Mar 31, 2010

దైవం

మనకి అర్థం కానిదంతా దైవ మాయే. 
భూగోళాన్ని అపకేంద్ర , అభికేంద్ర బలాలు ఒక నిద్రిష్ట కక్షలో తిరిగేలా చేయటం, పదార్థంలో పరమాణువుల అమరిక...తద్వారా  పదార్థ ధర్మ మార్పు, జంతుజాల జీవన క్రియలు  నుంచి మొదలు కొంటె ప్రతిదీ ఒక పద్దతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. 
మానవ మేధస్సు సృష్టి లో ఉన్న కొన్ని రహస్యాలని చేదించి స్వలాభానికి వాడుకుంటూ ఉంది.. కాని  సృష్టి కారణం, కారకులు, జీవం , జీవితం ..వీటిని ఇంకా నిర్వచించ లేక పోయింది . ఇక్కడే "దేవుడు" అన్న పదం ప్రతిపాదించ బడుతుంది..మనకి అర్థం కానిదంతా దైవ మాయే.

దేవుడు ఒక సాంఘీక  అవసరం

దేవుడు ఒక సాంఘీక అవసరం. ప్రజలు దేవుడి పేరుతో కొంత రిలాక్స్ అవ్తున్నారు. తమ తమ కోరికలని తీరుస్తాడని, ఆపదలనుంచి గట్టేకిస్తాడని, సమస్యలని పరిస్కరిస్తాడని నమ్ముతున్నారు. ఆ నమ్మకం లో బ్రతకక పోతే వ్యక్తీ గతంగా, సాంఘీకంగాఅశాంతి ప్రబలి పోతుంది. సమాజం లో విలువలు నశిస్తాయి. అవి పోయిన నాడు లోకం నరకం. ఇప్పటికే చాల శాతం మంది బ్రతుకు పోరాటం లో, ఆశల వాహినిలో, సుఖ భోగ లాలసలో పడి విలువలు మరిచి దోపిడీలు , దొంగ తనాలు, మోసం, హత్యలు , అత్యాచారాలు చేస్తున్నారు. ఇక దేవుడు అనేది గుడ్డి నమ్మకమే అని తెలిసిందో... ప్రపంచం వల్లకాడైపొదూ  ..

ఒక దానికి surrender కావాలి 

మనిషి దేనికో ఒక దానికి surrender కావాలి . అదొక ఆనందం. దానినే ప్రపత్తి అంటారు. మన అహంని మరిచిపోయి ఎవరికో ఒకరికి, దేనికో ఒన దానికి అర్పణ కావాలి..
దేనికి కావలి.?? ఎవరికీ కావాలి??
నీకా? కాని నీలో నాకు లోపాలు కనపడుతున్నాయే..నాకంటే గొప్పగా కనిపించటం లేదే నీవు ??
మరి ఎలా...
సరిగ్గా అప్పుడే "దేవుడు" ఒక అవసరం అవుతుంది ఎవరికైనా. ఎవరితో మనం మనని మరిచిపోయి, ముసుగు తొలగించి, మంచి చెడు చెప్పుకొని. ఏడ్చి, నవ్వి, ఒదార్చుకొని..స్వాంతన పొందుతామో అదే దేవుడు.
ఆ దేవునికి మనని మనం అర్పణ చేసుకొని, ఆ ప్రపత్తి లోఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
అందుకే దేవుడిని idealize చేసి, సకల గుణగణుడుగా, మహా శక్తి సంపన్నుడుగా, దయామయుడిగా, ఆపద్భంధవుడిగా, కొంగు బంగారంగా కీర్తిచి...స్తుతించి, శ్లాఘించి  స్వాంతన ఆనందాన్ని పొందుతున్నాం.
సంగీత మాదుర్యము, భక్తి ప్రపత్తి, సాహిత్య పు గారడీ కలగలిసి మన మనసులో పుట్టించే ఆనంద తరంగాలు మనని ఒలలాడిస్తాయి .

దేవుడంటే ....????

 ఏ శక్తి జీవ చైతన్యానికి ఆధారమో,ఏ శక్తి పూలకి రంగుగా మారుతుందో.. ఏ శక్తి పక్షి రెక్కలో దూరి దాన్ని గాల్లో తెలుస్తుందో.. ఏ శక్తి భూమిని గాల్లో పట్టి ఉంచిందో.. ఏ శక్తి మనని పలికిస్తుందో,నడిపిస్తుందో, పరుగులేట్టిస్తుందో, మన ఆలోచనలకి ఆధారమో, . .. ఏ శక్తి మాటై, పాటై మాధుర్యమై మనని అలరిస్తుందో, ఏ శక్తి వేలుగునీడలో సృష్టిస్తుందో, ఏ చైతన్యం విత్తు లో ఉన్న జీవాన్ని మేలుకొలిపి భూమిని చీలుచుకొని మొలకగా మారుస్తుందో.. ఆ శక్తి చైతన్యమే దేవుడు.

దేవుడు మీ కోరికలు తీర్చడు.

నిజం..

దేవుడు మీకోరికలు తీర్చడు. అరిచి గీ పెట్టు.. లక్ష కొబ్బరికాయలు కొట్టు.. గుండు గీయించుకొని తిరుగు జన్మంతా.. దేశం లోని గుళ్ళు గోపురాలు చుట్టబెట్టు ... ఎమన్నా చెయ్యి ...మీ   కోరిక తీర్చడు..

మీకు మీరు .. హృదయంతరాళం లోనుంచి .. ఫీల్ అయ్యి.. sincere గా శ్రమిస్తే మీ  కోరిక నెరవేరుతుంది..

మనకి కావలసినవి కోరుకోటానికి.. ..అనుకున్నది తీరక పోతే గుండె మండి తిట్టు కోటానికి దేవుడు కావలి. 

 



No comments: