Sep 5, 2011

కొన్ని పేస్ బుక్కు పోస్టింగులు..

 • బ్యాంకు బాలన్సు జీరో అయితే కాని జీవితం అర్థం కాదు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ సున్నా అలాగే ఉంటే ...జ్ఞానోదయం అవటం ఖాయం..
Aug 22
 •  చదువులు.రిలేషన్ షిప్పులు.. ప్రేమలు..సినిమాలు..హీరోలని ఆరాధించటం..ఎంజాయ్ మెంట్ .. .. వీటిల్లో యువత బిజీ గా ఉండటం... ప్రభుత్వం..పరిపాలన ..రాజకీయం అనే విషయాలమీద కనీస అవగాహన లేకుండా పోయింది... ఒక్కసారి  చదువు ఐపోయి ఉద్యోగం..సంపాదన..జీవితం.. సెటిల్మెంట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రమె సమాజ అసలు స్వరూపం తెలుస్తుంది.
 • ధనవంతులకి... affluent గా ఉన్న వాళ్లకి ఏ బాధాలేదు. ఏదోవిధంగా తమ పిల్లలని అన్ని సదుపాయాలూ ఏర్పరుస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వం మీద ఆధారపడేది మధ్యతరగతి ..బీదా బిక్కి..మాత్రమే.
Aug 28
 • మధ్య తరగతి మనుషుల్లో తెగింపు తక్కువ..సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఎక్కువ. కనక సహజాతాలని.. సహజ భావోద్వేగాల్ని కొంత అణిచి పెట్టి బతికేస్తుంటారు.మెల్లిగా జీవితం అంటే ఇదే అనే భ్రమ లోకి వెళ్ళిపోతారు.
Aug 30 (6 days ago)
 • * దేశ భక్తి అంటే కేవలం పిడికిళ్ళు భిగించి జై కొట్టం..లేదా ఆగస్ట్ 15 న జండా కి సలాం కొట్టటం.. క్రికెట్టును ఫాల్లో కావటమే కాదు.. భారతీయ కళలని ఆస్వాదించటం కూడా దేశ భక్తే.
Sep 2 (3 days ago)
 •   సుఖం దొరక్కుండా ఎన్ని గోడలు.ఎన్ని సెంటిమెంట్స్.. ఎన్ని నియమాలు..ఎన్ని డాంబికాలు ..ఎన్ని నీతులు పెట్టుకున్నాం,  మనం.. 
 • దేవుడు ఉన్నా లేకున్నా..పలికినా .. పలక్కున్నా ఈ పసుపు కుంకం వేసి నైవేద్యాలు  పెట్టె వాళ్ళే ఎక్కువయ్యారు లోకంలో..
Jul 1
 • * ముందుగా ప్రపంచాన్ని వదలాలి. తరువాత దేవుణ్ణి వదిలిపెట్టాలి. తరువాత గురువుని వదిలిపెట్టాలి. ఈముగ్గురినీ పట్టుకొని ఉన్నంత వరకూ అతను అజ్ఞానం లోనే ఉన్నట్లు లెక్క.
Jul 13
 • * దేవుడు లేదు అని చెప్పటం సులభమే. కాని ఉన్నాడని నమ్మటం...నమ్మకం కలగడం మాత్రం చాలా కష్టం.
Jul 28
 • *ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతంగా ఉన్నంతవరకు ఎలాంటి బాధ ఉండదు. ఎప్పుడయితే ఆది కమ్యూనిటీలోకి మారుతుందో అప్పుడు ఆది మతం రంగు పులుముకుంటుంది. ఈర్ష ..అసూయా లని రేకెత్తించి మారణహొమం సృష్టిస్తుంది.
Aug 27
 • * నేనైతే దేవుడినే తప్పు పడతా.. ఎవడు అడిగాడని ఇచ్చాడు నాకు ఈ లైఫ్.. ? ఎవరి కోసం చేసాడు ఈ సృష్టిని ..ఈ సకల చరాచర ప్రాణుల్ని ?? . పాపం శరీరాల్లో బంధింపబడి ..బ్రతక లేక చావలేక ఒక్కో ప్రాణి పదే బాధ యాతన వర్ణనాతీతం.
Aug 27
 • * రెండు తప్పులు.. సృష్టించటం మొదటి తప్పు.. సమానత్వం ఇవ్వకపోవటం రెండో తప్పు.. తప్పకుండా తిట్టుకోవలసింది వాడే. కాని తిడితే ఉన్నదీ ఉడపీకుతాడేమో అని భయం తో పూజలు చేస్తున్నాం.

2 comments:

Praveen Mandangi said...

>>>>>
బ్యాంకు బాలన్సు జీరో అయితే కాని జీవితం అర్థం కాదు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ సున్నా అలాగే ఉంటే ...జ్ఞానోదయం అవటం ఖాయం..
>>>>>
నా IDBI అకౌంట్‌లో బాలెన్స్ అక్షరాలా 49 రూపాయలు. ఇది నో ఫ్రిల్స్ అకౌంట్ కాదు. IDBIలో సర్వీస్ చార్జిలు పడవని నేనే బాలెన్స్ తక్కువగా ఉంచాను. ఏడాదిన్నర క్రితం IDBIలో అకౌంట్ తెరిచినప్పుడు మూడు వేలు కట్టాను. డెబిట్ కార్డ్ ఖర్చులు పోయి బాలెన్స్ 49 రూపాయలకి వచ్చింది. పెళ్ళికి ముందే జీవితంలో మునిగినవానిలాగ ఖర్చులు అయ్యాయి.

Sivanaadh Baazi Karampudi said...

sir god, matam meedha meeru vrasina vi naku chal baga nachhai well said sir

from
computer in telugu