Jul 19, 2009

మా ప్రయాణం


దాదాపు ౩౦ గంటల రైలు ప్రయాణం తరవాత డిల్లిచేరుకున్నాం, అక్కడ మాకోసం 'తవేరా' వేచి ఉంది.. మళ్లీప్రయాణం మనాలికి, 650 kms. ఏ అర్ధ రాత్రికో చేరుకుంటాంఅన్నాడు డ్రైవర్. సామాను సర్ది డిల్లి రోడ్లు చూస్తూ ప్రయాణంసాగించాం.. మార్గం మధ్యలో అందరు ఓ బీర్ కోడదామంటేఆపి బీర్ , లంచ్ కానిచ్చాం. రెండురోజులుగా స్నానం లేదు.. చికాకుగా ఉంది.. చండి ఘర్ చేరుకునే టప్పటికి రాత్రి 8 గంటలైంది.. అక్కడ మాకోసం వేచి ఉన్న బావగారినికలుసుకొని. రూం లో హాయిగా స్నానం చేసాం. అందరు స్నానాలు కానిచ్చాక మళ్లీ బయలుదేరింది బండి, బావ తోపాటుగా. ఆన్ ది వే మల్లి బీర్లు లాగించి రాత్రి 10 గంటలకి ఒక దాబాలో భోజనం చేసి మల్లి ప్రయాణం. చుట్టూ చీకటి,, ఎదురుగా ఆ నల్ల త్రాచులా ఉన్న రోడ్డు తప్ప ఏది కనపడటం లేదు.. అప్పుడప్పుడు ఎదురుగ వచ్చే వాహనాల వెలుగు కళ్ళకికొడుతోంది.. కిటికీ లో నుండి గాలి రివ్వున మొహాన్ని తాకి చెవిలో వింత ధ్వనిని శ్రుస్టిస్తోంది . కొంత మందిజోగుతున్నారు, కొంత మంది కళ్ళు మూసుకొని ఆలోచనల్లో మునిగిపోయారు..
మనలోకి మనం చూసుకొనే సమయంప్రయాణాల్లో బాగా దొరుకుతుంది.. కళ్ళు మూసుకుంటే ముందు, వెనక జీవితం కళ్ళు ముందు ఉంటుంది.. ఒక్కోసారివింత ఆలోచనలు కూడా వస్తుంటాయి.. నేను మాత్రం జీవితాన్ని ముందేసుకున్నా ... ఏంటి ఈ జీవితం ? ఎంత విచిత్రం.. ఎటు చుసిన మనుషులు.. జీవనాని కై పరుగులు.. నిరంతర పోరాటం.. బ్రతుకుకై ఆరాటం ..అసలు శాంతిగా బ్రతికే మనుషులున్నారా అని అనుమానం. ఏదో బ్రతుకుతెరువు దొరికింది రా అనుకొనే లోపు.. మతము, దేవుడు తాయారు, శాంతిని దూరం చేయటానికి... వెనకనుండి " డ్రైవర్ కళ్ళు ముస్తున్నాడు చుడండి " అని అరుపు విని ఆలోచనలు కట్అయ్యాయి.. అవును ,, డ్రైవర్ జోగుతున్నాడు..
అప్పటికే ఘాట్ రోడ్డు మొదలైంది... కాసేపు విశ్రాంతి తెసుకోమని డ్రైవర్ కి చెప్పి.. బండి దిగాం.. ఒక్కసారి చల్ల గాలితగిలింది.. సమయం 1 కావొస్తోంది.. పడుకోవటానికి ఏమి లేక , దాబాలో ఓ కుర్చీ లో కులబడ్డా,,, బండి లోజోగుతున్న వాళ్ళు బయటికి రాలేదు. ఆ దాభాలో వేసిన నులక పై పది డ్రైవర్ గుర్రు పెట్టాడు.. గత 5 రోజుల నుండి నిద్రలేదట, " పోయాను నేను వేళ్ళను " అన్నా వినకుండా మా ట్రిప్ కి పంపించారట ఆఫీసు లో.. సర్లేలే చేసేదేముంది అని.. మల్లి ఆలోచనల్లోకివేల్లబోయా.. కాని చలి ఆపని చేయనీయలేదు.. వణుకుతూ..కూర్చున్నాం...కాసేపు రోడు మీద వాహనాలని చూస్తూ.. కాసేపు చాయ్, .. కాసేపు టీవీ చూస్తూగడిపాం.. ఉదయం 6 గం అవుతుందనగా.. నిద్ర లేపాం డ్రైవర్ ని .

Easily Upload Your Images To Myspace
Free Music

దారి పొడుగునా చిన్న చిన్న కొండలు వాటిమీద ఇళ్ళు.. మంచుపర్వతాలనుంచి కరిగి పరిగెత్తే స్వచమైన కాలువ ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగింది మా ప్రయాణం..