Mar 11, 2012

కేరళ ప్రయాణం - 2



 ఎర్రగా నవ్వ్తుతున్న మిరప చేలు...దూరంగా కొండలు.. పొలం కూలీలు... చల్లని గాలి అన్నీ చూస్తుంటే.. ప్రపంచం విశాలత్వం కనపడి మనసుకి హాయిగా అనిపించింది. ప్రపంచం ఇంత అందంగా ఉంది , కాని రోజువారీ జీవితంలో పడి ఆ అందాన్ని,ఆనందాన్ని అందుకోలేక పోతున్నమేమో!! అలా కిటికీ లోంచి చూస్తూ ఉంటే గతంలోకి జారిపోవటమో...భవిష్యత్తులో తెలిపోవటమో రెండింట్లో ఏదో ఒకటి జరగటం సహజం ప్రయాణాల్లో.
ట్రైన్ ఏదో పెద్ద స్టేషన్ లో ఆగింది.అప్పుడు జ్ఞాపకాలని వదిలిపెట్టి లేచాను. మోహన్ గారు కూడా పుస్తకాన్ని మూసేసి నావైపు చూసాడు. ఇద్దరం ఆ ఆమ్మయిలవైపు చూసాం. ఉహు ఏమాత్రం చలనం లేదు. ఒక్క చిన్ని చూపు కూడా మావైపు విసరటం లేదు. నాలాగే  బయటకి చూస్తూ ,..తమ తమ జ్ఞాపకాలు నేమరేసుకున్తున్నరేమో. ఇవి పడే రకాలు కాదు అని అనిపించింది. ఆశ వదిలేశా.. ;) . మహేష్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు .
నేను మోహన్ రైలు దిగాం. అటు ఇటు తిరిగితే ఓ ఫాస్ట్ ఫుడ్ ముందు జనం గుమి గుడారు, చూద్దాం అని వెళ్తే వేడి ఇడ్లి..దోష ..
వాటిని చూడగానే ఆకలేసింది. చెరో ప్లేట్ చేత్తో పట్టుకొని ఆవురావురు మంటూ లాగించాం . ఓ దోస పార్సిల్ కట్టించండి నేను మంచినీళ్ళ బాటిల్  తెస్తా అని వెళ్ళాను. 

ట్రైన్ మెల్లిగా కదిలింది.  లోపలి వెళ్ళగానే మహేష్ నిద్రలేచి పైబెర్త్ నుంచి కిందికి దిగాడు. "జీవితంలూ అన్నీ కోల్పోయిన వాళ్ళు దురదృష్టవంతులు.. ఏం కోల్పోయామో తెలుసుకోలేనివాళ్ళు శాపగ్రస్తులు " అని ఎడారి వర్షం కోసం రాసాడు, కాని ఈయన మాత్రం అదృష్ట వంతుడు. లేకపోతే ఏంటది.. నిద్రలేవగానే 'దోస' రెడీ కదా..!!

 
దిక్కులు చూస్తూ మాటల్లో పడ్డాం.  సూర్యాస్తమయం అవుతోంది. నేను అమ్మాయిల వైపు కిటికీ చూసాను. ఆకాశం బంగారు రంగులో మెరుస్తోంది,  సూర్యుడు నారింజ పండులా ఎర్ర బడ్డాడు. చూడు బ్యూటీ అంటే అదీ అని నేను అటువైపు చూపించాను. అప్పుడు ఏంటి అమ్మాయా, మీరు నిజంగా కళాకారులు సర్.. అన్నాడు మోహన్. బాబూ  నేను మాట్లాడేది 'సన్ సెట్' గురించి. మీరేదో అనుకుంటున్నారు అన్నాను. కాదండీ దానికంటే 'అందం' కనపడుతోంటే sunset ఎవరు చూస్తారు అని నవ్వాడు.
అందరం నవ్వుకున్నాం. రైలు సాగిపోతోంది వడి వడిగా ...
                                       *****

రాత్రి ఎనమిదిన్నర అయ్యింది. పొద్దున్న తెచ్చిన వెజ్ బిర్యాని అలాగే ఉంది. అదే తిని పడుకుందాం  ఓ పనైపోతుంది అని మహేష్ పొట్లం విప్పాడు.  ఇంట్లో ఎన్నింటికి తిన్నా,... ట్రైన్ లో మాత్రం సరిగ్గా సమయానికి తింటాం. ఒకరిని చూసి ఒకరు తినటం మొదలు పెడతారు. :) . మేము మొదలు పెట్టగానే మా పక్కనున్న ఆయన తన పొట్లం విప్పాడు.. ఆది చూసి మిగతావాళ్ళు .
  మిగిలి పోయిన బాటరీ ని ఖతం చేద్దామని laptops తీసాడు మహేష్ . మోహన్ నా laptop   తీసుకున్నాడు. నేను పై బెర్త్ మీదకేల్లిపోయి 'జీవితాదర్శం' కొనసాగించాను.

No comments: