Feb 15, 2011

బాధ - చలం

ఎంత తరచి చూసినా లోకంలో బాధ ఉండటం అన్యాయం..ఘోరం. మతాలూ ఈ బాధని ..శిక్ష అనీ , కర్మ అనీ ..ఈశ్వరేచ్ఛ అని ఎంత సమర్థింప చూసిన అర్థం లేని మాటలని పిస్తాయి..బాధ లేకుండ సృష్టి ఎందుకు ఏర్పడి ఉండకూడదు ?
ఈ ప్రశ్న ఎవరినడగాలి?ఈ ప్రశ్నని తీసుకునే దేవరు?జవాబు చెప్పేదెవరు? బాధకి లోబడే ఏ జీవికి అధికారం లేదు జవాబు చెప్పటానికి!
బాధలివ్వటం ఎందుకు? ఇట్లా జీవరాశుల్ని కాల్చి చంపడమెందుకు ?
ఎంత స్పష్టమైన కసి కనపడుతోంది సృష్టి కర్త హృదయం లో ?
 - ఇదంతా కర్మ ఫలం -
అసలు దుష్కర్మ చేసే ఆలోచనలు ఎందుకు మనస్సులో పెట్టాలి ?
 గజ్జి పట్టి దిక్కు లేక తిరిగే కుక్క పిల్లలు..
పిల్లల్ని తినేస్తే ఏడ్చే పక్షి తల్లుల గోల
గోడలో మొలిచి నీళ్ళు లేక ఎండే మొక్కల క్షుద  - 
ఇట్టాంటి బాధని ఏ కర్మ సిద్దాంతము సమర్థించలేదు.

మనుష్యులయినా   ఒక రకమైన బాధల్లోంచి ఇంకో రకమైన బాధల్లోకి నడవటమే కనపడుతోంది ఇన్ని యుగాలుగా..
దేవుడి కన్నా సైతానులో ఎక్కువ నిజాయితీ.. దేవుడి కరుణనీ- క్రూరత్వాన్ని కూడా నిర్లక్షంగా ఎదురుతన్న గలిగిన వాడు అతనొక్కడే.
ఇంత బాధ పెట్టినతరవాత  ఇచ్చే  నీ సుఖాలు నాకేం వొద్దు అని తన్న గల శక్తి రావాలి మనిషికి.
బాధకి లోబడి పోయి..తన విషయమే యోచించుకునే వాడు ఏడుపుగొట్టు..అన్నింటిలోను విషాదమే చూడగల మనిషిగా అయిపోతాడు...

                  బాధ గురించి  చలం "బాధ" -   పుస్తకం పేరు ' విషాదం'  

No comments: