Feb 23, 2010
నాలో నేను.
నాలో నేను.... ఇది నా మనసులో జరిగే ఆలోచనలు, ఆనందాలు, బాధలు, భయాలు, ఆందోళనలు, అల్లకల్లోలాలు,.సమాజం-నా అబిప్రాయాలు. కల్పిత కథలు, నిజ జీవితానికి కల్పన జోడించిన విషయాలు, వీటికి సంబందించిన పోస్టింగ్స్ వుంటాయి.
ఈ బ్లాగ్ ప్రారంభించాతానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే " రచన చేయటం నేర్చుకోడం కోసం"
అంతే తప్ప ఎవరిని ఉద్దేశ పూర్వకంగా ఇక్కడ ప్రస్తావించే ప్రసక్తి లేనే లేదు. దయ చేసి తమకి అన్వయిన్చుకోవోద్దని మనవి.
- చక్రధర్ రావు
Feb 21, 2010
మీరెన్ని వేషాలు వేసినా
వైకుంటం .. పాలసముద్రం చల్లగా ఉంది.. ఆ సముద్రం లో ఒక పెద్ద 10 తలల ఆది శేషుడు..
శ్రీ మహా విష్ణువు ఆది శేషుడి మీద పడుకుని ఒక కునుకు తీస్తునాడు.
లక్ష్మి దేవి ఆవలిస్తూ కాళ్ళు వత్తుతూ ఉంది.
దేవీ .. కొంచం గట్టిగ నొక్కు..ముల్లోకాలు తిరిగి నొప్పిగా ఉన్నాయి..ఏమండీ, నాకో చిన్న డౌట్.. మీరెన్ని దొంగ వేషాలు వేసినా I mean "అవతారాలు" వేసినా ..లోకం లో అన్యాయం ఆగటం లేదుకదండీ.. దోచేవాడు దోచేస్తూనే ఉన్నాడు, లేని వాడు నిత్యం చస్తూనే ఉన్నాడు. చూడబోతే మీరేమి "ఆక్షన్" తీసుకుంటున్నట్టు లేదు.
దేవీ .. సకలలోక పాలకుండ.. శేష తల్పుండ.. విశేష నామ దేయుండా... విష్ణు దేవుండ..
తోక్కేం కాదు.. అడిగింది చెప్పండి అంటే..మిమల్ని మీరు పొగుడు కుంటారేంటి ...తెలుగు సినిమా హీరోల్లాగా.
అంతకంటే చేయటనికేముంది దేవీ .. అడుగు ఏం చేయలేదో..
ఆ కుంభకోణం చేసిన మంత్రి గారిని ఏం చేసారు అంటా ?? కనీసం ఏదైనా శిక్ష వేసారా ?
అయ్యో దేవీ .. తెలిదా, అతను తిరపతి లో నాకు కిలో బంగారం ఇచ్చాడు..
అవునా (నాకు కనీసం వజ్రపుటుంగరం కూడా లేదాయే) పోనీ.. మరి ఆ ఖనిజం స్కాం సూత్రధారి ?? అతని సంగతేంటి ??
అతనా.. అతను నా గుడి కట్టటానికి పెద్ద మొత్తం లో చందా ఇచ్చాడు.
మరి...మరి..అని లక్ష్మి దేవి..ఆలోచిస్తుంటే..
చూడు దేవి.. ప్రతి వాడు ఎంతో కొంత ఇస్తూనే ఉన్నాడు..
ఇవ్వలేక పోయిన వాడికి నేను ఏదో ఒక కీడు చేస్తూనే ఉన్నా,ఇంకేం కావలి..
అది కాగ మనుషులు తెలివి మీరి పోయారు. బొత్తిగా పాప భీతి లేకుండా పోయింది, మహా అంటే పోతాం, పొతే పోయింది వెధవ జీవితం, ఉన్నన్నాళ్ళు అప్పో సప్పో.. మోసమో, దగానో ఏదోటి చేసి సుఖం అనుభవిస్తే చాలనుకొంటున్నారు, ఎంతటి ఘోరానికైన తెగిస్తున్నారు.
ఎక్కువగా మాట్లాడితే నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అని పురాణాలు, భారత, భాగవతలో నేను చేసిన ఘన కార్యాలని ఏకరువు పెడుతున్నారు. నా వీక్ పాయింట్ తెలుసుకున్నారు, నా మోహన డబ్బు, నగా కొడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ?
అయినా దేవీ .. నీ కెందుకు ఇవన్నీ .. హాపీ గా కాళ్ళు పట్టక.. మగని సేవ కంటే మగువ కి కావలసినదేముంది కనక ??
మగని సేవట, మీరేదో సామాన్య జనాలని ఉద్దరిస్తున్నారేమో, నేను మీ సేవ చేస్తే పుణ్యం కలిసొస్తుందని అనుకుంటున్నా...మీరు కూడా లంచాలకి మరిగి.. కుపరిపాలన చేస్తుంటే మీకు సేవ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. దేవీ.. అంత కంటే ఏం చేయగలవు దేవి.. హ్యాపీ గా నా సేవలో తరించు..
బ్రతికుంటే.. కాల్ సెంటర్ లో పనిచేసిన బ్రతుకుతా కాని మీ కాళ్ళు పట్టను..
అయ్యో దేవీ ... వెళ్తున్నావా..
(ఇదంతా ఓరకంట గమనిస్తున్న బ్రహ్మ దేవుడు ముసిముసి గా నవ్వుకుంటూ తన పని తాను చేసుకుంటున్నాడు)
Feb 20, 2010
ఎండాకాలం వోచ్చేస్తోందోచ్
మా ఇంటి ముందు కాలనీ రోడ్డంతా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి.. ఎంటబ్బా , ఏమైంది ? ఇంత చెత్త ఎక్కడిది రోడ్డు మీద అనుకున్నా ..కొంచం తల ఎత్తు చూద్దును కదా..కానుగ చెట్లన్నిసగం బోసి పోయి కనిపించాయి.. అప్పుడు స్పురించింది.. ఎండాకాలం వోచ్చేస్తోందోచ్ ... చాలామందికి ఎండాకాలం అంటే చిరాకు ..నాకు మాత్రం ఎండాకాలం అంటే ఇష్టం,
చిన్నపుడు సెలవులు ఇస్తారని కాబోలు..కాని చెట్లకి ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళు తోడిగేది, తెల్లని చిన్ని మల్లె పూలలో అద్భుతమైన పరిమళాన్ని నింపేది , నల్లని కోకిలమ్మ గొంతులో తేనే రాగలు పలికించేది, మావిళ్ళకి పూత పూయించి ,కాయలు కాయించి మధురమైన రుచిని మనకి పంచేది ఈ కాలమేగా.
నాకు చిన్నపుడు ఎండాకాలం బాగా గుర్తు. ఒంటి పూట బడి మూలంగా ఉదయం 7గంటలకల్లా హాయిగా చన్నీళ్ళతో స్నానం చేసి స్చూలికి పరిగెత్తే వాణ్ని. మా స్కూల్ ఆవరణలో మల్లె , గులాబీ మొక్కలు పుష్కలంగా ఉండేవి..గుమ్మలోనే మల్లెల వాసనా, గులాబీ రంగూ పలకరించేవి. గుండెనిండా ఆ పరిమళం నిండిపోయేది. ముందు బెంచిలో కూర్చొని.. మల్లెలకి అంత తెల్లదనం. అ పరిమళం ఎలా వొచ్చిందా అని ఒకటే ఆలోచన. మధ్యాన్నం కాగానే కొంత మంది పిల్లలని పిలిచి ఆ మొగ్గలు కోయించి అమ్మేవాళ్ళు. పావలాకి 25. కోయటానికి నేను ముందు ఉండేవాడిని.. మెల్లిగా ఎవరికీ తెలీకుండా ఓ నాలుగు మొగ్గలు జేబులో వేసుకొనే వాడిని ఆ పరిమళం కోసం.
ఇక ఒంటి పూట బడి వదలగానే గంగాపురం రోడ్డు వైపు పరుగు.. ఎందుకంటే అ రోడ్డుకి పక్కనే గా మామిడి చెట్లు ఉండేది. మామిడి పూలు పిందెలుగా మారటం చూసేవాళ్ళం .ఆ బుల్లి మామిడి పిందెల కోసం ఆరాటం , వాటిని ముక్కలు కోసి ఉప్పులో అద్దుకొని తినేవాళ్ళం.
ఎండ ఎక్కువ ఉందని బయట తిరగానిచ్చే వాళ్ళు కాదు నాలుగు గంటల దాక. అప్పుడు ఏ పుచ్చాకాయో .. కర్బుజ పండో.. నిమ్మకాయి షర్బత్తో తాగి.. ఆటలకి పరుగు. ఇసికలో పోద్దుగుంకే దాక ఆడి .. ఇల్లు చేరటం.
రాత్రి డాబా మీద వెన్నెల వెలుగులో..చుక్కల దుప్పటి కప్పుకొని తెలిసి తెలియని ఆలోచనలోంచి నిద్రలోకి.
చల్లని చిరుగాలి.. కోకిలమ్మ సుప్రభాతం తో ఉషోదయం, మళ్లీ ఓ కొత్త రోజు.. అదే సెలవు రోజైతే చిరుగాలి జోలపాట, కోకిలమ్మ లాలి పాట అయ్యేవి.
Subscribe to:
Posts (Atom)


