీవితం అయితే.. అసలు  జీవితం ఎందుకు?  దేనికోసం అనే దృక్పథం లో మనవాళ్ళు ఆలోచించారేమో ?


తాతలు "వేస్ట్ ఫెల్లౌస్"  అని మీరు భావించినప్పటికీ .. తాతలే లేరు అనటం,
అలాగే మన చరిత్ర  గొప్పది కాకపోతే పోయింది కాని చరిత్రే లేదు అనటం సమంజసం కాదు.

Jan 28, 2011

మనదేశం




 మనదేశం .. అన్ని పుష్కలంగా ఉన్న దేశం...జనాభా.. నిరక్షరాశ్యత, మత చాందసం,  కుళ్ళు రాజకీయాలు..మోసం, దగా ,దొంగ వేషాలు, దరిద్రం. లేకి తనం..రోగాలు...రొస్టులు
దోచుకునే వాడికి దోచుకునేంత ఉంది .. అందుకే ఎవడొచ్చినా  ఎదురు వెళ్లి ఆహ్వానించి  దోచుకెళ్ళ మని చెప్పింది. మహమ్మదీయులు..Britishers లు వొచ్చి దర్జాగా దోచుకెళ్ళారు. ఇప్పుడేమో  మనని మనమే దోచుకున్తున్నాం. 

ఉన్న వాటిని ఎగుమతి చేస్తున్నాం. ఇక్కడి వాళ్ళకి అందకుండా ..
స్వతంత్రం వోచిందేమో అని అనుకుంటున్నాం.. కాని ఇంకా "విదేశీ అమ్మగారి  " పాలనలోనే ఉన్నాం.
అరాజకీయ నాయకుడిని  ఒక్కొక్కడిని నరికి అవతల పారెయ్యకుండా...ఇంకా మన " సహనాన్ని" చాటుకుంటున్నాం.

మాదో గొప్ప నాగరికత..చరిత్ర అని అనుకుంటున్నాం. దాని అసలు ఉనికిని ఎప్పుడో మరిచిపోయాం.

Nov 6, 2010

కార్పోరేట్ దోపిడీ


దీపావళి  పండక్కి  మా అన్నయ్య  వొచ్చాడు ఫామిలీ తో సహా.. ఆ మాట ఈ మాటల్లో  ..చక్రి. నాకు తెలియకుండా  
15 రూపాయలు కట్ అయ్యాయి ఫోన్ బాలన్సు నుండి. ఎందుకంటావ్ ?
నేను వెంటనే... ఏదైనా కాలర్ ట్యూన్ గాని activate చేశావా?
నాకు తెలిసి ఏం చేయలేదు. ఆగు చూద్దాం అని నా ఫోన్ నుండి కాల్ చేశా.. 
" నిన్నా లేదు మొన్నా లేదు.. నిన్న మొన్న లేకపోతే రేపే లేదు ..ఏక నిరంజన్" 
వొస్తే రాదు.. చస్తే రాదు.. పోయిండేది తిరిగే  రాదు ఎక్ నిరంజన్ "
పాట  చక్కగా వినిపిస్తోంది. కాలర్ ట్యూన్ activate చేయించావ్ గా ...
లేదు నేనేం  చేయలేదు.. 
సరే అని customer care కి రింగ్ ఇచ్ఛా...
మీరు customer care executive తో మాట్లాడటానికి ప్రతి మూడు నిమిషాలకి 50 పైసలు ఛార్జ్ చేయబడతాయి.అయినా మీరు మాట్లాడాలనుకుంటే ఒకటి నొక్కండి..
నొక్కాను 
  వాడు పెట్టిన సొల్లు మ్యూజిక్..మధ్య మధ్యలో వొచ్చీ  రాని  తెలుగులో  ఇదీ కావాలంటే అది నొక్కు, అది కావాలంటే ఇదీ నొక్కు అని అమ్మాయి వాయిసు.
ఎవడబ్బ సొమ్మని చెప్పా పెట్టకుండా 15 /- నోక్కేసా డన్న  కసి, ఎందుకలా అడుగుదామని ఫోన్ చేద్దామంటే  charging call .. 
క్షణ క్షణానికి  అసహనం, కసి,  బాధ  లను కంట్రోల్ లో పెట్టుకొని ఒకటా రెండా ఏకంగా 15 నిముషాలు లైన్ లో  ఉంటె.. అప్పుడు వొచ్చింది ఓ పిల్ల లైన్  లోకి 

చెప్పండి సర్ మీకు నేను ఏ విధంగా సహాయ పడగలను ?
కాలర్ ట్యూన్ ఎందుకు ? ఎవరినడిగి activate చేసారు ?
అదేంటి సర్ మంచి పాట  అందుకే.
మంచి పాట ఎవరికీ ?  ( కోపం ఆగటం లేదు )
అందరూ పెట్టుకుంటున్నారు సర్ .. just 15 రూపాయలే కదా..( నీ అయ్యని కట్టమను,  అనలేదు, ఆపుకున్నా )
 కోపం నషాళానికి అంటింది..
చూడు మాకు కాలెర్ ట్యూన్ అవసరం లేదు..  దయ చేసి తీసివేయండి  మా బాలన్సు 15 /- మళ్లీ ఇచ్చేయండి 
అలా ఇప్పుడు కుదరదు సర్. ( నీ  ..... అందామనుకొని  సంస్కారం వల్ల ఆగిపోయా ) 
ఇపుడు request పెట్టండి .. next టైం అలా జరగకుండా  ఉంటుంది.  
ఇంక కోపం లో ఏం మాట్లాడానో తెలిదు..  నా బాధ కసి .. అంతా తీరేదాక ...
థాంక్ యు సర్.. మీకు ఇంకా ఎమన్నా సహాయం కావాలా  ఏ మాత్రం సిగ్గు లేకుండా అంది.
అలా తర్ఫీదు ఇచ్చారు. బ్రతకలేక  ఈ తిట్లు తినే జాబ్ చేస్తున్నారు అది వేరే విషయం . 
ఆ సిగ్గు లేనిధీ  ఈ పిల్ల కాదు.  ఆ  బిచ్చ గాడు.


ఎంత చెప్పు.. ఏం లాభం..  డబ్బు మాత్రం తిరిగి రాలేదు.
  telephone సర్వీసెస్ ఇలా దర్జా దోపిడీ కి దిగజారి పోయాయి. 
ఈ దోపిడీ ఒక్క తెలిఫోనే సంస్థలే కాదు ఇంకా చాలాసంస్థలు చాల రకాలుగా,  మీకు తెలిసే చేస్తారు. మీరేం చేయలేరు. కేవలం బాధపడటం  తప్ప.
ఈ రోజుల్లో చదువుకున్నా లేకపోయినా. ఏదున్నా లేకపోయినా.. ఏం పని చేస్తున్నా.. ఒక ఫోన్ ఉండటం అవసరంగా మారింది.
పాపం కూలీలు, మేస్త్రీలు.. ఆటో వాలాలు, టీ బండి.. టిఫిన్ బండి ,,ఐరన్ షాప్ వాళ్ళు.. ఇలా నానా కష్టం చేసి ఏదో చిన్న బాలన్సు వేసుకుంటే.. ఈ లం....కొడుకులు..అది నొక్కు ఇదీ నొక్కు అని .. ఒక్కోసారి అది కూడా చెప్పకుండా డబ్బులు కట్ చేస్తుంటే.. 
ఎవరికి చెప్పుకోవాలి?
ఏం చేద్దాం చెప్పండి ?

Mar 3, 2010

ప్రశ్నించుకోండి.....




                                

మునుపెన్నడో శంకర మఠం హత్యోదంతం.. అప్పుడెప్పుడో పుట్ట పర్తి ప్రశాంతి నిలయం లో హత్య.. మొన్న కలికి భగవాన్, నిన్న నిత్యానంద స్వామి రాసలీలలు..

వీళ్ళని ఆరాధ్య దైవాలుగా చేసుకొని.. మహిమల్ని ఆపాదించింది ఎవరు??
 
వీళ్ళకి విరాళాలు ఇచ్చి పెంచి పోషించింది ఎవరు ?
వీళ్ళ ఫోటోలు పెట్టి పూజలు, భజనలు చేసింది, చేస్తోంది ఎవరు ?

కాషాయం కట్టగానే కామం మాయం ఐపోతుందని ఎవరు చెప్పారు ?
జీవిత మూల సూత్రాలు మరిచి పోయారా ? 

కూడు , గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలు. ఒక వయసు వచ్చాక కామం ప్రాథమిక అవసరం అని వేరే చెప్పాలా??
పడక గదుల్లో కెమెరాలు పెడితే , తపస్సు చేసుకుంటున్న నిత్యానందులు  కనపడతాడా?? 

ధనం మూలమిదం జగత్ అని మళ్లీ గుర్తు చేయాలా నేను ??
డబ్బు ముందు నైతికవిలువలు నిలబడవని తెలుసుకోలేదా?
కోటి విద్యలు కూటికోసం అని తెలిదా?? 

The fittest will survive అని పెద్దలు చెప్పింది మరిచారా ???? 

మీ జీవితాలని మార్చేస్తా అని వాడంటే మటుకు మీరెలా నమ్ముతారు ?
ఎం చదువు కున్నారు ? డిగ్రీలుంటే సరిపోతుందా.. విచక్షణా జ్ఞానం ఉండక్కరలేదా??

కళ్ళ ముందు సత్యం ..నిత్యం కనబడుతోంటే.. గుడ్డి వాళ్ళయ్యారా??
ఎవడో చెప్పే కాకమ్మ కథలకి పడి పోతారా ??

"చలం" అసలు సంగతి  అరచి చెపుతూ ఉంటె  వినపడలేదా??

తిరగేయండి గ్రంధాలని
ఒంటబట్టించుకోండి సారాంశాన్ని,
వెతకండి ములాలని,
కనుక్కోండి సత్యాన్ని,
ప్రశ్నించుకోండి మిమల్ని మీరు.  

Feb 21, 2010

మీరెన్ని వేషాలు వేసినా



వైకుంటం   .. పాలసముద్రం చల్లగా ఉంది.. ఆ సముద్రం లో ఒక పెద్ద 10 తలల ఆది శేషుడు..
శ్రీ మహా విష్ణువు  ఆది శేషుడి మీద పడుకుని ఒక కునుకు తీస్తునాడు.
లక్ష్మి  దేవి ఆవలిస్తూ కాళ్ళు  వత్తుతూ  ఉంది.
దేవీ .. కొంచం గట్టిగ నొక్కు..ముల్లోకాలు తిరిగి నొప్పిగా ఉన్నాయి..
ఏమండీ, నాకో చిన్న డౌట్.. మీరెన్ని దొంగ వేషాలు వేసినా I mean  "అవతారాలు" వేసినా ..లోకం లో అన్యాయం  ఆగటం లేదుకదండీ.. దోచేవాడు దోచేస్తూనే ఉన్నాడు, లేని వాడు నిత్యం చస్తూనే ఉన్నాడు. 
చూడబోతే మీరేమి "ఆక్షన్" తీసుకుంటున్నట్టు  లేదు.
  దేవీ .. సకలలోక పాలకుండ.. శేష తల్పుండ.. విశేష నామ దేయుండా... విష్ణు దేవుండ..
తోక్కేం కాదు.. అడిగింది చెప్పండి అంటే..మిమల్ని మీరు పొగుడు కుంటారేంటి ...తెలుగు సినిమా  హీరోల్లాగా.

అంతకంటే చేయటనికేముంది దేవీ .. అడుగు ఏం  చేయలేదో..
 ఆ కుంభకోణం చేసిన మంత్రి గారిని  ఏం చేసారు అంటా ?? కనీసం ఏదైనా శిక్ష వేసారా ?
అయ్యో దేవీ .. తెలిదా, అతను తిరపతి లో నాకు కిలో బంగారం ఇచ్చాడు..
అవునా (నాకు కనీసం  వజ్రపుటుంగరం కూడా లేదాయే) పోనీ.. మరి ఆ ఖనిజం స్కాం సూత్రధారి ?? అతని సంగతేంటి ??
అతనా.. అతను  నా  గుడి కట్టటానికి పెద్ద మొత్తం లో చందా ఇచ్చాడు.

మరి...మరి..అని లక్ష్మి దేవి..ఆలోచిస్తుంటే..
చూడు దేవి.. ప్రతి వాడు ఎంతో కొంత ఇస్తూనే ఉన్నాడు..
ఇవ్వలేక పోయిన వాడికి నేను ఏదో  ఒక కీడు చేస్తూనే ఉన్నా,ఇంకేం కావలి..
అది కాగ మనుషులు తెలివి మీరి పోయారు. బొత్తిగా పాప భీతి లేకుండా పోయింది, మహా అంటే పోతాం, పొతే పోయింది వెధవ జీవితం, ఉన్నన్నాళ్ళు  అప్పో సప్పో.. మోసమో, దగానో ఏదోటి చేసి సుఖం అనుభవిస్తే చాలనుకొంటున్నారు, ఎంతటి ఘోరానికైన తెగిస్తున్నారు.

ఎక్కువగా మాట్లాడితే నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అని పురాణాలు, భారత, భాగవతలో  నేను చేసిన ఘన కార్యాలని ఏకరువు పెడుతున్నారు.  నా వీక్ పాయింట్ తెలుసుకున్నారు, నా మోహన డబ్బు, నగా కొడుతుంటే  నేను మాత్రం ఏం  చేయగలను చెప్పు ?
అయినా దేవీ .. నీ కెందుకు ఇవన్నీ .. హాపీ గా కాళ్ళు పట్టక.. మగని సేవ కంటే మగువ కి  కావలసినదేముంది కనక ??
మగని సేవట,  మీరేదో సామాన్య జనాలని ఉద్దరిస్తున్నారేమో, నేను మీ సేవ చేస్తే పుణ్యం కలిసొస్తుందని అనుకుంటున్నా...మీరు కూడా  లంచాలకి మరిగి.. కుపరిపాలన చేస్తుంటే  మీకు సేవ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. దేవీ.. అంత కంటే  ఏం చేయగలవు దేవి.. హ్యాపీ గా నా సేవలో తరించు..
బ్రతికుంటే.. కాల్ సెంటర్ లో పనిచేసిన బ్రతుకుతా  కాని మీ కాళ్ళు పట్టను..
అయ్యో దేవీ ... వెళ్తున్నావా..

(ఇదంతా ఓరకంట గమనిస్తున్న బ్రహ్మ దేవుడు  ముసిముసి గా  నవ్వుకుంటూ  తన పని తాను చేసుకుంటున్నాడు)

Jun 26, 2008

MMTS heros

గుట్కా వేసుకొని .. పదవతరగతి కూడా పాస్ కాని, నిండా 20 ఏళ్ల వయసు లేని కుర్రాళ్ళు ..
మెకానిక్ ,షాపుల్లో చెప్పుల దుకాణాల్లో నెలకి ముడువేలకంటే ఎక్కువ సంపాదించలేని వెధవలు.. hightech city lo పని చేసే అమ్మాయిలకి లైను వేయటం ..తమను చూస్తారని ..సినిమాల్లో చూపించినట్టు తమ స్టైల్ కి పడిపోతారని భ్రమించడం. జాతరలలో దొరికే ఫోన్లలో మాటలు.. ఓ యారో.. ఏ యారో అంటూ pose కొట్టటం ..సీట్లు ఉన్నా కూర్చోకుండా డోర్ దగ్గర గుంపుగా నిలపడటం మిగతావాళ్ళకి అసౌకర్యంగా .. ఆగకముందే దూకి.. ఆగి వెల్లిపోతోంటే దానితో పాటు కొంత దూరం పరిగెడుతూ ఎక్కి ఏదో ఘనకార్యం సాధించినట్టు heroism ప్రదర్శించడం...
...ఒరేయ్ ఒక్కసారి మిమ్మల్ని మీరు చుసుకొండిరా.. మానసికంగా ఎంత అధమంగా ఉన్నారో... ఈ దేశ దరిద్రం అంతా మే నుంచే ..మీ దగ్గరే ఉంది. ఈ ప్రపంచం మిమ్మల్ని వేలివేయక ముందే కుళ్ళుని కడిగేసుకోండి.. మౌడ్యాన్ని వీడండి మంచిగా మనిషిలా బ్రతకండి.
(MMTS trains లో కుర్రాళ్ళని చూసి )

Jun 13, 2008

ఎవరు మారుస్తారు ఈ ప్రపంచాన్ని ...

1/7/05నిన్న world tobaco day, ... నేను రెండు సిగరెట్లు కాల్చాను జీవితం మీది frustration తో . ప్రభుత్వం మాత్రం T.V, సినిమాలలో సిగరెట్లు తాగడం చూపించకూడదు అని చేతులు దులిపేసుకుంది.
ఫ్రెండ్ ని కలుద్దామని S.R నగర్ వెళ్ళాను. Wait చేయాల్సి కేఫ్ లో కుర్చోన్నాను. more than 60 % people చేతులలో సిగరెట్లు వేలుగుతున్నై..నా చేతిలో కుడా .. అందులో 14సం నుండి 60 సం దాకా అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు.
కేవలం సినిమాల్లో పొగ త్రాగటం చూపించ వద్దంటే పని జరుగుతుందా??





పండించడం కాదు .. అమ్మటం కాదు .. తాగటం కాదు .. కేవలం సినిమాల్లో చూపించడం తప్పు... పాపం సినిమా..!!
సెక్స్ , తాగుడు, జూదం , గుట్కా, మోసం, దగా ..వీటిల్లో బానిస కానిదెవరు?? ప్రతి వాడికి సుఖం కావాలి , దానికోసం డబ్బు కావాలి .. ఆ డబ్బుకోసం ఏమైనా చేయాలి.. డబ్బు సంపాదించి అనుభవించాలి జీవితాన్ని..
ఎన్ని సీసాలు తాగాం.. ఎన్ని పెట్టెల సిగరెట్లు .. ఎన్ని గుట్కా పొట్లాలు... ఎంత మందిని.. . ఇది ఆనందం ... ఇదే ఆనందం ...
ఇదే ఆనందమని ప్రజలు భావిస్తునపుడు ... ప్రభుత్వ నిషేదాలు ఎందుకు?? తాగనీ..... అనుభవించనీ ...చావనీ అని ఉరుకోదే.. అసలు ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్ద మనుషులు , శాసనకర్తలు ఇవన్నీ చేసేవాళ్ళే ..చెయ్యకుండా ఉన్నారా ?? చెప్ప మనండి ... ఒక్క మనిషిని చూపించండి... చెప్ప మనండి గుండె మీద చెయ్యి వేసుకొని ఇవేవి నాకక్కర లేదని... లేడు..చెప్పడు.. చెప్పలేడు..
స్కూల్లో కాలేజీల్లో Personality developement introduce చేయమనండి ..చెయ్యరు ఎవ్వరు ...ఎ ప్రభుత్వం కుడా ....టీవీ సీరియల్స్ బాన్ చేయమనండి ముందు. ..
పిల్లలకి నీతి కథలు చెప్పలసిన బామ్మలు అమ్మమ్మలు టీవీ కి అతుక్కు పోయారు కళ్ళ జోళ్ళు సవరిస్తూ...
జీవితం అంటే ఎంతొ చెప్పాల్సిన తాతయ్యలు jeens T shirts వేసుకున్న అమ్మయిల పిర్రలు చూస్తూ బోసి నోళ్ళతో లొట్టలు వేస్తున్నారు ..
ఉస్చ్.. ఎవరు మారుస్తారు ఈ ప్రపంచాన్ని ......నీవా .......నేనా....
అసలు మారాల్సిన ..మర్చాల్సిన .. అవసరం ఉందా......??????
. ..................ఉష్చ్ బుర్ర వేడెక్కిందీ ఒక్క సిగరెట్ వెలిగిస్తాను...