Apr 8, 2011

కొత్త కుండ

సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎంత fridge నీళ్ళు తాగినా గొంతు మాత్రం తడవటం  లేదు. దాహార్తి తీరటం లేదు. అందుకే ఓ కుండ కొందామని వెళ్ళాను. 
ఎంతమ్మా కుండ  ?  
150 ..స్టాండ్ కలిపి ౩౦౦
అర్రే ఎంటమ్మ అంత చెపుతున్నావ్ ఒకేసారి,  మట్టి కుండ 150 ఆ...ఆ చిన్న స్టాండు 150 ఆ   ఆశ్చర్యం ప్రకటించేసా
అవును బాబు ధరలు పెరిగాయి కదా..
సర్లే,,
వెళ్లి పోయాను..పక్క షాప్ కి.
అక్కడ కొంచం ఎక్కువగానే చెప్పాడు.
ఇహ కుండా వద్దు ఏమి వద్దు..౩౦౦ పెట్టి ఎవడు కొంటాడు మహా అంటే ఇంకో నెల..రెండు నెలలు. ఏదోలా గడిచి పోతుంది లే అని వెనుదిరిగాను.
మళ్లీ మొదటి ఆవిడ నాదగ్గరికి వచ్చింది.

కొత్త కుండ కొనాలయ్య.. మంచిది. అంత ఆలోచిస్తావ్ ? 
ఆ ఏం మంచి ..? ప్రతిసారి కొంటునే ఉన్నంగా.. ఏం జరిగిందని. అలా జరిగుంటే కుండనే దేవుడిని చేసేవాళ్ళం గా..??
వీడు సెంటిమెంటుకు పడేవాడు కానట్టుంది అనుకోని.. నా మొహం బాగా చూసి  ఓ బ్రహ్మాస్త్రం  సందించింది.
 ఏంటయ్యా... ఇన్ని ఖర్చు చేస్తారు..కుండ దగ్గరికి వచ్చేసరికే మీకు ఎమోస్తది ?
సరిగ్గా తగిలింది..
నాకెందుకో కరెక్టే  అనిపించింది.  ఓ రాత్రి నిద్రపట్టకపోయినా..mood అస్సలే బాలేకపోయినా..మహా బాగా ఉన్నా  ఈజీ గా 250 హుష్ కాకి అయిపోతాయి.
of course ఈ మధ్య నిద్ర పట్టకపోయినా, మూడ్ ఎలా ఉన్నా ..  హుష్ కాకి అనిపించలేక పోతున్నా.  అదో నిస్సహాయత,   :(  అది వేరే విషయం. 
సరే ఆమె అన్నదానిలో  ఒకింత నిజాయితీ ఉందని అనిపించింది.
 సరే అమ్మా..220 ఇస్తా ఇచ్చేయి..
250 ఇవ్వు బాబు...
నా వాళ్ళ కాదు...
220 ఏ.
సరే 230 ఇవ్వు ..
సరేలే... పోనీ ...అని 230 చేతిలో పెట్టి కుండ తెచ్చుకున్నా..
అన్నట్టు ఒక రోజు అంతా నీళ్ళు  పోసి పెట్టి..ఆ తరవాత నుంచి వాడాలట  కదా.. 

2 comments:

Lalitha said...

please forgive my ignorance....kunda dhara Rs 230/-? nijamgaa?

naku thelisi year 2000 lo - pado, padiheno ichchinattu gurthu.

Bharatha Desham develop ayindandee chala :)

chakri said...

లలిత గారు.. నూటా యాభై కి తక్కువకి దొరకడం లేదండీ మంచి నీళ్ళ కుండ. :(