Jul 1, 2011

తేడాఏమీ లేదు

ఇండియా.. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇదో గమ్మత్తయిన దేశం. ఎటు చూసినా మూడనమ్మకాలు..సెంటిమెంట్లు, అర్థం లేని ఆచారాలు. 
కుల మతాలతో వచ్చే కుళ్ళు కంపుని ఇంపుగా పీలుస్తారు. 
బయటికి బాగానే నవ్వుతారు..కాని లోపల అంత విషమే....
స్త్రీ లను గౌరవించటం మన సాంప్రదాయమ అంటూనే..."స్త్రీ" మీద రోజూ  అఘాయిత్యమే. 
'చదువు' కేవలం ఉద్యోగానికే ఉపయోగిస్తారు తప్ప తర్కానికి కాదు. .
దుర్గ..సరస్వతి ..లక్మి అని పుజిస్తూనే..చంటి దాన్ని గొంతు నులుపుతారు. 
దేవుడు అంటే భయం..కానీ మనుషులని చంపటం ఆగదు. స్త్రీ అంటే గౌరవం...మాన భంగాలు ఆగవు. 
ఇంతకు మునుపు 'స్త్రీ ' ని భర్త చావగానే చితిలో కాలిపో అన్నారు.. ఇప్పుడు గర్భం లోనే మాడిపో అంటున్నారు. తేడాఏమీ  లేదు ..కేవలం కాలం మారింది అంతే. 
స్త్రీ ని ఇంతగా exploit చేసిన దేశం ఇంకేది  లేదు.

2 comments:

M.PRASOON KUMAR said...

స్త్రీ ని ఇంత బాగా ప్రేమించే దేశం కూడా ఇంకొకటి లేదు. 100 కోట్ల జనాబాలొ ఎవొ 100 సందర్భాలను పట్తుకొని ఇలా రాయటం ఎం బాగా లేదు. ఎటు చూసినా మూడనమ్మకాలు కనిపించిన వారికి ఇక్కడ వుండే ప్రేమా ఆప్యాయథ కంపించలెద sorry to say.

chakri said...

prasoon kumar gaaru > నిన్నే ఒక అమ్మ...తన కూతురిని తగలబెట్టింది,,వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని.. కోటికో నూటికో అలాంటి వాళ్ళు ఉన్నా ..ఆది మాతృత్వానికి మచ్చే.

కనిపించింది ఇక్కడ వుండే ప్రేమా ఆప్యాయథ గురించి కూడా రాసాను,ఇతర పోస్టుల్లో.