May 3, 2012

ఎప్పుడూ అద్భుతమే.


ఒకానొక ఉరికి ఓ యోగీశ్వరుడు వచ్చి ఒక మందిరాన్ని నిర్మించి అందులో ఉంటున్నాడు.     ఆ మందిరంలో ఎన్నో వింతలూ విశేషాలు ఉన్నాయి . ఎంతోమంది అతన్ని కలుసుకొని ఆ వింతలకి తెలుసుకొని తమ తమ బాధలకి చిట్కా కనుక్కొని పోయేవారట.
ఒకనాడు ఒక యువకుడు అతని దగరికి వచ్చి. తన వంతు రాగానే
ఒకే ప్రశ్న అడిగాడు సూటిగా " నాకు ప్రపంచం సుందరంగా తోచటం లేదు. ఎటు చూసినా మోసం, దగా...దోపిడీ . నాకు బతుకు మీద ఆసక్తి పోయింది. " నాకు జీవితెచ్చని కలిగించే ఓ సూత్రాన్ని  చెప్పగలరా  ?? "
సరే అలాగే. ఒక పని చెయ్యి.. ఈ దీపం వెలిగించి చేతుల్లో పట్టుకొని ఈ  మందిరాన్ని మొత్తం చూసి వచ్చి నాకు చెప్పు మందిరంలోని వింతలూ విశేషాలు " అన్నాడు
యువకుడు దీపాన్ని వెలిగించుకొని వెళ్ళాడు. ఓ రెండుగంటల తరవాత తిరిగొచ్చాడు. దీపం చక్కగా వెలుగుతోంది.
ఆ యోగీశ్వరుడు అడిగాడు.  చెప్పు నాయనా ఎమేం వింతలూ చూసావో..??
దానికి యువకుడు నీళ్ళు నములుతూ.. "దీప్పాన్ని ఆరిపోకుండా కాపాడే ప్రయత్నంలో పెద్దగా ఏమి చూడలేకపోయాను. చూసినవి గుర్తే లేవు. " అని తల దించాడు.
యోగీశ్వరుడు చిరునవ్వు నవ్వి... సరే మరో అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ తిరిగి వచ్చి చెప్పు అన్నాడు ఆ యువకునితో..
యువకుడు మళ్ళీ దీపంతో వెళ్లి  మరో రెండుగంటల్లో ఆనందంతో .. ఉత్శాహంతో వచ్చి తను చూసిన వింతలూ  వివరించాడు.
ఓపికగా విన్న యోగీశ్వరుడు.. ఆది సరే కాని దీపం ఆరిపోయింది కదా.. ఆది ఆరకుండా చూడాలని అన్నాను కదా.. అన్నాడు.
యువకుడు అప్పుడూ తేరుకొని దీపం వైపు చూస్తే ఆది ఆరిపోయి ఉంది. బిక్క మొహం వేసిన యువకుడిని చూసి చిరునవ్వు నవ్వి...
ఆనందం అనే దీపం బాల్యంలో బాగా వెలుగుతుంది. ఎందుకంటే
కల్మషం లేని మనసు  ప్రమిదగా..అమాయకత్వం/ స్నేహం/ ప్రేమ  వత్తిగా.. ఆసక్తి నునేగా  వెలిగి    ఏం చేసిన ఎటు చూసినా  ప్రపంచం అంతాఅద్భుతoగా తోస్తుంది.
కాని మనం పెరిగి పెద్దయ్యే కొద్ది ఆ దీపపు వెలుగు తగ్గుతూ ఉంటుంది. ప్రమిద కల్మషంతో చిల్లులు పడుతుంది..స్నేహపు వత్తి కాలి చిన్నడైపోతుంది. ఆసక్తి కలుషితం అవుతుంది..దాంతో దీపం కొడిగడుతుంది.

కనక ఆ ఆనందం అనే దీప్పాన్ని ఆరకుండా చూడగలిగిన వాళ్లకి  ప్రపంచం ఎప్పుడూ  అద్భుతమే !! 

No comments: