Mar 2, 2010

రంగుల లోకం పిలిచే వేళా ..





నిన్న (అంటే  మార్చ్  1 సోమవారం 2010) ..హైదరాబాద్ అంతా  హోలీ పండగ  బాగా చేసుకున్నారనుకుంటా ..నేను మాత్రం ముందురోజే  హైదరాబాద్ విడిచి పారి పోయా..
 పార్వతి, శివుడికై తపస్సు.. అది  చూసి  కాముడు  ( మన్మదుడు  ) పార్వతికి  సహయంచేద్దామని   శివుడిపై పూల బాణం వేయటం..శివుడు ఆగ్రహంతో కాముడిని  బస్మం చేయటం.. దానికి నిదర్శనంగామనం కామున్ని దహనం చేసి ఒకరి పై ఒకరు రంగులు పోసుకొని  .. ..ఈ  పండగ చేసుకోటం ...భలే భలే ..
ఈ గోలంతా భరించే ఓపిక లేక , ముందు రోజు సాయంత్రమే నేను , మా కజిన్ తో కలిసి వాళ్ళ ఊరికి ప్రయాణం కట్టా .  
వాళ్ళ ఊరు..చుట్టుపక్కల ఉండే పంటపొలాలు..చిట్టడవులు..రాళ్ళూ రప్పలు..గుళ్ళు గోపురాలు..అన్ని చుట్టేసాం .. అలసిపోయి సుస్టుగా తిని పడుకున్నాం.. మావాడికి ఆఫీసు ఉంది కనక పొద్దున్నే లేచి తిరుగు ప్రయాణం అయ్యాం.
వొచ్చీ రాగానే  పాల కోసం షాప్ దగ్గరికేల్లాను .ఓ కాలేజీ  అమ్మాయి రీ ఛార్జ్  కోసం వొచ్చింది. మొహం అంత గులాబీ రంగు..హోలీ  రంగు ఇంకా పోనేలేదు. అప్పుడు అనిపించింది.. నేను హోలీ మిస్ అయ్యానా అని. 
ఇంటికొచ్చి చాయ్ తాగి, కెమేరా  లో షూట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ చూడ్డం  మొదలెట్టా, అప్పుడు తెలిసింది.  నామీద కూడా రంగు పడిందని.
ఎలా అంటారా ....


షామీర్ పేట్ లేక్  లో.. ఆకాశం చిమ్మిన నీలం , కెంజాయ రంగులు,
పంటచేలు పులిమిన ఆకుపచ్చ రంగు,
మోదుగచెట్టు గుప్పిన ఎరుపు రంగు,
పల్లె మనుషుల...పసి మనసుల అద్దిన తెలుపు,
పూదోట   చిలకరించిన  పసుపు, గులాబి రంగులు..
అడవి పువ్వులు..పోద్దుదిరుగుడు   చల్లిన   పసుపు  రంగు..

ఇలా ...ప్రకృతి కాంత నా మీద చల్లిన ర్ణాని  ఫోటోల్లో  దాచేశా...!! 
 
 

2 comments:

~sreem said...

Holi "naturally". ee post chadivinavaaru maromaaru holi panduga cheskunnattuga undhi! description simply superb

aravind Joshua said...

annayaa....inkaa mugule undi neelo kavi hrudayam.