అందరూ ..ఆంధ్రాకో..తెలంగాణాకో... ఇంకోదేశానికో ...ఇంకెక్కడికో..పొట్ట చేతబట్టుకొని వచ్చారేమో
.. నేనైతే ఈ భూమ్మీదకే పొట్టచేతబట్టుకొని వచ్చాను . నా నెత్తిమీద ఉన్న
ఆకాశమే నా దేవుడు...నా కాలికింద ఉన్న నేలే నా తల్లి... నా చుట్టూ ఉన్న
ప్రకృతే నాదేశం..నా మనసే నా రాజ్యం..నా చేతిలో ఉన్న పనే నా మనీ...
నన్నెవడు దోచుకోలేడు. దోచుకున్నాడని వాడు ఫీల్ అయినా ఆది నేను
కాదనుకున్నదే..నేను ప్రేమతో ఇచ్చిందే. నాకు నేను విధించుకున్న బంధనాలే
నన్ను బందిస్తాయి. కట్టుకున్నది నేనే..తెంచుకోవాల్సిందీ నేనే. బయటికి
ఒకింత ..ఒకవైపు ఉన్నట్టు కనపడినా ఆది నా కనీసపు బాధ్యత .. నేను
కళారాధకుడిని. విశ్వ మానవత్వపు సాధకుడిని.
3 comments:
అందరూ పొట్ట చేత పట్టుకుని వచ్చిన వల్లే.
కానీ కొందరే ఇతర్ల పొట్ట కొట్టాలని చూస్తారు
తిన్నింటి వాసాలు లెక్క పెట్టి ఇల్లంతా నాదే అంటారు.
పెత్తనం చేస్తారు, తమ సామ్రాజ్యాలను నెలకొల్పుకుంటారు.
వాళ్ళ తోనే కదా ఇబ్బంది
నిన్న బ్రిటీషు వాడు చేసింది అందే
ఇవాళ మన తోటి సోదర వ్యాఘ్రాలు చేస్తున్నది అదే.
అడుక్కు తినే వాళ్ళు పొట్టలు చేత పట్టుకుంటారు
అడుక్కునే వాళ్ళు చేతల్ పడతారు పొట్టలు
సత్తా వున్నోడు ఎక్కడైనా బ్రతికేస్తాడు
సన్నాసులు ఇంకొకరు తమ పొట్టలు
ఎవరో కొడుతున్నారని ఏడు స్తుంటారు
ఇది అంతులేని ఏడుపు
ఇంతే ఇంతే ఈ ఏడుపు బ్రతుకులింతే
Hellow sir
if you find a good website for entertainment and fun visit this website
Desirulez
Post a Comment