నిజంగా దేవుడున్నాడా అని ఒక్క సారయినా మీకు అనుమానం రాలేదా ??
మొన్న వైష్ణవిని మాడ్చి మసి బొగ్గు చేసినపుడు ?
మన రాజకీయ నాయకులని చూసినపుడు ? వాళ్ళ కుంభకోణాలు గురించి విన్నపుడు ?
బాబాలు దేవుడి ముసుగులో చేస్తున్న అరాచకాలు విన్నపుడు ?
నిత్యం జరిగే మర్డర్లు మాన భంగాలు, దోపిడీలు దొంగతనాలు..అల్లర్లు ఆత్మ హత్యలు
దేశం లో ఎక్కడ పడితే అక్కడ దరిద్రం చేసే "రుద్ర తాండవం" చూస్తున్నపుడు ?
కన్న తండ్రే కిరాతకంగా , కూతురుని అనుభవిస్తున్నపుడు ?
తల్లి, పిల్లని అమ్ముకున్నపుడు ?
జనాలని టెర్రరిస్టులు పిట్టల్ని కాల్చినట్టు కాల్చినపుడు ?
బాంబులు బగ్గు మన్నపుడు ?
అమాయకులు ముక్కలైనపుడు ?
ఎప్పుడూ రాలేదా ??
దేవుడున్నాడా అని ఒక్క సారయినా మీకు అనుమానం రాలేదా ?
