Jan 31, 2011

కష్ట పడటం అంటే ..
" కొన్ని ఇష్టమైన వాటిని వదులుకోవటం.. కొన్ని అయిష్టం అయినా  చేయటం"

Jan 29, 2011

The naked triangelమానవ సంభందాలలో...  ముఖ్యంగా " ప్రేమ" లో  ఎన్నో తెలియని  త్రికోణాలు  ఉంటాయి. మనకి, మనని ప్రేమించే వాళ్ళకి,మనం ప్రేమించే
వాళ్ళకి మధ్య ఓ త్రికోణం. 
మళ్లీ వాళ్ళకి ..వాళ్ళని  ప్రేమించే వాళ్ళ మధ్య ...ఇలా  ఆ పరంపర సాగుతూనే ఉంటుంది.
తన జీవితపు అనుభవాలని..చేదు నిజాలని  ఎలాంటి hype లేకుండ..సూటిగా.. మనసులోతుల్లో తగిలేట్టు రాసిన రచయిత ఆత్మ కథయే ఈ పుస్తకం.
మరి కథ వస్తువు ? రచయిత మాటల్లోనే.
 "Betrayal"
How men and women deceive each other when they make love;
how they betray in their search for truth;
how being disloyal to one   makes them madly loyal to other...the power and torture of sex its ecstasy ..its destructive nature  how geniuses are blinded by it and how they lust to b destroyed by their women.
my characters are naked  stripped to b worthy of the alter. there is no other comfort then the warmth of ones own skin.
 - Balwant gargi 

చలం శైలి లాగ అనిపించే  నవల ఇది. దొరికితే తప్పక చదవండి.

Jan 28, 2011

మనదేశం
 మనదేశం .. అన్ని పుష్కలంగా ఉన్న దేశం...జనాభా.. నిరక్షరాశ్యత, మత చాందసం,  కుళ్ళు రాజకీయాలు..మోసం, దగా ,దొంగ వేషాలు, దరిద్రం. లేకి తనం..రోగాలు...రొస్టులు
దోచుకునే వాడికి దోచుకునేంత ఉంది .. అందుకే ఎవడొచ్చినా  ఎదురు వెళ్లి ఆహ్వానించి  దోచుకెళ్ళ మని చెప్పింది. మహమ్మదీయులు..Britishers లు వొచ్చి దర్జాగా దోచుకెళ్ళారు. ఇప్పుడేమో  మనని మనమే దోచుకున్తున్నాం. 

ఉన్న వాటిని ఎగుమతి చేస్తున్నాం. ఇక్కడి వాళ్ళకి అందకుండా ..
స్వతంత్రం వోచిందేమో అని అనుకుంటున్నాం.. కాని ఇంకా "విదేశీ అమ్మగారి  " పాలనలోనే ఉన్నాం.
అరాజకీయ నాయకుడిని  ఒక్కొక్కడిని నరికి అవతల పారెయ్యకుండా...ఇంకా మన " సహనాన్ని" చాటుకుంటున్నాం.

మాదో గొప్ప నాగరికత..చరిత్ర అని అనుకుంటున్నాం. దాని అసలు ఉనికిని ఎప్పుడో మరిచిపోయాం.

బ్రతుకు - జీవితం


తిని, తొంగుంటే -  బ్రతుకు..
కాసింత కళ పోసన కూడ కలిస్తే - జీవితం.


రాయిగా ఉండటం - బ్రతుకు..
శిల్పంగా మారటం - జీవితం.

శారీరక సుఖం కోసం అర్రులు చాచటం - బ్రతుకు..
మానసిక వికాసం కోసం పరితపించటం-
జీవితం.

ధనం పోగేసుకోడం - బ్రతుకు..
ఆనందం పంచుకోవటం - జీవితం.
 

తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు డబ్బులు - బ్రతుకు.
ఆ ఉరుకుల్లో ఒక్కనిముషం ..గడ్డి పువ్వు నవ్వునో.... చిరుగాలి స్పర్శనో.. సూర్యోదయపు/సూర్యాస్తమయపు ఎరుపునో...వరి చేల వాసన నో..అనుభూతి చెందగలిగితే - జీవితం.

Jan 27, 2011

సరళ రేఖ

ఒక ఆడ మగ మధ్య 
ప్రేమ ..కామం అనేవి  సరళ రేఖని చెరో వైపు..
కామం తో మొదలి ప్రేమ వైపుకో..

ప్రేమ తో మొదలై కామం వైపుకో.. సాగాల్సిందే.. 

ప్రేమ ధనంప్రేమ కూడ ధనం లాంటిదే..
సంపాదించుకోవాలి.
ప్రేమ పూర్వక పనులు చేయటం ద్వారా దాన్ని సంపాదించొచ్చు.
గౌరవం, స్నేహం, ప్రేమ పూర్వక మాటలు, appreciation, సహాయం, కృతజ్ఞత, caring..బహుమతులు.. ఇలా ఎన్నో పనుల ద్వారా మనం ప్రేమని సంపాదించు కోవొచ్చు.
ఈ పనులు నిరంతరం జరుగుతుంటే ప్రేమకి లోటు రాదు.
మనసు బ్యాంకు లో ప్రేమ ధనం నిండి పోతుంది.
జీవితపు ఆనందానికి  ఇందనం ప్రేమ.

Jan 26, 2011

వ్యక్తి

ఘర్షణ ఘర్షణ ఘర్షణ ఘర్షణ
వ్యక్తి కి ఎప్పుడు ఘర్షణే ..
తలో తనకే ఘర్షణ ..
వ్యక్తి కి వ్యక్తి తో ఘర్షణ..
ఇంటికి - వ్యక్తి కీ ఘర్షణ
 పరిస్థితులతో ఘర్షణ  ..
లోకంతో someఘర్షణ 

Jan 21, 2011

అవురా పెద్దది గుమ్మాడి ..ఏదో పని చేస్తున్నా  ..కరెంటు పోయింది.. సరే కొంచం సేపు చలి కాచుకుందాం అని  ఎండకోసం  డాబాపైకి వెళ్ళాను. పక్కనే మిగిలిపోయిన ఖాలీ స్థలంలో   రెండు గేదెలు మేస్తూ కనిపించాయి. చుట్టూ apartments మధ్య ఈ దృశ్యం ఇంకేన్నాల్లుంటుందో  అనిఅనుకుంటుండగానే.. నా దృష్టి  అక్కడ పెరిగిన గుమ్మడి పాదుల వైపు మళ్ళింది . ఓ చిన్ని గుమ్మడి కాయి.. పక్కనే అరవిరిసిన గుమ్మడి పువ్వు.
సాధారణంగా కనిపించే కాయగూరల్లో పెద్దనైన దీని ఆకారం యిట్టె ఆకర్షించి అదంటే ఎందుకో కుతూహలం ఉండేది నా చిన్నప్పుడు. అటు తరవాత "వీరి గుమ్మడి పండు వీరి పేరేమి..అనే ఆట" ద్వార గుమ్మడి  బాగా పరిచయం.
బొద్దుగా ఉండే పిల్లని "గుమ్మడికాయ" అని వెక్కిరించటం.."గుమ్మడి  కాయ లాగ ఉంటాడు" చూడు అని  ఉదాహరించటం.."గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవటం" లాంటి సామెతలూ   కూడా మనకి పరిపాటే.
గుమ్మడి కాయ కూర.. గుమ్మడి తో చేసిన పులుసు,  గుమ్మడి పలుకుల పాయసం, గుమ్మడి హల్వా  ..లాంటి  రక రకాల వంటకాలలోగుమ్మడికి ప్రత్యెక స్థానమే ఉంది. అలాగే ..దిష్టి తీయటానికి గుమ్మడిని పగలగోట్టటం.. దిష్టి తగలకుండా గుమ్మడి కాయని గుమ్మానికి వేలాడ తీయటం లాంటి వాటితో మన సాంప్రదాయాల్లో కూడా గుమ్మడికి మంచి ప్రాశాస్తమే  ఉంది.  అమెరికా లాటి దేశాల్లో కూడా గుమ్మడి కి ఓ సముచిత స్థానం ఉంది.


Halloween day రోజు  గుమ్మడి కాయని తొలిచి అందులో దీపం పెట్టి లాంతరు లాగ వెలిగించటం, Thanksgiving డే రోజు కూడా గుమ్మడి తో వొంటకం వడ్డించటం వాళ్ళ సంప్రదాయం.


"ఓ గుమ్మా గుమ్మడి పువ్వు. ఓ కొమ్మ కమ్మగా నవ్వు.."
" అమ్మాడి  నవ్వవే గుమ్మడి నవ్వవే... గుమ్మడి పువ్వులాగా అమ్మాడి  నవ్వవే.. "
" గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడి.. "
లాంటి హిట్ పాటలతో  తెలుగు సినీ సాహిత్యం  లో కూడా మంచి చోటే సొంతం చేసుకుంది గుమ్మడి.
అబ్బా గుమ్మడి కథ చాలానే ఉంది....అనుకుంటుండగానే
కరెంటు వొచ్చింది  ..ఆలోచనలు కట్.... 

Jan 13, 2011

యధాపి రుచిరం పుష్పం


"యధాపి రుచిరం పుష్పం
నణ్ణవంతం అగస్తకం
ఎవం సుభాషితో వాచా
న ఫలోహూతి కశ్చన: "

పువ్వు ఎంత అందంగా ఉన్న పరిమళం లేకపోతే ఆది వ్యర్థమే.
అలాగే క్రియా శూన్య మైన మాటలు వినటానికి ఎంత బావున్నా నిష్ప్రయోజనాలు

Jan 12, 2011

మొనోగమి..మానస వాచా కర్మణ..
ఏదేని విషయం..మంచనా చెడైనా మనసులో ఉండటం ..దాన్నే మాటల్లో పలికించడం.. చివరగా చేసే పనులతో సంపూర్ణం అవుతుంది..
కనక.. మానసిక వ్యభిచారం..అసంపూర్ణం..
కామం అనివార్యం .. పరాయి వ్యక్తి మీద కాని, లేదా ఇద్దరు వ్యక్తుల మీద గాని, లేదా నచ్చిన వ్యక్ల్తి తో కామించాలనుకోవడం సహజం ..అది అనుకోవడంతో అక్కడే ఆగిపోతే అసంపూర్ణం..
చాల వరకు భయం వల్ల అక్కడే ఆగిపోతుంది.కొంత మంది ఆచరణ వరకు తీసుకెళతారు.
కానే ఆ ఫీలింగే లేని state కలగాలంటే దాన్ని దాటుకొని వెళ్ళాలి. కనిసం మానసికంగా నైనా అనుభవించి ముందుకెళ్ళాలి. అవగాహన దాన్ని సులభంగా దాటడానికి ఉపయోగిస్తుంది.
మానసికంగా ఎలాంటి ఫీలింగ్ కలిగినా ఆచరణ వరకి వెళ్ల kundaa ఒక్కరితోనే శారిరక వాంచలు తీర్చుకోవటం అనేది మొనోగామి.
వివాహం మొనోగామి ని సపోర్ట్ చేస్తుంది.
వివాహం ఒక సామాజిక ,వ్యక్తిగత, జీవ అవసరాల మేలు కలయిక..హిందూ మత సంప్రదాయాల ప్రకారం ఆధ్యాత్మిక అవసరం కూడా..
ఇద్దరు వ్యక్తులు ఒక ఒప్పందం ప్రకారం కలసి జీవిస్తూ ,స్నేహపూర్వకంగా శారిరక మానసిక అవసరాలు తీర్చుకుంటూ, సమాజ సమతుల్యానికి పాటుపడుతూ..కొత్త తరాన్ని సమాజానికి అందిస్తూ..(ప్రకృతికి సహకరిస్తూ) జరిపే జీవన యానం..
కేవలం కామం కేంద్రకంగా ఉన్న వ్యక్తి నచ్చిన వ్యక్తులతో సంగమిస్తూ ఉంటాడు..అశాంతి ,హింసపెరిగే అవకాశం ఉన్నందున సమాజం దృష్టా ఆమోదం పొందనిని. కాని ఆ కోరిక అసహజం కాదు.  కామం కొంత కాలం మాత్రమే... వయసు మల్లుతుంటే కామం తీరి జీవితపు ఇంకో మలుపులోకి వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ కామం తీరక అక్కడే ఉంటె జీవితపు ఇంకో ఆనందాన్ని చూడకుండా ఉంటాడు..
ఇక కామం తీరి ఇంకా కామాన్నే కోరేవాడు మానసిక ఎదుగుదల లేనివాడు..వయసు ముప్పయి దాటినా వీధి పిల్లలల్తో చేరి లోలీలాడటం లాగా.

Jan 10, 2011

పురాణ కథల్లో ప్రేమ


*When love is not a pre-condition for marriage, why should anybody expect love to be a post-condition for marriage?
 పెళ్లి అనేది ఒక బంధం. అ బంధం లో ఉంటామని ఒకరికొకరు ఇష్టం తో ఒప్పుకుని చేసుకునేది పెళ్లి. పెళ్లి పది కాలాల పాటు నిలబడటానికి ఒకరి మీద ఒకరికి ఇష్టం. స్నేహం, అర్థంచేసుకోవటం, క్షమా, నమ్మకం, గౌరవం..ఇష్టయిస్తాలని ఆదరించటం.. మొదలైనవి ఉండాలి.  ఆ ప్రయాణం లో ఒకరి పై ఒకరికి అనుభందం ఏర్పడుతుంది.
 కామం, వాత్సల్యం, అనురాగం, స్నేహం, అభిమానం, గౌరవం, ఇష్టం, మోహము,వలపు....ఇవన్నీ వేరు వేరు. కాని మనం అన్నింటికీ వాడుకలో "ప్రేమ" అనే పేరే పెట్టుకొని.. confusion కి గురి అవుతున్నాం.
మన పురాణ కథల్లో..దాదాపుగా ప్రేమ అనే పదం కనపడదు. దేవి నిన్ను మొహిస్తున్నాను లేదా కామిస్తున్నాను  అంటాడు తప్ప ప్రేమిస్తున్నా అని అనడు.
ప్రేమ అనేది వ్యక్తి కి ప్రకృతి/విశ్వానికి /దేవునికి కి సంభందించింది గా అనుకొవొచ్చు. పైన చెప్పిన వాటి అన్నింటి highest డిగ్రీ ప్రేమ.
అంటే  ఎక్కడినుండి మొదలైనా ఆ ప్రయాణం లో చివరి మజిలీ యే ప్రేమ. ఆ చివరి మజిలీ చేరుకున్నాక మనసులో ఏదో గొప్ప ఆనందం. అ ఆనందం లోంచి ఒక వెలుగు.. ఆ వెలుగులో లోకం అద్భుతంగా దర్శనం ఇస్తుంది. సాధన చేస్తుటే..ఆ వెలుగు విశ్వ వ్యాప్తమైపోతుంది.
ఒక పర్వతాన్ని  ఎక్కటానికి ఎన్నో దారులు ఉండొచ్చు. చేరుకునేది శిఖరాగ్రానికే . ఆ శిఖరాగ్రం నుంచి చుస్తే ప్రపంచం నూతనంగా దర్శనం ఇస్తుంది.  అదే ప్రేమ. 

తొలి చూపు లోనేఅర్రే చూడగానే ప్రేమించేస్తారా ? పిచ్చా ?? 
తొలి చూపు కాక పోతే.. పోనీ జీవితం అంతా..ప్రేమ  లో ఉన్నామో లేమో కనుక్కుంటూ ఉంటారా ?  నాకు  ఇలాంటి వ్యక్తి కావలి అని అనిపించదా ?. ఎంతో మంది వ్యక్తులను చూసిన  పుర్వానుభవం ఉంటుంది కదా ?  మనిషన్నాక ఇష్టా అయిష్టాలు..dreams.. ఉండనే ఉండవా?  instinct అనేది ఒకటి ఉండదా ?? I like this kind of guy/gal అని అనిపించదా ??  ఆది ప్రేమ కాదా? కాకపోతే పోనీ ఇష్టమో.. infactuation ఓ ఏదో ఒకటి.. ఎందుకో మనసు వాళ్ళని  కోరుతుంది.. మాట్లాడాలని కలిసి సమయం గడపాలని అనిపిస్తూంది. వాళ్ళ నవ్వో,  నడకొ, మాటో, మౌనమో,కళ్లునో , చూపులో, శరెర సౌష్టవామో. ఏదో ఒకటి నచ్చుతుంది.  అలాంటి వాళ్ళు ఎదురుగా కనపడితే ఉరికే చూస్తూ కుర్చోలెం కదా.. మళ్లీ వాళ్ళని  మిస్ ఐపోతే ? జన్మలో మళ్లీ కలుస్తారో లేదో..ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ? if not now ,  then when ?  మొదటి అడుగు వేయక తప్పదు..చేతకాక..దైర్యం లేక .. ఏదో మాయ కోసం..అదృష్టం కోసమో..  ఎదురు చూస్తే..సున్నాయే.

జీవితం లో చాల  విషయాలు  సడన్ గా జరుగుతున్నపుడు ప్రేమో దోమో..  మాత్రం సడన్ గా ఎందుకు జరక్కూడదు  ? ప్రేమ కాదు ఆది జస్ట్ ఇష్టం.. సరే ఏదోటి..జరిగింది..next లెవెల్ కి వెళ్ళాలి.. అంతే..అక్కడే ఆగిపోతే ఎలా..?
 
   మన పక్కనే ఉంటారు..మనం గుర్తించం..రోజు కలుస్తాం, మాట్లాడుతాం.మాటల్లో..కలిసి తిరగటంలో.. టైం స్పెండ్ చేయటం లో సంవత్సరాలు గడుస్తాయి . ఒక సమయం వొస్తుంది..అప్పుడనిపిస్తుంది..  వీళ్ళు లైఫ్ లాంగ్ మనతోనే  ఉంటే ఎంత బావుండో అని .. అప్పుడు  ప్రేమలో పడ్డామేమో  అని మనసుని గట్టి గా అడగాలి .అప్పుడు కూడా ఇంక ఆలోచిస్తూ ఉంటే, ఆ దేవుడే కాపాడాలి.

Jan 7, 2011

అవురా పెద్దది గుమ్మాడి ..ఏదో పని చేస్తున్నా  ..కరెంటు పోయింది.. సరే కొంచం సేపు చలి కాచుకుందాం అని  ఎండకోసం  డాబాపైకి వెళ్ళాను. పక్కనే మిగిలిపోయిన ఖాలీ స్థలంలో   రెండు గేదెలు మేస్తూ కనిపించాయి. చుట్టూ apartments మధ్య ఈ దృశ్యం ఇంకేన్నాల్లుంటుందో  అనిఅనుకుంటుండగానే.. నా దృష్టి  అక్కడ పెరిగిన గుమ్మడి పాదుల వైపు మళ్ళింది . ఓ చిన్ని గుమ్మడి కాయి.. పక్కనే అరవిరిసిన గుమ్మడి పువ్వు.
సాధారణంగా కనిపించే కాయగూరల్లో పెద్దనైన దీని ఆకారం యిట్టె ఆకర్షించి అదంటే ఎందుకో కుతూహలం ఉండేది నా చిన్నప్పుడు. అటు తరవాత "వీరి గుమ్మడి పండు వీరి పేరేమి..అనే ఆట" ద్వార గుమ్మడి  బాగా పరిచయం.
బొద్దుగా ఉండే పిల్లని "గుమ్మడికాయ" అని వెక్కిరించటం.."గుమ్మడి  కాయ లాగ ఉంటాడు" చూడు అని  ఉదాహరించటం.."గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవటం" లాంటి సామెతలూ   కూడా మనకి పరిపాటే.
గుమ్మడి కాయ కూర.. గుమ్మడి తో చేసిన పులుసు,  గుమ్మడి పలుకుల పాయసం, గుమ్మడి హల్వా  ..లాంటి  రక రకాల వంటకాలలోగుమ్మడికి ప్రత్యెక స్థానమే ఉంది. అలాగే ..దిష్టి తీయటానికి గుమ్మడిని పగలగోట్టటం.. దిష్టి తగలకుండా గుమ్మడి కాయని గుమ్మానికి వేలాడ తీయటం లాంటి వాటితో మన సాంప్రదాయాల్లో కూడా గుమ్మడికి మంచి ప్రాశాస్తమే  ఉంది.  అమెరికా లాటి దేశాల్లో కూడా గుమ్మడి కి ఓ సముచిత స్థానం ఉంది.


Halloween day రోజు  గుమ్మడి కాయని తొలిచి అందులో దీపం పెట్టి లాంతరు లాగ వెలిగించటం, Thanksgiving డే రోజు కూడా గుమ్మడి తో వొంటకం వడ్డించటం వాళ్ళ సంప్రదాయం.


"ఓ గుమ్మా గుమ్మడి పువ్వు. ఓ కొమ్మ కమ్మగా నవ్వు.."
" అమ్మాడి  నవ్వవే గుమ్మడి నవ్వవే... గుమ్మడి పువ్వులాగా అమ్మాడి  నవ్వవే.. "
" గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడి.. "
లాంటి హిట్ పాటలతో  తెలుగు సినీ సాహిత్యం  లో కూడా మంచి చోటే సొంతం చేసుకుంది గుమ్మడి.
అబ్బా గుమ్మడి కథ చాలానే ఉంది....అనుకుంటుండగానే
కరెంటు వొచ్చింది  ..ఆలోచనలు కట్....