Jul 24, 2012

వర్షాన్ని చూస్తూ..


భోరున వర్షం కురుస్తూనే ఉంది. స్ట్రీట్ lite నిలువెల్లా తడిసిపోయింది. అయినా ఇది నాకో లెక్కా అని కాంతిని వెదజల్లుతూనే ఉంది.కాంతి సరిపడినంత లేకపోవటంతో చెట్ల ఆకులు నలుపులో కనబడుతున్నాయి. చినుకు పడ్డ ప్రతిసారి అవి బరువుకి వంగి లేస్తున్నాయి. కేబుల్ మీద చినుకులు తీగ వాటుగా జారి తాపీ మని కిందకు దూకుతూ జారుడు బండ ఆట మొదలు పెట్టాయి. చినుకులన్ని ఒక్కటయ్యి కాలువగా మారి రోడ్డుమీద ఎక్కడికో ప్రయాణం కట్టాయి. అందరూ వెచ్చగా ఆదమరచి నిద్రపోతూ ఉన్నారు. నేను మాత్రం కిటికీ పక్కన నిల్చొని ... వర్షాన్ని చూస్తూ..
నీ కరుణామృత జలధార నాపై ఎప్పుడు కురుస్తుందా అని ఆలోచిస్తూ...

1 comment:

Padmarpita said...

కిటీకీలో నుండి అలా చూస్తే ఎలా తడుస్తారండి:-)
బయటికి వస్తే తడిచి ముద్దైపోతారు చూడండి:-)