Feb 13, 2010

తమిళ పొన్ను

ఊరి నుండి అప్పుడే వొచ్చి ముఖం కడుక్కొని..అమ్మ కలిపిన అటుకుల మూట విప్పి తింటున్నాం ఇద్దరం,  నేను, వాసూ. . ఉప్పు కారం.. కొబ్బరి పొడి..వేసి కలిపిన అటుకులు కమ్మగా ఉన్నాయి ఇంతలో.. "రా   రమ్మని రారా రమ్మని రామచిలుక పలికెను ఈ వేలా" ..  అంతగా బాలేక  పోయినా  పదే పదే వినిపిస్తోంది ఓ అమ్మాయి గొంతు.. ఆ  పదాలు పలకటం కూడా తెలుగు వాళ్ళ లా లేదు..
 వాసు ని అడిగా " ఎక్కడిదా గొంతు.. ఎవరా పిల్ల"
అదా  మధ్యాన్నం నిద్ర రాకుండా ఇదో గోల మొదలైంది మనకి.. కింద షాప్.. హాట్ చిప్స్ కి అద్దెకి ఇచ్చారు.. తమిళ వాళ్ళకి "
 "ఓహ్  అవునా " అన్నాను మళ్లీ అదే పాట వింటూ..తమిళ యాసలో గట్టిగా బెరుకు లేకుండా పాడుతోందా  పిల్ల.
వేడి చాయ్ పెట్టాడు వాసు.
వాసు చిన్ననాటి మిత్రుడు. కాని ఈ మధ్యే నేను వాసు రూం లో జాయిన్ అయ్యా. ఆటను చాల సాదా సీదా వ్యక్తి.. లైఫ్ ఇస్ సో సింపుల్ అతనికి.  తన వల్లకాని..శక్తికి మించిన  ఆలోచనలు చేయడు..full practical minded. ఉదయం 7 గంటల కల్లా లేచి చాయ్ తో పాటు  న్యూస్ పేపర్ చూడటం, స్నానం..వంట ..భోజనం..కాసేపు విశ్రాంతి.. మధ్యాన్నం 1 గం  ఆఫీసుకి వెళ్లి. రాత్రి 10 గంటలకి రావటం..అది అతని దిన చర్య.. ఆదివారం వొస్తే...ఓ  సినిమా..అంతే.
నిద్ర లేవటానికి ఓ వేళా  పాళా  అంటూ లేని నేను వాసు రూం కీ షిఫ్ట్ అయ్యాక చాయ్ కోసం  7 కల్లా లేవటం అలవాటయ్యింది.
కాలేజీ  నుండి సాయంత్రం 4 గం కి వొచ్చి కాసేపు పడుకునే వాడిని..ఈ పిల్ల పుణ్యమా అని ఆ నిద్ర  లేకుడా పోయింది. లేటెస్ట్ సినిమా పాటలతో ఊదరగొట్టేది.  ఎవరా  పిల్ల ఎలా ఉంటుంది.. అనే కుతూహలం కూడా ఎక్కువవుతూనే ఉంది ఓపక్క .
ఓ రోజు మధ్యాన్నం కాలేజీ నుండి వొస్తూనే సరా సరి షాప్ కీ వెళ్ళా  హాట్ చిప్స్ కొందామని..
"రా రా రమ్మని రామచిలుకా".... ఆపేసింది నన్ను చూసి,..
తమిళ నలుపు..అయినా ఏదో కళ .. తెల్లగా పెద్ద   కళ్ళు .. 18- 19 మధ్య ఉంటుంది. హాట్ చిప్స్ వేయించి వేయించి  మొహం కొంచం జిడ్డు ఓడుతోంది..నూనే పట్టించి వేసిన చిన్న జడ .. పెద్దగ  చదువుకోలేదని మొహం చుస్తే ఎవరికైనా తెలుస్తంది.. కాని ఎదుటివారిని కట్టి పెడేసే  గుణం ఏదో  ఉంది..
 నిర్భయంగా బెరుకు లేకుండా మాట్లాడం లోనే ఉందేమో..
"ఎం కావలి"
"చిప్స్ "
"పైన రూం లో ఉంటారా " నన్ను ఎప్పుడో గమనిచేసింది..
"అవును "
"సదూ  కుంటున్నారా " తమిళ యాసలో ప్రశ్నలతో పాటు  గుప్పెడు చిప్స్ ఎక్కువేసింది.
అది  మొదలు.. అప్పుడప్పుడు నేను చిప్స్ కోసం వెళ్ళటం.. చిరునవ్వులు, పలకరింపులు హాయ్ లు బాయ్ లు  . ఆ పిల్ల నా కళ్ళ లోకి తదేకంగా చూసేది  నేనే మరల్చు కోవలిసి వొచ్చేది.
 అది ఎండాకాలం ఒక రోజు నేను భోజనం చేస్తున్నా, వాసు మంచి కునుకో లో ఉన్నాడు.. ఇంతలో    టక టక అని తలుపు చప్పుడైంది కింద.. మా రూం మొదటి అంతస్తులో..spiral stair case తో వింత గా ఉండేది. ఎవరా అని చెయ్యి కడుక్కోకుండా నే వెళ్లి తలుపు తీసా..
 తమిళ పొన్ను..  " కొన్ని నీలిస్తారా " అని వాటర్ బాటిల్ చూపించింది.
"సరే పైకొచ్చి తీసుకో..నేను భోజనం చేస్తున్నా " అన్నాను,
నాతో బాటే అనుసరించిది. అదుగో ఆ కుండలో ఉన్నాయి అని చూపించా.
వెళ్లి గ్లాస్ తో బాటిల్ నింపటం మొదలు పెట్టి మళ్లీ కళ్ళతో కళ్ళు ముడేసింది. నాకు ఎలా తప్పింహుకోవలో తెలిలేదు. దగ్గరి కెల్లాను.. ముద్దు పెట్టు అన్నట్టుగా   చెంప చూపించింది.
ఏమి ఆలోచించకుండా ముద్దు పెట్టాను. నీళ్ళ బాటిల్ వొదిలేసి..  చేతులు చాచింది..
నేను కోగిట్లో వాలాను. అలా రెండు మూడు  నిముషాలు ఉండిపోయాం..అ అమ్మాయి  చిన్నగా  కదిలే సరికి విడి  పడ్డాను.
ఎం మాట్లాడకుండా నీళ్ళ  బాటిల్ తెసుకొని వెళ్లిపోయింది..

No comments: