Jul 24, 2011

మాట్రిమొనీ కథలు ( కష్టాలు )


 సర్..  నేను ____________ matrimony  నించి మాట్లాడుతున్నాను.
చెప్పండి.
సర్ మీ ప్రొఫైల్ కి requests  వస్తున్నాయి కదా..
ఏమో..ఉండొచ్చు.. అయితే.
సర్ ..మీరు మెంబర్షిప్ తీసుకొంటే వాళ్ళతో కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా.
ఆ ముక్క వాళ్లకి చెప్పు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయలేరా..
ఆది కాదు సర్.. మెంబర్షిప్ తెసుకుంటే  మీకు నచ్చిన నలబై మందికి  తో కాంటాక్ట్ చేయవచ్చు. వాటిల్లో ఏదో ఒకటి కుదిరే ఛాన్స్ ఉంది కదా.
నాకు నచ్చితే.... వాళ్లకి నచ్చాలి కదా..
అదే వాళ్లకి నచ్చితే పెళ్లి కుదిరే అవకాశం ఉంది కదా..
వాళ్ళకి నచ్చితే మెంబర్స్ అయ్యి,  నా నెంబర్ యే వాళ్ళు తీసుకుంటారు కదా
సార్ ఆది కాదు...
ఏంటి కాదు. తొక్క.. నీ ......
మీ సైట్ లో ఒక్క ప్రొఫైల్ అయిన సరిగా ఉందా.. ఫోటో ఉంటే ఇన్ఫర్మేషన్ ఉండదు.. ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోటో పెట్టరు.  సరే ఫోటో ..ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోన్ నెంబర్ ఉండదు. ఫోన్ నెంబర్ ఉంటే ఆది పని చేయదు. వాళ్ళు ఇచ్చిన నెంబర్ వాళ్ళ దేనా కాదా అని మీరు inquiry   చేయరు. అసలా ప్రొఫైల్ పెట్టేవాడు పెళ్ళికి పెడుతున్నడా..సరదాకి పెడుతున్నాడో కూడా మీకు తెలియదు.  ఎవడూ పడితే వాడొచ్చి ప్రొఫైల్ పెట్టేస్తారు.

పోనీ  పెట్టినవాళ్లకి  ఆశ ఎక్కువ.
ప్రతి పోరీ కి చల్లగా జాబ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యే కావాలి. నెలకి ముప్పై నలభై  వేలు సంపాదించి దాని చేతిలో పోయాలి......
సర్ సర్... అదేం లేదు సర్..అన్ని రకాల వాళ్ళూ ...
హే ఆపు...నీ అమ్మ.. మీరే profiles create  చేసి... రిక్వెస్ట్ పంపించి...చూసారా మీకు రిక్వెస్ట్లు వస్తున్నాయి అని మెంబెర్షిప్ అంటగడతారు.
సర్ లేదు సర్ .. నిజంగా
అవునా... నీదేనా  ఈ సైట్..
కాదు సర్.. నేను employ ని...
కదా...మీ బాస్ ఎవరు ?
అదీ...actually....
తెలుసుకో.. తెలుసుకొని ..వాడిని నా దగ్గరకు పంపు.  నేను నేర్పిస్తా ..  మాట్రిమొనీ   సైట్ ఎలా ఉండాలో ఎలా సర్వీసు ఇవ్వాలో....అలాగే  జీతం వస్తుంది కదా అని కంపెనీ ఏంటో తెలియకుండా జాయిన్ కాకు...కొంచం జనాలకి ఉపయోగపడే కంపనీలో పనిచెయ్యి..

 సర్ ..:(

3 comments:

ఆత్రేయ said...

నాకు అర్జంట్ గా మాట్రిమొని సైట్ లో రిజిస్టర్ అయి వాళ్ళ నుంచీ ఫోనే అందు కోవాలని ఉంది ...

kvsv said...

నిజమేనండీ కళ్ళకు కట్టీనట్టు చెప్పారు..నా కొ...లు ఎలాగోలా మెంబర్షిప్ అంతగట్టేస్తారు...

Indian Minerva said...

ఓహో!!! ఈ వింతలు కూడా వుంటాయన్నమాట