Nov 28, 2011

విశ్వ రూపం

 
ఏ శనివారమో, భార్యామణి బాగా తయ్యారయ్యి బండి వెనకాల కూర్చుంటే ఓ గుడికి వెళ్లి , విగ్రహానికి నమస్కారం పెట్టి .. ఓ కొబ్బరి కాయో, హరతో ఇచ్చి , తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికొచ్చి వీక్ ఎండ్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి మతం మస్తుగానే ఉంటుంది. కాని,......
మెట్టు మెట్టు కడిగి దీపాలు పెట్ట్టేవాళ్ళు, ఏదో నమ్మకంతో గుండు గీయించుకునే మనుషులూ..బాబాలని నమ్మి శీలాలని అర్పించుకునే అతివలు.. మైల అయ్యిందని మంచి నీళ్ళు పారబోసుకొనే బ్రాహ్మణ ఇల్లాళ్ళు.. ఉపవాసలతో ఆరోగ్యం చెడగోట్టుకునే అమ్మలక్కలు ..పెళ్లి కాక గుడి చుట్టూ పోల్లిగింతలు పెట్టె కన్యలు.. తండ్రికి పిండం పెట్టలేక, కర్మకాండలో స్వర్ణ , గోదానం ఇచ్చుకోలేక తండ్రీ అత్మ శాంతించదేమో  అని చింతించే  గృహస్తు...ఇలా కొంప కొంప కీ పోయి చూడండి మతం విశ్వ రూపం కనపడుతుంది.
ఫలానాది చేస్తే ఫలానా అవుతుందని... పాపం తుడిచి పెట్టుకు పోతుందని., ఉత్తమ లోకాలు ప్రప్తిస్తాయని .. ఫలానా చేయకపోతే పుట్టగతులుండవని చెప్పేది హైందవ మతం లోనే. పురాణాలు చదవండి.. స్తోత్రాలు వల్లె వేయండి.మీకే తెలుస్తుంది జనాన్ని ఎంత భయ బ్రాంతులకి గురిచేసారో...
కాషాయం కట్టి ఇల్లు వదిలిన ప్రతివాడు హిందుత్వపు బలి పశువే. పూజలు వ్రతాలూ చేసి దరిద్రుడయిన  ప్రతివాడు బలిపశువే...
జాతకాలు.. నవగ్రహాలు.. ఉంగరాలు అంటూ పెళ్ళాం నగలు తాకట్టు పెట్టిన ప్రతివాడు బలిపశువే.
పాలకి ఏడ్చే పిల్లాడు.. మడితో ఉండి  పాలివ్వలేని ఆ తల్లి ఇద్దరు బలి పశువులే, అప్పు చేసి హోమం/ పూజలు  చేయించే గృహస్తుడు బలి పశువే..దేవుడు దేవుడు అంటూ కొంప కొల్లేరు చేసుకున్న వాళ్ళంతా బలిపశువులే.
మతం పేరుతో ఏం జరిగినా.. ఆది మతానికే చెందుతుంది. దానికి జవాబు దారి మతమే. 
హిందూమతాని ఆహా ఓహో అని చెపుతూ లక్ష విధాల రాయొచ్చు.అదో పెద్ద విషయం కాదు. హిందూ మతం గందరగోళం అన్న మాట వాస్తవం. జనాలు అంతకంటే గందరగోళం లో ఉన్నారనేది వాస్తవం.
ఆత్మ పరీక్ష చేసుకొని సరిదిద్దుకోవలసిన అవసరం.. simplify చేసి ముడత్వాన్ని మట్టుపెట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది.  
హిందూ మతంలో   అర్థవిహీనాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రక్షాళన చేయాలి. అర్థంలేని ఆచారాలు..క్రతువులు అన్ని తొలగి పోవాలి.  వేదాలు.. పురాణాలు..ద్వైతం, అద్వైతం...లక్షల సంఖ్యలో దేవుళ్ళు దేవతలు.. గుళ్ళు గోపురాలు..యజ్ఞాలు ..పూజలు, వ్రతాలు ..అన్ని కలగలిపి  హిందూమతాన్ని పెద్ద గందరగోళం చేసి పెట్టారు. 'సరళీకృతం' చేసి ఆ మతాన్ని కాపాడవలసిన అవసరం ఉంది.
అలా కాక వెనకేసుకోస్తుంటే..జరిగేది, ఒరిగేది ఏమి ఉండదు. లోకంలో అజ్ఞానం  పెచ్చు పెరిగి మతోన్మాదంతో జనాలు చస్తూ బ్రతకటం..లేదా బ్రతుకుతూ చావటం తప్ప.
 

4 comments:

ఎందుకో ? ఏమో ! said...

నిజమే ! మీ దృక్కోణం నేటి కాలం వారు ఇలానే ఆలోచిస్తారని లేదా వారి ఆంతరంగిక ఉద్దేశ్యం సమాజం లో నేడున్న స్థితిగతుల దృష్ట్యా ఇలానే ఉంటుందని మీ వ్యాసం స్పష్టం చేసింది.
మీరు ఇంకా సహనం తోనే రాసారు ఇంకాస్త ఆవేశంతో రాసుంటే భయంకర నిజాలు వెలుగు చూసేవి.
అయితే ఇక్కడ ఒక అంశం ప్రధానంగా గమనించాల్సి ఉన్నది,
ఇక్కడ దోషం మతానిది కాదు మత ప్రవక్తలది కాదు,
వ్యవస్థది, మొన్న ఈ మధ్యన మా పక్కింది వాళ్ళ పాప (2 సం||లు ) నాతో పటు గుడికి తీసుకెళ్ళాను, గంట అంటే ఏమిటో ఆపాపకు తెలియదు బహుశా వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు చుపలేదేమో గతం లో అనుకున్నాను, తర్వాత ప్రదక్షణ చేసే time లో పక్కనా సిదిలావస్థ లో నున్న సాయిబాబా ఫొటోస్ చూసి బాబా బాబా అంటూ చేయి వదలి అటు వెళ్ళ సాగింది.
అయితే వాళ్ళ parents ఆమెకి బాబాని చుపించినట్లున్నారు సాయిరాం అంటూ గుర్తుపట్టా సాగింది ఆ ప్రదోష వేళ మసక చీకటిలో కూడా !!

కాని హిందూ మతం ఒక్కటే కాదు ఏ మతానికి కూడా ఆమతం లో ఆ ధర్మంలో వారు అనుసరిస్తున్న విధులకు సంప్రదాయాలకు అంతరార్థం తెలియదు,
తెలిపే వారుకూడా ఒక వత్తి తో వెలిగించాలా? రెండు వత్తులు వెలిగించాల?
ఇలా యథార్థం గా దాని (ఆ క్రియ or క్రతువు యొక్క) లక్ష్యార్థం మరచి ఏవేవో వివరిస్తున్నారు
కారణం ఏదైతేనేమి మొత్తానికి చేస్తున్న, అనుసరిస్తున్న విధి విధానాల వెనుక దాగి ఉన్న మర్మం అందరికి అందుబాటు లో లేదనేది వాస్తవం

To be Cont...

ఎందుకో ? ఏమో ! said...

ఈ మధ్యనే ఇలాంటి అంశం గురిచిన ప్రస్తావన ఎవరో పుణ్యాత్ములు ఈ బ్లాగ్ లోకం లో తీసుకుని వస్తే నేను నా వాక్కు వినిపించటం జరిగింది comment రూపంలో ...
హిందూ మతం గంధర్వగోళం గా తయారయ్యింది అన్నారు, ఆ గంధర్వగోళం మతం లో లేదు,
మతం మతం గా బాగానే ఉన్నది, మతం అంటే ధర్మం, ఏది ధారణ చేయబడుచున్నదో అది ధర్మం
ఏది ఆచరించ బడుతున్నదో అది ధర్మం గా సంప్రదాయం గా పిలువబడుచున్నది
అయితే కొన్ని సత్ సంప్రదాయాలు కాల క్రమంలో వాటి ఉన్నత స్థితిని కోల్పోయాయి కారణం "వాటిని ఎందుకు ఉద్దేశ్యించి ఏర్పాటు చేసారో మన పెద్దలు" ?
అనే స్పృహ ప్రస్తుత Generation లో లేకపోవటమే.

మనం మతం చాల ఉన్నతమైనదని lecture ఇవ్వటమే కాదు అది సత్యం కూడా !!
అయితే ఏమతమైన ఏ ధర్మమైనా అది ఏ లక్ష్యంతో నిర్దేశించ బదినదో ఆ లక్ష్యంతోనే ఆచరింప బడినట్లైతే సంపూర్ణ సాఫల్యత సిద్ధిస్తుంది
అంతే కాని ఏదో తరతరాలనుండి వస్తుందండీ, మా పెద్దలు చేసారు మేము చేస్తున్నాము అంటే అది అలవాటు (తమోగుణం) అంతే కాని జ్ఞానం అని పించు కోదు.

Anonymous said...

మూడాచారాలు పొవలంటె ఆ పరిస్థితులకు అవకాశం లేని చొట కొంత కాలం నివసించాలి.మురికి లొ ఉంటూ దుర్వాసన వస్తొంది అనుకొవటం మూర్కత్వం

shiva kamesh said...

హిందూ మతంలో మూఢనమ్మకాలు ఉన్న మాట నిజమే కానీ మొత్తం హిందూ ధర్మం waste అనుకోవటం ముమ్మాటికీ తప్పుడు అభిప్రాయం మైల అని నీళ్ళు పారబోసుకునేబ్రాహ్మణఇల్లాళ్ళు మాత్రమే కాదు పనిమనిషి కని చనిపోతే తాగుడుకి అలవాటు పడ్డ ఆమె భర్త దగ్గరి నుండి పసి పిల్లని తీసుకొచ్చి పాలిచ్చి(తనపాలు,చనుపాలు) పెంచిన బ్రాహ్మణ ఇల్లాలు కూడా ఉన్నారు. మీరు చూసేది మాత్రమే నిజం కాదు