Mar 16, 2012

కేరళ ప్రయాణం - 4


ప్రేమ్ గారిచ్చిన ఆహార పొట్లాలు
తింటూ..హైయిగా పాలక్కాడ్ చేరుకున్నాం.
సరాసరి 'జోబీ మాల్' వేన్యు కి వెళ్ళిపోయి ఎడారివర్షం స్క్రీనింగ్ ఎప్పుడు ఏమిటి అనేది కనుక్కున్నాం. జయ్ అనే కుర్రాడు మమల్ని receive చేసుకుని నడిచి వెళ్ళేంత దూరంలో ఉన్న ఒక హోటల్ చూపించాడు.పాలక్కాడ్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చల్లగా స్నానం చేసేసరికి హాయిగా అనిపించింది.
ఒక్క పదినిముషాలు రిలాక్ష్ అయ్యాక మళ్ళీ
జోబీ మాల్ చేరుకున్నాం.
రిసెప్షన్ దగ్గర ఇద్దరమ్మాయిలు ఉన్నారు. వచ్చిన గెస్ట్ లకి id కార్డ్స్ తయారుచేసి ఇస్తున్నారు. మొహంలో కేరళ కళ ఉట్టి పడుతోంది.
ఒకమ్మాయి సన్నగా ఉంది, గంధం రంగు చీర కట్టింది, సంప్రదాయంతో ఆకట్టు కొంటోంది. ఇహ రెండో అమ్మాయి దీనికి విరుద్దంగా ప్యాంటు,టీ షర్టు వేసింది. జుట్ట్టు విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే విధంగా .. ఆ మాటకొస్తే కేరళలో అమ్మాయిల జుట్టు బావుంటుంది. ఒత్తుగా నల్లగా. కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.చీరకట్టిన పిల్ల నన్ను పట్టించుకోలేదు కాని...ఈ రెండో పిల్ల మాత్రం నన్ను చూసింది. ఓ మత్తు నన్ను గమ్మత్తుగా పలకరించింది.
ఏం చూపది..వెంటాడే చూపు. వేటాడే చూపు ..ఓ ఆడపిల్ల చూపు. కళ్ళలోకి సూటిగా చూస్తే నా గుండెలోతుల్లోకి తాకింది.నేను
చూపు తిప్పుకోవలసి వచ్చింది తప్ప ఆపిల్ల ఆలా చూస్తోంది పట్టి పట్టి. దొరికితే కళ్ళు కలిపెస్తోంది.
చూద్దాం ఎంతసేపో ఇది అనుకున్నా..ఈ  లోపు మా ID కార్డ్లు రెడీ అయ్యాయి. తీసుకొని హాల్లోకి వెళ్లాం సినిమా చుట్టానికి.
ఓ రెండు సినిమాలు చూసాక ఆకలేసింది .. బయటికివెల్లి భోజనం చేసి వచ్చాము. మళ్ళీ సినిమాలు.. అలా సాయంత్రం ఎదిన్తివరకు చూసి రూం కి చేరుకున్నాం. కొద్ది సేపు రెస్ట్ తీసుకున్నాక చల్లగా ఏదయినా తాగితే బావుండు అనిపించింది. ఆలోచన రావటమే ఆలస్యం..... `వెళ్ళిపోయాం.:)

తెల్లారి పది గంటల కల్లా తయ్యారయ్యి వెళ్ళాము. నన్ను చూసిన పిల్ల చుడీదార్ లో దర్శనం ఇచ్చింది. నన్ను పెద్దగా పట్టించుకోలేదు. విచిత్రం కాకపోతే నిన్న అంత ఇదిగా చుసియన్ పిల్ల ఈ రోజు పట్టించుకోవటం లేదు. ఆడవాళ్లు అంతే.. తమకేం కావాలో తెలిదు. పెద్ద confused minds.
ఇది  నాకు చాల మామూలే కనక  ఏమీ అనిపించలేదు. లంచ్ కి ముందు రెండు సినిమాలు తరవాత రెండు సినిమాలు.. సాయంత్రం చల్లదనం.. అంతే. అలా మూడురోజులు గడిచింది.
నాలుగో రోజు మొదటి షార్ట్ ఫిలిం చూసాక.. పాలక్కాడ్ కోటకి వెళ్లాం. చుట్టూ కందకం. ఎత్తయిన బురుజులు .. విశాలంగా ఉంది . కోట గోడలు మాత్రం ఎత్తుగా రాతి కట్టడం .ప్రధాన ద్వారం  పదిహేను అడుగుల ఎత్తు పన్నెండడుగుల వెడల్పుతో బలిష్టంగా ఉంది. దాటుకొని లోపలి వెళితే  లోపల కోట మాత్రం  కోట లా లేదు . ఓ పెద్ద ఇల్లు,  కేరళ స్టైల్ లో ఉంది.
కోటగోడకి అనుకొని రెండు ఫోటోలు తీసుకున్నాక  .. ఇహ నా వల్ల కాదు మీరెళ్ళి చూసి రండి అని ఓ చెట్టు కింద సెటిల్ అయ్యి  పేస్ బుక్కు ఓపెన్ చేసాడు మహేష్.  నేను, మోహన్ అలా చుట్టూ తిరిగి వచ్చేసాం. అక్కడి నుండి సరాసరి డ్యాం కి వెళ్ళాము. అక్కడ చూడటానికి ఏమీ కొత్తగా అనిపించలేదు. జనాలు, వాళ్ళ బాష తప్ప.
మళ్ళీ వెనక్కి hyderabad  ప్రయాణం. మూడున్నరకి ట్రైన్. మూడింటికి స్టేషన్ చేరుకొని గొప్ప జ్ఞాపకాలేమి సంపాదించుకోకుండానే వెనుదిరిగాను.
మా ఎదురగా ఒక ప్రేమ జంట..తినిపించు కుంటున్నారు. . తిట్టుకుంటున్నారు,..కొట్టుకుంటున్నారు... కొరుక్కుంటున్నారు. మైదానం రాజేశ్వరి ..అమీర్ జంట గుర్తొచ్చారు నాకు . వాళ్ళని చూస్తూ సమయం గడిచింది. తొమ్మిదింటికి వెళ్ళు దిగిపోయారు. ఏదో పనిమీద మోహన్ తిరపతిలో దిగుతాను అన్నాడు. మహేష్ కూడా ఇంటికి వెళ్లి వస్తా నేను అక్కడే దిగుతా అన్నాడు.ఏదో ఆలోచనల్లో తిరపతి రానే వచ్చింది. ఇద్దరు దిగిపోయారు. వాళ్ళని సాగనంపి నేను పై బెర్త్ ఎక్కి కళ్ళు మూసుకున్నాను. ఇంతలో ఓ రెండు జంటలు ఎక్కారు.
బెర్తులు conform కానట్టుంది . ఆందోళనగా ఉన్నారు. ఈ రెండు బెర్తులు మీరు తీసుకోవచ్చు. హైదరాబాద్ దాక రావలసిన మా ఇద్దరు మిత్రులు అవసరమై   ఇక్కడ దిగిపోయారు. అని చెప్పగానే థాంక్ యు సర్.. థాంక్ యు అని టెన్షన్ release అయ్యి ఆనందగా ఫీల్ అయ్యారు. వాళ్ళు. ఇంకో జంటకి వేరే చోట దొరికింది.

అందరూ నిద్ర పోతున్నారు. చీకటిని చీల్చుకుంటూ రైలు పరిగెత్తుతోంది , పెద్ద శబ్దంతో. కళ్ళు మూసుకుంటే రైలు శబ్దం ..తెరిస్తే చూపు రైలు పైకప్పు.
నా చూపు పైకప్పుకి  తాకి వెనక్కి వస్తోంది. అక్కడ చూడటానికి ఏమీ లేకపోవటం తో  తలనెప్పి అనిపిస్తోంది.   ఏదో చిన్న పెట్టెలో బంధించినట్టు అనిపించింది. ఏదో అన్ఈజీ నెస్ . పోనీ ఆలోచనల్లో మరిచిపోదాం అంటే ఒక్క విషయం కూడా తట్టటం లేదు. లేచి కూర్చునే వీలు లేదు. పడుకుంటే నిద్రా రావటం లేదు. ఆ పరిస్థితి నాకు నరకంగా తోచింది.చావంటే అదే నేమో. శరీరాన్ని కదిలించలేక .. కళ్ళు తెరవలేక...ఉపిరి తీసుకోక అచేతనంగా పడిఉండటమే చావేమో.
శరీరం లోంచి బయట పడిన ఆత్మ మళ్ళీ శరీరంలోకి వెళ్ళలేక ఎంత వేదన పడుతుందో అనిపించింది.
చచ్చాక కూడా బాధ ఉంటుందని...నిజానికి బతికి ఉన్నప్పటికంటే చచ్చాకే బాదేక్కువని అనిపించింది.

ఈ   ఆలోచనల్లో ప్రయాణం తెలియటంలేదు.
మనిషి ఏదో ఒక ఆలోచనల్లో మునిగి పోవటమే సుఖం అంటే . ఆలోచనల్లేక..ఆలోచించటానికి ఏమీ లేకపోతే ఆది నరకం.
నేను చావు గురించిన ఆలోచనలో పడ్డాను. నాలుగు నాళ్లలో చచ్చి బూడిద అయిపోయే మనిషి హాయిగా అనుభవించక ఎన్ని sentiments ? .. ఎన్ని బాధలు..ఎంత వేదన ??
ఎన్ని వేషాలు ?? ఎన్ని బేషజాలు ? ఎంత నటన ? ఎంత గర్వం ? ఎంత గొప్ప ?

చావంటే..??  ప్రపంచం అంతా ఉంటుంది, మనం తప్ప. చచ్చేముందు మనకి మన జీవితం అంతా గుర్తోస్తుందేమో. స్వర్గ,నరకాలు ఉన్నాయా. వైతరణీ నది దాటాల్సిన్దేనా ?? ఛీ.. చీము నెత్తురు పారే ఎట్లో ఎలా ఈదాలి ?? ? మరీ అంత అసహ్యంగా ఎందుకుండాలి అది ??
  దేవుడు ఎంత  శాడిస్ట్ కాకపోతే మానని పుట్టించి.. మాయలో పడేసి చంపి శిక్షించి  ఏం బావుకుంటాడు ?

..................... నిద్ర పట్టేసింది.

3 comments:

జ్యోతిర్మయి said...

కళ్యాణ్ గారూ ఆలోచనలేమీ రాకపోతే చావు గురించి అలోచించి నిద్రపోయారా..మీకు ఏమికలలు వచ్చి ఉంటాయా అని ఆలోచిస్తున్నాను...

కొంచెం వార్డ్ వేరిఫికషణ్ తీసేయ్యరూ..వ్యాఖ్య పెట్టడానికి సులువుగా ఉంటుంది.

chakri said...

జ్యోతిర్మయి గారు.. నాపేరు కళ్యాన్ కాదు. చక్రధర్ ..చక్రి :)
word verification ఎలా తెసేయ్యాలో కాస్త చెపితే అలాగే తీసేస్తా .

జ్యోతిర్మయి said...

చక్రధర్ గారూ సారీ అండి. మీపేరెందుకో కళ్యాణ్ అని గుర్తుపెట్టుకున్నాను, ఇదేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి.

Go to 'Dashboard'.
Then click 'Settings'.
Then click 'Comments'.
Three up from the bottom click NO next to "Show word verification for comments?".
Then click Save Settings at the very bottom.