Mar 4, 2011

నా రాతలు

 
నా రాతలు.. ఎలా ఉంటాయో నాకు తెలుసు..
ఏది లోతుగా ఉండదు.. స్పష్టతా ఉండదు.. అప్పుడే కలిసిన వ్యక్తులతో హాయ్.హౌ రు అని పొడి పొడి గా మాట్లాడినట్టు..ఉంటాయి. 
కాని అ పొడి మాటల్లోనే కొంచం తడి తగులుతుంది..
విషయం  అర్థం చేయించే  ప్రయత్నమూ ఉంటుంది.
అప్పుడే మొదలవుతుంది..అంతలోనే అర్ధాంతరంగా అయిపోతుంది.  
నిష్టూరమే అయినా ఉన్న మాట చెప్పేస్తుంది.గుండె బద్దలు కొట్టేస్తుంది
జీవితం ఎప్పుడూ  ఏదో మూలసూత్రాల ఆధారంగా నడుస్తుందని నా అభిప్రాయం. అ సూత్రాలేవో కనున్నోవాలని నా ప్రయత్నం. కనుక్కొని చేసేదేమీ లేకున్నా.
ఎందుకంటే...సూత్రం తెలిసినా  తెలియకున్నా ... జీవితం గడుస్తుంటుంది..  కాని సూత్రం తెలిస్తే అదో ఆనందం....గుండె నిబ్బరం.

2 comments:

జ్యోతిర్మయి said...

మీ రాతలు లోతుగా, స్పష్టంగా ఉన్నాయ్. చదువుతుంటే తడి తగులుతూ ఉంది అర్ధం అయ్యాక రక్తానికి బదులుగా శరీరంలో చైతన్యం ప్రవహిస్తూ వుంది. మీ బ్లాగు ఓ అధ్బుతం. తీరిగా పూర్తిగా చదువుతాను. నేటి యువతరం స్త్రీ గురించి ఇంత బాగా ఆలోచిస్తారా? అన్న అనుమానం ఉండేది. మీ బ్లాగ్ చూసాక తీరిపోయింది.

chakri said...

జ్యోతిర్మయి గారూ..ధన్యోస్మి. :)