Jul 25, 2011

మాట్రిమొనీ కథలు ( కష్టాలు ) - 2

 క్రితం పోస్ట్ లో ఆ కాల్ సెంటర్ అమ్మయితో అంత ఆవేశంగా మాట్లాడటానికి కారణం ఉందండీ. అదేంటంటే... 

ఇంట్లో వాళ్ళ పోరు ఎక్కువైంది"పెళ్లి కోసం" .  నచ్చిన  అమ్మయినైనా వెతుక్కోవాలి లేదా మావాళ్ళు తెచ్చిన సంబంధం అయినా చేసుకోవాలి .  ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఇహ లాభం లేదని ప్రోఫైల్స్  సెర్చ్ చేస్తున్నాను. కులాంతర వివాహం కుదరదు కనక మా కమ్యూనిటీ వాళ్ళని వడబోసి వెతకటం ప్రారంభించా .
 ప్రొఫైల్ ఎలా తగలడ్డాయి అంటే...
సగానికి పైగా ప్రోఫైల్స్ కి ఫొటోలే లేవు. 
ఫోటో పెట్టిన వాళ్ళ మొహం బావుండదు.. సారీ ఇలా అనటానికి ఒక కారణం ఉంది. ఆ ఫోటోలు  పెళ్ళికోసం దిగిన   ఫోటోలు కాకుండా ఫ్రెండ్స్ తో తీసుకున్న ఫోటోలు.. వేరే ఫంక్షన్ లలో తీయించుకున్న ఫోటోలు . చాల వరకు మొబైల్ కెమేరాతో తెసినవి. అవి ఎం బావుంటాయి చెప్పండి ??  ఆ ఫోటోలు చూస్తుంటే చేసుకుంటే చేసుకో. లేకపోతే లేదు.. అన్నట్టు ఉన్నాయి. ఇంకొంత మంది ఓ నాలుగు మెట్లు ఎక్కి,  పక్కన ఎవడో అబ్బాయి ఉన్న ఫోటోలు  కూడా పెట్టారు ? వాడు బాయ్ ఫ్రెండ్ ఆ ..తమ్ముడా. అత్త కొడుకా.. ఎలా తెలిసేది ?  ఎంత  modren girl అయితే  మాత్రం  ఇలాగా  

horoscope  must match  అంటారు కాని వాళ్ళ horoscope   ఉండదు . 
partner preference :  I want a decent person as my life partner..
  వీళ్ళకి కావలసిన దేసెంట్ ఏంటో ఎలా తెలిసేది ?? 
ఇంకిత జ్ఞానం మనుస్కుల్లో బొత్తిగా కొరవడిందని నాకు ఇక్కడే జ్ఞానోదయం  అయ్యింది.
ఇలా వింత వింత ప్రొఫిలెస్ అన్నింటినీ దాటుకొని వెళుతుంటే   ఓ అమ్మాయి కొంచం మన టైపు లా ఉంది అని వివరాల్లోకి వెళ్ళాను,    మా అమ్మాయి  ముప్పై వేలు  సంపాదిస్తోంది .. . మీరో యాభై వేలు  సంపాదిస్తే తప్ప ఈ ప్రొఫైల్ చూసే  అర్హత లేదు అని  ఖరా ఖండిగా చెప్పాడు వాళ్ళ నాన్న . మూసుకొని  మూసేసాను.
అలా నేను వారం రోజుల పైగా.. రోజుకు నాలుగు గంటల చొప్పున.. వందలకి వందలు  ప్రోఫైల్స్  సెర్చ్ చేస్తుంటే   ఓ ప్రొఫైల్  తలుక్కున మెరిసింది. వివరాలు..ఫోటో.. haroscope అన్ని ఉన్నాయి. partner preference కుడా  సరిపోట్టే ఉంది.   అన్ని కలిసినట్టే అనిపించింది.   
" మీ ప్రొఫైల్ నచ్చింది .. మీకు నచ్చితే తెలియజేయండి"   నా ఇంట్రెస్ట్ ని express  చేసాను.
సరిగ్గా వారం తరవాత  "నాకు కుడా  మీ ప్రొఫైల్ నచ్చింది " అన్నట్టు నా ఇంట్రెస్ట్ ని accept  చేసినట్టు మెయిల్ వచ్చింది.
 ఆమె ప్రొఫైల్ ని ఒకటికి రెండు సార్లు చూడటం తో రెండురోజులు గడిచాయి.  మా కజిన్ ని పిలిపించా. వాడికి  జాతకాలూ...లెక్కలు వేయటం లో కొంచం ప్రవేశం ఉంది. నాకు వీటిమీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా  తరవాత  మా వాళ్ళు  పేచీ పెట్టకుండా, అదేదో మనమే చూస్తే .. అందుకే ...
" అన్నీ బానే కలుస్తున్నాయి"  అని మావాడు శుభం పలికాడు.

ఎవరైనా ఒకరికి మెంబెర్ షిప్పు ఉంటె తప్ప ఎదుటి వాళ్ళ ఫోన్ నెంబర్ /ఈ మెయిల్ కనపడదు.  నేను తీసుకోవలా ? లేక వాళ్ళే  తీసుకొని నాకు ఫోన్ చేస్తారా ? అని నేను టెన్షన్ పడుతోంటే ..
 " వాళ్ళ సంగతి వదిలెయ్యి. అమ్మాయి వాళ్ళు. నీలాంటి వాళ్ళు  వందమంది దొరుకుతారు వాళ్లకి .  కాని నీకు దొరకొద్దూ ".. అని మా వాడు చురుక్కు మనిపించాడు.
పచ్చినిజం వెలగకాయ లా అనిపించింది. అందుకే మరునాడే matrimony వాళ్ళకి పోనే చేశా.. ఎక్కడ  pay చేయాలో కనుక్కుందామని..
" సర్ ..మీరు కళ్ళు కదపకుండా అక్కడే కూర్చోండి  మా exicutive వస్తాడు మీ దగ్గరకి ..అరగంటలో.. కాదు కాదు ఇరవై నిముషాల్లో..
ఆహా .. ఏమి నా భాగ్యము.. ఏదో సామేత చెప్పినట్టు.. 'వెతకబోయిన తీగ కాళ్ళకు తగులుతుందని'. 
వచ్చాడు.. డబ్బు కట్టాను.. మెంబెర్ షిప్పు తీసుకున్నాను..  ఓ నలభై నమ్బెర్స్  చూసుకోవచ్చు .మూడు నెలల కాల వ్యవధిలో...

ఆ అమ్మాయి నెంబర్  నోట్ చేసుకున్నాను.... రెండు సార్లు ట్రై చేశా.   ఎవరు లిఫ్ట్ చేయటం లేదు.ఓ రోజు గడిచిపోయింది.
మరుసటి  రోజు ఉదయాన్నే ట్రై చేశా..ఓ ఆడ గొంతు.. నాకు టెన్షన్..రెండు సెకన్లలో టెన్షన్ తగ్గింది. ఆమె వాళ్ళమ్మ. 


మీ అమ్మాయి ప్రొఫైల్ చూసానండి. నచ్చింది.
మీరు కూడా నా ప్రొఫైల్ నచ్చినట్టు రిప్లై ఇచ్చారు. అందుకే ఫోన్ చేస్తున్నా..
మీ పేరు.. 
చెప్పాను
ఎం చేస్తుంటారు..
చెప్పాను 
డేట్ అఫ్ బర్త్ 
చెప్పాను
age difference  ఎక్కువుందండీ..
నాకు ఏంచెప్పాలో తెలియలేదు...అంటే ... కాని ....నేను ..మీరు ప్రొఫైల్ చూసారు కదండీ.. అయినా నేను అలా కనపడనండి...
మూడేళ్ళ కన్నా ఎక్కువ తేడా ఉంటె  మేము చేసుకోము .. అని ఏ మాత్రం  మొహమాటం లేకుండా  ఫోన్ పెట్టేసింది. 
అంతే....ఒక్క నిముషం నాకు మతి పోయింది.


నా ప్రొఫైల్  లో క్లియర్ గా అన్నీ రాసాను. చూడకుండానే మీ ప్రొఫైల్ నాకూ  నచ్చింది అని   రిప్లై ఇచ్చి.. 
తీరా నేను డబ్బులు కట్టి ఫోన్ చేస్తే...
 మూడేళ్ళ కంటే తేడా  సంబంధం మాకు వద్దు  అని ప్రొఫైల్ లో రాసి ఏడవచ్చు కదా...  దొంగ __


కోపం ముంచుకొచ్చి...ఫోన్ విసిరికొట్టే వాడినే. కాని మళ్ళీ మూడువేలు గుర్తొచ్చి...ఆ ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది.. :(


1 comment:

Anonymous said...

malhello,
miru keevalam magapelli kodukule gurunche chepthunaru,ma sister ki chsuthunnappudu memu enni tippalu paddamo,nri abbayi lanauchi message nachindandi tera adighte ma abbbayi vache smavashtarm vastadu antaru daniki ipatnunchi messagelenduko,poni localga smaadahalu chustunte vallu kudaa ma abbayi bengaluru nuchi raalali delhi nuchi raavali mundu memeu chustamatru ideedo kurakayala beram la .ollu mandedi. finala ga ma sister matrimony ki smabaham kakundane manchi samabhanadam telsinavalla vallaa dorikindi anukondi.this matrimony is stupid buisness

enth aollu mandedo