Nov 10, 2009

మా ఊరికి "శివ" సినిమా వొచ్చింది



అది 1990 - 91 అనుకుంటా..మా ఊరికి  "శివ" సినిమా వొచ్చింది.. పరీక్షల్లో క్లాసు ఫస్ట్ వొస్తానని ప్రామిస్ చేస్తేనే కాని  ఓ   రెండు రూపాయలు దొరకలేదు.. మొత్తానికి సినిమాకి వెళ్ళాను..
నాగార్జున సైకిల్ చైన్  తెంపి.మెల్లిగా చేతికి చుట్టుకున్నాడు..పిడికిలి గట్టిగా భిగించాడు.. ఎదురుగ చక్రవర్తి....బిత్తరపోయి చూస్తున్నాడు... నేను నోరు వెల్లబెట్టుకొని చూస్తున్నాను..అయినా అది నాకు మాములే..ఏ సినిమా చూసినా నోరు అలాగే తెరుచుకొని ఉంటుంది..ముఖ్యంగా ఫైటింగ్ సన్నివేశాలు వొచ్చినపుడు. అప్పటి కప్పుడు నా ఫేవరేట్ హీరో మారిపోయాడు...చిరంజీవిని వెనక్కి నెట్టి నాగార్జున వచ్చేశాడు. ఇది కూడా నాకు మాములే.. మన రాజకీయ నాయకులూ పార్టిలు మార్చినట్టుగా నేను నా ఫేవరేట్ హీరోలని మార్చేవాడిని.
తరవాత రోజు నుండి నా స్నేహితునితో అదే సన్నివేశాన్ని పదే పదే చెప్పేవాడిని..పాపం.వాడునోరు తెరచుకొని   వినేవాడు..సినిమాయే చూడనట్టుగా.. అప్పటికే రెండుసార్లు చేసేసాడు.. వాడు నాగార్జున పార్టి లోకి ఎప్పుడో వచ్చేశాడు.


సన్నగా, "మిడ్డి" వేసుకొని జుట్టు వదిలేసి పదే పదే జుట్టును వెనక్కి తోస్తూ చిలిపిగా నవ్వే అమలని అంత సులువుగా ఎలా మర్చిపోతాను. ఒక పాటలో మెట్ల  మీద నుండి దూకుతూ చేసే డాన్స్ ఇంకా గుర్తుకు వస్తూ ఉంటుంది.
ఓ  రోజు స్కూల్ నుండి ఆదర బాదరాగా వచ్చా..
వచ్చి రావటమే గూట్లోకి బాగ్ విసిరేసి..డ్రెస్ మార్చుకొని చాయ్ తాగి పరిగెత్తాను..మేము ఆటలాడే చోటుకి...అది వైశాలి ఇంటి వెనకవైపు..చుట్టూ దట్టంగా చెట్లు...ఓ పెద్ద చింత చెట్టు కింద చదునుగా ఉండే ఖాళి ప్లేస్ నే మా ఆట స్తలం. ఇళ్ళకి దూరంగా ఉన్టటం తో అంత తొందరగా పెద్దలు వచ్చి మా ఆటకి భంగం కలిగించారు..అది గాక ఈ టైం లో అయినా ఆ పెద్ద చింత చెట్టు కింద నీడ ఎపుడు ఉంటుంది. అప్పుడప్పుడు జరిగే తగాదాలు కూడా ఇంట్లో వాళ్ళకి తెలీవు..అందుకే ఆ స్తలం ఎంచుకున్నాం. అప్పటికే ఒక ఆట మొదలైంది..ఎవరో కొత్త గోటిలు ( గోలి కాయలు) తెచినట్టున్నారు. ఒకటి ఎర్రగా ఉంది అది నన్ను ఆకర్షింది. దాన్ని ఎలాగైనా సంపాదించాలి అనుకున్న.. 
వైశాలి..ఆ ఆమ్మాయి అంత అందగత్తె అవునా కాదా అనేది నాకు తెలియదు కాని, ఆ కళ్ళే ఒక వింత కాంతి తో మెరిసేవి. అంతకంటే  వింతగా ఆ రెప్పలు కొట్టుకునేవి.. నిముషానికి కనిసం ముప్పై సార్లన్నా ..పచ్చని వర్చస్సు, చిన్ని పెదాలు బ్రాహ్మణత్వం తోనికిసలేడేది ఆమెలో. ఇవన్నీ కావు కాని.. ఆ గంభిరంత.. ఆ మౌనం అది నన్ను ఆకర్షించింది ..ఆటలాడుతూ అల్లరి చేసే వయసు కాని చేయదు.. ఎప్పుడూ వాళ్ళమ్మ పక్కన చేరి పూల మాల కడుతునో.. దేవుని దీపాలు వెలిగిస్తునో, అందంగా నవ్వుతుంది..కాని అది అపురూపం అందరికి దొరకదు.
అప్పుడప్పుడు వాళ తమ్ముడిని పిలుచుకొని పోటానికి వచ్చేది అక్కడికి.. మా పిచ్చి ఆటలు
చూసి కిలుక్కున నవ్వేది..అది నన్ను చూసి నవ్వినట్టు అనిపించేది.ఎందుకంటే బక్క పలుచగా..పొట్టి లాగు ..శివ స్టైల్లో భుజాల దాక మడిచి, దుమ్ముకొట్టుకోని పోయిన షర్టు..
కాని నా ఆలోచనలు వేరు..నాలోని "శివ " ఆమెలో " ఆశ " ని చూసేవాడు...(ఇంకా ఉంది.)

No comments: