Mar 10, 2010

స్వాములోరి పూజమహిమ..

ఆ మధ్య ఎప్పుడో మా అమ్మ పోరు పడలేక .. ఒక జాతకాల స్వామిజి దగ్గరికి వెళ్ళా. ఆమెకీ ఎవరో చెప్పారంటా  గొప్ప స్వామిజీ . అతను చెప్పినట్టు చేస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి అని..
సరే ఇద్దరం వెళ్ళాము.. అడ్రస్ వెతుకుంటూ..


లోపల జనం బాగానే ఉన్నారు.. అయన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు.. జనం అంతా కింద కూర్చున్నారు  . ఏదో జపం చేస్తున్నట్టున్నాడు,  ఎప్పుడూ కళ్ళు తెరుస్తాడా అని జనం ఆయన్ని అదేపనిగా చూస్తున్నారు,  ..నేను మా అమ్మ వెళ్లి కాళ్ళు కడుక్కొని వరుసలో చోటు చేసుకొని కూర్చున్నాం. (కాళ్ళు  కడుక్కొమ్మని శిష్యుడు చెప్పాడు..అదో కండిషన్ అక్కడ మరి.)
అలా ఒక 15 నిముషాల తరవాత అయన కళ్ళు తెరిచాడు.
అందరినీ  తేరి పార చూసి.. లోపలి కెళ్ళాడు.. కొన్ని సెకనుల  తరవాత ఘంటా నాదం వినిపించింది..హారతి  పళ్ళెం,తీర్థం తో బయటకు వచ్చాడు..
అందరూ భక్తి తో మోకరిల్లి, హారతి కళ్ళ  కద్దుకొని  తీర్థం తీసుకున్నారు,
ఒకాయన అయన దగ్గరికెళ్ళి తన గోడు విన్నవించుకున్నాడు..
భార్య తనతో కాపురం చేయటం లేదంట.. జేబులో డబ్బులు మాయం చేస్తుందంట, నిన్నే ౪ వేలు నోక్కేసిందట,  ఎం చేయాలో తెలీటం  లేదంట.. ఎలా దారికి తెచ్చుకోవాలి  అని సందేహం వెల్ల గక్కాడు.
స్వామి వారు ఒక చీటిలో ఏదో రాసిచ్చాడు..ఏం రాసాడబ్బా అని నాcuriosity  ఆపుకోలేక చచ్చా అనుకో...
చీటీ ని చూసి  అతను దాన్ని కళ్ళకద్దుకొని  సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళిపోయాడు.


     మా వంతు వొచ్చింది. అంతకుముందే శిష్యుడి ద్వారా  డేట్ అఫ్ బర్త్,  స్టార్, అండ్ టైం అఫ్ బర్త్ రాసిచ్చిన చీటీ అయన చేతికి వొచ్చింది.
కొంత సేపు  వెళ్ళు లేక్కపెట్టుకొని లెక్కలు వేసాడు.  "అంతా బానే ఉంది .. లక్మి దేవి కటాక్షం  లేడు, అందుకనే అనుకున్న పనులు జరగటం లేడు.పెళ్లి కూడా అందుకే వాయిదా పడుతోంది.. అని. స్వామి వారు మహా జ్ఞాని, నేను బ్రహ్మ చారి వెధవనని గుర్తుపట్టేసారు. మా అమ్మ సంతోషం ముఖం లో ప్రస్పుటంగా కనపడింది.
 చీటీ మీద  ఏదో రాసి  మా అమ్మ చేతిలో పెట్టాడు. నేను నా curiosity  ని చంపే  ప్రయత్నం లో చీటీ లాక్కుని చూసాను..
1200 /- అని ఉంది. శిషుడు తనవైపు రమ్మని సైగ చేస్తే స్వామికి నమస్కారం చేసి, అతని దగ్గరికి వెళ్ళాము. రెండో ఇంట్లో రాహువు శని కొట్టుకుంటున్నారు. ఏదోఇంట్లో శుక్రున్ని  కేతువు మింగేశాడు. కనకనే పెళ్లి కుదరటం లేడు అన్నాడు. నేనేమో పెళ్లి సంగతి సరే , కనీసం gf అయినా దొరకటం లేదు . దానికి కూడా  వీళ్ళేనా  కారణం అని అడగాలని నోటి దాకా వొచింది. అమ్మని చూసి ఆగిపోయా..నాకేమి అర్థం కాలేదు ఆ బాక్స్. నన్ను వెన్ను పోటు పొడవటానికి ఇంత మంది ఉన్నారా? నా వెనక మహా కుట్ర జరుగుతోందే అని అనిపించింది. పెట్టక పెట్టక అసలైన వాటికే ఎసరు పెట్టారు అనుకున్నా.  జపం చేసి హోమం చేయాలి.మూడు రోజులు పడుతుంది  అని వివరించాడు.
అలాగే అంటూ  అక్కడినుండి వోచ్చేసాం .
ఇక మొదలుపెట్టింది మా అమ్మ..  ఎప్పడు వెళ్దాం అని..
వేల్దామే ప్రస్తుతానికి 1200 /-  లేవు అని చెప్పా.. నీకెందుకు నేను నాన్న ని అడిగి తెస్తాగా  అంది.
వొద్దు లేవే  డబ్బులు దొరకగానే నేనే చెప్తా కొంచం ఓపిక పట్టు అని చెప్పా.
సరిగ్గా ఒక వారం  తరవాత..డబ్బులు అడ్జస్ట్   కాకున్నా ఏదో ఒకలా మేనేజ్ చేసి.. (అమ్మ పోరు పడలేక )
సరే వెళ్దాం పద అని మళ్లీ ఆయనదగ్గరికి వెళ్ళాం.
ఇందాక చెప్పినట్టు హారతి, తీర్థం  అయిపోయాక అయన ఇచ్చిన  చీటీ చూపించి డబ్బులు ఇవ్వబోయాం .. దానికి ఆయన  పూజ ఐపోయాక అన్నట్టు చెప్పాడు.
రోజు ఉదయం 6   కల్లా  వొచ్చి తీర్థం తెసుకొని వెళ్ళండి అని చెప్పాడు..
మొదటి రోజు నా పేరు మీద సంకల్పం  చేసాడు.. రెండో రోజు జస్ట్  తీర్థం  తెసుకొని  వోచ్చేసాం .మూడో రోజు మాత్రం.. హోమగుండం లో పూజ, నాలాగే ఒక 8 మంది దాకా, .. నెయ్యి , నువ్వులు అగ్నికి ఆహుతి చేసాం .    తర్వాత  తీర్థం ప్రసాదం... డబ్బు సమర్పిచుకున్నాం.
నాకు మహా చెడ్డ చిరాకుగా  ఉంది..డబ్బు  పోయినందుకేమో..??? 
కాని  next day  ఎం జరిగిందంటే..

11 గం  కి ఏదో పనిమీద బయటికి వెళ్లి వొచ్చా. చేసే పని లేక, అలా కల్లుముసుకొని పడుకున్నా.. నిద్ర పట్టేసింది ఘాడంగా.. అ మత్తులోనే ఓ సారి లేచి బయటికి చూసా ..అంతా  సవ్యంగానే  ఉంది ..నిశబ్ధంగా ..
మళ్లీ ఒచ్చి ఇంకో కునుకేసా.. ౩ pm దాకా ..తరవాత ఇంక ఆకలికి ఆగలేక నిద్రపట్టక లేచా. బయట నా బైక్ లేదు. 
 అర్థం కాలేదు.. అసలు ఈ రోజు డేట్ ఎంత?  నేను ఎక్కడున్నా? బయటికి వెళ్ళానా  లేదా ?  బైక్ ఎక్కడ పార్క్ చేశా ? ..ఇలా ఒక్క సారి ఆరోజు చేసిన పనులని రీల్ వేసుకుంటే అప్పుడర్థమైంది.. బైక్ ఎవడో కొట్టేసాడని.
వెంటనే తేరుకొని.. కంట్రోల్ రూం కి ఫోన్  చేస్తే, నల్లకుంట PS   కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమని అన్నారు. ఆలస్యం చేయకుండా ఆటోలో వెళ్ళా  , అక్కడ గేటు ముందున్న  పోలీసు దగ్గరినుండి నుండి.. ఎదురైన ప్రతివాళ్ళు
"ఏమైంది.. ఎక్కడ.. ఎక్కడ పెట్టావు, లాక్ చేయలేదా.. ఎంత సేపైంది.. మీకు careless ఎక్కువ " అని లక్ష ప్రశ్నలు వేసి  చివరికి తేల్చింది ఏంటంటే ..నా అడ్రస్  వేరే PS   పరిథి లోకి వొస్తుంది అని.. అక్కడి నుండి వేరే స్టేషన్ కి పరుగు లంకించుకొని మళ్లీ ఎదురైన  ప్రతివాళ్ళకి వివరాలు ఇచ్చి అందరి తో తిట్లు తిని చివరికి  కంప్లైంట్ తీసుకునే  అతనికి  చెప్తే..  నెంబర్, నేమ్  రాసుకొని..  "ఆ దొరికితే ఇస్తాం, అప్పుడప్పుడు వొచ్చి  కలుస్తూ ఉండు" కూల్ గా చెప్పాడు
ఈ  ఏప్రిల్  22  వొస్తే రెండు వసంతాలు నిండుతాయి .

ఇదీ   స్వాములోరి   పూజమహిమ..

No comments: