Apr 8, 2011

నా అభిమానం


నాకు అప్పుడు అయిదారేళ్ళ వయసు.
సినిమా అంటే అబ్బురం. అందులోను.. చిరంజీవి సినిమా అంటే.. ఓహ్..దసరా ,,దీపావళి కంటే పెద్ద పండగ నాకు ఆది..
నానా హంగామా చేసి చిరు సినిమా చూసేవాడిని.. స్కూల్ ఎగ్గొట్టి సినిమా చూసే ధైర్యము..ఘనతా నా కాలనీలో నాకే దక్కాయి. పక్కవాళ్ళ ముందు దోషిగా నిలబడ్డా నామోషి గా ఎప్పుడు ఫీల్ అవలేదు. పైగా అదో గొప్ప adventure గా అనుభూతి చెందేవాడిని. ఆ ఫైగింగులు..ఆ స్టైలు .. ఆ అందము..ఆ డ్రెస్సులు..ఆ స్టెప్పులు..మరిచిపోగాలనా?? ఖైదీ, గుండా..పులి..కిరాతకుడు..యమకింకరుడు....మీకు తెలుసుగా పేర్లు..


Intermediate.
"Gang leader  కాలేజీ ఎగ్గొట్టి టిక్కెట్స్ కోసం try చేస్తే చివరికి మొదటి ఆటకి దొరికింది. నాలుగింటికల్లా  రావలసిన పిల్లాడు ఎక్కడికి వెళ్ళడా అని ఇంట్లో వాళ్ళంతా యమా  ఇదై పోతుంటే.. నేను మాత్రం.. " ఆంజనేయుడికి దండం పెట్టి రాఫ్ఫ్ ఆడించేస్తా నాహా..... రావణ లంకకి నిప్పంటించి మీసం మెలి పెడదామ.  జి  అ న జి ..గ్యాంగ్ గ్యాంగ్ ..బజావో..బ్యాండ్ బ్యాండ్.."
సినిమా చూస్తూ..అప్పుడప్పుడు పిడికిలి భిగించి వదులుతూ తన్మయత్వం చెంది..  ఇంటికి వెళ్లేసరికి  10 కొట్టింది.ముందు అన్నం పెట్టారు..ఆ తరవాత వాతలు పెట్టారు. కాని నేను గ్యాంగ్ లీడర్ లో చిరంజీవిలా  ఫీల్ అయ్యి .. అవి గొప్పగా నొప్పి పెట్టనట్టు నటించాను.


డిగ్రీ
...చదువుతున్నానో...లేక అయిపోయిందో..గుర్తులేదు..
హైదరాబాదు..మల్కాజిగిరి ..సాయిరాం theater.. "స్నేహం కోసం"  సినిమా చూసాను.
ఆ తరవాత ఇంక చిరంజీవి  సినిమా చూడకూడదు అనుకున్నాను.. అప్పటికే ఆయన మాస్ మసాల మాటల స్టయిలు.. లుంగీలు ఎగ్గట్టడాలు  గంతులు వేయటాలు..  ఎంచుకున్న పాత్రల్లో హుందా తనం లేకపోవటము.. చీ చిరంజీవి అనిపించింది.
మళ్లీ ఇంతవరకు చిరంజీవి సినమాని theater లో చూడలేదు.


మొన్నటి దాకా & ప్రస్తుతం.
చిరంజీవి పార్టీ పెట్టటం..నాకు చాల బాధేసింది.   ఇక ఆయన ఏం మాట్లాడిన అసహ్యం వేసింది. ఎందుకంటే ఆయన తెర నుంచి రాజకీయ నాయకుడు అయ్యాడు కనక. రాజకీయం అంటే నిజ జీవిత నటన కనక.. రాజకీయ నాయాకుడేవరు  హీరో కాదు..కాలేడు గనక
ఇక ఆయన సంపూర్తిగా నా మనసులోంచి తొలగించ బడ్డాడు.
ఆయన తన స్వంత జీవితంలో సరి అయిన దారి ఎంచుకొని..ఒక్కో మెట్టు ఎక్కాడేమో..నా ఒక్కడికి బదులు వంద మంది అభిమానులని సంపాదించుకున్నాడేమో..
కాని నా గుండె కుండలో అభిమానం ఒక్కో చుక్కా కారి పోయి..ఎండిపోయింది.
ప్రజారాజ్యం కాంగ్రేసులో మద్దతో/ విలీనం కావటం తో..ఆ ఎండిన కుండా  పగిలి పోయింది.

4 comments:

laddu said...

Bagundhi. Meela nenu okadini. Naala chala mandhi unnaru.

Anonymous said...

అందుకే నా ఫేస్ బుక్ పేజిలో , ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన రోజున "పుట్టిన రోజు, వర్ధంతి ఒకే రోజు రావడం దాదాపుగా అరుదు.
కాని, మన రాష్ట్రంలో - ఒక నాయకుడికి నిజమైన పుట్టిన రోజు, రాజకీయ వర్ధంతి జరుగుతోంది" అని రాసుకున్నాను

Vidyamanohar said...

అందుకే నా ఫేస్ బుక్ పేజిలో , ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన రోజున "పుట్టిన రోజు, వర్ధంతి ఒకే రోజు రావడం దాదాపుగా అరుదు.
కాని, మన రాష్ట్రంలో - ఒక నాయకుడికి నిజమైన పుట్టిన రోజు, రాజకీయ వర్ధంతి జరుగుతోంది" అని రాసుకున్నాను

Jayasree Naidu said...

తెర వేల్పులు ఇలా ఇలవేల్పులు అవ్వడానికి తాపత్రయ పడటం తోటి సామాన్యుడు ఇన్నాళ్ళూ తను కట్టుకున్న ఆరాధనా హర్మ్యం తునా తునకలై పోతోంది.. a sad saga for silver screen admiration.