Feb 20, 2010

ఎండాకాలం వోచ్చేస్తోందోచ్


మా ఇంటి ముందు కాలనీ రోడ్డంతా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి.. ఎంటబ్బా , ఏమైంది ?  ఇంత చెత్త ఎక్కడిది రోడ్డు మీద అనుకున్నా ..కొంచం తల ఎత్తు చూద్దును కదా..కానుగ  చెట్లన్నిసగం బోసి పోయి కనిపించాయి.. అప్పుడు స్పురించింది..  ఎండాకాలం వోచ్చేస్తోందోచ్ ...  చాలామందికి  ఎండాకాలం అంటే చిరాకు ..నాకు మాత్రం ఎండాకాలం అంటే ఇష్టం,
చిన్నపుడు సెలవులు ఇస్తారని కాబోలు..కాని
చెట్లకి ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళు తోడిగేది,  తెల్లని చిన్ని మల్లె పూలలో అద్భుతమైన పరిమళాన్ని నింపేది ,  నల్లని  కోకిలమ్మ గొంతులో తేనే రాగలు పలికించేది,  మావిళ్ళకి పూత పూయించి ,కాయలు కాయించి మధురమైన రుచిని మనకి పంచేది ఈ కాలమేగా. 
నాకు చిన్నపుడు ఎండాకాలం బాగా గుర్తు. ఒంటి పూట బడి మూలంగా ఉదయం 7గంటలకల్లా హాయిగా చన్నీళ్ళతో స్నానం చేసి స్చూలికి పరిగెత్తే వాణ్ని. మా స్కూల్ ఆవరణలో మల్లె , గులాబీ మొక్కలు  పుష్కలంగా   ఉండేవి..గుమ్మలోనే  మల్లెల  వాసనా, గులాబీ రంగూ పలకరించేవి. గుండెనిండా ఆ పరిమళం నిండిపోయేది. ముందు బెంచిలో కూర్చొని.. మల్లెలకి అంత తెల్లదనం. అ పరిమళం ఎలా వొచ్చిందా  అని ఒకటే ఆలోచన. మధ్యాన్నం కాగానే కొంత మంది పిల్లలని  పిలిచి ఆ మొగ్గలు కోయించి  అమ్మేవాళ్ళు. పావలాకి 25.  కోయటానికి  నేను ముందు ఉండేవాడిని.. మెల్లిగా ఎవరికీ తెలీకుండా ఓ నాలుగు మొగ్గలు జేబులో వేసుకొనే వాడిని ఆ పరిమళం కోసం.
ఇక ఒంటి పూట బడి వదలగానే గంగాపురం రోడ్డు వైపు పరుగు.. ఎందుకంటే అ రోడ్డుకి పక్కనే గా మామిడి చెట్లు ఉండేది. మామిడి పూలు పిందెలుగా మారటం చూసేవాళ్ళం .ఆ బుల్లి మామిడి పిందెల కోసం  ఆరాటం , వాటిని ముక్కలు కోసి ఉప్పులో అద్దుకొని  తినేవాళ్ళం.
ఎండ  ఎక్కువ ఉందని బయట తిరగానిచ్చే వాళ్ళు కాదు నాలుగు గంటల దాక. అప్పుడు ఏ పుచ్చాకాయో .. కర్బుజ పండో.. నిమ్మకాయి షర్బత్తో  తాగి.. ఆటలకి పరుగు. ఇసికలో పోద్దుగుంకే  దాక ఆడి .. ఇల్లు చేరటం.

రాత్రి డాబా మీద వెన్నెల వెలుగులో..చుక్కల దుప్పటి కప్పుకొని తెలిసి తెలియని ఆలోచనలోంచి నిద్రలోకి.
చల్లని చిరుగాలి.. కోకిలమ్మ సుప్రభాతం తో ఉషోదయం, మళ్లీ ఓ కొత్త రోజు.. అదే సెలవు  రోజైతే  చిరుగాలి జోలపాట,  కోకిలమ్మ లాలి పాట అయ్యేవి.

2 comments:

Sri said...

beautiful, konni lines lone vesavikalam, adhi thecche chinni chinni anandhaalanu simple words lo baga rasaru. nijame kadha, summers thecche santosham aa chinni gnyapakaalu anantham...
mamidi, nimmarasam, mallepulu, challani vennela, ila anni kalipina vesavi selavalu and many more.. endhulonaina nijam nippulantidhemo kaani ee vishayam lo matram nijam sweet lantidhi kadhu kadhu sweetae! chala baga rasaru. photo inka bagundhi. palle atmosphere ni live ga chupincharu, short n simple. thanks, keep it up

aravind Joshua said...
This comment has been removed by the author.