Dec 22, 2010
ఈ నాడు ఏం జరుగుతోంది హిందూ మతం లో ??
ఈ నాడు ఏం జరుగుతోంది హిందూ మతం లో ??
మనకి దేవుళ్ళకి కొదువ లేదు.. ఎటు చూసినా దేవుళ్ళే.. ఏ పేరు చెప్పినా దేవుడే..రామయణ భారత భాగవతాల్లో.. పురాణాల్లో చెప్పిన వాళ్లే కాక.. గ్రామ దేవతలు.. నవగ్రహాలు.. అడుగడుగునా పుట్టగొడుగుల్లా దేవుళ్ళే.
"మనుజుడై పుట్టి మనుజుని సేవించి.. అనుదినము దుఃఖ పడనేలా " అన్నట్టు.. రోజుకో బాబా.. అవతారం ఎత్తుతాడు ....జీవితం మీద ఓ రెండు మూడు నిర్వచనాలు, నాలుగు వేదాంతం మాటలు.. రెండు మోక్ష మార్గాలు..చెపుతాడు. కనీస ఇంకిత జ్ఞ్యానం లేని జనాలు అతన్ని దేవుడిని చేస్తారు. ఈ బాబాలకి.. కూడా దేవుళ్ళకి పూజ చేసినట్టే.. భజనలు..హారతులు .. ధూప దీప నైవేద్యాలు..
దేవుడు ఒక్కడే అంటారు.. మళ్లీ ఇన్ని రూపాలని పూజిస్తారు..
బౌద్ద జైన సిక్కు మతాలూ పుట్టుకొచ్చాయి..అవి కూడా హిందూ మతం లో అంతర్భాగమే అంటారు. ఎంటిందంతా ??
హిందూ మతానికి తనకంటూ ఒక ఉనికి.. లేదా?? ఖచ్చితంగా హిందూ మతం అంటే ఇది అని చెప్పెడాడు ఎవడైనా ఉన్నాడా ?
ఎటు పోతోంది హిందూ మతం ? ఆపే వాడెవడు ?
హిందూ మతం ఏం చెపుతోంది ??పురాణ పురుషులని , పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే బాబాలకి ..ధూప దీప నైవేధ్యాలా పెట్టి పుజించామనా ?? లేక యమ నియమాలు పాటిస్తూ యోగాభ్యసమా ??
ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఎవరు, ఎంతమంది నిజంగా జన్మ రాహిత్య స్థితి కావాలని.. eternity కలగాలని ఆశిస్తున్నారు ?
ఎంత మంది.. ఈ సుఖ భోగాలకై.. పరితపిస్తున్నారు ?
ఒక solidity లేదు కనకనే..ఒకే బావన లేదు కనకనే .. complicated ఐపోయింది..చిక్కుముడి పడిపోయింది.. ఇప్పుడు ఎవ్వరు ఏమి చేయగలిగింది లేదు. there is no way..
నేను అనుకునేది ఏంటంటే ..
అసలైన హిందూ ఆధ్యాత్మిక సంపద అయిన ... కుండలిని, క్రియా, రాజయోగాది యోగాభ్యాసాలు వదిలేసి..బౌతిక మైన ఆహార్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. రామాయణ భాగవత భగవత్గీత పద్యాలను వల్లె వేసే వాళ్లే హిందూ అధ్యాత్మికతకి ప్రతీకలు గా భావిస్తున్నాం. హిందూ మతం "life is a celebration" అని చెప్పే జీవన శైలి. భారతీయ ఆధ్యాత్మికత నిస్సంకోచంగా పరమాత్మని చేరే ఒక సాధనం. ఒకటి సుసమాజం కోసం..ఇంకోటి ఆత్మా - పరమాత్మల సంయోగ సాధనం. ఒకటి సామాజికం, ఇంకోటి వ్యక్తి గతం. కనక వ్యక్తి గతంగా పరమాత్మా దర్శనం కావాలంటే మతం తో పనిలేదు, యోగ సాధన తప్ప. సామాన్య సామాజిక జీవితం గడిపేవాడు ఏ మతం లో చేరి ఏం చేసిన.. భారతీయ ఆధ్యాత్మికత కి వాటిల్లే ప్రమాదం ఏమి లేదు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
BRAVO
Post a Comment