Nov 18, 2009

వీడుకోలు..




...తీరాన్ని తాకాలని వడివడిగా  లేచే తుంటరి అల...నా కాళ్ళని పెనవేసుకొని నన్ను మెత్తగా స్పృశించే లేత కెరటం  ..అలల అద్దంలో నాట్యమాడే కాంతి గీతలు  ... సముద్రానికి    బంగారాన్ని అద్దుతున్న  సూరీడు .. ఒంటరిగా    ఎగిరే నా  మనసు,.. కలసి విడిపోయే బంధాలు ..ఎటో తెలియని దూర తీరాలకి నా పయనం.....సముద్రం తో  సూరీడి   వీడుకోలు....

Nov 10, 2009

మా ఊరికి "శివ" సినిమా వొచ్చింది



అది 1990 - 91 అనుకుంటా..మా ఊరికి  "శివ" సినిమా వొచ్చింది.. పరీక్షల్లో క్లాసు ఫస్ట్ వొస్తానని ప్రామిస్ చేస్తేనే కాని  ఓ   రెండు రూపాయలు దొరకలేదు.. మొత్తానికి సినిమాకి వెళ్ళాను..
నాగార్జున సైకిల్ చైన్  తెంపి.మెల్లిగా చేతికి చుట్టుకున్నాడు..పిడికిలి గట్టిగా భిగించాడు.. ఎదురుగ చక్రవర్తి....బిత్తరపోయి చూస్తున్నాడు... నేను నోరు వెల్లబెట్టుకొని చూస్తున్నాను..అయినా అది నాకు మాములే..ఏ సినిమా చూసినా నోరు అలాగే తెరుచుకొని ఉంటుంది..ముఖ్యంగా ఫైటింగ్ సన్నివేశాలు వొచ్చినపుడు. అప్పటి కప్పుడు నా ఫేవరేట్ హీరో మారిపోయాడు...చిరంజీవిని వెనక్కి నెట్టి నాగార్జున వచ్చేశాడు. ఇది కూడా నాకు మాములే.. మన రాజకీయ నాయకులూ పార్టిలు మార్చినట్టుగా నేను నా ఫేవరేట్ హీరోలని మార్చేవాడిని.
తరవాత రోజు నుండి నా స్నేహితునితో అదే సన్నివేశాన్ని పదే పదే చెప్పేవాడిని..పాపం.వాడునోరు తెరచుకొని   వినేవాడు..సినిమాయే చూడనట్టుగా.. అప్పటికే రెండుసార్లు చేసేసాడు.. వాడు నాగార్జున పార్టి లోకి ఎప్పుడో వచ్చేశాడు.


సన్నగా, "మిడ్డి" వేసుకొని జుట్టు వదిలేసి పదే పదే జుట్టును వెనక్కి తోస్తూ చిలిపిగా నవ్వే అమలని అంత సులువుగా ఎలా మర్చిపోతాను. ఒక పాటలో మెట్ల  మీద నుండి దూకుతూ చేసే డాన్స్ ఇంకా గుర్తుకు వస్తూ ఉంటుంది.
ఓ  రోజు స్కూల్ నుండి ఆదర బాదరాగా వచ్చా..
వచ్చి రావటమే గూట్లోకి బాగ్ విసిరేసి..డ్రెస్ మార్చుకొని చాయ్ తాగి పరిగెత్తాను..మేము ఆటలాడే చోటుకి...అది వైశాలి ఇంటి వెనకవైపు..చుట్టూ దట్టంగా చెట్లు...ఓ పెద్ద చింత చెట్టు కింద చదునుగా ఉండే ఖాళి ప్లేస్ నే మా ఆట స్తలం. ఇళ్ళకి దూరంగా ఉన్టటం తో అంత తొందరగా పెద్దలు వచ్చి మా ఆటకి భంగం కలిగించారు..అది గాక ఈ టైం లో అయినా ఆ పెద్ద చింత చెట్టు కింద నీడ ఎపుడు ఉంటుంది. అప్పుడప్పుడు జరిగే తగాదాలు కూడా ఇంట్లో వాళ్ళకి తెలీవు..అందుకే ఆ స్తలం ఎంచుకున్నాం. అప్పటికే ఒక ఆట మొదలైంది..ఎవరో కొత్త గోటిలు ( గోలి కాయలు) తెచినట్టున్నారు. ఒకటి ఎర్రగా ఉంది అది నన్ను ఆకర్షింది. దాన్ని ఎలాగైనా సంపాదించాలి అనుకున్న.. 
వైశాలి..ఆ ఆమ్మాయి అంత అందగత్తె అవునా కాదా అనేది నాకు తెలియదు కాని, ఆ కళ్ళే ఒక వింత కాంతి తో మెరిసేవి. అంతకంటే  వింతగా ఆ రెప్పలు కొట్టుకునేవి.. నిముషానికి కనిసం ముప్పై సార్లన్నా ..పచ్చని వర్చస్సు, చిన్ని పెదాలు బ్రాహ్మణత్వం తోనికిసలేడేది ఆమెలో. ఇవన్నీ కావు కాని.. ఆ గంభిరంత.. ఆ మౌనం అది నన్ను ఆకర్షించింది ..ఆటలాడుతూ అల్లరి చేసే వయసు కాని చేయదు.. ఎప్పుడూ వాళ్ళమ్మ పక్కన చేరి పూల మాల కడుతునో.. దేవుని దీపాలు వెలిగిస్తునో, అందంగా నవ్వుతుంది..కాని అది అపురూపం అందరికి దొరకదు.
అప్పుడప్పుడు వాళ తమ్ముడిని పిలుచుకొని పోటానికి వచ్చేది అక్కడికి.. మా పిచ్చి ఆటలు
చూసి కిలుక్కున నవ్వేది..అది నన్ను చూసి నవ్వినట్టు అనిపించేది.ఎందుకంటే బక్క పలుచగా..పొట్టి లాగు ..శివ స్టైల్లో భుజాల దాక మడిచి, దుమ్ముకొట్టుకోని పోయిన షర్టు..
కాని నా ఆలోచనలు వేరు..నాలోని "శివ " ఆమెలో " ఆశ " ని చూసేవాడు...(ఇంకా ఉంది.)

Nov 4, 2009



ఏంటి  వీడెవడో స్టైలిష్ గా పోనీ టైల్ వేసుకొని..తెగ పోసులు కొడుతున్నారు అనుకుంటున్నారా..
లేక ఈ ఫోటో  ఎందుకు పెట్టా ఇక్కడ అని అలోచిన్స్తున్నారా ...అయ్యో అది నేనే నండీ  బాబు.ఏంటి నమ్మకం లేదా ..చెపుతా ..
మీకు ఈ వాస్తవ ప్రపంచం బోర్ గా ఉందా,, ఎలా జీవించాలో  అలా  ఉండలేక పోతున్నారా..అంటే ఓ నలుగురు  గాల్ ఫ్రెండ్స్ ని మైంటైన్ చేయటమో, లేక రెండు అందమైన ఇల్లు లేకపోటమో, లేక తెలవార్లు తాగి తందనాలు అడటమో??  
అయితే ఆ విషయం లోకి  వెళ్దాం
 అదొక  వింత  లోకం, కాల్పనిక,  మాయా, వెబ్   ప్రపంచం. అచ్చం ఈ మన వాస్తవ ప్రపంచం లాగే. అమెరికా , యూరోపు  జనాలు వెర్రి ఎత్తినట్టు  ఈ కాల్పనిక  ప్రపంచం  లో నివసిస్తున్నారు... వాస్తవ ప్రపంచాన్ని వొదిలి..ఈ రోగం ముదిరి కొంత మంది పెళ్ళాలని , ఉద్యోగాలని కూడా వదిలేస్తున్నారు..
ఏది ప్రస్తుతం ఆసియా దేశాలలో అంతగా పాకలేదు..రేపో మాపో అది జరిగితే....


చెప్పాగా  , పోనీ టైల్ వేసుకున్నవాడు నేను..
దాన్ని అవతార్ అంటారు..నా అవతార్ అన్న మాట...అది నేనే డిజైన్ చేసుకున్నా..నేను ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు  . ముఖం, తల కట్టు,  దుస్తులు, చెప్పులు, ఆభరణాలు....గాగుల్స్ ..అన్ని సెలెక్ట్ చేసుకొని మన అవతార్ ని మనమే క్రియేట్  చేసుకోవచ్చు..
ఇది  social networking site . కాని 3d అవతార్లు  ఉంటాయి కనక గేమ్ లాగా అనిపిస్తుంది.  అంటే..నేను నా అవతార్ ని   క్రియేట్ చేసుకొని ఆ లోకం లోకి అడుగు పెడతా..నాలాగే చాలా మందీ నూ .
  streets , hotels , restorents , pubs , beaches , shopping  ఒహ్ ..మనకి నిజ జీవితం లో ఎలా ఉంటాయో అక్కడ అలా ఉంటాయి.. ఇక మనం  చేయ వలసిన పని అల్లా.. అలా వీదుల్లో తిరుగుతూ ..కొత్త వాళ్ళతో పరిచయం.. హాయ్ హౌ ఆర్ యు ??అని ..అలా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించు కొని స్నేహం మొదలు పెట్టవచ్చు. 
లేదా ఒక అమ్మాయిని/అబ్బాయి తో పరిచయం.. చెట్టా పట్టాల్  వేసుకొని అలా అలా తిరిగి ఒక గ్రీటింగ్ కార్డు, గిఫ్ట్ ఇచ్చి..love లో పడొచ్చు..అలా మీ dating ముదిరితే హోటల్  రూం కో ,,లేదా మీ ఇంటికో..బీచ్ లోనో.. ఎక్కడ అనిపిస్తే అక్కడ  u can make love...ఇద్దరు ఒకరి కొకరు వదిలి ఉండలేక పోతున్నారా.. అయితే ఎంచక్కా పెళ్లి కూడా చేసుకోవచ్చు..
పెళ్లి లో ఫోటోలు కూడా తెసుకోవచ్చు.. పెళ్ళికి అందరిని పిలవొచ్చు..డ్రింక్స్ DJ ఏర్పాటు చేయొచ్చు... హనీ మూన్ కి వెళ్ళొచ్చు ..పెళ్లి పెటాకులయితే   విడాకులు  కూడా తీసుకోవచ్చు , తాగి తాగి దేవదాసు లాగా మారిపోనూవొచ్చు..వీధుల్లో పడి అల్లరి చేయొచ్చు, అమ్మాయిలని  ఏడిపిస్తే  శిక్ష కూడా ఉంటుంది కనక జాగ్రత్త.
ఇంతే కాదండోయి.. మీరో ఇల్లు రెంట్ కి తీసుకొని.. హ్యాపీగా మీకు కావలసినట్టు అలకంరించుకొని..మీ ఆవిడతో/ గర్ల్ ఫ్రెండ్ తో  కాపురం చేయొచ్చు .. అచ్చం నిజ జీవితం లో లాగే.
అక్కడ కూడా మనీ ఉందండోయ్ ..అక్కడ రాయల్  లైఫ్ గడపాలంటే మనీ కావాల్సిందే. అ డబ్బు  మీరు అక్కడే సంపాదించు కోవచ్చు ..గేమ్ మనీ అన్న మాట..ఆ గేమ్ మనీ ని రియల్ మనీ గా కూడా మార్చుకోవచ్చు..
ఇంకా ఇంకా చాల చేయొచ్చు.  ఎంత తాగినా ..ఏంటి సిగరెట్లు కాల్చినా  ఆరోగ్యం పాడవదు  ..స్వైన్  ఫ్లూ,  ఎయిడ్స్ లాంటివి రావు. భలే ప్రపంచం కదూ.నాకు మొదట్లో దిమ్మ తిరిగి పోయింది.. కోలు కోవటానికి  మూడు నెలలు పట్టింది.
మనం ఇక్కడ కంప్యూటర్ ముందు డు  కూర్చొని ఆ అవతర్నాలి అడిస్తున్నట్టే అసలైన మనం ఎక్కడో ఉండి  ఈ నిజమనుకుంటున్న మనల్ని అడిస్తున్నామేమో..??

Nov 2, 2009

జీవితమంటే??



జీవితమంటే??
అనుక్షణం నా మనసులో చేరి నన్ను ఉపిరాడనివ్వకుండా నన్ను బాధిస్తున్నదీ ప్రశ్న.
ఎందుకు పుట్టాం , ఏమ్చేస్తున్నాం.. ఎటు పోతున్నాం,, తరవాత ఏంటి..
ఈ బాధలన్ని ఎందుకు.. లోకంలో
ఇంతమంది మనుషులెందుకు.
ఏమిటి శ్రుష్టి.. ఈ జంతు జాలం చెట్లు పుట్టలు .. ఉదయం సాయంత్రం. ఎండా వానా ఆకలి దప్పిక ..
మోసం దగా. కామం కాపినం.. ఏమిటివన్ని??
మతం .మౌడ్యం. దేవుడు పూజ తీర్థం ప్రసాదం ..పసుపు కుంకుమా ...ఎందుకిదంతా??
నేను ఎందుకు నాలాగా ఉండటం లేదు.. ఈ మనుషుల కోసమా.. నా కోసమా
ఈ ముసుగెందుకు తొడుకున్నా?? అందరి ముఖాలకి ముసుగుందేం..
ఎందుకింత జీవితం .... ఎం చేసుకోవాలి.. తినడం పడుకోటం...పెళ్లి పేరంటం.. రోగాలు రోష్టులు .. పుట్టుక చావు.. ఇంతేనా ??