Mar 30, 2011

ఇన్నాళ్ళూ ..



ఇన్నాళ్ళూ ..  కాలంతో పరుగులు పెట్టి అలిసిపోయాను. కాలమే నాకోసం   ఆగుతుందో. లేక తనతో పాటే లాక్కేలుతుందో ..దానిష్టం.

ఇన్నాళ్ళూ.. లోకంతో పాటు నటించి విసిగిపోయాను.. ఇక లోకమే నాకోసం నటిస్తుందో.. లేక నటించటం అపేస్తుందో ..దానిష్టం. 

ఇన్నాళ్ళూ... నీ ప్రేమకోసం తపించాను. ఇక నీలో ప్రేమని  ఇస్తావో.. నా ప్రేమని తర్కిస్తావో /తిరస్కరిస్తవో  నీ ఇష్టం. 


ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి ...పట్టుకోల్పోయాను..ఇక పుస్తకమే నన్ను చదువుతుందో..లేక నేనే పుస్తకం అంటుందో దానిష్టం.

ఇన్నాళ్లూ.. డబ్బుకోసం వెంపర్లాడాను . ఇక డబ్బే నావేనకోస్తుందో..లేక తనదారి తాను చుసుకుంటుందో దానిష్టం.


ఇన్నాళ్ళూ .. జనాన్ని మేల్కొలపాలని అరచి  నీరసించాను. ఇక జనం మేలుకొంటారో..నన్నే నిద్రపుచ్చుతారో వాళ్ళ ఇష్టం.

ఇన్నాళ్ళూ .. నన్ను నేను తెలుసుకోవాలని ప్రయత్నించి వికటించాను.. ఇక నేను 'నన్ను'ని  తెలుసుకుంటుందో...నన్ను 'నేను' ని  తెలుసుకుంటుందో దానిష్టం.

ఇన్నాళ్ళూ ... మనసులోతుల్లోకి జారిపొవాలని శ్రమించాను. ఇక మనసే నాలోకి జారుతుందో. జారలేక జారగిల  పడుతుందో..దానిష్టం.

ఇన్నాళ్లూ  కలలు కంటూ కాలం గడిపాను...ఇక ఆ కలలు నిజమే అవుతాయో..కల్లలే అవుతాయో వాటిష్టం.


ఇన్నాళ్ళూ .. దేవుడిని కన్నుక్కోగలనని విస్వసించాను.. ఇక దేవుడే  నన్ను కనుక్కుంటాడో, కనపడకుండానే ఉంటాడో ఆయనిష్టం.

2 comments:

praveena said...

మన ప్రయత్నం మనం చేద్దాం, అంత వరకే.... జరిగేది జరగనీ... తర్వాత చెయ్యల్సింది చేద్దాం. చాలా బాగా రాసారు

chakri said...

ప్రవీణ గారూ ధనోస్మి. :)