Jan 26, 2013

మనకి మనమే ..
హ్యారీ పాటర్ - 3
హ్యారీ పాటర్ సిరస్ ని కాపాడే ప్రయత్నం లొ ఉన్నాడు. సిరస్ కొలను ఒడ్డున చఛిపొతున్నాడు. డెమన్స్ చుట్టూ చేరాయి. ఇద్దరి జీవ శక్థులని పీల్చేస్తున్నాయి. హ్యారీ శక్తి హీనుడు అవుతున్నాడు.డెమన్స్ మాత్రం తమని వదలటం లేదు. సిరన్ నిస్సహాయంగా పడున్నాడు. నిస్సహాయతే వాటికి కావలసింది. ఇంకో కొన్ని క్షణాల్లో సిరస్ ప్రాణాలు పోతాయనగా హ్యారీ దీనంగా చావుబతుకుల మధ్య కొలను అవతలి వైపు చూసాడు అటు వైపు ఒక తెల్లని కాంతిపుంజం కనపడింది. ఆ కాంతి పుంజం అంతకంతకూ ఎక్కువయ్యి మొత్తం డెమన్స్ ని పారిపొయెలా చెసింది. లేచి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అసలేమి జరిగిందో గుర్తులేదు.పక్కన హర్మోయిని ఉంది నవ్వుతూ.
ప్రొఫెసర్ డంబెల్డొర్ వచ్చాడు. గడిచిన కాలంలో జరిగిన తప్పు సవరించటానికి ఇద్దరినీ గత కాలంలోకి పంపాడు. ఇద్దరూ అన్నింటినీ సవరిస్తూ .. సిరస్, హ్యారీ పాటర్ డెమన్స్ బారిన పడె దశకి వచ్చారు. అటువైపు సిరస్ కొలను ఒడ్డున చఛిపొతున్నాడు. హ్యారీ పాటర్ నిస్సహాయంగా చాస్తూఉన్నాడు. డెమన్స్ చుట్టూ చేరాయి. సిరస్..హ్యారీ జీవ శక్థులని పీల్చేస్తున్నాయి. హ్యరీ అంతకంతకూ శక్తి హీనుడు అవుతున్నాడు. ఇటువైపు ఇక్కడ హ్యారీ పాటర్ తనకి కాపాడే వాళ్ళకోసం చూస్తున్నాడు. చనిపోతున్న తనని కాపాడింది తన తల్లిదండ్రులే అని అతడు అనుకుంటున్నాడు. కనక వాళ్ళొచ్చి హ్యారీని ( తనని ) రక్షిస్తారని చూస్తున్నాడు. సిరస్ ప్రాణాలు మెల్లిగా గాల్లొకలిసి పోతున్నాయి. తన తల్లిదండ్రుల జాడలేదు. తాను కూడా కొలను ఒడ్డున ప్రాణాలు పోగొట్టు కునే దశలో ఉన్నాడు. సిరస్ ప్రాణాలు ఇంకో క్షణం అనంతవాయువుల్లో కలిసిపోతాయనగా ఇహ లాభంలేదని, ఇటు వైపున ఉన్న హ్యారీ తానే తన మంత్రదండాన్ని ప్రయోగించి డెమన్స్ ని పారద్రోలి హ్యారీ ని కాపాడాడు. అంటే సిరస్ ని.. తనని తాను కాపాడుకున్నాడు.
అంతా అయోమయంగా ఉండవచ్చు. సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఇంతకీ దీనిలో ఉన్న గొప్పదనమ్ ఎంటి అంటే , రచయిత్రి రోజు వారీ విషయాలకి చక్కని రూపకల్పన చేసి గొప్ప కథని తయారు చెసింది. అది కాల్పనికత అద్బుతంగా తెరెకెక్కించ బడింది. విశయానికి వస్తె....
ఆ డెమన్స్ ఎవరో కాదు... మన అత్మన్యూనత, అలసత్వం, నిరాశ, భయం, దిగులు, ఆందోళన, పిరికితనం. సమస్యలు మొదలైనవి. ఎప్పుడయితే మనం ఆత్మవిస్వాసాన్ని, దైర్యాన్ని,ఆశని కొల్పొతామో అవన్నీ మన మీద పడి దాడి చేసి మన శక్తులని పీల్చి మనని ఓటమి అంచున నిలబెట్టి చావుదశకి తీసుకెళతాయి. మనని ఎవరూ కాపాడలేరు. చివరికి మనని కనిపెంచిన తల్లిదండ్రులు కూడా. ఏ దేవుడూ రాడు మనకోసం.
మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరయా మనకి దిక్కు ?? ఎవరయా మనని కాపేడేది?? ఎవరయా మనకి సహాయం చేసెది..చేయగలిగేది అంటే .. 'మనకి మనమే .. మన ఆత్మవిశ్వాసమే'
ఆత్మవిశ్వాసపు మంత్రదండాన్ని ప్రయోగిస్తే .. ఆ డెమన్స్ అన్నీ తలో దిక్కూ పారిపోతాయి. ఎంతకాలం అయితే మనలో మనమీద మనకి విశ్వాసం ఉంటుందో అంతకాలం అవేవీ మన దరికి రావు.
అదీ ఈ ఎపిసోడ్ లో మనం గ్రహించవలసింది.

No comments: